పుట:అక్షరశిల్పులు.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

కలంపేరు: 'అఫ్సర్‌'. చదువు: బి.ఏ (చరిత్ర)., ఎంఏ (తెలుగు)., పిహెచ్‌.డి. వ్యాపకం: అధ్యాపకులు, సాహిత్య సృజన. ఆరంభంలో చాలా కాలం ఆంధ్రాజ్యోతి, ఆంధ్రభూమి దినపత్రికల్లో సంపాదాకునిగా పనిచేశారు. ఆ తరువాత అమెరికా వెళ్ళి 'విస్కాన్‌న్సిన్‌ విశ్వ విద్యాలయంలో బోధనా, పరిశోధనా బాధ్య తలను చేపట్టి ప్రసుతం 'టెక్సాస్‌ విశ్వవిద్యాలయం' లోని ఆసియా విభాగంలో అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. ఆంధ్రాజ్యోతి వారపత్రిక నిర్వహించిన కథల పోటీలకు రాసిన 'అడివి' కథకు బహుమతి రావడంతో తెలుగు సాహిత్యం వైపు మళ్ళారు. 1984లో ఆంధ్రాజ్యోతి తెలుగు దినపత్రికలో పలు బాధ్యాతలను నిర్వహించారు. ప్రస్తుతం అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌లో అధ్యాపకులు. తెలుగు పత్రికల్లో కవితలు, సామాజిక-సాహిత్య వ్యాసాలు, సమీక్షలు అసంఖ్యాకంగా ప్రచురితం. 'తెలంగాణ కవిత్వం: వస్తు రూప పరిణామం' అను అంశం మీదా పరిశోధాన చేసి డక్టర్‌ిే పొందారు. ఆయన రాసిన 'నిర్దిష్టత, స్థానికత, కొత్త సాహిత్య ప్రమాణాలు' సాహిత్య విమర్శ కొత్త చర్చలకు నాంది పలికింది. రచనలు: 1. రక్తస్పర్శ (1986), 2. ఇవాళ ( కవితా సంపుి, 1991), 3.ఆధునికత-అత్యాధునికత (1992), 4. కథా-స్థానికత (సాహిత్య విమర్శ), 5. వలస (కవితా సంపుటి, 2002, 6. ఊరి చివర (కవితా సంపుి, 2010). అవార్డులు- పురస్కారాలు: ఫ్రీ వర్స్‌ ఫ్రంటు అవార్డు (1992), ఉమ్మడిశెట్టి అవార్డు (1992) అలిశెట్టి ప్రభాకర్‌ అవార్డు (1999) తెలుగు విశfiవిద్యాలయం అవార్డు (హైదారాబాద్‌, 2003), సాహితీ గౌతమి అవార్డు (2003), మద్రాస్‌ తెలుగు అకాడమీ ఉగాది పురస్కారం (మద్రాస్‌, 2002), భాషా సమ్మాన్‌ అవార్డు (2007). చిరునామా: ప్రస్తుతం అమెరికాలో నివాసం. Email: afsrtelugu@gmail.com, afsar@mail.utexas.edu

అహమ్మద్‌ అలీ ఖాదరి సాహెబ్‌
1935 నవంబరు నాటి 'భారతి' సంచికలో

'ఓరుగల్లు చరిత్ర' వ్యాసం ప్రచురితం.

అహమ్మద్‌ బాషా షేక్‌
నెల్లూరు జిల్లా నెల్లూరులో 1945 మే 14న జననం.

తల్లితండ్రులు: షేక్‌ ఖైరున్నీసా బేగం, షేక్‌ మహమ్మద్‌ గులాం

గౌస్‌. కలంపేరు: షేక్‌ అహమ్మద్‌. చదాువు: పదావ తరగతి. వృత్తి: టైలరింగ్. 1969 నుండి కవితలు, పాటలు, గేయాలు రాస్తున్నారు. నటుడు, గాయకుడు. 1992లో సారా వ్యతిరేక ఉద్యామ పాటల సంకలనంలో కవిత ప్రచురితం అయినప్పనుండి వివిధా పత్రికలలో పలు పాటలు, గేయాలు, కవితలుచోటు చేసుకున్నాయి. అంతర్జాతీయ పరిణామాల మూలంగా దేశం , కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ముసిం లు ఎదుర్కొంటున్న ప్రత్యేక సమస్యలను విశ్లేషిస్తూ, కమ్యూనిస్టు దృక్కోణంతో సమాధానాలు

40