పుట:అక్షరశిల్పులు.pdf/114

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అక్షరశిల్పులు


వెలువరించారు. తెలుగు, హిందీ భాషల్లో వెలువడుతున్నవివిధ పత్రికలలో పలు కవితలు, గేయాలు, పద్యాలు, సామాజిక వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు, సమీక్షలు ప్రచురితం.

రచనలు: 1.డాక్టర్‌ ఉమర్‌ అలీషా గారి ఉమర్‌ ఖయ్యూమ్‌

అక్షరశిల్పులు.pdf

రుబాయిల అనుశీలన, 2. వెలుగుల రవ్వలు (వచన కవితా సంపుటి).డాక్టర్‌ ఉమర్‌ అలీషా గారి ఉమర్‌ ఖయ్యూమ్‌ రుబాయిల అనుశీలన గుర్తింపు తెచ్చి పెట్టింది. అవార్డులు -పురస్కారాలు: ఉగాది పురస్కారం (1987, హైదారాబాద్‌), లలిత కళాపరిషత్‌ పురస్కారం (అనంతపురం), కళాజ్యోతి పురస్కారం (ధర్మవరం), శ్రీ హుస్సేన్‌ షా కవి స్మారక అవార్డు (భీమవరం, 2003). రాష్ట్రంలోని పలు సాహితీ-సాంస్కతిృక సంస్థలచే సన్మానాలు. లక్ష్యం: మంచిని మరచిన లోకానికి మంచిగా మెలగమని ఉపదేశం చేయడం. చిరునామా: డాక్టర్‌ షేక్‌ మహమ్మద్‌ ముస్తఫా, ఇంటి నం.24-301, పవర్‌ హొస్‌ రోడ్‌, ప్రొద్దుటూరు-516360, కడప జిల్లా. సంచారవాణి: 97049 16336, దూరవాణి: 08564 -255482.

ముస్తఖీమ్‌ ముహమ్మద్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా కొల్లాపూర్‌లో 1975 ఏప్రిల్‌ 27న

జననం. తల్లితండ్రులు: ఎంఎస్‌ రుఖియాబీ, ఎం.డి మహమూద్‌.

అక్షరశిల్పులు.pdf

ఉద్యోగం: హిందీ పండ్‌ిడిట్. 1995 నుండి వివిధ పత్రికలలో కవితలు, సమీక్షలు ప్రధానంగా ధార్మిక వ్యాసాలు ప్రచురితం. గీటురాయి వారపత్రికలో ధారావాహికంగా ధార్మిక వ్యాసాలను రాశారు. లక్ష్యం: అసూయా ద్వేషాల నుండి మనిషిని దూరంగా ఉంచడం, సత్సమాజం కోసం కృషి చేయడం.. చిరునామా : ఎం.డి ముస్తఖీమ్‌, ఇంటి నం. 1-1-194, ఛావని స్ట్రీట్, కొల్లాపూర్‌-509102, మహబూబ్‌నగర్‌ జిల్లా.

ఎన్నెస్‌ ఖలందర్‌: కడప జిల్లా ప్రొద్దుటూరులో 1971

అక్షరశిల్పులు.pdf

నవంబరు 15న జననం. తల్లి తండ్రులు: చోటీ రసూల్‌ బీ, ఎన్‌. బాబ్‌జాన్‌. చదువు: ఎం.ఏ. వృత్తి: అధ్యాపకులు. ఎనిమిదవ తరగతిలో చదువుతున్న రోజుల్లో 'జాబిల్లి' పిల్లల మాసపత్రికలో ఒకేసారి రెండు కథలు (బడాయికి హద్దు ఉండాలయ్యా, పులి చెలిమి) ప్రచురణ కావడంతో రచనా వ్యాసంగం ఆరంభమై వివిధ పత్రికలలో, సంకలనాలలో కథలు, కథానికలు, కవితలు, ప్రచురితం. 'వార్త' దినపత్రికలో ప్రచురితమైన 'మున్నీబేగం' కథా

113