పుట:అక్షరశిల్పులు.pdf/102

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అక్షరశిల్పులు


కవుల సాహిత్యాన్ని ఆయా భాషల పాఠకులకు పరిచయం చేయడం. చిరునామా: సయ్యద్‌ మక్సూద్‌, క్వార్టర్‌ నం.8/6, మహేంద్రనగర్‌, జహీరాబాద్‌, మెదక్‌ జిల్లా. సంచారవాణి: 94408 36492

మలిక్‌ సుల్తాన్‌ మొహిద్దీన్‌ సయ్యద్‌
ప్రకాశం జిల్లా కంభంలో 1940 ఏప్రిల్‌ 10న జననం. తల్లితండ్రులు: సయ్యదా సలీమున్నీసా, హకీం సయ్యద్‌ అబ్దుల్‌ గఫూర్‌ నిజామి.

కలంపేర్లు: నిజామి కుమార. ఎస్‌.ఎం.మలిక్‌. చదువు: ఎస్‌ఎస్‌ఎల్‌సి. తెలుగు, ఉర్దూ, అరబిక్‌, పారశీకం, తమిళ భాషలలో ప్రవేశం. తొమ్మిదేళ్ళ వయస్సులో తండ్రి నుండి పారశీకం నేర్చుకున్నారు. ఆ తరువాత మిగతా భాషల మీద పట్టు సంపాదించి ఆయాభాషల్లోని సాహిత్య-ధార్మిక గ్రంథాల అధ్యయనం. రాష్ట్ర-కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 1970 వరకు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి ధార్మికసేవలో గడపాలన్న నిర్ణయం మేరకు రైల్వేలో చేస్తున్న ఉద్యోగానికి 1970లో రాజీనామా చేశారు. ఉన్నత పాఠశాల విద్యార్థిగా గురువుల

ప్రోత్సాహం మేరకు చిన్నప్పటి నుండి ఛందోబద్ద కవిత్వం రాస్తూ

అక్షరశిల్పులు.pdf

వచ్చారు. ఆ క్రమంలో 1964లో నెల్లూరు నుండి వెలువడుతున్న 'విజ్ఞాన చంద్రిక'లో రాసిన తొలి వ్యాసంతో రచనా వ్యాసంగం ఆరంభం. 1968లో ఉర్దూలోంచి తెలుగులోకి 'శ్రేయోమార్గం' అను అనువాద గ్రంధాన్నితొలిసారిగా వెలువరించారు. 1974లో పూర్తికాలపు ధార్మిక సేవకుడి గా హైదరాబాద్‌ నగరం చేరుకున్నారు . ఇస్లామియాసాహిత్యాన్ని తెలుగులో ప్ర చురించాలన్న ఉద్దేశ్యంతో 1977లో ఏర్పడిన 'తెలుగు ఇస్లామిక్‌ పబ్లికేషన్స్‌' వ్యవస్థాపక సంచాలకులుగా కృషి చేశారు. ఆ తరువాత 1979లో 'గీటురాయి' మాసపత్రిక వ్యవస్థాపక సంపాదకులుగా బాధ్యాతలు స్వీకరించాక 'నిశ్శబ్ద శబ్దాలు' శీర్షికతో కవిత్వం రాయడం ఆరంభించారు. అప్పటినుండి వివిధ పత్రికలలో కవితలు, సామాజిక-సాహిత్య వ్యాసాలు ప్రధానంగా ధార్మిక వ్యాసాలు అసంఖ్యాకంగా ప్రచురితం అయ్యాయి. గత మూడు దాశాబ్దాలుగా 'గీటురాయి' పత్రికకు సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ మధ్య కాలం వరకు వివిధ దినపత్రికలలో వారం వారం ఆయన అందించిన ధార్మిక వ్యాసాలు వెలువడ్డాయి. ఉర్దూ, అరబిక్‌ భాషలో ప్రచురించబడిన 50కు పైగా ధార్మిక గ్రంథాలను తెలుగులోకి అనువదించారు.'ఖుర్‌ఆన్‌ అవగాహన' ఖుర్‌అన్‌ తెలుగు అనువాదాన్ని మొత్తం నాలుగు వేల పుటలతో 10 భాగాలుగా రూపొందించగా ప్రస్తుతానికి మూడు భాగాలు వెలువడ్డాయి. స్వతంత్ర రచనలు: 1.ప్రభువు పిలుస్తున్నాడు, 2.వెన్నెల తెరలు, 3.తూరుపు తావి, 4.విపులాచల పృద్ద్వీ, 5.సాహిత్యం-వాదవివాదాలు, 6.సందేహాలు-సమాధానాలు, 7.ఇస్లామీయ పరిభాషలో జిహద్‌ (ప్రథమ భాగం). లక్ష్యం:

101