పుట:అనుభవసారము (పాల్కుఱికి సోమనాథుడు).PDF/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనుభవసారము

41


చ.

అనయముఁ బంచవింశతిమహావరమూర్తుల నీశ్వరాదులన్
దనరినమూర్తి మూర్తిఘనతత్త్వసదాశివపంచకంబులన్
[1]జననుత! నూఱుకోట్లయుగసంఖ్యలు గొల్చిన నొందుతత్ఫలం
బనుపమలింగమూర్తి నిమిషార్ధము గొల్చినఁ బొందు సమ్మతిన్.

157


శా.

దానానేకమహాతపోనిచయసద్ధర్మౌఘతీర్థాఖిల
స్థానస్తోమజపవ్రతప్రణుతయజ్ఞవ్రాతమంత్రోక్తని
త్యానుష్ఠానవితానముల్ సలుపుపుణ్యం బంతయున్ గూడ నా
ర్యానాథాంఘ్రులఁబూన్చుపుష్పజసహస్రాంశంబునుం బోలునే?

158


సీ.

స్ఫీతుండు తొల్లి యుచ్ఛిష్టప్రదేశని
          పతితపుష్పము శివార్పితము గాఁగఁ
దలఁచినంతనె చేసి మలహరుం డతనికిఁ
          ద్రిదశత్వమును బ్రసాదించె ననఁగ
వాంఛఁ "గించిద్దళం వా చులుకోదకం
          వా" యనఁ బరమతత్త్వప్రలీన
చింత "దేవేంద్రలక్ష్మీపదం తే దదా
          సి" యన నింద్రత్వంబు శివునియీవి


గీ.

అదియు నరిదియే నిరంతరస్థితిఁ దదీ
యార్చనావిధేయు లైనభక్త
తతికి నీశ్వరుండు త న్ని చ్చుట యరిది
యే తలంపఁగా మహితయశస్క!

159


క.

స్వర్గసుఖార్థులకును నప
వర్గసుఖార్థులకుఁ గోర్కె వారక సలుపన్

  1. జన నొక