పుట:అక్షరశిల్పులు.pdf/151

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

'ఉగ్రవాదమా, నీదేమతం?', 'మన్నించు తల్లి' లాంటి కవితలు గుర్తింపు తెచ్చిపెట్టాయి. పురస్కారం: తెలుగు భాషా పురస్కారం (రాష్ట్ర అధికార భాషా సంఘం, 2008), లక్ష్యం: సాహిత్యం ద్వారా సామాజిక సేవ. చిరునామా: ఎస్‌.ఎం. సుభాని, ఇంటి నం.9-7-24, మొదటి అంతస్తు, సమతా ఆసుపత్రి వెనుక, రైలుపేట, గుంటూరు-522001, గుంటూరు జిల్లా. సంచారవాణి: 94907 76184.

సుగం బాబు యం.కె.
గుంటూరు జిల్లా గుంటూరు నగరంలో 1944 ఏప్రిల్‌ ఒకిటిన జననం. తల్లితండ్రులు: సకినాబీబి, ఫరీద్‌ ఖాన్‌. తల్లితండ్రులు పెట్టిన పేరు మహబూబ్‌

ఖాన్‌ కాగా అదికాస్తా 'సుగంబాబు' గా పేరు స్థిరపడింది. చదువు: బి.ఏ (తెలుగు). వృత్తి: జర్నలిస్టు-రచయిత. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో ప్రవేశం. పలు చలన చిత్రాలకు

అక్షరశిల్పులు.pdf

దర్శకుడిగా, రచయితగా వ్యవహరించారు. 1963 డిసెంబర్‌లో

'భారతి' మాసపత్రికలో 'మట్టీ బొమ్మ' కవిత ప్రచురణతో రచనా వ్యాసంగం ఆరంభం. అప్పటినుండి వివిధ పత్రికల్లో, సంకలనాల్లో కవితలు, కథానికలు, సాహిత్య వ్యాసాలు చోటుచేసుకున్నాయి. తెలుగు సాహిత్య లోకంలో 'పైగంబర్‌ కవులు'గా సుప్రసిద్ధులైన ఐదుగురిలో ఒకరైన సుగంబాబు 2003లో తెలుగు సాహిత్యంలో 'రెక్కలు' అను నూతన ప్రక్రియను ఆరంభించి ఐదుఎడిషన్లు వెలువరించారు . తొలిసారిగా హిబ్రూ విశ్వవిద్యాలయం (ఇజ్రాయిల్‌) కు చెందిన ఆచార్య సుర్మన్‌ డేవిస్‌ ఆంగ్ల భాషలో 'వింగ్స్' పేరిట వాటిని అనువదించి వెలువరించినప్పటి నుండి తెలుగులోనే కాకుండా జాతీయ స్థాయిలో 'రెక్కలు' ప్రక్రియ పాఠకాదరణ పొంది, అది కన్నడం, హిందీ భాషా సాహిత్యంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. రచనలు: చరలో సెలయేరు (1968), విప్లం (1969), పైగంబర్‌ కవులు (1971), సూరీడు (పాటల పుస్తకం, 1971), లెనిన్‌...లెనిన్‌ (1984), రెక్కలు (2003). ఈ గ్రంథాలలో 'సూరీడు' ఖ్యాతి తెచ్చిపెట్టింది. లక్ష్యం: మనిషి తన పరిదులను ఎరిగి మసలుకున్నప్పుడు మాత్రమే శాంతిగా-సౌఖ్యంగా జీవిచంగలడన్న విషయం ఎరుకపర్చాలని. చిరునామా: ఎం.కె సుగం బాబు, ఫ్లాట్-502, సాయితేజ ఎన్‌క్లేవ్‌, సూరారం ఎక్స్‌ రోడ్స్‌, వెంకట్రామ్‌ నగర్‌, హైదారాబాద్‌-550055. సంచారవాణి: 93925 17348.

సుహైల్‌ అహమ్మద్‌ ఆదిల్‌
హైదారాబాద్‌లో 1975 ఆగస్టు 24న జననం. తల్లి

తండ్రులు: అఖ్తర్‌ ఫైజ్‌ సిధ్ధిఖా, ఫాయఖ్‌ అహమ్మద్‌ ఫైజ్‌. కలంపేరు: సాద్‌. చదువు: ఎం.ఏ (ఇస్లామిక్‌ స్టడిస్‌)., ఎం.ఏ (ఉమన్‌ స్టడుస్‌)., బి.ఇడి., ఆలీం. ఉద్యోగం: ఉపాధ్యాయులు. ఉర్దూ, తెలుగు, అరబ్బీ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో ప్రవేశం. 1991లో రాసిన 'ఇస్లాంలో జంతు సంరక్షణ' వ్యాసం 'ఈనాడు' దినపత్రికలో ప్రచురితం అయినప్పటి

150