పుట:అక్షరశిల్పులు.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

నూతనత్వం కల్పించాలి. చిరునామా: షేక్‌ బాబూజీ, ఇంటి నం. 4-13-111, అమరావతి రోడ్‌, గుంటూరు-52207. సంచారవాణి: 93911 85993.

బడే సాహెబ్‌ షేక్‌
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 1948 జనవరి ఒకిటిన జననం.

తల్లితండ్రులు: హసన్‌ బీ, ఖాశిం సాహెబ్‌. చదువు: బి.కాం. ఉద్యోగం: భారత తపాలాశాఖ విశ్రాంత ఉద్యోగి. చిన్నతనం నుండి తెలుగు భాష పట్ల మక్కువ ఎక్కువగా ఉన్నా1991 నుండి తెలుగు భాషను రక్షించుకోవాడనికి నడుం కట్టి 'మేధావుల బారి నుంచి తెలుగు భాషనే కాదు లిపిని కూడ

కాపాడుకుందాం' వ్యాసాన్ని 'వార్త' దినపత్రికలో రాశారు. అప్పటి

నుండి తెలుగు నేర్చుకోవడము సులభతరం చేసే ప్రయత్నంలో భాగంగా వివిధ పత్రికల్లో వ్యాసాలు ప్రచురితం అయ్యాయి. తెలుగును సులభంగా నేర్చుకోడనికి, నేర్పడనికి వీలయ్యే విధాంగా 'మా హసన్‌బీ తెలుగు వాచకం' అను పుస్తకాన్ని 1991లో రాసి 2005 వెలువరించారు. పలువురికి ఆ విధానం నేర్పుతూ గుర్తింపు పొందారు. లక్ష్యం: తెలుగు భాషను నేర్చుకోవడం సులభతరం చేయాలన్నది. చిరునామా : షేక్‌ బడే సాహెబ్‌, ఇంి నం. 2-2-55/6, రహ్మత్‌నగర్‌, హైదారాబాద్‌- 500013, సంచారవాణి: 98499 21322

బడే సాహెబ్‌ షేక్‌ గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ మండలం జానపాడు జన్మస్థలం. పుట్టిన తేది: 01-07-1927. తల్లితండ్రులు: మొహిద్దీన్‌బీ, షేక్‌ సైదా సాహెబ్‌. చదువు: యస్‌.యస్‌.యల్‌.సి, రాష్ట్రభాషా ప్రవీణ, ప్రచారక్‌, హిందీ సాహిత్యరత్న, వృత్తి: ఉపాధ్యాయులు. తెలుగు, ఉర్దూ, హిందీ భాషలలో పండితులు. కలంపేరు: సాబిర్‌. 1970లో

'భాయికీ పుకార్‌' గేయరచనతో సాహిత్యరంగ ప్రవేశం. రచనలు:

ప్రవక్త హజరత్‌ మొహమ్మద్‌ వారి జీవిత చరిత్ర (హరికథా రూపం), జగజ్జ్యోతి హజరత్‌ మొహమ్మద్‌ (గేయరచన), హమారే రసూల్‌, హృదాయ ఘోష (కవితా సంపుి). సర్‌దారె ఆలం (ఉర్దూ రచన). హరికథా రూపంగా రాసిన ప్రవక్త హజరత్‌ మొహమ్మద్‌ వారి జీవిత చరిత్ర మంచి పేరు తెచ్చి ప్టిెంది. ఈ హరికథా గేయరూపం విశిష్టతను వివరిస్తూ డక్టర్‌ తూమాి దోణప్ప తన 'హరి కథా సర్వస్వం' పరిశోధానాత్మక గ్రంథాంలో ఆరు పేజీలు కేటాయించారు. ముహమ్మద్‌ ప్రవక్త రచనను ప్రదార్శనకు యోగ్యంగా తయారుచేసి స్వయంగా పలు ప్రదార్శనలను నిర్వహించారు. ధార్మిక, సామాజికాంశాల మీదా తెలుగు, ఉర్దూ, హిందీ భాషల్లో పలు రేడియో ప్రసంగాలు చేశారు. ముస్లింల పట్ల ముస్లిమేతరుల

50