పుట:అక్షరశిల్పులు.pdf/84

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అక్షరశిల్పులు

జవేరియా
మెదక్‌ జిల్లా జోగిపేటలో 1969 ఏప్రిల్‌ 10న
అక్షరశిల్పులు.pdf

జననం. తల్లితండ్రులు: అర్షియా బేగం, ఎం.ఖాదీం. చదువు: ఎంఏ., విద్వాన్‌ (హిందీ). వృత్తి: విద్యాబోధన. 1982 నుండి రాయడం ఆరంభించి వివిధ పత్రికలలో, సంకలనాలలో పలు వ్యాసాలు, కవితలు ప్రచురితం. లక్ష్యం: ప్రజల్నిసామాజికంగా చైతన్యవంతుల్ని చేయడం. చిరునామా: జవేరియా,టీచర్‌, ఇంటి నం. 10-132, అంబేద్కర్‌ కాలనీ, పాటాన్‌ చెర్వు-502319, మెదక్‌ జిల్లా. సంచారవాణి: 98499 31255.

జవాద్‌ హుస్సేన్‌
శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆర్ట్స్‌ కాలేజీ (తినుపతి) లో

ఉద్యోగం. చదువు: ఎం.ఎ. రచనలు: వివిధ తెలుగు పత్రికలలో గేయాలు, వ్యాసాలు ప్రచురితం. 1982లో హైదారాబాద్‌లో జరిగిన 'ఆంధ్రప్రదేశ్‌ ముస్లిం తెలుగు రచయితల సమ్మేళనం' కార్యక్రమాన్ని కార్యనిర్వాహకుడిగా నిర్వహించడం మాత్రమే కాకుండా ప్రత్యేక సంచిక 'వెలుగు దివ్వెలు' ప్రచురిండంలో సహాయ సంపాదాకత్వం వహించారు.

జిలానీ అబ్దుల్‌ ఖాదర్‌ షేక్‌: గుంటూరు జిల్లా మంగళగిరిలో 1991 మే 8న జననం. తల్లితండ్రులు: అస్మత్‌ బేగం, ఆదం షఫీ. కలంపేర్లు: మంగళగిరి జిలాని, సత్యశ్రీ, చదువు: బి.ఎస్సీ., బి.ఇడి. వృత్తి: విద్యాబోధన (హైదారాబాద్‌). 2001 ఫిబ్రవరిలో గీటురాయి

వారపత్రికలో ప్రచురితమైన 'ప్రేమమయం' వ్యాసం ద్వారా రచనా

అక్షరశిల్పులు.pdf

వ్యాసంగం ఆరంభమైవివిధపత్రికలలో, సంకలనాలలో సామాజిక సమస్యల పరిష్కారానికి ధార్మిక సమాధానాలను జోడించి రాసిన వ్యాసాలు, కవితలు, కదానికలు, సమీక్షా వ్యాసాలు ప్రచురితమయ్యాయి. ఖుర్‌ఆన్‌ గ్రంథంలో ప్రస్తావించబడిన శాస్రీయ సాంకేతిక విషయాలను సామాన్య పాఠకులకు పరిచయం చేయడం కోసం పలు పరిశోధానాత్మక వ్యాసాలు వెలువరించారు. ఆ క్రమంలో రాసిన 'సైన్స్‌ ఒప్పుకున్న ఖుర్‌ఆన్‌ సత్యాలు' (గీటురాయి) వ్యాసం పేరు తెచ్చి పెట్టిటిెంది. లక్ష్యం: సత్యాన్ని, శాంతిని, ప్రేమను, మంచి స్నేహాన్ని అందరికి పంచడం, చిరునామా: షేక్‌ అబ్దుల్‌ ఖాదార్‌ జిలానీ, ఇంటి నం. 9-1-1/ బి/4, డిఫెన్స్‌ కాలనీ, లంగర్‌ హౌస్‌, హైదారాబాద్‌-500008. సంచారవాణి: 94913 37852. Email: ibn_adam.rediff.com

జిలాని ముహమ్మద్‌
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు లో 1980 జూలై పదిన

జననం. తల్లితండ్రులు: బషీరున్నీసా బేగం, మహమ్మద్‌ బాష. కలం పేర్లు: ఏలూరు

83