పుట:అక్షరశిల్పులు.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

యాసుఫ్‌ బాబ షేక్‌
నల్గొండ జిల్లాలో 1972 మార్చి 2న జననం. కలం పేరు:'స్కైబాబ'. 'జల్‌జలా' ముస్లింవాద కవిత్వం (కవితా సంకలనం, 1998) వెలువరించారు. 2002లో అంవర్‌తో కలసి 'అజా' కవితా సంకలనం, 2004లో 'వతన్‌' పేరిట కథానికల

సంకలనం ప్రచురించారు. 2005లో 'జగనేకి రాత్‌' స్వీయ కవితల సంపుటి, కవయిత్రి షాజహనాతో కలసి 'అలావా' (2006) కవితా సంకలనం, 2009లో 'చాంద్‌తారా' (మిని కవితలు) ప్రచురించారు. పలు వ్యాసాలు, కథలు, కథానికలు, కవితలు వివిధ పత్రికలలో ప్రచురితం అయ్యాయి. ఆ కవితలలో కొన్ని హిందీ, ఆంగ్ల భాషల్లోకి తర్జుమా చేయబడి ఆయా భాషా పత్రికలలో, సంకలనాలలో చోటు చేసుకున్నాయి. 'చమన్‌' మాసపత్రికకు సంపాదాకత్వం బాధ్యతలు నిర్వహించారు. చిరునామా: స్కైబాబ, ఇంటి నం. 6-3-609/ 1/ఏ, ఆనందనగర్‌ కాలనీ, ఖైరతాబాద్‌, హైదారాబాద్‌-500 004, సంచారవాణి: 9885420027, 99859 21379.

ఘోరి యూసుఫ్‌
1951లో నల్లగొండ జిల్లా నల్లగొండలో జననం. విద్య: ఎం.ఏ

(ఉర్దూ). వృత్తి: పాత్రికేయులు. కవితలు, గేయాలు, వ్యాసాలు

వివిధ పత్రికలలో ప్రచురితం అయ్యాయి. రాష్ట్రంలో వెలువడిన వివిధ కవితా, కథా సంకలనాలలో ఆయన రచనలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో తెలుగులో రాస్తున్న కవులు, రచయితలను ఒక చోట చేర్చాలన్న లక్ష్యంతో 1982లో 'ఆంధ్రప్రదేశ్ ముస్లిం తెలుగు రచయితల సమ్మేళనం' బాధ్యతలను చేపట్టి విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 'ఆంధ్రప్రదేశ్‌ ముస్లిం తెలుగు రచయితల సమ్మేళనం' వెలువరించిన ప్రత్యేక సంచిక 'తెలుగు దివ్వెలు' తయారీలో ప్రముఖ పాత్ర వహించడం మాత్రమే కాకుండా ఆ సంచికలో 'దక్కనీ ఉర్దూలో తెలుగు పదాలు' శీర్షికతో వ్యాసం రాశారు. ఈ సమ్మేళనం నిర్వహణలో ప్రధాన భాగస్వామ్యాన్ని స్వీకరించిన ఆయన సమ్మేళనం ఆహ్వాన కమిటి కార్యదర్శిగా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు.

జమ్రద్‌ బాషా షేక్‌
గుంటూరు జిల్లా బాపట్లలో 1956

జూన్‌ ఒకటిన జననం. తల్లితండ్రులు: మైమున్నీసా బేగం, షేక్‌ జాఫర్‌ బాషా. చదువు: ఎం.కామ్‌., ఎల్‌ఎల్‌.బి. వృత్తి : న్యాయవాది. 1974 నుండి ప్రదర్శనా యోగ్యమైన నాటికలు, నాటకాలు రాసి ప్రదర్శించడంతో రచనావ్యాసంగం ఆరంభమైంది. అప్పటినుండి పలు నాటికలు, నాటకాలు రచించి, స్వయంగా వాటిలో నటించి, ఆ నాటకాలు, నాటికలకు దర్శకత్వం


160