పుట:అక్షరశిల్పులు.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్షరశిల్పులు


ఖాశిం సాహెబ్‌ షేక్‌
కృష్ణా జిల్లా నందిగామలో 1928 లై 15న జననం.

చదువు: సివిల్‌ ఇంజనీరింగ్. ఉద్యోగం: రాష్ట్రప్రభుత్వంలోని ఇరిగేషన్‌ శాఖలో ఇంజనీర్‌గా 1983లో రిటైర్డ్‌ అయ్యారు. 1966 నుండి కవితలు రాయడం ఆరంభించి 2010 వరకు

18 వందలకు పైగా కవితలు రాశారు. ఆ కవితలు వివిధ పత్రికల్లో, కవితా సంకలనాలలో చోటుచేసుకున్నాయి. ఈ కవితల్లో ఎంపిక చేసిన కవితలు 1994 నుండి 2010 వరకు 16 కవితా సంపుటాలుగా వెలువడ్డాయి. ఆ కవితలలో కొన్నింటిని స్వయంగా స్వరకల్పన చేయటం మాత్రమే కాకుండా రండు వందల కవితలకు తగిన బాణీలు సమకూర్చి గానం చేశారు. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ సాహిత్య వేదికల మీద పలు సన్మానాలు- సత్కారాలు పొందారు. రచనలు: 1.గాలి గోపురం, 2.జాతి వైభవం, 3. కోడి కూసింది, 4. బంగారు పిచ్చుకలు, 5. చంద్రికలు, 6. నా పవిత్ర భూమి, 7. ఓ మనిషి, 8. స్త్రీ అంటేనే, 9. అభిషేకీయం, 10. ఆక్షరశిల్పాలు, 11. జీవన గీతం, 12. హ్యపీ మెమోరీస్‌ ఆఫ్‌ షేక్‌ ఖాశిం, 13. కాంతి కిరణాలు, 14. సఖీ, 15. వేదనలో వేదం, 16. చందన తాంబూలాలు. ఈనాటికి కవితా సంపుటాల ప్రచురణలో తీరిక లేకున్నారు. లక్ష్యం: మస్తిష్కానికి పదునుపెట్టి, మనస్సుకు అహ్లాదానిచ్చే సాహిత్యం సృజించాలన్నది. చిరునామా: షేక్‌ ఖాశిం సాహెబ్‌, ఇంటి నం.12-110, నేతాజీనగర్‌, నందిగామ, కృష్ణా జిల్లా. దూరవాణి: 08678-273737, సంచారవాణి: 9848820627.

ఖాశిం షేక్‌
కృష్ణా జిల్లా నందిగామ తాలూకా పెనుగంచిప్రోలులో జననం. తలితండ్రులు

హుస్సేన్‌ బీ, హుస్సేన్‌ సాహెబ్‌. చదువు: భాషాప్రవీణ. ఉద్యోగం: ఉపాధ్యాయులు. అప్పటి చిరునామా: శనగపాడు, నందిగామ తాలూకా, కృష్ణా జిల్లా. రచనలు:జగత్‌ప్రవక్త మొహమ్మదు జీవితచరిత్ర (1990), శ్రీ సీతారామ కళ్యాణము (బుర్రకథ,1990), సాధుశీల శతకము.

ఖాశిం యూసుఫ్‌: 1982లో చిత్తూరు నివాసి. విద్య: ఎం.ఏ (ఉర్దూ). వృత్తి : అధ్యాపకులు. రచనలు : 'చీకటి తరగలు', 'తమోనలం' రచయితలలో ఒకరు.

ఖతిజా హయాత్‌ బేగం
కడప జిల్లా జమ్మలమడుగు నివాసి. రచనలు: పలు భక్తి

గీతాలు, కథాలు, గేయాలు.

ఖుర్షీద్‌ సయ్యద్‌
వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌లో 1964 మే 12న జననం. తల్లి

తండ్రులు: జహరాబీ, సయ్యద్‌ అలీ. చదువు: బి.ఏ., బి.ఇడి., హెచ్‌డిసిఎం. ఉద్యోగం: సహకారశాఖలో సహాయక రిజిష్ట్రార్‌. 1988 ఆగస్టులో 'గీటురాయి' లో 'తెలుగు పత్రికల తీరుతెన్నులు' వ్యాసం ప్రచురిమైనప్పటినుండి వివిధ పత్రికలు, సంకలనాలలో కవితలు,

95