పుట:అక్షరశిల్పులు.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్షరశిల్పులు


గుర్తింపు తెచ్చి పెట్టింది. లక్ష్యం: సామాజిక సేవకు ప్రేరణ కల్గించేందుకు సాహిత్యం ద్వారా కృషి చేయాలన్నది. చిరునామా: షేక్‌ మస్తాన్‌, ఇంటి నం. 2-121, జి. రామన్నపేట -521182, చందర్లపాడు మండలం, కృష్ణా జిల్లా. దూరవాణి: 08678-254473, సంచారవాణి: 99483 57673.

మస్తాన్‌ వలి షేక్‌
కడప జిల్లా ముద్దనూరు గ్రామంలో 1968 జూన్‌ 23న జననం.

తల్లితండ్రులు: షేక్‌ గౌసున్నీసా బేగం, షేక్‌ మహబూబ్‌ సాహెబ్‌.

చదువు: బి.ఏ. ఉద్యోగం: ప్రజాశక్తి దినపత్రిక. 2004లో రచనా రంగ ప్రవేశం చేసినప్పటినుండి పలు వ్యాసాలు, కవితలు వివిధ పత్రికలలో ప్రచురితం అయ్యాయి. రచనలు: 1.మన కడప (కడప జిల్లా చ రి త్ర , 2009), 2.సీమ అందాలు (ఆధ్యాత్మికం - పర్యాటకం, 2010). లక్ష్యం: నలుగుర్నిచైతన్యపర్చే రచనల ద్వారా సమాజ సేవలు అందించడం. చిరునామా: షేక్‌ మస్తాన్‌ వలి, ఇంటి నం.3/1367, కోఆపరిేవ్‌ కాలనీ, కడప-516001, కడప జిల్లా. సంచారవాణి: 94900 99284, Email: shaikmasthanvali786@ gmail.com

మహమ్మద్‌ ఇలియాస్‌
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో 1970 ఆగస్టు మూడున జననం. తల్లితండ్రులు: మునీరున్నీసా, షేక్‌ హుస్సేన్‌. చదువు:

ఎంఎస్సీ., ఎం.ఇడి., డిపిఇ. ఉద్యోగం: అధ్యాపకులు (కేంద్రీయ విద్యాలయం,హైదరాబాద్‌ ) . విశాలాంధ్ర దినపత్రికలో 'యూనిఫారం' కవిత 2009లో ప్రచురితమైనప్పటి నుండి వివిధ పత్రికల్లో, కవితా సంకలనాలల్లో కవితలు, వ్యాసాలు చోటు చేసుకున్నాయి. లక్ష్యం: ముస్లిం సమాజాన్ని చుట్టుముట్టి వేధిస్తున్న అపోహల్ని బద్దలుకొట్టి, వాస్తవాలను వెల్లడి చేయాలన్నది. చిరునామా: మహమ్మద్‌ ఇలియాస్‌, ఇంటి నం. 5-9-27/2, నాగార్జుననగర్‌, సత్తెనపల్లి, గుంటూరు జిల్లా. సంచారవాణి: 9492689808. Email: arshiyallas@ gmail.com

మహబూబ్‌ అలీ షేక్‌
ప్రకాశం జిల్లా గజ్జెలకొండ గ్రామంలో 1957 జూన్‌ 16న జననం. తల్లితండ్రులు: షేక్‌ ఖాశింబీ, కరీం సాహెబ్‌. చదువు: ఏడవ తరగతి. ఉద్యోగం: దక్షిణ మధ్యరైల్వేలో గేట్ మన్‌ (నరసరావుపేట) 'ఓ కోహినూర్‌ వజ్రమా!' కవిత 2001లో 'నడుస్తున్న చరిత్ర' మాసపత్రికలో (విజయవాడ) ప్రచురితమైనప్పటి నుండి రచనా వ్యాసంగం ఆరంభం. పలు కవితలు వివిధ పత్రికలలో, కవితా సంకలనాలలో చోటు చేసుకున్నాయి.

103