పుట:అక్షరశిల్పులు.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్షరశిల్పులు


హమీద్‌ ఎం.ఎ
మహబూబ్‌నగర్‌ జిల్లా అక్కెనపల్లి జన్మస్థలం. చదువు: ఎం.కాం.

వృత్తి : అధ్యాపకులు. (1982లో జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జూనియర్‌ లెక్చరర్‌). వివిధ పత్రికలలో పలు కవితలు, వ్యాసాలు ప్రచురితం. ఇక్బాల్‌ కవితా వైభవం, గాలిబ్‌ కవిత్వంలో ప్రణయం, సాహిర్‌ కవిత్వం వ్యాసాలు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. 1982లో జరిగిన 'ఆంధ్రప్రదేశ్‌ ముస్లిం తెలుగు రచయితల సమ్మేళనం' సందర్భంగా వెలువరించిన ప్రత్యేక సంచికలో 'షేక్‌ షాది నీతులు' వ్యాసం ప్రచురించారు.

హమీదుల్లా షరీఫ్‌
గుంటూరు జిల్లా మునుగోడులో 1932లో జననం. తల్లి తండ్రులు:

షేక్‌ కరీమా, షేక్‌ దాదా సాహెబ్‌. చదువు: బిఏ., బి.యల్‌. వృత్తి: ధార్మిక సేవ. 1980లో

ఖుర్‌ఆన్‌ గ్రంథాన్నితెలుగులో అనువదించారు. ఈ అనువాదం

2009 చివరకు మొత్తం మీద లక్షా యాభైవేల కాపీలు ముద్రితమై 'ఖుర్‌ఆన్‌' తెలుగు అనువాదకునిగా పేరును తెచ్చిపెటిెంది. ఉర్దూ, అరబ్బీ భాషలలోని పలు ధార్మిక గ్రంథాలను తెలుగులోకి అనువాదం చేస్తున్నారు. రాష్ట్రమంతా పర్యటిస్తూ చక్కని తెలుగులో ఇస్లామీయ ధార్మిక ప్రసంగాలు చేస్తూ వక్తగా పేర్గాంచారు. ఆకాశవాణి, టివీ ఛానెల్స్‌లో ధార్మిక ప్రసంగాలు చేస్తున్నారు. లక్ష్యం: ఇస్లామీయ సాహిత్యాన్నితెలుగు పాఠకులకు అందించడం -దైవప్రసన్నత పొందడం ప్రధానం. చిరునామా: హమీదాుల్లా షరీఫ్‌, 405, అన్సారి ఎన్‌క్లేవ్‌, అజిజియా మస్జిద్‌ ఎదురు, మెహదీపట్నం, హైదారాబాద్‌-28. దూరవాణి: 04066253022, సంచారవాణి: 92465 31645.

హనీఫ్‌ ముహమ్మద్‌
నల్లగొండ జిల్లా నల్లగొండలో 1956 జూన్‌ 12న జననం. తల్లి

తండ్రులు: జానీ బేగం, మహమ్మద్‌ గౌస్‌. చదువు: ఎం.ఏ (ఇస్లామిక్‌ స్టడీస్‌). వృత్తి: వ్యాపారం. 1979లో కళాశాల పత్రికలో రచనలు ప్రచురితం.

ఆ తరువాత నుండి రాసిన కవితలు, కథానికలు, సమీక్షలు వివిధ

సంకలనాలలో, పత్రికలలో చోటుచేసుకున్నాయి. సామాన్య ప్రజానీకం ఎదాుర్కొంటున్న సమస్యలు ఆ సమస్యల పరిష్కారంలో సతమతమøతున్న పరిస్థితులు రచనకు ప్రేరణ. ప్రచురణలు: 1. జఖౌమ్‌ (కవితా సంపుటి, 2002), 2. హర్‌ ఏక్‌ మాల్‌ (కథల సంపుటి, 2003), 3. పాన్‌ మరక (కవితా సంపుటి, 2005), 4. తమన్నా (కవితా సంపుి, 2005), 5. హుకుం (నవల, 2010). పాన్‌మరక కవితా సంపుిలోని 'పాన్‌మరక' కవిత ఆంగ్లం, హిందీ భాషల్లోకి అనువదించబడి ఆయా భాషా కవితా సంకలనాలలో చోటు చేసుకుంది. పాన్‌మరక

71