పుట:అక్షరశిల్పులు.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

సమ్దాని హుసేన్‌ షేక్‌: తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో 1953 డిసెంబరు 3

న జననం. తల్లితండ్రులు: జహరున్నీసా బేగం, మదీనా షరీఫ్‌. చదువు: బి.యస్సీ., పిజిడిసియం., పిజిఐఆర్‌పియం. ఉద్యోగం : గియసు జుద్దీన్ బాబూఖాన్‌ ట్రస్ట్ (జిబికె ట్రస్ట్ ) (హైదారాబాద్‌). 1980 నుండి వ్యాసాలు రాస్తున్నప్పటికి 2007లో ఉర్దూ నుండి తెలుగులోకి అనువదించిన 'దళిత సమస్య-ఇస్లాం' గ్రంథం గుర్తింపును అందించింది. పత్రికలలో స్వతంత్ర వ్యాసాలు, అనువాద వ్యాసాలు ప్రచురితం. లక్ష్యం: ధర్మ సంస్థాపన. చిరునామా: షేక్‌ హుస్సేన్‌ సమ్దాని, ఇంటి నం.147/ 3 ఆర్ టి, విజయనగర్‌ కాలనీ, హైదారాబాద్‌-500052. సంచార వాణి: 98665 56836. Email: shsamdani@rediffmail.com

సమీవుల్లా ఖాన్‌ పఠాన్‌
ఖమ్మం జిల్లా కల్లూరులో 1966 మే 5 న జననం. తల్లి

తండ్రులు: సకినాబీ, బహర్‌ అలీ ఖాన్‌. చదువు: యం.ఏ (హింది)., బి.ఇడి. ఉద్యోగం: ఉపాధ్యాయులు. 1990లో 'గోరి లోని గాడాంధాకారం' ధార్మిక వ్యాసంతో ఆరంభమై వివిధ పత్రి కల్లో వ్యాసాలు, అనువాద వ్యాసాలు, కవితలు, కథానికలు చోటు చేసుకున్నాయి. లక్ష్యం: సత్య సందేశ ప్రచారం. చిరునామా: పి. సమీవుల్లా ఖాన్‌, ఇంటి నం. 8-4-347, నిజాం పేట, ఖమ్మం 507001, ఖమ్మం జిల్లా. సంచారవాణి: 94406 54325, 95735 47479. Email: pskhan@gmail.com

సర్దార్‌ బాషా షేక్‌
కృష్ణా జిల్లా నూజివీడులో 1961 ఏప్రిల్‌ తొమ్మిదిన జననం. తల్లి

తండ్రులు: షేక్‌ సకినాబీ, షేక్‌ తురాబ్‌. కలంపేరు: అల్‌ఫతా.

చదువు: యస్‌యస్‌సి. ఉద్యోగం: విజయకృష్ణా సూపర్‌ మార్కెట్,

విజయవాడ. 1980లో నాస్తిక మిత్రలో ప్రచురితమైన 'నేను నాస్తికుడ్ని కవితతో ఆరంభించి వివిధ పత్రికలలో కవితలు, సాహిత్య విమర్శలు చోటుచేసుకున్నాయి. 'మూల్‌ నివాసి టైమ్స్‌'లో వచ్చిన 'నేను మూలవాసిని' కవిత, 'అంకుర్‌' (ఢిల్లీ) పత్రికలో ప్రచురితమైన 'లాల్‌ జంగ్' (హింది కవిత) గుర్తింపు ఇచ్చాయి. లక్ష్యం: సమసమాజం. చిరు నామా: షేక్‌ సర్దార్ బాషా (అల్‌ఫతా), ఇంటి నం.41-1/4-4, ద్వారకానగర్‌, కృష్ణలంక, విజయవాడ-520013. సంచారవాణి: 99856 23693 (పిపి).

138