పుట:అక్షరశిల్పులు.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్షరశిల్పులు

మెహరున్నీసా, షేక్‌ మస్తాన్ . చదువు: బి.ఏ. వ్యాపంకుడు

('వార్త' దినపత్రిక, హైదారాబాద్‌). 1981లో బాలమిత్ర మాసపత్రికలో తొలిసారిగా 'అందం తెచ్చిన అపకారం' కథ ప్రచురితం కావడంతో రచనా వ్యాసంగం ఆరంభం. అప్పనుండి వివిధ పత్రికల్లో, సంకలనాలలో కథలు, కవితలు, వ్యాసాలు చోటుచేసుకున్నాయి. ఆక్రమంలో ఫెమినిజం ప్రధానాంశంగా రాసిన 'స్పందన' నవల, 'పచ్చని జ్ఞాపకం' కవిత గుర్తింపు తెచ్చిపెట్టాయి. రచన: స్పందన (నవల 2002). లక్ష్యం: మంచి సాహిత్యాన్ని రచించడం, మంచి సాహిత్యాన్ని ఆస్వాదించడం. చిరునామా : షేక్‌ రఫి, ఇంటి నం. 16-11658/ఏ, మూసరంబాగ్, హైదారాబాద్‌-36. సంచారవాణి: 94907 51886.

రఫి సయ్యద్‌: కృష్ణా జిల్లా నూజివీడులో 1958 మే ఎనిమిదిన జననం. తల్లితండ్రులు: సయ్యద్‌ అష్రఫున్నీసా, సయ్యద్‌ హఫీజ్‌. చదువు: బి.ఏ, ఐటిఐ. ఉద్యోగం: దక్షిణ మధ్య రైల్వే.

1979లో విజయవాడ నుండి వెలువడి న 'ఎన్‌ కౌంటర్‌ '

పక్షపత్రికలో తొలిసారిగా వ్యాసం ప్రచురితమైనప్పటినుండి వివిధ పత్రికల్లో, సంకలనాల్లో వ్యాసాలు చోటుచేసుకున్నాయి. వక్త, రాజకీయ విశ్లేషకుడు. లక్ష్యం: మూఢ నమ్మకాల నుండి, అన్నిరకాల అసమానతల నుండి సమాజాన్ని విముక్తం చేయడం. చిరునామా: సయ్యద్‌ రఫి, ఇంటి నం. 745-ఎం, ఆర్‌ ఇ కాలనీ, కాల్‌టెక్స్‌ రోడ్‌, విజయవాడ-520 001, కృష్ణాజిల్లా. సంచారవాణి: 99490 93044. Email: syedrafimrs@gamil.com

రఫి మహమ్మద్‌ టెంగిరి షేక్‌: కడప జిల్లా నరసాపురంలో 1973 జూన్‌15న

జననం. తల్లితండ్రులు: జైనుబీ, బాషు సాహెబ్‌. చదువు: ఎం.ఏ.,

బి.ఇడి . ఉద్యోగం : ఉపాధ్యాయుడు . కలంపేరు : టి ఎం డి రఫి.1988లో ఆంధ్రభూమి వీక్లీలో రాసిన 'కోయిలా...కోయిలా' కవితతో ఆరంభమై వివిధ పత్రికల్లో, సంకలనాలలో పలు కవితలు, కథలు, వ్యాసాలు చోటు చేసుకున్నాయి. ముస్లిం రిజర్వేషన్లను సమర్థిస్తూ దినపత్రికల్లో ప్రచురితమైన వ్యాసాలు గుర్తింపు తెచ్చిపెట్టాయి. లక్ష్యం: ముస్లింలు బాగుండాలి, అందరూ బాగుపడాలి, నా దేశం సుభిక్షంగా ఉండలన్నది. చిరునామా: టిఎండి రఫి, ఇంటి నం.14-421, కొత్తవీధి, పోరుమామిళ్ళ-516193, కడప జిల్లా. సంచారవాణి: 94416 36821.

123