పుట:అక్షరశిల్పులు.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్షరశిల్పులు


జ్యోతిర్గమయ, ధర్మ సంరక్షణార్థం, దేముడూ నీకు దిక్కెవరు నాటికలు రాసి విద్యార్థుల ద్వారా అంతర్‌కళాశాలలనాటక పోటీలకు పంపి పలు బహుమతులు గెలుచుకోవడంతో విస్తృతంగా రచనలు చేయడం ఆరంభించారు. ఆ క్రమంలో నవలలు: 1.విముక్తి, 2. విధివిన్యాసాలు, 3.కలల అలలు, 4. ఈ చరిత్ర ఎవరు రాస్తారో, 5. ఆపదలో అనురాధా, 6. జాదూ నగర్‌, 7. మృత్యు లోయ, 8. ఈ నేరం ఎవరిది?, 9.మాయా బజార్‌, 10. మృత్యువుతో ముఖాముఖి, 11. ఓ నటి కథ, 12. మరో ధారిత్రి, 13. త్రికాల్‌, 14. బలికోరిన ప్రేమ; నాటికలు: 15. జ్ఞానోదయం, 16. తమసోమా జ్యోతిర్గమయ, 17. ధర్మ సంరక్షణార్థం, 18. దేముడూ నీకు దిక్కెవరు, 19. కనకపు సింహాసనమున; రేడియో నాటికలు: 20. కోటి విద్యలు, 21. తాతయ్య పరీక్ష, 22. తనదాకా వస్తే, 23. పరిహారం, 24. ఇది దారి కాదు, 25. ఐడియాల అప్పారావు; హాస్యరస గ్రంథాలు: 26. ప్రముఖుల హస్యాలు, 27. మహనీయుల జీవితాల్లో మధుర ఘట్టాలు, 28. హాస్యవల్లరి, 29. నవరసాల తెలుగు హస్యం, 30.నవ్వుతూ బ్రతకాలిరా (2010); విద్యార్థులకు ఉపయుక్త గ్రంథాలు:

31. వ్యాససుధ, 32. నమ్మలేని నిజాలు, 33. చరిత్ర పురుషులు

చారిత్రక ఘట్టాలు, 34. ప్రపంచ అద్బుతాలు, 35. రాబిన్‌సన్‌ క్రూసో; సాహిత్యవిమర్శనా గ్రంథాలు: 36. ప్రపంచ సాహిత్యంలో ప్రేమ ఘట్టాలు, 37.షేక్స్‌పియర్‌ నాటకాలు, కథలు-విమర్శ, 38. విశ్వ సాహిత్యంలో విశిష్టతలు-వింతలు తదితర గ్రంథాలు వెలువడ్డాయి. ఈ గ్రంథాలు కాకుండా ఆంగ్ల అధ్యాపకులు కావడంతో 1. వరల్డ్‌ ఫేమస్‌ స్టోరీస్‌,2. సోషల్‌ షార్ట్‌ స్టోరీస్‌ ఫర్‌ చిల్డ్రన్‌ అను ఆంగ్ల గ్రంథాలను వెలువరించారు. ఐదు దశాబ్దాలుగా రాసిన నవలలు, నాటికలు-నాటకాల మీద రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయలలోని విద్యార్థులు పరిశోధనలు జరిపి ఎం.ఫిల్‌., పి.హెచ్‌డి పట్టాలను పొందారు. రాష్ట్రంలోని వివిధ పత్రికలలో కథలు, కవితలు, సాహిత్య, సమీక్షా వ్యాసాలు, పలు నవలలు ధారవాహికంగా ప్రచురితం అయ్యాయి. ఆయన ప్రత్యేకంగా రాసిన రేడియో నాటికలన్నీ ఆకాశవాణి ద్వారా ప్రసారం కావడం మాత్రమే కాక ఆయన రూపొందించిన స్టేజి నాటకాలు ఈనాటికి కూడా రాష్ట్రంలోనే కాకుండ ఇతర రాష్ట్రాలలో తెలుగు ప్రజలు అధికంగా గల ప్రాంతాలలో ప్రదర్శించ బడుతున్నాయి, ఉత్తమ నాటక రచన క్యాటగిరిలో బహుమతులు అందుకుంటున్నాయి. ఉత్తమ దర్శకులు, ఉత్తమ నటుడు, ఉత్తమ రచయితగా బహుమతులు అందుకున్న ఆయన హస్య నటుడిగా, మంచి చిత్రకారులుగా సుప్రసిద్దులు. కథలు, నవలలు, నాటికలు పలు ఇతర భాషలలో అనువాదమై పుస్తకాలు వెలువడ్డాయి, రేడియో నాటికలు జాతీయ స్థాయిలో ప్రసారానికి నోచుకున్నాయి. అవార్డులు-పురస్కారాలు

115