పుట:అక్షరశిల్పులు.pdf/83

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

అక్షరశిల్పులు.pdf

1998లో స్వయంగా రాసి, పాడిన 'అదిగో ఎగురుతుంది యస్‌ఐఓ

పతాకం' గుర్తింపు తెచ్చిపెట్టడం మాత్రమే కాకుండ అది క్యాసెట్ రూపం ధరించి ఆ సంస్థ అధికారిక ప్రబోధాగీతం స్థాయిని పొంది, సంస్థ కార్యక్రమాల ఆరంభంలో ఆ పాట పాడడం ప్రధానం అయ్యింది. లక్ష్యం: సమాజం ఎదుర్కొంటున్నపలు రుగ్మతలకు ఇస్లామీయ ఆధ్యాత్మిక పరిష్కారాలు సూచించడం. చిరునామా: మహమ్మద్‌ అబ్దుల్‌ జలీల్‌, సందేశ భవనం, లక్కడ్‌ కోట్, ఛత్తా బజార్‌, హైదారాబాద్‌-500002. సంచారవాణి: 97043 17015.

జమాల్‌ వలి ఎస్‌
కడప జిల్లా కనెకతప్పెట్ల నివాసి. ప్రభుత్వ ఉద్యోగి. రచనలు:

విశ్వనాధ నాయకుడు (చారిత్రక నాటకం). పద్యాలు, పాటలు, వచన కవితలు రాశారు. కథకుడిగా, నాటకాల రచయితగా మాత్రమే కాకుండ మంచి నటుడిగా విఖ్యాతులు.

జానీ బాషా సయ్యద్‌: గుంటూరు జిల్లా మాచర్లలో 1969 న్‌ 10న జననం.

అక్షరశిల్పులు.pdf

తల్లితండ్రులు: ఖాశింబీ, షేక్‌ సైదా సాహెబ్‌. చదువు:బి.ఏ. ఉద్యోగం: రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ. 1982లో 'బాలజ్యోతి' మాసపత్రిక ఉత్తరాలు రాయడంద్వారా రచనా వ్యాసంగం ఆరంభమై వివిధ పత్రికలలో, సంకలనాలలో కథలు, కవితలు, వ్యాసాలు ప్రచురితం. అవార్డులు: కవిమిత్ర (పాలకొల్లు). లక్ష్యం: తెలుగు సాహిత్యంలోని సుగంధాలను పదిమందితో కలసి పంచుకోవడం, పంచడం. చిరునామా: సయ్యద్‌ జానీ బాషా, ఇంటి నం. 9-542, ఎఎంజీ హస్టల్‌ వద్ద, చిలకలూరిపేట-522 616, గుంటూరు జిల్లా. సంచారవాణి: 94414 09749.

జాశ్మిన్‌ అహమ్మద్‌ సయ్యద్‌
గుంటూరు జిల్లా నరసరావుపేటలో 1980 జులై 15న

జననం. తల్లితండ్రులు: షేక్‌ రమిజా బాను, సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌. కలం పేరు:

అక్షరశిల్పులు.pdf

జాశ్మిన్‌. చదువు: ఎం.ఏ (ఇంగ్లీష్‌). 1998 నుండి రచనా వ్యాసంగం ఆరంభం. వివిధ పత్రికలు, సంకలనాలలో చరిత్ర, సామాజిక అంశాల మీద వ్యాసాలు, కవితలు ప్రచురితం. లక్ష్యం: మూఢనమ్మకాల నుండి బయటపడే చైతన్యాన్ని ప్రజానీకంలో కలుగజేసేందుకు ప్రయత్నించడం. చిరునామా: సయ్యద్‌ జాశ్మిన్‌ అహమ్మద్‌, w/o. Dr. ఎస్‌.ఎం తల్మీజుద్దీన్‌, ఇంటి నం. 5-53, మెయిన్‌ రోడ్‌. ఉలవపాడు-523292, ప్రకాశంజిల్లా.

82