పుట:అక్షరశిల్పులు.pdf/94

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అక్షరశిల్పులు

తండ్రులు: జాన్‌ బి, షేక్‌ సైదా. చదువు: బి.ఏ. వ్యాపకం: సామాజిక కార్యకర్త. వినియోగదారుల ఉద్యామానికి సంబంధించి రాసిన వ్యాసాలు 1989 నుండి వివిధ పత్రికలలో ప్రచురితం కావడంతో రచనా వ్యాసంగంఆరంభం. అప్పటినుండి వివిధవారపత్రికలలో సామాజిక-రాజకీయ వ్యాసాలు, సమీక్షలు, విశ్లేషణలు ప్రచురితం అయ్యాయి. వినియోగదారుల ఉద్యమ పత్రికగా 'వినియోగ వాణి' మాసపత్రిక (గుంటూరు) ను కొంత కాలం నిర్వహించారు. లక్ష్యం: ప్రజాస్వామిక హక్కులు-బాధ్యతల పట్ల ప్రజానికాన్ని చైతన్యవంతుల్ని చేయడం. చిరునామా: షేక్‌ ఖాజావలి, ఇంటి నం. 26-18-30, మసీదాు వీధి, కంకరగుంట గేటు వద్ద, గుంటూరు-522004 గుంటూరు జిల్లా, సంచారవాణి: 99492 75002. Email: khajavaliguntur@ gmail.com

ఖాలిదా పర్వీన్‌
కేరళ రాష్ట్రం పాలకాడ్‌ జిల్లా కుయల్‌మన్నన్‌ గ్రామంలో 1955

నవంబర్‌ 30న జననం. తల్లితండ్రులు: రాజ్యలక్ష్మి , పంచాపకేసన్‌. వ్యాపకం: ధార్మిక ప్రచారం. ఆంధ్రప్రదేశ్‌ వచ్చి తెలుగు నేర్చుకుని కవితలు, వ్యాసాలు రాయడం ఆరంభించి చారు. పలు కవితలు, వ్యాసాలు వివిధ పత్రికలు, సంకలనాలలో ప్రచురితం అయ్యాయి. రచనలు: సందేశ ప్రచారంలో మహిళల పాత్ర (అనువాదం). లక్ష్యం: సత్య సందేశాన్ని రచనల ద్వారా ప్రజలకు అందించడం. మంచి వక్త. చిరునామా: ఖాలిదా పర్వీ న్‌, ఇంటి నం.12-2-881/31, జెబాబాగ్, ఆసీఫ్ నగర్, హైదారాబాద్‌ -28. సంచార వాణి: 92465 78831, Email: k_parveen2005@yahoo.com

ఖాశిం ఖాన్‌ ముహమ్మద్‌
నల్లగొండ జిల్లా సూర్యాపేట జన్మస్థలం. విద్యాభ్యాసం:

ఎం.ఏ. ఆంగ్లం, అరబ్బీ, సంస్కృత భాషల్లో పండితులు. రచనలు: అవిమారకము, ఆత్మాభిమానము, ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఉత్తర రామచరిత్ర, ఖురానే షరీఫ్‌ (అనువాదం), దేవుడు -నాదేశము, దేశభక్తులు, ప్రతిమ, బాల విజ్ఞానసర్వస్వము, వాసవదత్త, భాష మహాకవ

ఖాశిం సాహెబ్‌ షేక్‌
కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ తాలూకా ఆలమూరు జన్మస్థలం.

పుట్టిన తేది: 24-06-1924. తల్లితండ్రులు: మదార్‌బి, లాల్‌మియా. చదువు: బి.ఏ., బి.టి. అప్పటి నివాసం: 1/285 సి, శ్రీరామనగర్‌, కడప. రచనలు: వీరభద్ర విజయము, దేశమంటే? అనార్కలి, రాముడు, కబీరు స్వతంత్ర రచనలు. కబీరు బోధామృతము అనువాద గ్రంథం. 1964 ప్రాంతంలో కన్నుమూశారు.

93