పుట:అక్షరశిల్పులు.pdf/160

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అక్షరశిల్పులు

ప్రచురణ కోసం తెలుగులోకి అనువదించారు. గుజరాత్‌ ఘటనల సందర్భంగా ' సెక్యులర్‌ డెమాక్రటిక్‌ లిటరరీ కల్చరల్‌ ఫోరం' (హైదారాబాద్‌) ఏర్పాటు చేసి 'గుజరాత్‌ గాయం' కవితా సంకలనం తీసుకరావడంలో ప్రధానపాత్ర నిర్వహణ. పలు కవితా సంపుటాలు, విమర్శనా గ్రంథాలకు, సాహిత్య వ్యాస సంపుటాలకు, ప్రముఖ కవుల కవితా సంపుటాల ప్ చురణకు సంపాదకులుగా వ్యవహరించి పలుగ్రంధాలను వెలువరించారు . గాయకుడు-వక్త. అవార్డులు-పురస్కారాలు: రంజని-కుందుర్తి అవార్డు (1989), ఎస్‌విీ దీక్షితులు అవార్డు (1993), అమిలినేని లక్ష్మీ రమణ స్మారక ధర్మనిధి పురస్కారం (తెలుగు విశ్వవిద్యాలయం, 1998), కెసి గుప్తా సాహిత్య పురస్కారం (2000), డాక్టర్‌ సి నారాయణ రెడ్డి సాహిత్య పురస్కారం (2003), నూతలపాటిగంగాధరం సాహిత్య అవార్డు (2003), ఉత్తమ కవిత్వం అవార్డు (తెలుగు విశ్వవిద్యాలయం, 2004), రాష్ట్ర ఉత్తమ కవి (1998,2002), ఆంధ్రప్రదేశ్‌ మాదిగ సాహిత్య వేదిక అవార్డు (1998), ఉమ్మడి శెట్టి కవితా పురస్కారం (అనంతపురం, 2010). రచనలు: 1. సరిహద్ధు రేఖ (కవితా సంపుటి, 2002), 2. ప్రవహించే జ్ఞాపకం (కవితా సంపుటి, 1992), 3. ఎడతెగని ప్రవాహం (కవితా సంపుటి, 2009), 4. తెలంగాణా సాహిత్య విమర్శ (2008), 5. తెలుగు సాహిత్య విమర్శలో రా.రా మార్గం (పరిశోధనా వ్యాసం, 1991). లక్ష్యం: సాహిత్యం సమాజ హితం కోరుతుంది. సాహిత్యకారునిగా నేనూ సమాజహితం కోరుతూ, సంఘజీవిగా మసలుతూ, మనిషిలో మనిషితనం పెంచేందుకు రచనలు తొడ్పడాలన్నది. చిరునామా: డాక్టర్‌ యాకూబ్‌, సూఫిఘర్‌, ఇంటి నం. 1-7-28, రోడ్‌ నం. 17, చైతన్యపురి, హైదారాబాద్‌ -500060. సంచారవాణి: 98491 56588. Email: kaviyakoob@yahoo.com.

యాసుఫ్‌ అలీ అస్కరి
నల్గొండ జిల్లా నల్గొండలో 1948 జులై పదిన జననం.

తల్లితండ్రులు: ఖదీజతుల్‌కుబ్రా, ముహమ్మద్‌ మహబూబ్‌ అలీ అస్కరి. కలంపేరు: యూసుఫ్‌

అస్కరి. చదువు: బి.ఏ., బి.యల్‌. వృత్తి: విశ్రాంత రాష్ట్ర ప్రభుత్వ

అక్షరశిల్పులు.pdf

అధికారి. 1990లో 'నీలగిరి' మాసపత్రికలో 'సత్యమేవ జయతే' వ్యాసం ప్రచురితమైనప్పటి నుండి వివిధ పత్రికలలో, సావనీర్లలో సామాజిక - ధార్మిర్మిక అంశాల మీద వ్యాసాలు ప్చురితం అయ్యాయి. స్థానిక మాసపత్రిక 'చీకటి వెలుగులు' మాసం మాసం ఏదోఒక సమకాలీన అంశం మీద విశ్లేషణాత్మక వ్యాసం ప్రచురితం అవుతుంది. లక్ష్యం: ప్రచారం అవుతున్న అవాస్థవాలను పూర్వపక్షం చేస్తూ ప్రజానీకానికి నిజాలు తెలియచేయడం. చిరునామా: ముహమ్మద్‌ యూసుఫ్‌ అలీ అస్కరి, ఇంటి నం. 5-8-115, రహమత్‌ నగర్‌, నల్గొండ-508001, నల్గొండ జిల్లా.

159