పుట:అక్షరశిల్పులు.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్షరశిల్పులు


ప్రచురించిన 'భారత స్వాతంత్య్రోద్యమం-ముస్లింల పాత్ర' వ్యాససంపుటిలో చోటుచేసుకుంది.నటుడు, చిత్రకారుడు, వ్యంగ్యచిత్రకారుడు, వక్త. అంతర్జాతీయ-జాతీయ-ప్రాంతీయ సభలు,సమావేశాలు, సదస్సులలో పాల్గొన్నారు. అవార్డులు- పురస్కారాలు: వి.ఆర్‌ నార్ల విశిష్టజర్నలిస్టు అవార్డు (విజయవాడ), తెలుగు భాషా పురస్కారం (గుంటూరు), డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఫెలోషిప్‌ అవార్డు (న్యూఢిల్లీ). లక్ష్యం: ఆర్థిక-సామాజిక అసమానతలు లేని లౌకిక, ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణంలో రచయితగా భాగస్వామ్యం అందించడం, జ్ఞానంప్రజాస్వామీకరించబడలన్న ఆకాంక∆తో రచనా వ్యాసంగం చేయడం. చిరునామా: సయ్యద్‌నశీర్‌ అహమ్మద్‌, శివప్రసాద్‌ వీధి, కొత్తపేట, వినుకొండ-522567, గుంటూరు జిల్లా. సంచారవాణి: 94402 41727, 93964 29722. Email: naseerahamed@ yahoo.com.

నసీరా బేగం
కృష్ణా జిల్లా విజయవాడలో 1972 మే 17న జననం. తల్లితండ్రులు:సలీమున్నీసా బేగం, సయ్యద్‌ నయీముర్‌ రహ్మన్‌. చదువు: బి.ఏ. వ్యాసంగం: రచన-

అనువాదం. ఉర్దూ, తెలుగు భాషలలో ప్రవేశం. 1987లో తండ్రి ప్రోత్సాహంతో రచనారంగ ప్రవేశం. అప్పటినుండి రాష్ట్రంలోని వివిధ పత్రికలలో వ్యాసాలు ప్రచురితమయ్యాయి. 'ఈనాడు' దినపత్రికలో 'అంతర్యామి' శీర్షిక క్రింద రాస్తున్న వ్యాసాలు గుర్తింపు తెచ్చాయి. ఉర్దూ నుండి తెలుగులోకి అనువదించి ధార్మికంగా ప్రజలకు మార్గదర్శకం చేసే వ్యాసాలు రాస్తున్నారు. లక్ష్యం: అల్లాహ్‌ ప్రసన్నత. చిరునామా: నసీరా బేగం, ఫ్లాట్.405, అన్సారి ఎన్‌క్లేవ్‌, అజీజియా మస్జిద్‌ ఎదురు, మెహదీపట్నం, హైదారాబాద్‌-28. సంచారవాణి: 92465 31645, దాూరవాణి: 040-66253022.

నవాజ్‌ అలీ ముహమ్మద్‌: 1938 సెప్టెంబర్‌ 25న

జననం. వరంగల్‌ జిల్లా నర్సంపేట నివాసి. తల్లితండ్రులు: మహబూబ్‌ బీ, మహబూబ్‌ అలీ, వృత్తి: అధ్యాపకులు. 1954లో 'భాగ్యనగర్‌' పత్రికలో 'జోహారు' తొలి కవిత ప్రచురితం. అప్పటి నుండి వివిధ పత్రికలలో పలు కవితలు, వ్యాసాలు చోటు చేసుకున్నాయి. 'సహజ కవి' బిరుదాంకితలు. రచన: 'సంజీవని' (గేయ సంపుటి,1989). చిరునామా: ఎండి నవాజ్‌ అలీ, 8-22, నేతాజీ రోడ్‌, నర్సంపేట- 506132, వరంగల్‌ జిల్లా.

నాజర్‌ సాహెబ్‌ షేక్‌
బుర్రకథా పితా మహుడుగా విఖ్యాతిగాంచి 'నాజర్‌' పేరుతో ప్రసిద్ధుడైన షేక్‌ నాజర్‌ సాహెబ్‌ గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలో 1920 ఫిబ్రవరి 5న జన్మించారు. తల్లితండ్రులు : షేక్‌ బీబాబి, షేక్‌ మస్తాన్‌ సాహెబ్‌.

117