పుట:అక్షరశిల్పులు.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్షరశిల్పులు

బాధ్యతల నిర్వహణ. లక్ష్యం: ప్రజా చైతన్యం కోసం కృషి. చిరునామా: ఎస్‌ఎ అజీద్‌, ఇంటి నం. 3-7-256, మున్సూరాబాద్‌, ఎల్బీనగర్‌, రంగారెడ్డి జిల్లా, హైదారాబాద్‌-68. సంచారవాణి: 9246213493. Email:sahayaa@in.com.

అజ్మతుల్లా
నల్లగొండ జిల్లా దేవరకొండ. రచనలు : సత్యసింధూర చరిత్ర, తత్వపుష్పము,

మార్కండేయ జననము.

బాబ్‌ జీ షేక్‌
గుంటూరు జిల్లా వేమూరు మండలం జంపనిలో 1949 మార్చి 17న

జననం. తల్లితండ్రులు: షేక్‌ ఖాశింబి, దర్యాహుసేన్‌. చదువు: బిఎస్సీ., బి.ఇడి. ఉద్యోగం: ఉపాధ్యాయులు. 1963లో నిజామాబాద్‌లో ఉగాది సందర్భంగా

జరిగిన కవి సమ్మేళనంలో 'గీత తత్వం' కవిత పఠించడం నుండి

రచనా వ్యాసంగం ఆరంభమై పద్యాలు, కథలు, కవితలు వివిధ తెలుగుపత్రికలలోప్రచురితం . రచనలు: 'అంత ర్ముఖి' మకుటంగా స్వీకరించి 1. దివ్య ఖుర్‌ఆన్‌ విశిష్టత (పద్యకావ్యం), 2. ఇస్లాం అంటే... (పద్యకావ్యం), 3. అల్లాహు శతకం, 4. కుమతి శతకం, 5. అక్షరదీప్తి (పద్యకావ్యం). నటుడిగా విఖ్యాతులు. లక్ష్యం: సమాజ శ్రేయస్సు, సంఘ సంస్కరణ. చిరునామా: షేక్‌ బాబ్‌ జీ, ఇంటి నం. 19-967, రసూల్‌పేట, పిడుగురాళ్ళ-522413, గుంటూరు జిల్లా. సంచారవాణి: 92907 67108, Email:babjee.sk@gmail.com

బాబూజీ షేక్‌
గుంటూరు జిల్లా గుంటూరు నగరంలో 1962 జూలై ఒకిటిన

జననం. తల్లితండ్రులు: షేక్‌ ఆదంబీ, పద్మశ్రీ షేక్‌ నాజర్‌. కలంపేరు: బాబూజీ. చదువు: బి.ఎస్సీ. ఉద్యోగం: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో (హైదరాబాద్‌ ) బుర్రకధా పితామహుడు, పద్మశ్రీ షేక్ నాజర్ ప్రేరణతో విద్ల్యార్ధి దశనుండి

నాటికలు, కథలు రాయడం ఆరంభించి, పలు ప్రదర్శనలు

ఇచ్చారు. బుర్రకథలు రాసి తండ్రి మార్గదర్శకత్వంలో రాష్ట్రంలో ప్రదర్శించారు. బుర్రకథలు, కళా రూపాల విశిష్టతను వెల్లడిస్తూ రాసిన వ్యాసాలు పత్రికల్లో ప్రచురితం అయ్యాయి. ఆయన రాసిన నాటికలు, బుర్రకథలతో పాటుగా 'స్వర్గ సంరక్షణ', 'సిద్ధార్థ మహాత్యం' (పద్యా నాటకాలు) ఆకాశవాణి, టివీ ఛానెల్స్‌లో ప్రసారం అయ్యాయి. రచనలు: 1.మేలు కొలుపు (గీతాలు 1986), 2.దేశమంటే దేహమే నోయ్‌ (రాజకీయ వ్యాసం, 1996), 3.బుర్రకథ వాణి (18 బుర్రకథలు). లక్ష్యం: ప్రజా కళారూపాలకు జీవంపోసి

49