పుట:అక్షరశిల్పులు.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్షరశిల్పులు


అఫ్జల్‌ మహమ్మద్‌ అహమ్మద్‌: పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లులో 1963 నవంబర్‌ 21న జననం. కలంపేరు: అఫ్జల్‌ఇండియన్‌. తల్లితండ్రులు: షేక్‌ సాబెరున్నీసా, మహమ్మద్‌ ఇబ్రహీం. చదాువు: ఎం.ఎ. వ్యాపకం: వ్యాపారం. 'గీటురాయి' వారపత్రిక సంపాదాకులు, ప్రముఖ రచయిత ఎస్‌.ఎం మలిక్‌ ప్రేరణతో 1979లో 'నవరక్తం

రావాలి' రచన గీటురాయి వారపత్రికలో ప్రచురితం. అప్పటి

నుండి వివిధ వార పత్రికల లో వ్యాసాలు, క వి త ల చోటు చేసుకున్నాయి. కవితల్లో ఆరు ఆంగ్లంలో అనువాదామై పత్రికల్లో ప్రచురితం కాగా మరో పది కవితలు హిందీలో తర్జుమా చేయబడి పత్రికల్లో ప్రచురితం అయ్యాయి. నలభై అక్షరాలకు మించకుండ నాలుగు చరణాలతో, నాల్గవ చరణంలో భావం బలంగా 'పంచ్‌' అయ్యే విధాంగా 'సాహిరీలు' పేరుతో నూతన కవితా ప్రకియ ఆరంభించారు. ప్రచురణలు: 1.నైతిక జీవితం, 2. చరితార్థులు. లక్ష్యం: ఇస్లాం విశ్వప్రేమ స్వభావాన్ని, స్వరూపాన్ని సాక్షాత్కరింప చేయడం. చిరునామా: మహమ్మద్‌ అఫ్జల్‌ అహమ్మద్‌, ఇంటి నం.7-32/1, చాగల్లు-534342, పశ్చిమ గోదావరి జిల్లా. సంచారవాణి: 93464 98464, Email: afjalindian@yahoo.co.in

అఫ్రోజ్‌ అహమ్మద్‌ షేక్‌: కృష్ణా జిల్లా విజయవాడలో 1980లో జన్మించారు. తల్లితండ్రులు: షేక్‌ మహబూబాషా, షేక్‌ మొహర్‌ జబీన్‌. చదాువు: బి.సి.ఎ., ఫాజిలె ఇస్లామియా. వ్యాపకం: భాషా అనువాదాం. 1999లో 'సృష్టి నిదర్శనం' తొలి రచన వెలువడింది. కవితలు, పాటలు, వ్యాసాలు వివిధా పత్రికలలో ప్రచురితం. అనువాదాలు మాత్రమే కాకుండ పలు స్వతంత్ర

రచనలు చేశారు. వక్త, గాయకుడు. ఇస్లామీయ సాహిత్యంతో

కూడిన దాదాపు 60 పుస్తకాలను ఉర్దూ, అరబ్బీ, ఆంగ్ల భాషల నుంచి తెలుగులోకి అనువదించారు. ఆయన గ్రంథాలలో 'వేదాల్లో ముహమ్మద్‌ (స)' టైటిల్‌తో 2007లో వెలువరించిన గ్రంథం గుర్తింపు తెచ్చింది. లక్ష్యం : అత్యుత్తమ సాహిత్య విలువలతో, పాత్రికేయ విలువలతో, ఉన్నత ప్రమాణాలతో, ఇస్లాం సందేశాన్ని ప్రజా బాహుళ్యానికి అందాజేయడం. చిరునామా: షేక్‌ అఫ్రోజ్‌ అహమ్మద్‌, ఇంటి నం.7-10-3/బి, గులాం అబ్బాస్‌ వీధి, వించిపేట, విజయవాడ-520001, కృష్ణా జిల్లా. సంచారవాణి: 93953 17066, Email: ahamed.afroz@rocketmail.com

అఫ్సర్‌: ఖమ్మం జిల్లా చింతకాని గ్రామంలో జననం. అసలు పేరు ముహమ్మద్‌ మహబూబ్‌ అలీ. తండ్రి : ప్రముఖ కవి 'కౌముది' గా విఖ్యాతులైన ముహమ్మద్‌ షంషుద్దీన్‌.


39