పుట:అక్షరశిల్పులు.pdf/115

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

గుర్తింపు తెచ్చిపెట్టింది. 'ప్రియదత్త' వారపత్రికలో 'సార్వభౌమ' నవల సీరియల్‌ వచ్చింది. హిందీ నుండి పలు కథలను తెలుగులోకి అనువదించారు. లక్ష్యం: మానవత్వపు పరిమళాలు వెదజల్లడం. చిరునామా: ఎన్నెస్‌ ఖలందర్‌, ఇంటి నం.21/573, ఖాదర్‌ హుసేన్‌ మసీదు వీధి, ప్రొద్దుటూరు-516360, కడప జిల్లా. సంచారవాణి: 93472 25279.

నబీ రసూల్‌ కంబదూరి
అనంతపురం జిల్లా కంబదూరిలో 1952 జూలై ఒకిటిన జననం. తల్లితండ్రులు: ఖాజాబీ, షేక్‌ మస్తాన్‌ సాహెబ్‌. కలంపేరు: కంబదూరి. చదువు:
అక్షరశిల్పులు.pdf

బి.కాం. ఉద్యోగం: రాష్ట్ర విద్యుత్ శాఖ (రిటైర్డ్). 1973లో 'సమరం పూరించండి' కవిత ప్రచురణతో రచనా వ్యాసంగం ఆరంభమై వివిధ పత్రికలలో, సంకలనాలలో కవితలు, వ్యాసాలు, సమీక్షలు ప్రచురితం. 'అనంత వినియోగవాణి' అను వినియోగదారుల మాసపత్రికను సంపాదకునిగా నితర్వహిస్తున్నారు. వక్త, సాహిత్య- సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో దిట్ట. రాష్ట్రంలోని పలు సాహితీ-సాంస్కృతిక-సేవా సంస్థలచే సన్మానాలు-సత్కారాలు పొందారు. లక్ష్యం: అట్టడుగు వర్గాల ఉన్నతి. చిరునామా: కంబదూరి నబీ రసూల్‌,ఫ్లాట్ నం.7, మోడరన్‌ హౌసింగ్ కాలనీ, సంగమేష్‌నగర్‌, అనంతపురం-515001, అనంతపురం జిల్లా. సంచారవాణి: 98667 14867.

నబీ సాహెబ్‌ షేక్‌: రచనలు: అంబరీషోపాఖ్యానము, కపోతేశ్వర చరిత్రము, చంద్రహాస చరిత్రము, ద్రువోపాఖ్యానము.

అక్షరశిల్పులు.pdf
నబి షేక్‌
గుంటూరుజిల్లా అగ్నిగుండాలలో 1971 మే

పదిన జననం. తల్లితండ్రులు: నరసంబి, చిన నబి. చదువు: బిఎస్సీ. వృత్తి : విద్యాబోధన . కవితలక, వ్యాసాలు వివిధ పత్రికలలో, సంకలనాలలో ప్రచురితం. రచనలు: చదువంటే? (2005), వినుకొండ కలాలు (2005). లక్ష్యం: మనస్సులను ఏకం చేయడం. చిరునామా: షేక్‌ నబి, సిద్ధార్థ నగర్, వినుకొండ- 522647, గుంటూరు జిల్లా. సంచారవాణి: 81218 40062.

నఫీజుద్దీన్‌ మహమ్మద్‌: గుంటూరు జిల్లా తెనాలిలో 1940 మే 25న జననం. తల్లి తండ్రులు: మహమ్మద్‌ ఇస్మాయిల్‌, హజరా బీబి. 'యండి. సౌజన్య' కలంపేరుతో ప్రసిద్దులు. ఆంధ్రపత్రిక ఎడిటర్‌ వీరాజి 1982లో ఈ కలం పేరును ఎంపికచేశారు. చదువు: ఎం.ఏ., (ఇంగ్లీష్‌)., ఎం.ఫిల్‌. వృత్తి: అధ్యాపకులు.1965లో 'పాపం బిచ్చగత్తె' కథ ప్రచురితం అవుతుండంతో రచనా వ్యాసంగం ఆరంభించి అదే సంవత్సరం 'జ్ఞానోదయం, తమమసోమా

114