పుట:అక్షరశిల్పులు.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

చోటు చేసుకున్నాయి. పలు కవితలు, కథానికలు ఇతర భాషల్లోకి అనువదించబడి ఆయా భాషా పత్రికల్లో స్థానం సంపాదించుకున్నాయి. యాభై నవలలు వెలువడ్డాయి. ఈ నవలల్లో 35 వివిధ పత్రికలలో ధారావాహికంగా ప్రచురితమై ఆ తరువాత నవలలుగా వెలువడ్డాయి. 15 నవలలు నేరుగా ప్రచురితం. ఈ నవలల్లో 'మహా యజ్ఞం, నిశ్శబ్ద యుద్ధం, వజ్ర సంకల్పం, దానవ రాజ్యం, అరుణతార, సుదర్శన చక్రం, కాలుతున్న పూలతోట, టిపూ సుల్తాన్‌, అంగార తల్పం, అగ్నిరథం, అనుక్షణం అంవేషణ' లాంటి నవలలు ప్రజాదరణ పొందాయి. దూరదర్శన్‌లో ప్రసారమైన 1. మహా భారతం (1988-89), 2. రామాయణ్‌ (1989-90), 3.టిపూ సుల్తాన్‌ (1990-91), 4.పరమ వీర చక్రలాంటి మెగా సీరియల్స్‌ అనువాదాలు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ధారావాహికంగా ప్రచురితమయ్యాయి. ప్రముఖ హిందీ రచయితలు రాసిన పలు నవలలను తెలుగులోకి అనువదించి 'చతుర' మాసపత్రికలో ధారావాహికంగా వెలువరించారు. చలనచిత్ర రంగంలో 'నాగాస్త్రం, ఇరుగిల్లు-పొరుగిల్లు, విధాత, అర్చనా ఐఏయస్‌, ఆడపిల్ల' లాంటి సినిమాలకు కథను సమకూర్చడం మాత్రమే కాకుండా స్క్రీన్‌ప్లే కూడా అందించారు. 'వచ్చినవాడు సూర్యుడు' చిత్రానికి పాటలు రాశారు. బుల్లితెరకు వచ్చేసరికి జెమినీ టెలివిజన్‌లో ప్రసారమైన 'కలశం' సీరియల్‌కు కథను సమకూర్చడం కాకుండా మాటలు రాసి స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహించారు. ఇది 2004- 2005లో నాలుగు నంది అవార్డులను అందుకుంది. ఆకాశవాణిలో కథలు, కథానికలు, నాటికలు, కవితలు ప్రసారం. 'స్పర్శ' (కవితా సంకలనం, 1985), ఒక యుద్ధ నదీ తీరాన (సుదీర్గ… కవితా కావ్యం, 2010) వెలువరించారు. లక్ష్యం: సృజనాత్మకతను సామాజిక ప్రయోజనం కోసం అందించాలని. చిరునామా: శాతవాహన, ప్లాట్ నం. 502, శ్రీ నిలయం అపార్ట్‌మెంట్స్, డోర్‌ నం. 7-1-644/30, సుందర్‌ నగర్‌, యస్‌.ఆర్‌.నగర్‌, హైదారాబాద్‌ -500038. సంచారవాణి: 09393979755. Email: saisathavahana@yahoo.co.in

గులాం యాసిన్‌
మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తి జన్మస్థానం. గేయాలు రాశారు.
హబీబుర్రెహమాన్‌
కృష్ణాజిల్లా విజయవాడలో 1972 నవంబర్‌ 25న జననం.

తల్లితండ్రులు: రహిమున్నీసా, అబ్దుల్‌ వాజిద్‌. చదువు: ఎమ్‌కాం.

ఉద్యోగం: బిఎస్‌ఎన్‌ఎల్‌ (విజయవాడ), 1994లో వక్ప్‌ఆస్తుల మీద వ్యాసం రాయడంద్వారా రచనా వ్యాసంగం ఆరంభం. వివిధ పత్రికలలో వ్యాసాలు ప్రచురితం. లక్ష్యం: సామాజిక సమస్యల పరిష్కారానికి మార్గాలు సూచించడం. చిరునామా: హబీబుర్రెహమాన్‌, ఇంటి నం. 12-2-59, బాబూ రాజేంద్ర ప్రసాద్‌ (బిఆర్‌పి) రోడ్‌, వించిపేట, విజయవాడ-520001, కృష్ణాజిల్లా. సంచారవాణి: 94401 72786.

70