పుట:అక్షరశిల్పులు.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

రహమతుల్లా బేపారి షేక్‌: కడప జిల్లా సిద్దవట్టంలో 1957 డిసెంబర్‌ ఆరున జననం. తల్లితండ్రులు: షేక్‌ సలీమాబి, షేక్‌ అబ్దుల్‌ రసూల్‌. కలంపేరు: 'శశిశ్రీ'. చదువు: బి.ఏ., బి.యల్‌., ఎం.ఏ. వృత్తి: పాత్రికేయుడు. ప్రాథమిక విద్య నాటి నుండి కవిత్వం మీద ఏర్పడిన మక్కువకు డాక్టర్‌ పుట్టపర్తి నారాయణాచార్యుల మార్గదర్శకం లభించడంతో 1977లో 'అభ్యుదయ' మాసపత్రికలో 'సమాజం' కవిత తొలిసారిగా ప్రచురితమైంది. అప్పటి నుండి వివిధ పత్రికల్లో, సంకలనాల్లో కవితలు, కథానికలు, గేయాలు, పద్యాలు, సాహిత్య- సామాజిక-సమీక్షావ్యాసాలు చోటుచేసుకున్నాయి. ప్రచురితమైన చాలా కవితలు, కథానికలు ఆంగ్లం, ఉర్దూ భాషల్లో తర్జుమా చేయబడి ఆయా భాషా పత్రికల్లో ప్రచురితం అయ్యాయి. 1995 నుండి 'సాహిత్యనేత్రం' త్రైమాస పత్రిక నిర్వహిస్తున్నారు. ఆశువుగా కవిత్వం చెప్పడంలో దిట్ట. వక్త, సామాజిక-రాజకీయ విశ్లేషకుడు. రచనలు: 1.రాతిపూలు (కథా సంపుటి, 1996), 2.పల్లవి (వచన కావ్యం, 1978), 3.శబ్దానికి స్వాగతం (వచన కావ్యం, 1991), 4.జేబులో సూర్యుడు (వచన కావ్యం,2008), 5.దాహెజ్‌ (కథల సంపుటి,

2007), 6.మనకు తెలియని మన కడప జిల్లా (చరిత్ర గ్రంథం,

2007). ఈ గ్రంథాలలో 'జేబులో సూర్యుడు' వచన కావ్యం 'జేబ్‌ మే సూరజ్‌' పేరుతో 2006లో ఉర్దూలో, 'దాహెజ్‌' కథల సంపుటి 'ట్యూన్స్‌ ఆఫ్‌ లైఫ్స్‌' పేరుతో 2008లో ఆంగ్లంలో వెలువడ్డాయి. తెలుగుకు ప్రాచీన హోదా కోసం కడప జిల్లాలోని తొలిసారి తెలుగు శాసనాల గురించి ప్రచారం చేసిన భాషా సేవకుడిగా గుర్తింపు. పురస్కారాలు-అవార్డులు: ఎంవి గుప్తా ఫౌండేషన్‌ ప్రత్యేక అవార్డు (ఏలూరు, 1989), గుర్రం జాషువా అవార్డు (కడప, 1990), తెలుగు అధికార భాషా సంఘంచే 'విశిష్ట భాషా పురస్కారం' (2004 మరియు 2008), ఉత్తమ సాహిత్య సంపాదకుడు అవార్డు (కథానిలయం నందలూరు, 2007), డాక్టర్‌ పట్టాభిరామి రెడ్డి స్మారక పురస్కారం (హైదారాబాద్‌, 2008), కొండేపూడి శ్రీనివాసరావు స్మారక సాహిత్య పురస్కారం (2008, గుంటూరు), ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంచే 'రాష్ట్ర స్థాయి ఉత్తమ పాత్రికేయుడు' అవార్డు (హైదారాబాద్‌, 2008), యూనిసిఫ్‌ అంతర్జాతీయ పురస్కారం (2009, హైదారాబాద్‌). అరసం వజ్రోత్సవ సాహితీ పురస్కారం (గుంటూరు, 2010). ప్రముఖ సాహిత్య-సాంస్కృతిక సంస్థలచే సన్మానాలు, సత్కారాలు. లక్ష్యం: తెలుగు సాహిత్య, సాంస్కృతిక వైభవ-ప్రాభవాలను మరింతగా ప్రతిష్టింప జేయాలన్నది. చిరునామా : షేక్‌ బేపారి రహమతుల్లా, ఇంటి నం.1-778 (2ఏ), జర్నలిస్టు కాలనీ, ద్వారకా నగర్‌, కడప-516004, కడప జిల్లా. సంచారవాణి : 93474 10689, 99899 13818. Email: sasisreekdp@gmail.com

124