పుట:అక్షరశిల్పులు.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్షరశిల్పులు


బాషా షేక్‌
గుంటూరు జిల్లా బాపట్లలో 1974 జూలై ఒకటిన జననం. తల్లితండ్రులు:

షేక్‌ నూరున్నీసా, షేక్‌ మీరా సాహెబ్‌. చదువు: ఇంటర్‌. వ్యాపకం:

జర్నలిస్ట్‌. 1990లో 'పాపం సుబ్బారావు' కథానిక ప్రచురితం కావడంతో రచనా వ్యాసంగం ఆరంభం. కవితలు, కథలు, వ్యాసాలు వివిధ పత్రికలలో, సంకలనాలలో ప్రచురితం. రాష్ట్ర ప్రభుత్వం 'పుష్కర అవార్డు'తో సత్కరించింది. ప్రస్తుతం బాపట్ల నుండి 'దర్గా ' మాసపత్రిక సంపాద కులుగా బాద్యతలను నిర్వహిస్తున్నారు. లక్ష్యం: అసమానతలు లేని సమ సమాజ నిర్మాణం కోసం ప్రజల్ని చైతన్యపర్చడం. చిరునామా: షేక్‌ బాషా, ఇంటి నం.10-4-31, జెండా చెట్టు వీధి, బాపట్ల- 522101. సంచారవాణి: 93469 10988, Email: darga@yahoo.com

బాషా మహబూబ్‌ షేక్‌
గుంటూరు జిల్లా గుంటూరులో1947 జూలై 1 ఒకిటిన జననం.

తల్లితండ్రులు: షేక్‌ హబీబున్నీసా బేగం, షేక్‌ ముహమ్మద్‌ ఖాశిం. చదువు: 12వ తరగతి, ఎం.ఎల్‌ .సి (ఉస్మానియా). 'నవీన సాహితి బాషా' గా విఖ్యాతులు. వ్యాపకం: ఆయుర్వేద వైద్యం. 1974లో పురాణం సుబ్రమణ్యం శర్మ ప్రోత్సాహంతో

'స్పందన' కథానిక ఆంధ్రజ్యోతి వారపత్రికలో (1974 ఫిబ్రవరి)

ప్రచురితమైంది. అప్పటి నుండి కథలు, కథానికలు, నాటికలు, నాటకాలు, కవితలు, పరిశోధనా వ్యాసాలు వివిధ పత్రికలలో మాత్రమే కాకుండా కవితా, కథానికల సంకలనాలలో చోటు చేసుకున్నాయి. మంచి వక్త. తెలుగు భాషాభివృద్థి ప్రధాన లక్ష్యంగా 'తెలుగు భాషాభివృద్ధి ఉద్యమ వేదిక' ఏర్పాటు చేసి వేదిక అధ్యక్షులుగా తెలుగు బాషాభివృద్ధికి నిరంతర కృషి. తెలుగు భాషాభిమాని. పురస్కారాలు: సాహితీ రత్న(పాలకొల్లు), సాహిత్య గాంధర్వ (విజయవాడ), తెలుగు వెలుగు బాషా (తెలుగు భాషా చైతన్య స్రవంతి, విజయవాడ). లక్ష్యం: తెలుగు అక్షరం ద్వారా తెలుగు భాషాభివృద్థి. చిరునామా: షేక్‌ మహబూబ్‌ బాషా, కేరాఫ్‌: షేక్‌ అఫ్రోజ్‌ అహ్మద్‌, ఇంటి నం.7-10-3/బి, గులాం అబ్బాస్‌ వీధి, వించిపేట, విజయవాడ- 520001, కృష్ణాజిల్లా. దూరవాణి: 93953 17066 (పిపి), Email: ahamed.afroz@ rocketmail.com

బషీరానంద్‌
రాష్ట్ర రాజధాని హైదారాబాద్‌ నివాసం. 1982లో హైదారాబాద్‌లో

జరిగిన 'ఆంధ్రప్రదేశ్‌ ముస్లిం తెలుగు రచయితల సమ్మేళనం' సందర్భంగా వెలువడిన 'తెలుగు దివెవ్వలు' ప్రత్యేక సంచికలో 'స్నేహితునికి చిన్న మాట' వ్యాసం రాశారు.

55