పుట:అక్షరశిల్పులు.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

1983లో రాసిన 'స్పెషాలిటీ' తెలుగు కవిత 'పండిత భారతి'

పత్రికలో ప్రచురితమైనప్పటి నుండి ఇటు తెలుగు అటు హిందీ భాషల్లో రాసిన కవితలు, సాహిత్య-శాస్త్రీయ వ్యాసాలు ఆయా భాషా పత్రికల్లో, సంకలనాల్లో చోటు చేసుకున్నాయి. రచనలు: 1. పర్యావరణ పరిరక్షణ (1999), 2. నీరు-మీరు (2000), 3. నావ కథ, 4. అక్షరగీతి (2001), 5 విశ్వం దాని కథ (2002), 6. రైతన్నా..ఓ రైతన్నా (2007), 7. లోకం మెచ్చిన బాట (2008). అవార్డులు: కవిరాజు త్రిపురనేని స్మారక అవార్డు. లక్ష్యం: సామాజిక చైతన్యం. చిరునామా : ఎండి. తాజుద్దీన్‌, జడ్‌పిహెచ్‌ఎస్‌, రుద్రంపూర్‌-507119, ఖమ్మం జిల్లా. సంచారవాణి: 98482 07512, 95332 01149.

ఉమర్‌ అలీషా: విశాఖపట్నం జిల్లా విశాఖపట్నంలో 1955 సెప్టెంబర్‌ 21న జననం.

తల్లితండ్రులు: రజియా బేగం, ఖాదర్‌ బాషా. చదువు: బి.ఏ

(ఇంగ్లీషు)., ఎం.ఏ (తెలుగు)., ఏయంఐఇ. 1967 నుండి 'ఈశ్వర తత్వం' ప్రధాన అంశంగా పద్యశతకం రాశారు. అప్పటి నుండి వివిధ పత్రికలలో ఆధ్యాత్మిక, సాహిత్య సమీక్షా వ్యాసాలు, విమర్శనా వ్యాసాలు, పద్యాలు, కవితలు ప్రచురితమయ్యాయి. ఆకాశవాణి, దూరదర్శన్‌లో సాహిత్య ప్రసంగవ్యాసాలు విస్తారంగా ప్రసారం అయ్యాయి. లక్ష్యం: సమాజంలోని ప్రతి ఒక్కరిలో సమాజ శ్రేయోకాంక్షను మరింతగా పెంపొందించాలి. చిరునామా

ఉమర్‌ అలీషా, బీచ్‌ రోడ్‌, కంచర వీధి, విశాఖపట్నం-1, విశాఖపట్నం జిల్లా.

సంచారవాణి: 90324 92606.

ఉమర్‌ అలీషా డాక్టర్‌
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో 1966 ఆగస్టు రెండున

జననం. తల్లితండ్రులు: జహెరా బేగం, మొహిద్దీన్‌ బాద్షా

చదువు: బిహెచ్‌యంఎస్‌. వృత్తి: వైద్యం. 1989 నుండి ఆధ్యాత్మిక వ్యాసాలు రాస్తున్నారు, 'తత్వజ్ఞానం' మాసపత్రికలో వ్యాసం ప్రచురితమైనప్పటి నుండి వివిధ పత్రికలలో ఆధ్యాత్మిక వ్యాసాలు చోటుచేసు కునాflన్నాయి. ఆకాశవాణి, దూరదర్శన్‌, భక్తి టివి ఛానెల్స్‌లో పలు ఆధ్యాత్మిక ప్రసంగ వ్యాసాలు ప్రసారం. రచనలు: 1. విజ్ఞానజ్యోతి (120 ఆధ్యాత్మిక వ్యాసాల సంపుటి, 2007), 2. తత్వ దర్శనం (1992 నుండి 2010 వరకు ఇచ్చిన ఆధ్యాత్మిక ప్రసంగాల ఆరు సంపుటాలు). వీటిలో 'విజ్ఞానజ్యోతి' గ్రంథం 'కాస్మిక్‌ విజ్‌డమ్‌' పేరుతో

152