పుట:అక్షరశిల్పులు.pdf/95

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

ఖాశిం సాహెబ్‌ షేక్‌ డాక్టర్‌
కడప జిల్లా తొండూరు గ్రామంలో 1938 జూలై

ఒకిటిన జననం. తల్లితండ్రులు: ఫాతిమా బీబీ, ఫక్రుద్దీన్‌ సాహెబ్‌. కలంపేరు: డాక్టర్‌ బద్దేలి , కల్లూరు. చదువు: బివిఎస్సీ . ఉద్యోగం: వెటర్నరీ అసిస్టెంటు సర్జన్‌ (రిటైర్డ్‌). పద్నాల్గవ ఏట నుండి నాటకాలు రాయడం, మిత్రులతో కలసి ప్రదర్శించడంతో ఆరంభమైన ఆసక్తి మరింత ముందుకు సాగి 1955లో కవితలు ప్రచురితం. అప్పటి నుండి వివిధ పత్రికలలో కథలు, కవితలు, కథానికలు, వ్యంగ రచనలు, గేయ కథలు, గేయాలు, ధార్మిక వ్యాసాలు చోటుచేసుకున్నాయి. ఉర్దూ నుండి పలు వ్యాసాలను తెలుగులోకి అనువదించి ప్రచురించారు. లక్ష్యం: మంచి మార్పుకోసం కృషి చేయడం. చిరునామా: డాక్టర్‌ షేక్‌ ఖాశిం సాహెబ్‌, ఇంటి నం.7/4129/2, శ్రీనివాస నగర్‌, ప్రొద్దుటూరు-516360, కడప జిల్లా. సంచారవాణి: 90323 75939.

ఖాశిం సాహెబ్‌ డి.
కడప జిల్లా పెద్దపసువుల గ్రామంలో 1967 జూన్‌ ఒకిటిన

జననం. తల్లితండ్రులు: దస్తగిరమ్మ, డి ఖాశిం సాహెబ్‌. కలంపేరు: డికె చదాుదువుల బాబు. చదువు: బి.ఏ., బి.ఇడి., డి.ఇడి. ఉద్యోగం: ఉపాధ్యాయులు. 'బల్లి తన పాటెరుగదు' కథతో 1985లో సాహిత్యరంగ ప్రవేశం. అప్పటినుండి కథలు, కవితలు వ్యాసాలు పలు పత్రికల్లో, సంకలనాల్లో ప్రచురితం. కదలలో 'ఆలోచించక మనసా, నాన్నానేను చదువుకుంటా, యద్భావం తద్భవతి, అమూల్యం, స్వార్థం' అను కథలు గుర్తింపును తెచ్చిపెట్టాయి. బాలల్లో సద్భావనలు, సత్ప్రవర్తన కలుగచేయాలన్న ప్రధాన లక్ష్యంతో బాలలకు ఉపయుక్తమగు కథలు రాస్తున్నారు. 'కనువిప్పు' కథ మహారాష్ట్రలో ఉన్నతపాఠశాల విద్యార్థులకు పాఠ్యగ్రంథంలో భాగమైంది. రచనలు: మనసున్నమనిషి (2002), బాలల కథలు (2003), బంగారు రెక్కలు (2004), అప్పు-నిప్పు (2004), చిన్నారి మనస్సు (2005), విజయ రహస్యం (2005) అను కథల సంపుటాలతోపాటుగా కడప జిల్లాకు చెందిన 465 మంది కవులు-రచయితల వివరాలతో కూడిన 'కడప జిల్లా సాహితీ మూర్తులు' గ్రంథాన్ని2007లో వెలువరించారు. రాష్ట్రంలోని ప్రముఖ సాహితీ సంస్థలచే, ప్రముఖులచే పలు సన్మానాలు-సత్కారాలు అందుకున్నారు. లక్ష్యం: బాలబాలికలను ఉత్తమ పౌరులుగా, మనసున్నమంచి మనుషులుగా మలచాలన్నది.

చిరునామా
డి.ఖాశిం సాహెబ్‌, ఉపాధ్యాయులు, ఇంటి నం. 3/528, వై.ఎం.ఆర్‌ కాలనీ, ప్రొద్దుటూరు-516361, కడపజిల్లా. సంచారవాణి: 94407 03716.

94