పుట:అనుభవసారము (పాల్కుఱికి సోమనాథుడు).PDF/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

38

అనుభవసారము


య్యర్థం బనర్థ మనియు ని
రర్థక మనియును నెఱుంగు మటు త్రిపురారీ!

141


క.

పడయుదురర్థం బర్థము
పడసియుఁ దమశక్తి మెఱసి భక్తహితార్థం
బొడఁగూర్తురు సద్భక్తులు
విడువరు వ్యవసాయములు భువిం ద్రిపురారీ!

142


క.

[1]వలయుం గృషివాణిజ్యకు
శలవిద్యావర్తనములు [2]సలుపఁగ సద్భ
క్తుల కర్థం బార్జింపఁగ
నిల భక్తార్థంబె కాన యెలమి మహాత్మా!

143


క.

కాయక్లేశముఖంబున
న్యాయంబునఁ బడయవలయు నర్థము సమయం
జేయునది భక్తులకు న
న్యాయవివర్జితచరిత్ర నారయపుత్త్రా!

144


క.

ఎన్నిముఖంబుల నర్థముఁ
బన్నుగఁ బడసియును దారు పడసితి మన ర
త్యున్నతిఁ గుడువరు ముడువరు
[3]చెన్నటిపనులకు వ్యయంబు సేయరు భక్తుల్.

145


క.

చేయునెడ భక్తిపరులకు
న్యాయార్జిత మైనయట్టియరకానికి న
న్యాయార్జిత మగుమాడలు
వేయును సరి గావు భక్తివిధిఁ ద్రిపురారీ!

146
  1. వలయు కృషి వనేప వణిజకు
  2. సలుపుచు
  3. చెన్నటు నన్న