పుట:అక్షరశిల్పులు.pdf/93

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

ప్రభుత్వ పర్యావరణ శాఖలో చేరి పర్యావరణ శాస్త్రవేత్తగా 1981లో స్వచ్ఛందపదవీ విరమణ చేశారు. పర్యావరణ పరిరక్షణ పట్ల సామాన్య ప్రజానీకంలో అవగాహన కల్గించాలన్న లక్ష్యంతో సామాన్యులకు కూడా సులభంగా అర్థం అయ్యేలా వ్యాసాలు రాశారు. అతి సరళమైన భాషలో రాసిన వ్యాసాలు పలు పత్రికలలో ప్ర చురితంఅయ్యాయి. రాయలసీమ ప్రాంతంలోని కరువు నివారణకు మేఘమథనం ఒక్కటే ఏకైక మార్గమని సూచించి అటు ప్రజలలో, ఇటు ప్రభుత్వాధినేతలలో మేఘ మథనం పట్ల అవగాహన కల్గించేందుకు వ్యాసాలు వెలువరించారు. పర్యావరణం, శాస్త్రీయ అంశాల మీదనే కాకుండా ముస్లిం సమాజానికి సంబంధించి ధార్మిక-సామాజిక -న్యాయ సంబంధిత అంశాల గురించి రాసిన పలు వ్యాసాలు వివిధ పత్రికలలో చోటు చేసుకున్నాయి. సామాజిక స్పహ కలిగించే పలు కవితలు, వ్యాసాలు రాసిన ఆయన 2008 జూలై 16న అనంతపురంలో కన్నుమూశారు.

ఖాజా ఎండి

ఖమ్మం జిల్లా పాల్వంచలో 1968 ఆగస్టు ఒకిటిన జన్మించారు. 1998లో 'ఫత్వా' స్వీయ కవితా సంపుటి వెలువరించారు. 2005లో 'ముస్లింవాద తాత్విక- సిద్ధాంతం, సాహిత్యం' సైద్థాంతిక గ్రంథాన్ని వెలువరించారు. పలు కవితలు, సాహిత్య వ్యాసాలు, కథలు వివిధ పత్రికలలో, కథా-కవితా సంకలనాలలో ప్రచురితం అయ్యాయి. చాలా కవితలు ఇతర భాషల్లోకి అనువదించబడి ఆయా భాషా పత్రికల్లో చోటుచేసుకున్నాయి. చిరునామా: ఎండి. ఖాజా, ఫ్లాట్ నం. 407, వెంకటాద్రి అపార్టుమెంట్స్, యర్రముక్కపల్లి, కడప, కడప జిల్లా. సంచారవాణి 9848212329.

ఖాజా మైనద్దీన్‌ మహమ్మద్‌: మహబూబ్‌ నగర్‌ జిల్లా పెబ్బేరిలో 1956 జూన్‌

ఐదున జననం. కలంపేరు: పెబ్బే ఖాజామైనద్దీన్‌. తల్లితండ్రులు: జానుబీ, షేక్‌ బడేసాహెబ్‌. ఉద్యోగం: ఉపాధ్యాయులు. 1973లో 'కార్మికులు' కవితతో రచనా వ్యాసంగం ఆరంభమైంది. అప్పటి నుండి వివిధ పత్రికల్లో, పలు సంకలనాలలో కవితలు, వ్యాసాలు, కదానికలు ప్రచురిత అయ్యాయి. లక్ష్యం: ప్రజానీకాన్ని అభ్యుదయం దిశగా ఆలోచింపజేయడం. చిరునామా: మహమ్మద్‌ ఖాజామైనద్దీన్‌, ఇంటి నం.1-10-85/18, షా షాహెబ్‌ గుట్ట, మహబూబ్‌నగర్‌-509002, సంచారవాణి: 93966 26276.

ఖాజావలి షేక్‌
గుంటూరు జిల్లా గుంటూరులో 1963 జులై 15న జననం. తల్లి

92