పుట:అక్షరశిల్పులు.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కట్టుకుని ఆయన కార్యసాధాకులయ్యారు. ఇదొక క్లిష్టమైన మహత్తర కార్యం. యీ కార్యసాఫల్యానికి కడు వ్యయప్రయాసలకు లోనైఉంటారన్నది నగ్నసత్యం. ఇటువంటి గ్రంథ రచనలకు సంబంధించిన విషయ సేకరణకు ఎంతో ఓపిక, ఓర్పు, సహనం అవసరం. పలు ఒడు దుడుకులను, కష్టనష్టాలను సైతం భరించక తప్పదు. యీలాంటి బృహత్కర కార్యభారాన్ని చేప్టి పట్టువదలని విక్రమార్కుడిలా అహర్నిశలు కృషి చేసి 333 మంది కవులు, రచయితల వివరాలతో 'అక్షరశిల్పులు' వెలువరించడం ముదావహం. యీ గ్రంథం ద్వారా ముస్లిం కవులు, రచయితలు వారి రచనలు మరుగున పడి మటుమాయం కాకుండ నశీర్‌ నిక్షిప్తం చేశారు. భావి తరాలకు, సాహిత్య చరిత్ర పరిశోధాకులకు అక్షరశిల్పులు ఎంతగానో ఉపకరిస్తుందనటం ఏమాత్రం అతిశయోక్తికాదు. యీ గ్రంథాన్ని ప్రముఖ కవి మౌల్విఉమర్‌ అలీషాకు అంకితం ఇవ్వడం హర్షదాయకం. ఉత్తమ కవులు, రచయితలు పట్ల నశీర్‌ గారికి ఉన్నగౌరవభావానికి ఇది నిదర్శనం. ఈ గ్రంథానికి వీలైనంతగా శాశ్వత భద్రత కల్పించాలని, సాహిత్య చరిత్ర పరిశోధకులకు సర్వదా అందుబాటులో ఉంచాలన్న లక్ష్యంతో ప్రముఖ గ్రంథాలయాలకు, రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు, ప్రచార సాధానాల వ్యవస్థలకు ఉచితంగా అందచేయాలని నిర్ణయించడం మహోన్నతమయింది. అక్షరశిల్పులు ప్రచురణను వాణిజ్య వ్యవహారంగా కాకుండ ముస్లిం సమాజానికి, తెలుగు సాహిత్య ప్రపంచానికి మేలు కలుగచేయడమే ప్రధానమన్న సంకల్పం కలిగిన నశీర్‌ అహమ్మద్‌ అభినందనీయులు. ఆర్థిక ఒనరులు పుష్కలంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, సాహిత్య అధ్యయన సంస్థలు, సాహిత్య పీఠాలు మాత్రమే చేయగల పనిని నశీర్‌ వ్యక్తిగతంగా పూనుకుని అనుకూల-ప్రతికూల పరిస్థితులను కూడ సమానంగా సహనంతో ఆహ్వనించి ఒంటి చేత్తో పూర్తిచేయడం ప్రశంసనీయం. సత్యశోధకులు, సాహిత్యాభిలాషి నశీర్‌ లాంటి వ్యక్తికి ప్రజలు, ప్రభుత్వాలు, విశ్వ విద్యాలయలూ కించిత్తు తోడ్పాటు అందించినా అద్భుతాలను సృస్టించగలడన్నది నిర్వివాదాంశం. ఈ గ్రంథానికి ముందుమాట రాయడం నాకు లభించిన గౌరవంగా భావిస్తున్నాను. ప్రజలకు, పాఠకులకు ప్రధానంగా సారస్వత సమాజానికి ఉపయుక్తంకాగల బృహత్తర కార్యభారాన్నిచేపట్టి 'అక్షరశిల్పులు' గ్రంథాన్నిఅందించిన సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ మున్ముందు తెలుగు సాహిత్య చరిత్ర రంగాన్నిమరింత సంపన్నం చేయగల గ్రంథాలను ప్రచురిస్తారని ఆశిద్దాం, ఆహ్వానిద్దాం, ఆశీర్వదిద్దాం.