పుట:అనుభవసారము (పాల్కుఱికి సోమనాథుడు).PDF/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

42

అనుభవసారము


భర్గనివేదితపుష్పని
రర్గళఫలరాశిలోని యల్పమె చాలున్.

160


క.

ఫలమునకుఁ గొల్చువారికి
ఫల ముపభోగాంత మనఁగ ఫలవిరహితు లై
కొలిచినవారికిఁ దథ్యము
సలలితనిశ్రేయసుఖము శంభుం డొసఁగున్.

161


క.

మోక్షార్థులకుం జక్కన
మోక్షముతెరు వితరసుఖసమోహార్థులకున్
వీక్షింప మఱొకతెరు వగుఁ
ద్ర్యక్షార్చనఫలము ముక్తి [1]దప్ప దదెట్లున్.

162


క.

కాన యఖిలాల్పభోగవి
తానము లగుచిక్కులందుఁ దగులక సద్భ
క్తానీక మర్థిఁ గొలుచుట
మానితమోక్షార్థవిమలమతిఁ ద్రిపురారీ!

163


సీ.

సద్గురుకరుణాలసత్పట్టభద్రుఁ డ
          స్థిరరాజ్యవైభవస్థితికిఁ జనునె
నిత్యప్రసాదవినిర్మలామృతభోగి
          స్వర్గోపభోగానుషక్తుఁ డగునె
విస్ఫారభక్తిసంవిత్సుఖార్ణవమగ్నుఁ
          డితరసుఖశ్రేణి కిచ్చగిలునె
ప్రథితలింగప్రాణమథనజీవన్ముక్తుఁ
          డంగావసానమోక్షార్థి యగునె

  1. దప్పదు యెట్లున్.