పుట:అక్షరశిల్పులు.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

ప్రజాభిప్రాయాన్ని సదాశయాలకు అనుగుణంగా అక్షరంతో మలచాలన్నప్రయత్నం. శాశ్వత నివాసం చిరునామా: ముహమ్మద్‌ అజీజుర్రహ్మాన్‌, ఇంటి నం.16-2-862, అక్బర్‌బాగ్, సైదాబాద్‌, హైదారాబాద్‌-500059. దూరవాణి: 040-24551510.

ఆజీజ్‌ వజీర్‌ సయ్యద్‌
కర్నూలు జిల్లా కర్నూలులో 1964 ఆగస్టు 11న జననం.

తల్లితండ్రులు: మైమున్నీసా, సయ్యద్‌ బాబూ సాహెబ్‌. చదువు: బి.ఎ. వ్యాపకం: రచన. పద్నాల్గవ యేట నుండి రచనలు చేయడం ఆరంభించగా 1983లో 'ఎర్ర కాగితాలు'

(కథ) రచయితగా నిలబెట్టింది. కలంపేరు: ఎస్‌డివి అజీజ్‌.

సుమారు వంద కథలు వివిధ తెలుగు పత్రికలలో ప్రచురితం. పలు నాటికలు, స్టేజి నాటికలు, రేడియోనాటికలు రాశారు. అన్ని రేడియో నాటికలు, రూపకాలు ఆకాశవాణి ద్వారా ప్రసారం అయ్యాయి. ఈ నాటికలలో 'సామా' అన్ని భారతీయ భాషల్లోకి అనువదించబడి జాతీయస్థాయిలో ప్రసారమై , జాతీయ అవార్డును, మంచి గుర్తింపును తెచ్చిపెట్టిటిెంది. ప్రచురణలు: 1.వనజ, 2. శిథిల శిల్పాలు, 3. కావేరి, 4. ప్రేమ, 5. వాహిని, 6. అలల వాలున, 7. హరిణి (సాంఫిుక నవలలు) 8. వీరనారి, 9. తెరిణెకిం ముట్టడి, 10. పాలెగాడు, 11. మహాదాత బుడ్డ వెంగళ రెడ్డి (చారిత్రక నవలలు) 12. ఆంధ్ర కేసరి, 13. ది గైడ్‌, 14. మనిషి (రేడియో నాటికలు), 15. మనిషి (కథల సంపుటి,2010). ఈ గ్రంథాలలో 'పాలెగాడు' 'శిధిలశిల్పాలు' ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. కర్నూలు నుండి 'సాహితి' సాహిత్య మాసపత్రిక కొన్నేళ్ళపాటు నడిపారు. లక్ష్యం: ప్రజలను చైతన్యవంతుల్ని చేయడం. చిరునామా: ఎస్‌డివి అజీజ్‌, ఇంటి నం.46/634, బుధవారపేట, కర్నూలు- 518002. సంచారవాణి: 81063 67175. Email: sdvazizkurnool@yahoo.com

అజీద్‌ అబ్దుల్‌ షేక్‌
నల్గొండ జిల్లా గరిడేపల్లి మండలం గట్టిపల్లిలో 1968 జూలై

10న జననం. తల్లితండ్రులు: షరీఫాబీ, ఖాజామోహిద్దీన్‌.

చదువు: ఎం.ఎ., బి.ఇడి. వృత్తి: జర్నలిస్ట్‌. 1987 నుండి రాసిన కవితలు, వ్యాసాలు, కథలు రాష్ట్రంలోని వివిధ పత్రికలలో, సంకలనాలలో ప్రచురితం. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుండి మాత్రమే కాకుండ కర్నాటక బళ్ళారి నుండి వెలువడిన పలు వార, పక్ష, మాసపత్రికల రూపకల్పన చేయడంలో సహకారం, ఆయా పత్రికలకు గౌరవ సంపాదాకుడిగా చేయూత. ప్రచురణలు: 1. తురక వాడ (కవితా సంపుటి), 2. జిందగీ (వ్యాస సంపుటి). ఆంధ్ర ప్రదేశ్‌ ముస్లిం రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా, జర్నలిసుల సంఘం నాయకునిగా


48