పుట:అక్షరశిల్పులు.pdf/162

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అక్షరశిల్పులు


వహించి ప్రదర్శించారు. నాటికలలో 'ఎ వార్నింగ్, విస్పోటనం, ఎంగిలాకులు, జన్మభూమి, అమ్మకానికో తండ్రి 'నాటికలు రాష్ట్రం అంతా ప్రదర్శితమై నాటక రచయితగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. లక్ష్యం: సామాజిక చైతన్యం, సమాజ సేవా భావాలను ప్రజలలో కలుగజేయడం. చిరునామా: షేక్‌ జమ్రుద్‌ బాషా, న్యాయవాది, ఇంటి నం. 4-3-24, యాదవపాలెం, బాపట్ల-522101, గుంటూరు జిల్లా. సంచారవాణి: 93469 1008.

జరీనా బేగం డాక్టర్‌
కడప జిల్లా కడపలో 1958 జూలై రండున జననం. తల్లితండ్రులు : ఖతీజాబి, ఖాజా మొహిద్దీన్‌. చదువు: ఎమెస్సీ (బాటనీ)., పిహెచ్‌.డి. ఉద్యోగం:

అధ్యాపకులు. (ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, వడ్డేపల్లి). 1982లో ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైన 'స్వార్ధానికి మూలం' కవిత ద్వారా

అక్షరశిల్పులు.pdf

రచనా వ్యాసంగం ఆరంభం. అప్పటినుండి వివిధ పత్రికల్లో, కవితా సంకలనాల్లో కవితలు, మినీ కవితలు, సాహిత్య వ్యాసాలు, కథలు చోటు చేసుకున్నాయి. ఈ కవితల్లో 'తుదియాత్ర' టి బాయ్‌ పవన్‌' కవితలు గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఆకాశవాణిలో 'విజయ పథం' శీర్షికన పలు రేడియో ప్రసంగాలు. అవార్డులు -పురస్కారాలు: మానసా సాహిత్య అవార్డు (విజయవాడ, 2006), ఎక్స్‌రే సాహిత్య అవార్డు (విజయవాడ, 2007). జాతీయ సమగ్రత అవార్డు (2006). రచనలు: 1. ప్రతి బింబాలు (కవితా సంపుటి, 2008). లక్ష్యం: భావి యువలోకానికి దిశానిర్దేశనం చేయగల రచనలు చేయడం. చిరునామా: డాక్టర్‌ జరీనా బేగం, లెక్చరర్‌, ఇంటి నం. 2-10-512, టీచర్స్‌ కాలనీ, వడ్డేపల్లి, వరంగల్‌- 506370, వరంగల్‌ జిల్లా. సంచారవాణి: 9989615703. Email:gzareena@yahoo.co.in

అక్షరశిల్పులు.pdf

161