పుట:అనుభవసారము (పాల్కుఱికి సోమనాథుడు).PDF/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనుభవసారము

39


క.

వచ్చునెడ లింగవశ మను,
నిచ్చునెడన్ భక్తు లెల్ల నీశుం డను, ము
న్నిచ్చియు నిచ్చినయెడఁ దా
నిచ్చితి ననఁ డచలభక్తుఁ డిలఁ ద్రిపురారీ!

147


క.

అడుగమి నిచ్చుట యుత్తమ;
మడిగినయెడ నీఁగి యెన్న నగు మధ్యమ; మ
ట్లడిగిన మెయ్యొఱపులఁ దా
నిడుటయె యధమంబు భక్తియెడఁ ద్రిపురారీ!

148


క.

భక్తుని భక్తుం డడిగిన
భక్తునకున్ భక్తి సేయఁ బాటిల్లు నయో
ద్యుక్తి నటు గాక యుండిన
భక్తుం డనవలదు దుఃఖపాశవినాశా!

149


క.

నిపుణగుణి "యర్థిదోషం
[1]న పశ్యతి" యనఁగ వినును మనం బలరారన్
ద్రిపురారిభక్తుఁ డడుగుట
త్రిపురాంతకుఁ డడిగినట్లు తెల్లం బగుటన్.

150


ఉ.

లింగము మూర్తి యంచు [2]మఱి లింగము నే మని పూజ సేయుఁ? దా
లింగము మూర్తి యంచు [3]మఱి లింగము నెక్కడ నెట్లు కొల్చు? ము
న్నంగము లేదు సత్క్రియకు నంగము లేక భజింపరాదు లిం
గాంగవినిశ్చయం బెఱుఁగ నన్యుల శక్యమె? లింగసంచితా!

151
  1. నపశ్యంత" యనన్ వలదు మనం బలరారున్
  2. మది
  3. మది