పుట:అక్షరశిల్పులు.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్షరశిల్పులు

స్థానం సంపాదించుకున్నాయి. ప్రధానంగా వివిధ ప్రత్యేక

సందర్బాలనుబట్టిరాసిన వ్యాసాలు మంచి గుర్తింపు ను తెచ్చిపెట్టాయి. లక్ష్యం: స మసమాజం దిశగా ప్రజలను చైన్యవంతుల్ని చేయడం, ఆసమసమాజం స్థానంలో సమసమాజం ఏర్పాటుకు రచయితగా తోడ్పాటు అందివ్వడం ప్రధాన లకక్ష్యం. చిరునామా: షేక్‌ మహబూబ్‌ ఆజం, ఇంటి నం. 32-34652, మసీదు వీధి, ఎస్సారార్‌ అండ్‌ సివిఆర్‌ ప్రభుత్వ కళాశాల గేటు ఎదురు, మాచవరం, విజయవాడ- 520004, కృష్ణాజిల్లా. సంచారవాణి: 99594 98786.

ఆజం మహమ్మద్‌ సయ్యద్‌
డోన్‌ తాలూకా బేతంచర్ల జన్మస్థలం. పుట్టిన తేది :

1938 జనవరి ఒకటి. తల్లితండ్రులు : సయ్యద్‌ గౌస్‌బీ, సయ్యద్‌ మహబూబ్‌. హిందీపండితులు. రచనలు : 'సయ్యదయ్య మాట సత్యమయ్య' మకుటంతో సూక్తిసుధా, అంతావిధివిలాసం, గురుపూజ, విశాలాంధ్ర జిందాబాద్‌ నాటికలు. ఉర్దూలో కూడా మిలాద్‌-ఇ-అజం, గజ్‌లియాత్‌-ఇ-ఆజం అను రచనలు చేశారు. 'లలిత కవి' బిరుదాంకితులు.

ఆజీజుర్రహ్మాన్‌ ముహమ్మద్‌: కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం సుబ్బిచెర్వులో 1957 అక్టోబర్‌ 12న జననం. తల్లితండ్రులు: షరీఫాబి, ముహమ్మద్‌ యూనుస్‌. చదువు: బి.ఎ. వ్యాపకం: ధార్మిక సేవలు, జర్నలిస్ట్‌. 1979లో గీటురాయి వారపత్రికలో తొలిరచన

ప్రచురణ ద్వారా రచనా వ్యాసాంగం ఆరంభం. ప్రముఖ కవి రచయిత ఎస్‌.ఎం. మలిక్‌,మౌలానా ముహమ్మద్‌ తఖీయుద్దీన్‌ల ప్రేరణతో తెలుగు, ఉర్దూ

భాషలో ప్రావీణ్యం. గీటురాయి పత్రికలో పనిచేస్తూ పలు ధార్మిక వ్యాసాలు రాశారు, అనువాదాలు చేశారు. ఆ క్రమంలో పలు వ్యాసాలు వివిధ పత్రికలలో చోటు చేసుకున్నాయి. ఉర్దూ నుండి తెలుగులోకి అనువదించిన సుమారు 70 గ్రంథాలను రాష్ట్రంలోని వివిధ ప్రచురణ సంస్థలు ప్రచురించాయి. ఆ గ్రంథాలలో 1. హదీసు మకరందం, 2. తఫ్సీర్‌ అహ్సనుల్‌ బయాన్‌ (ఖుర్‌ఆన్‌ అనువాదం), 3. దేవుడొక్కడే, 4. రుజుమార్గం, 5. రమజాన్‌ శుభాలు అను గ్రంథాలు గుర్తింపు తెచ్చిపెట్టాయి. 'తఫ్సీర్‌ అహ్సనుల్‌ బయాన్‌' పేరుతో తెలుగులో అనువదించిన రెండువేల ఎనిమిది వందలడెభై పుటలకు పైగాగల బృహత్తర గ్రంథం ఖ్యాతికి కారణమైంది. ప్రస్తుతం కువైట్ లో నుండి వెలువడుతున్న 'నెలవంక' మాసపత్రికకు సంపాదకత్వం వహిస్తున్నారు. ప్రస్తుత నివాసం కువాయిట్. లక్ష్యం:

47