పుట:అక్షరశిల్పులు.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

దైవప్రసన్నత. ఇస్లాంను తెలుగు తెలిసిన ప్రజలకు ఎరుకపర్చడం. చిరునామా: ఎస్‌.ఎం. మలిక్‌, 105 బి, సంతోష్‌ నగర్‌ కాలనీ, గ్రంథాలయం గ్రౌండ్‌ వద్ద, సంతోష్‌నగర్‌, హైదారాబాద్‌-500059. సంచారవాణి: 98482 29218, దాూరవాణి:040-2453305. Email: smmallick@hotmail.com.

మస్తాన్‌ షేక్‌ డాక్టర్‌
గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో 1952 జూలై రెండున జననం. తల్లితండ్రులు: షేక్‌ మొహిద్దీన్‌ బి, నన్నే సాహెబ్‌. చదువు: ఎం.ఏ(తెలుగు)., ఎం.ఏ

(లింగ్విస్టిక్‌), పిహెచ్‌.డి. ఉద్యోగం: అలీఘర్‌ విశ్వవిద్యాలయంలో అధ్యాపకులు. చిన్ననాటి నుండే రచనా వ్యాసంగం ఆరంభం. వివిధ పత్రికలలో పరిశోధానాత్మక-సాహిత్య వ్యాసాలు, కవితలు, సమీక్షలు ప్రచురితం. తెలుగు సాహిత్యానికి ముస్లింల సేవకు సంబంధించి

పరిశోధన జరిపి ముస్లింల సాహిత్య సేవా చరిత్రను వెల్లడించిన

మొట్టమొదటి తెలుగు సాహిత్య చరిత్రకారునిగా ఖ్యాతిగాంచారు. తెలుగు సాహిత్యాన్ని, ఇతర భాషల్లోని సాహిత్య ప్రక్రియలను తులనాత్మకంగా అధ్యయనం చేసి, పరిశోధనలు జరిపి జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పరిశోధనా పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా పలు దేశాలను పర్యటించారు. తెలుగు సాహిత్య విలువలను వివరిస్తూ ఆంగ్లంలో గ్రంథాలను వెలువరించారు. జాతీయ -అంతర్జాతీయ స్థాయిలో పలుసన్మానాలను అందుకున్నారు. రచనలు: తెలుగు సాహిత్యం-ముస్లింల సేవ (1991), తెలుగు సాహిత్య వ్యాసాలు (1999). అవార్డులు-పురస్కారాలు: విజయశ్రీ అవార్డు (న్యూఢిల్లీ, 2005), బెస్ట్‌ సిటిజన్‌ అఫ్‌ ఇండియా (న్యూఢిల్లీ, 2006), శ్రీ హసన్‌ షా స్మారక అవార్డు (భీమవరం, 2007). లక్ష్యం: తెలుగు సాహిత్య విలువలను ప్రపంచానికి చాటి చెప్పాలని. చిరునామా: ప్రొఫెసర్‌ షేక్‌ మస్తాన్‌, ప్రొఫెసర్‌ ఇన్‌ తెలుగు, డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ మోడరన్‌ ఇండియన్‌ ల్యాంగ్వేజస్‌, అలీఘర్‌ ముస్లిం యూనివర్సిటి, అలీఘర్‌-202002, ఉత్తరప్రదేశ్‌. దూరవాణి: 0571- 3291097, సంచారవాణి: 098377 29542. Email: prof.mastan@gmail.com

మస్తాన్‌ వలి షేక్‌
కృష్ణా జిల్లా రామన్నపేట గ్రామంలో

1980 ఫిబ్రవరి నాల్గున జననం. తల్లితండ్రులు: షేక్‌ సఫియాబీ, జాన్‌ సాహెబ్‌. కలం పేరు: వలి. చదువు: ఎం.ఎస్సీ (జువాలజీ). ఉద్యోగం అద్యాపకులు. 1999 లో కళాశాల పత్రికలో 'వ్యర్థమేనోయ్‌ వలి' కవిత ద్వారా రచనా వ్యాసంగం ఆరంభం. అప్పటినుండి వివిధ తెలుగు పత్రికలలో, కవితలు ప్రచురితం అవుతున్నాయి. 2005లో రాసిన 'తెలుగు గమక చమకాలు'

102