పుట:అక్షరశిల్పులు.pdf/117

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

-బిరుదులు: చక్రపాణి అవార్డు (హైదారాబాద్‌), కొలసాని-చక్రపాణి అవార్డు (చిలువూరు),జాషువా స్మారక అవార్డు (తెనాలి), తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ అవార్డు (హైదారాబాద్‌), షార్జా తెలుగు అసోసియేషన్‌ అవార్డు (షార్జా), రసమయి-లిటరరీ అవార్డు(దుబాయ్‌), కొలసాని వెంకట సుబ్బయ్య అవార్డు, బాలజ్యోతి అవార్డు, బొల్లిముంత శిరామకృష్యయ్య అవార్డు, ఠాగూర్‌ సెంటినరీ అవార్డు (గుంటూరు), హస్యచక్రవర్తి (దుబాయి), నవలా చక్రవర్తి (నాగార్జున విశ్వవిద్యాలయం, గుంటూరు). సాహిత్య-సాంస్కృతిక సంస్థలద్వారా పలు సన్మానాలు అందుకున్నారు. లక్ష్యం: ఉత్తమ, ఉపయుక్త సాహిత్యాన్ని సంఘానికిఅందించడం. చిరునామా: మహమ్మద్‌ నఫీజుద్దీన్‌, (ఎండి.సౌజన్య), కొత్తపేట, తెనాలి-522 201, గుంటూరు జిల్లా. దూరవాణి: 08644- 226015, సంచారవాణి: 99490 16732.

నశీర్‌ అహమ్మద్‌ సయ్యద్‌: నెల్లూరు జిల్లా అల్లూరు తాలూకా పురిణి గ్రామంలో 1955 డిసెంబరు 22న జననం. తల్లితండ్రులు: షేక్‌ బీబిజాన్‌, సయ్యద్‌ మీరా మోహిద్దీన్‌. చదువు: ఎం.కామ్‌., ఎల్‌ఎల్‌.బి.,సాహిత్యరత్న(హిందీ)., డి.జె. వృత్తి: న్యాయవాది-పాత్రికేయుడు. ఏడవ తరగతి నుండి రాయడం ఆరంభించినా 1975లో 'మరోప్రపంచం' లిఖిత మాసపత్రికలో తొలిసారిగా కవితలు ప్రచురణ. 1976లో 'ప్రగతి' సచిత్ర వారపత్రికలోకథానికలు, కార్టూన్లు చోటుచేసుకున్నాయి. అప్పటినుండి వివిధ పత్రికల్లో పలు కవితలు,గేయాలు, కథలు, వందలాది రాజకీయ-సామాజిక-సాహిత్య- చరిత్ర-సమీక్ష వ్యాసాలు,

అక్షరశిల్పులు.pdf

పలు వ్యంగ్య చిత్రాలు ప్రచురితం. స్వయంగా మిత్రుడు విఎస్సార్‌ అవధానితో కలసి 'మరో ప్రపంచం', 'భేరి' లిఖిత మాసపత్రికలు వెలువరించారు, 2006 నుండి 'ఇండియా' మాసపత్రికకు సంపాదకత్వం వహిస్తున్నారు. భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లిం జన సముదాయాల పాత్ర వివరిస్తూ, 1999 నుండి గ్రంథ ప్రచురణ ప్రారంభించి, 1. భారత స్వాతంత్య్రోద్యమం - ముస్లింలు, 2. భారత స్వాతంత్య్రోద్యమం: ముస్లిం మహిళలు, 3. భారత స్వాతంత్య్రోద్యమం: ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలు, 4. మైసూరు పులి :టిపూసుల్తాన్‌, 5. భారత స్వాతంత్య్రోద్యమం: ముస్లిం ప్రజా పోరాటాలు, 6. షహీద్‌-యే-ఆజం అష్పాఖుల్లా ఖాన్‌, 7. భారత స్వాతంత్య్ర సంగ్రామం: ముస్లిం యోధులు (ప్రథమ భాగం), 8. చిరస్మరణీయులు, 9. 1857: ముస్లింలు అను గ్రంథాలు వెలువరించారు. ఈ గ్రంథాలలో మొదటినాలుగు గ్రంథాలు మూడుసార్లు, ఆ తరువాతి నాలుగు గ్రంథాలు రెండుసార్లు పునర్ముద్రణయ్యాయి. ఈ గ్రంథాలలో షహీద్‌-యే-ఆజం అష్పాఖుల్లా ఖాన్‌, భారత స్వాతంత్య్రోద్యమం-ముస్లింలు ఉర్దూలోకి అనువాదం అయ్యాయి. 'భారత స్వాతంత్య్రోద్యమం-ముస్లింలు' ఆంగ్ల వ్యాసం అలీఘర్‌ ముస్లిం విశ్వవిద్యాలయం

116