పుట:అక్షరశిల్పులు.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్షరశిల్పులు

మరాఠి, ఒరియా, మళయాళం, ఆంగ్ల భాషల్లో వెలువడగా 'కాలుతున్న పూలతోట' కూడా హిందీ, మళయాళం, కన్నడం, ఆంగ్లంలో ప్రచురితం అయ్యాయి. పురస్కారాలు-అవార్డులు: ప్టొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి 'సాహితీ పురస్కారం' (2005), ధర్మనిధి పురస్కారం (2002). ఉత్తమ నవలా రచయిత గౌరవ పురస్కారం (విశాలాంధ్ర స్వర్ణోత్సవాలు, 2003), భాషా పురస్కారం (అధికారభాషా సంఘం, హైదారాబాద్‌, 2003), మాడభూషి రంగాచారి స్మారక పురస్కారం (2004), ఢిల్లీ తెలుగు అకాడమీ పురస్కారం (2005), రాష్ట్రీయ వికాస్‌ శిరోమణి పురస్కారం (ఢిల్లీ, 2005), పులికిం కథా సాహితీ సత్కృతి (2005) బండారు ఈశ్వరమ్మ అవార్డు (2006), శారదాంబ అవార్డు, రచనా కథా పీఠం అవార్డు, కొవ్వలి సాహితీ పురస్కారం (2009), ఉగాది పురస్కారం (2007), వాసిరెడ్డి సీతాదేవి నవలా పురస్కారం (2007), చాసో కథా పురాస్కారం (2008). జాతీయ -అంతర్జాతీయ స్థాయి 'కథా-నవల' పోటీలలో పలుమార్లు విజేత, పలు బహుమతులు లభ్యం. లక్ష్యం: సమాజాన్ని పట్టి పీడిస్తున్న రుగ్మతల వికృతచేష్టల పట్ల ప్రజలను జాగురూకుల్నిచేయాలన్న చిన్న ప్రయత్నం. చిరునామా: సయ్యద్‌ సలీం, ఫాట్ నం.306, జెబి అపార్‌ట్మెంట్స్, దోమలగూడ , హైదరాబాద్‌ - 29. సంచారవాణి : 98493 86327. Email: saleem_652002@yahoo.co.in

సమద్‌ ఎస్‌ ఎ
. కడప జిల్లా నందలూరులో 1935 లై 10న జననం. విద్యార్హతలు:

ఎం.ఏ. ఉద్యోగం : రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ. 1982 ప్రాంతంలో చిత్తూరు జిల్లా తిరుపతి నగరంలోని భవాని నగర్‌ నివాసి. కడప జిల్లాలో చాలా కాలం ఎక్సైజ్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా

బాధ్యతలు నిర్వహించారు. 1982లో హైదారాబాద్‌లో జరిగిన

'ఆంధ్రప్రదేశ్‌ ముస్లిం తెలుగు రచయితల సమ్మేళనం' కార్యక్రమం ఆహ్వాన కమిటి కార్యదర్సిగా బాధ్యతలు నిర్వహించడం మాత్రమే కాకుండా ప్రత్యేక సంచిక 'తెలుగు దివ్వెలు' ప్రచురించడంలో ప్రముఖ పాత్ర వహించారు. ఈ ప్రత్యేక సంచికలో ఆయన రాసిన 'ముస్లిం తెలుగు రచయితలు : నేటితరం' అను సవివరణాత్మక వ్యాసం ప్రచురితం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 50 మంది ముస్లిం తెలుగు రచయితలు పాల్గొన్న ఈ సమ్మేళనంలో 30 మంది రచయితలు రాసిన వ్యాసాలతో 'తెలుగు దివ్వెలు' రూపొందింది. 1982 మార్చి 20, 21 తేదిలలో రెండు రోజుల పాటు వివిధ సాహిత్య కార్యక్రమాలు, కవితా గోష్టులతో సాగిన మొట్టమొదటి కార్యక్రమం కనుక ఆనాటి ముఖ్యమంత్రి భవనం వెంకట్రామ్‌, మంత్రివర్యులు, అధికార భాషాసంఘం అధ్యక్షులు, ఇతర పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. (సమాచారం: షేక్‌ అలీ, కావూరు,22-01-2010).

137