పుట:అక్షరశిల్పులు.pdf/58

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
అక్షరశిల్పులుచోటుచేసుకున్నాయి. రచనలు: ఖుతుబ్‌నామా (1965), జలాల్‌నామా (అగ్బరు చరిత్ర, 1969), రామేనామా (పద్యాకావ్యాలు). ఖుతుబ్‌నామా గ్రంథం మైసూరు విశ్వవిద్యాలయంలో డిగ్రీ విద్యారులకు పాఠ్య గ్రంథంగా అనుమతించారు. ఖుతుబ్‌నామా కావ్యాన్ని చదివిన కవిసామ్రాట్ విశ్వనాథసత్యనారాయణ చేసిన ప్రశంసా వ్యాఖ్య: 'ఏ పద్యము తీసినను వసుచరిత్రయో, మను

చరిత్రయో, పారిజాతాపహరణమో స్మృతికి తగులుతున్నది'

అక్షరశిల్పులు.pdf


(ఖుతుబ్‌ నామా, 1965, ప్రచురణ: అబ్దుల్‌ సలాం, కడప). 1965లో 'గోలకొండ' శీర్షికతో రాసిన చారిత్రక పద్యాకావ్యంలోని పద్యాలు పాలా వెంకట సుబ్బయ్య సంపాదాకత్వంలోని 'కలభాషిణి' పత్రికలో ప్రచురితమయ్యాయి. ఆ పద్యాలకు మంచి పాఠకాదరణ లభించడంతో గోలకొండ చరిత్రను కావ్యముగా రాయమని వెంకట సుబ్బయ్య కోరగా పూర్తిస్థాయిలో 'ఖుతుబ్‌నామా' (పద్యకావ్యం) తయారయ్యింది.

చాంద్‌ బాషా పి
అనంతపురం జిల్లా పెనుగొండ గ్రామంలో 1972 సెప్టెంబర్‌

ఎనిమిదిన జననం. కలంపేరు: జాబిలి, జయచంద్రా. తల్లితండ్రులు: ఎ.రమిజాబి, ఎ.జాఫర్‌ అలీ సాహెబ్‌. చదువు: ఎం.ఏ(హిందీ)., హెచ్ప్‌టి. ఉద్యోగం: హింది పండిట్‌. 1996లో సాహిత్య రంగ ప్రవేశం.2000లో 'మట్టిమనిషి' తొలి కవిత ప్రచురితం. అప్పటినుండి వివిధ పత్రికలలో,

అక్షరశిల్పులు.pdf

సంకలనాల్లో కవితలు, కథాలు చోటుచేసుకున్నాయి..అవార్డులు- పురస్కారాలు: రాధేయ కవితా పురస్కారం (2005,అనంతపురం), తెలుగు సాహితీ సమితి పురస్కారం (2006,కర్నూలు), శరత్‌ సాహితీ స్రవంతి పురస్కారం (2007, కరీంనగర) ఇందుకూరి సాహితీ భారతి పురస్కారం (2008, నిజామాబాద్‌), జిల్లాస్థాయి ఉత్తమ సాహితీవేత్త (2007, అనంతపురం). లక్ష్యం: అసమానతలు లేని సమాజ నిర్మాణంలో కవిగా సాహిత్య సేవ. సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కోసం సామాజిక సేవా కార్యకర్తగా నిరంతరం చేయూత ఇవ్వడం. చిరునామా: పి.చాంద్‌ బాషా, హిందీ పండిట్‌, ఇంటి.నం. 2/83/1, కమాన్‌ వీధి, పెనుగొండ -515110, అనంతపురం జిల్లా. సంచారవాణి: 94919 90313, Emailː jabilichand̊gmail.com.

దాదా హయాత్‌ యన్‌
నెల్లూరు జిల్లా వెంకటగిరిలో 1960 అక్టోబర్‌ 10న జననం.

తల్లితండ్రులు: యన్‌. ఛోటీ రసూల్‌ బీ, ఎన్‌. బాబ్‌జాన్‌.స్వగ్రామం: కడప జిల్లా ప్రొద్దుటూరు. చదదువు: బిఏ., బి.ఎల్‌. వృత్తి: న్యాయవాది.1983లో తొలిసారిగా 'అహింస' శీర్షికతో రాసిన

57