పుట:అక్షరశిల్పులు.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

బషీరుద్దీన్‌ ముహమ్మద్‌
నల్గొండ జిల్లా మర్యాలలో 1931 జనవరి 5 ఐదున జననం.

తల్లి తండ్రులు: ఖైరాతున్నీసా, ఎం.డి జలాలుద్దీన్‌. కలంపేరు: ఘామడ్‌ నల్గొండవి. చదువు:

మెట్రిక్‌. ఉద్యోగం: జిల్లా ఆరోగ్య శాఖలో ఉద్యోగ విరమణ.

ప్రస్తుతం రచన ప్రధాన వ్యాపకం. 1970 లో రచనా వ్యాసంగం ఆరంభం. ప్రధానంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్ళడానికి అనువుగా చాలా పాటలు రాశారు. ఆయన రాసిన పలు పాటలు వివిధ పత్రికల్లో చోటు చేసుకున్నాయి. రచనలు: లోక గీతాలు (2008). లక్ష్యం: ప్రజలను మంచి మార్గం దిశగా చైతన్యపర్చడం. చిరునామా: ముహమ్మద్‌ బషీరుద్దీన్‌, ఇంటి నం. 5-12-17, రహ్మత్‌నగర్‌, నల్గొండ- 508001, నల్గొండ జిల్లా. దాూరవాణి: 08682-244839, 93913 26672.

బిందే అలీ సయ్యద్‌
నిజామాబాద్‌ జిల్లా ఎల్లారెడ్డి తాలూకాలోని కుగ్రామంలో 1922

ప్రాంతంలో జన్మించారు. గ్రామాల్లో పొలాలకు వెళ్ళే పల్లె పడుచులు పాడుకునే పాటల పట్ల ఆకర్షితులై 5వ తరగతి నుండి పాటలల్లడం ఆరంభం. ఉన్నతపాఠశాలలో గురువులు నేర్పిన చందస్సు ఆధారంతో పద్యాలు విన్పిస్తూ సహవిద్యార్థుల అభినందనల ప్రోత్సాహంతో

పలు పాటలు రాసి మనోహరంగా పాడటమేకాదు ఆ పాటలన్నిటిని

కలిపి 'పల్లెపాటలు' పుస్తకాన్ని 'కేకలు' పత్రిక ఎడిటర్‌ బైసా రామదాసు సహకారంతో వెలువరించారు. ఆ తరువాత మరికొన్ని గేయాలతో 'కదలి రా' (గేయమాలిక) తెచ్చారు. వివిధపత్రికలలో వివిధాంశాల మీద వ్యాసాలు, కవితలు, పాటలు, గేయాలు ప్రచురితమయ్యాయి. బిఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగిగా, ఉద్యోగ సంఘం నేతగా ఆయన రాసిన నాటికలు ఆకాశవాణిలో ప్రసారం అయ్యాయి, ఉద్యోగ సంఘాలు చాలా నాటికలను ప్రదర్శించాయి. 1980లో పదవీవిరమణ చేశాక 'ప్రక్షాళన' ప్రబోధ గేయమాలికను తెచ్చారు. లక్ష్యం: సాహిత్యం ద్వారా వినోదం మాత్రమే కాకుండా వికాసం, విజ్ఞానాన్నిఅందించడం. చిరునామా: సయ్యద్‌ బందే అలీ, ఇంటి నం.2-4-72/168, ఫోర్ట్‌ వ్యూ కాలనీ, ఉప్పరపల్లి, రాజేంద్రానగర్‌, హైదారాబాద్‌-30.

బుడన్‌ సాహెబ్‌ షేక్‌
కడప జిల్లా కొత్తపల్లి జన్మస్థలం. తల్లితండ్రులు: మహబూబీ,

ఖాశిం సాహెబ్‌. చదువు: బి.ఎ., బి.యల్‌. వృత్తి : న్యాయవాది. కడపలో న్యాయవాదిగా పనిచేస్తూనే రచనా వ్యాసంగం సాగించారు. 1965లో చారిత్రక పద్యాకావ్యం 'ఖుతుబ్‌నామా' రాసేనాటికే ఉత్తమ కవిగా ఖ్యాతిగాంచారు. ఆనాటి ప్రముఖ పత్రికలన్నిటిలో ఆయన రచనలు

56