Jump to content

పుట:అనుభవసారము (పాల్కుఱికి సోమనాథుడు).PDF/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

40

అనుభవసారము


ఉ.

అంగమదృశ్యదృశ్యముల [1]కాశ్రయుఁ డయ్యును గానరానిస
న్మంగళలింగమూర్తి నసమానజగత్త్రయచక్రవర్తి ను
త్తుంగవిశాలకీర్తి నవధూతవినమ్రజనార్తి నాత్మలో
సాంగము గాఁగ సద్గురు[2]కృపాఢ్యతఁ గా కెఱుగంగ వచ్చునే?

152


చ.

అవిరళభక్తియుక్తి ననయంబును భక్తుఁడు దా నొనర్చురా
జవదుప[3]చారభావనల సత్క్రియ లెల్లను లింగమూర్తియం
దవయవముల్ దలంచు తలఁ పట్టులఁ దోఁచగ భక్తవత్సలుం
డవుట నిజంబు గావున దయామతి మున్నుగఁ జేయు సత్క్రియల్.

153


క.

భావింపఁగ సద్భక్తుని
భావం బెట్లట్ల తోఁచుఁ బరమేశుఁడు "య
ద్భావం త ద్భవతి" యని క
[4]దా వినఁబడు శ్రుతులలో నుదారచరిత్రా!

154


క.

పంబినభక్తిస్థితి త్రివి
ధం బగు నది యెట్టు లనినఁ దా శుద్ధము మి
శ్రంబును సంకీర్ణంబు న
నం బరఁగి లసచ్చరిత్ర నారయపుత్త్రా!

155


మ.

అమరం గేవలభక్తియుక్తియుఁ దదీయధ్యానమున్ శుద్ధభ
క్తి; మనంబార సదాశివార్చనము మూర్తిధ్యానమున్ మిశ్రభ
క్తి; ముదం బీశ్వరచింతనంబు మును ప్రీతిం గొల్చు సంకీర్ణభ
క్తి; మహాత్మా యన శుద్ధభక్తిపద ముత్కృష్టంబు దా నెమ్మెయిన్.

156
  1. కాశ్రయనియ్యము గానివాని
  2. కృపాఢ్యుఁడు
  3. కార
  4. దే వినబఁడు శ్రుతులలోన ధీరసమానా!