పుట:అక్షరశిల్పులు.pdf/152

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అక్షరశిల్పులు


నుండి వివిధ పత్రికల్లో, సంకలనాల్లో, సావనీర్లల్లో వ్యాసాలు

అక్షరశిల్పులు.pdf

చోటుచేసుకున్నాయి. పలు ఉర్దూ గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. అనువాద గ్రంథాలు: 1.హజ్‌ పరమార్ధం, 2. దైవ సాన్నుధ్యం పొందడమెలా?, 3. మేరాజ్‌ (యాత్ర-సందేశం), 4. దిక్సూచి, 5. హజ్రత్‌ ఉమర్‌ (రజి), 6. హజ్రత్‌ ఉస్మాన్‌ (రజి), 7. హజ్రత్‌ అలీ (రజి), 8. సమాధుల సందర్శన, 9. తావీజులు-తాయెత్తులు, 10. దైవ ప్రవక్త (స) దాంపత్య జీవితం, 11. సంపూర్ణ నమాజ్‌, 12. ఖుర్‌అన్‌తో ఇంటర్యూ (2010), 13. ధర్మ సంస్థాపన (2010). లక్ష్యం: ఉర్దూ భాషలో ఉన్న ఇస్లామియా ధార్మిక సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు పరిచయం చేయడం. చిరునామా: సుహైల్‌ అహమ్మద్‌ ఆదిల్‌, ఇంటి నం. 18-1-350/ 22/175, గుల్షన-యే-ఇక్బాల్‌ కాలనీ, అక్బర్‌ రోడ్‌, కేశవగిరి (పోస్టు), బండ్లగూడ మండలం, హైదారాబాద్‌-500005. సంచారవాణి: 93999 07243..

సుల్తాన్‌ పాషా ఎం
మహబూబ్‌నగర్‌ జిల్లా కొల్హా›పూర్‌ జన్మసలం. పుట్టినతేది: 06-08-

1950. తల్లితండ్రులు: ఆషా బేగం, ఖాశిం. చదువు: ఎం.ఎ., బి.ఓ.ఎల్‌. అప్పటిలో హైదారాబాద్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (పీల్‌ఖానా) లో తెలుగుపండితులుగా ఉద్యోగం. రచనలు: గేయాలు.

మహమ్మద్‌ తహసీన్‌ అలీ డాక్టర్‌
కరీంనగర్‌ జిల్లా ఉప్పల్‌లో 1952 మార్చి

ఒకిటిన జననం. తల్లితండ్రులు: ఇఫాతున్నీసా బేగం, మహమ్మద్‌

అక్షరశిల్పులు.pdf

హుస్సేన్‌. చదువు: ఎం.ఏ (హిందీ), ఎం.ఏ (సైకాలజీ)., పిహెచ్‌.డి. ఉద్యోగం: అధ్యాపకులు. 1973లో 'ఇక్కడే ఉండి పోవాలని ఉంది' కవిత ప్రచురితం అయినప్పటినుండి వివిధ పత్రికల్లో, సంకలనాల్లో కవితలు, కథలు, వ్యాసాలు ప్రచురితం. 2004లో వెలువడిన 'నిర్ణయం' కథానిక మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. లక్ష్యం: బహు భాషల్లో ఉన్న ఉత్తమ సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు పరిచయం చేయడం. చిరునామా: డాక్టర్‌ మహమ్మద్‌ తహసీన్‌ అలీ, ఇటి నం.3-137/3, పరిమళ కాలనీ, వడ్లెపల్లి-506370, వరంగల్‌ జిల్లా, సంచారవాణి: 99636 11016.

తాజుద్దీన్‌ అహ్మద్‌ మహమ్మద్‌: ఖమ్మం జిల్లా తెట్లెలపాడు లో 1957 మే ఐదున జననం. తల్లితండ్రులు: అమీనా బేగం, అబ్దుల్‌ నబి. చదువు: ఎం.ఏ., విద్వాన్‌., సాహిత్య రత్న., శాస్త్రి., ఆచార్య. ఉద్యోగం: అధ్యాపకులు. 1976 నుండి హిందీలో రాస్తున్నా,

151