పుట:అక్షరశిల్పులు.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సమాజంలో ప్రచురణ ప్రసార సాధానాల ఉధృతం ఎంతగా ఉన్నా పాఠకుల ఆదరణ అంతకంటె ఎక్కువగా ఉండడంతో సాహిత్య గ్రంథాల వెల్లువ ఏమాత్రం తగ్గలేదు. ముస్లిం కవులు, రచయితలు కూడ వ్యక్తిగతంగా తమ సాహిత్య ప్రక్రియలను పెద్ద సంఖ్యలో వెలువరించడం ఆనందించ దగిన విషయం. కవులు, రచయితలు వ్యక్తిగతంగా కవితా-కథా-వ్యాస సంపుాలను వెలువరించడం మాత్రమే కాకుండ తెలుగులో రాస్తున్న ముస్లిం కవులు, రచయితల ఉత్తమ రచనలు సేకరించి సంకలనాలను కూడ ప్రచురించడం ఆహ్వనించదగిన పరిణామం. ఆ తరువాత ముస్లిం సమాజం ఎదుర్కొంటున్న సమకాలీన సమస్యల తీవ్రతను బట్టి ఆయా సమస్యలను ప్రదాన వసువుగాస్వీకరించి కవితా సంకలనాలు, కథా సంకలనాలు అధిక సంఖ్యలో వెలువడటం ప్రధాన జీవన స్రవంతిలో భాగంగా సాహిత్య ప్రపంచానికి ముస్లిం సమాజం అందిస్తున్న అత్యంత విలువైన భాగస్వామ్యాన్నివెలుగు చేస్తున్నాయి.

ఈ క్రమంలో ప్రస్తుతం 'అక్షరశిల్పులు' గ్రంథాన్నివెలువరించిన సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ చరిత్రకారులుగా, రచయితగా, బహు గ్రంథకర్తగా ప్రతిష్టులు. ఈయన రచనలు రాసిలోనూ వాసిలోనూ, ప్రసిద్ధివహించాయి. ముస్లిం సమాజ ప్రతిష్ట పున:స్థాపన ప్రధాన లక్ష్యంగా వెలువడిన ఈయన గ్రంథాలు విభిన్న సాంఫిుక సముదాయాలున్న భారతీయ సమాజంలో సద్భావన, సదావగాహన మరింతగా పున:స్థాపన కావడనికి దోహదాపడతాయి. సుస్పష్టమైన అవగాహనతో సాధికారమైన రచనలు చేయడంలో నశీర్‌ సిద్ధాహస్తులు. భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లింల పాత్రను వెలుగు చేస్తూ ఆయన రాసిన గ్రంథాలు ముస్లింల మీదా అసంకల్పితంగా ఉద్బవించిన సంశయాలను, సందేహాలను, ఉదేశ్య పూరితంగా ప్రచారం చేయబడుతున్న అసత్యాలను, అర్దసత్యాలను పఠాపంచలు చేసి ముస్లింల అస్తిత్వాన్ని ధృడపర్చి, ముస్లింల దేశభక్తికి కాగడా పడుతుంటాయి. 'అక్షరశిల్పులు' రచన సాహిత్య సంబంధమైనది. చారిత్రక రచన ఒక ఎత్తయితే సాహిత్య చరిత్ర రచన మరో ఎత్తు. ఇది చరిత్రకారుడైన నశీర్‌ గారి భావవై విధ్యానికి నికశోఫలంగా నిర్ధారించవచ్చు. ఈ రచన తెలుగులో రాసిన/రాస్తున్నముస్లిం కవులు, రచయితల రచనలు, వారి జీవిత రేఖలకు దర్పణం లాంటిది. ముస్లిం తెలుగు రచయితలు తెలుగు సాహిత్యాన్నిసుసంపన్నం చేస్తూ సృష్టించిన రచనల వివరాలను, ఆయా కవులు,రచయితల జీవిత విశేషాలను వివరించే కార్యభారాన్ని మోసేందుకు నశీర్‌ అహమ్మద్‌ పూనుకోవడం ఆయన చారిత్రక, సాహిత్యాభిలాషకు నిదర్శనం. ఈ కార్యనిర్వహణకు కంకణం