పుట:అక్షరశిల్పులు.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్షరశిల్పులు

సర్వర్‌ ముహమ్మద్‌
కరీంనగర్‌ జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి (ఆర్‌ఎస్‌)లో 1948

ఆగస్టు 15న జననం. తల్లితండ్రులు: అఫ్జల్‌బి, ముహమ్మద్‌ అబ్దుల్‌ కరీం. కలంపేరు: అబుల్‌ ఫౌజాన్‌. చదువు : ఎం.ఏ(ఇస్లామిక్‌ స్టడిస్‌)., ఎం.ఏ(ఉర్దూ). ఉద్యోగం : విశ్రాంత రాష్ట్ర ప్రభుత్వ రెవిన్యూ శాఖ అధికారి. 1983లో గీటురాయి వారపత్రికలో 'సమీపిస్తున్న భయంకర సన్నివేశం' వ్యాసం రాయడం బద్వారా రచనా వ్యాసంగం

ఆరంభం. అప్పటి నుండి వివిధ పత్రికలలో ధార్మిక, చారిత్రక

వ్యాసాలు, కథానికలు ప్రచురితం. ఉర్దూ నుండి తెలుగులోకి, అలాగే తెలుగు నుండి ఉర్దూలోకి కూడా పలు గ్రంథాలను అనువదించారు. స్వతంత్ర రచనలు: 1.మత సామరస్యం ఔరంగజేబు, 2. ముస్లింల సమగ్ర జీవితం; అనువాద గ్రంథాలు: 3. ప్రవక్త సహచరుల సందేశ సరళి, 4. మానవ సభ్యతా సంస్కృతుల పై ఇస్లాం ప్రభావం, 5. ఇస్లాం సుశిక్షణా వ్యవస్థ, 6. బర్జ్‌ఖ్‌ (పితృలోకం), 7. లైంగిక సంబంధాలు-ప్రకృతి నియమాలు,8. ఇస్లాం ధ్యేయం ఏమి?, 9. వివాహ శుభాకాంక్షలు, 10. దాంపత్య జీవితం విచ్ఛిన్నమైనప్పుడు-ఇస్లాం స్త్రీకిచ్చిందేమి?, 11. బాలికల సామూహిక సంహారం, 12. మానవుని ఆర్థిక సమస్య- ఇస్లామీయ పరిష్కారం, 13. మహాప్రవక్తల సందేశ సరళి-మన బాధ్యత, 14. ఇస్లాం పై విమర్శలు-సమాధానాలు, 15. మహనీయ మహమ్మద్‌ మరియు భారతీయ ధార్మిక గ్రంథాలు (2010), 16. షహీద్‌ అష్పాఖుల్లా ఖాన్‌ (తెలుగు నుండి ఉర్దూలోకి అనువాదం, 2010). ఈ గ్రంథాలలో 'మత సామరస్యం-ఔరంగజేబు', 'ఇస్లాంలో పరమత సహనం', 'షహీద్‌ అష్పాఖుల్లా ఖాన్‌' గుర్తింపు తెచ్చిపెట్టాయి. లక్ష్యం : భారతీయులందర్ని సర్వమానవ స్ధభ్రాతృత్వ పునాదుల మీద ఏకీకృతం చేయడం. చిరునామా : ముహమ్మద్‌ సర్వర్‌, ఇంటి. నం. 7-2-1038, కశ్మీర్‌ గడ్డ లోకాలిటీ, మంకమ్మతోట, కరీంనగర్‌-505001, సంచారవాణి: 99638 67432.

సత్యాగ్ని హుస్సేన్‌
కడప జిల్లా రాయలపంతుల పల్లెలో 1943 జూన్‌ ఒకిటిన జననం.

తల్లితండ్రులు: షేక్‌ బషీ రాబీ, షేక్‌ ఇమాం సాహెబ్‌ .

తల్లితండ్రులు పెట్టిన పేరు షేక్‌ హుస్సేన్‌ కాగా సాహిత్య గురువు పుట్టపర్తి నారాయణచార్యులు పెట్టిన కలం పేరు 'సత్యాగ్ని హుస్సేన్‌' అసలు పేరుగా స్థిరపడింది. చదువు: బి.ఏ. వృత్తి: జర్నలిజం-రాజకీయాలు (ప్రస్తుతం రాష్ట్ర శాసనమండలి సబ్యులు). ఉన్నత పాఠశాల విద్యార్థిగా కవిత్వం-నాటకరంగం మీద ప్రత్యేక ఆసక్తి. స్వయంగా నాటికలు రచించి, నటించి ప్రదర్శించి ఉత్తమ

139