పుట:అక్షరశిల్పులు.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని చిన్నపత్రికలను ప్రోత్సహిస్తూ, కోరినవారికి వివిధాంశాల మీద వ్యాసాలు అందించటం అభిరుచి. లక్ష్యం: ప్రజా చైతన్యం. చిరునామా: షేక్‌ మహమూద్‌, ఇంటి నం.16-4/2/2, నిమ్మతోట, నరసరావుపేట-522601, గుంటూరు జిల్లా. సంచారవాణి: 93999 07041.

మహజబీన్‌
నెల్లూరు జిల్లా నెల్లూరులో 1961 మార్చి 30న జననం. తల్లితండ్రులు:

వాహిద్‌ పర్వీన్‌, మహమ్మద్‌ ఇస్మాయిల్‌. చదువు: ఎం.ఏ., ఎల్‌ఎల్‌.బి. వృత్తి: న్యాయవాది, సామాజిక కార్యకర్త. ప్రవృత్తి: రచన. విద్యార్థిదశ నుండి రచనా వ్యాసంగం ఆరంభం. వివిధ పత్రికలలో కవితలు, కథానికలు, సామాజిక-సాహిత్య వ్యాసాలు, సమీక్షలు ప్రచురితం. 'సాక్షి' దినపత్రికలో 'ఇందురేఖ' కాలమ్‌ రాశారు. జాతీయ,

అంతర్జాతీయ సాహిత్య సదస్సులలో పాల్గొన్నారు. కవితలలో

'స్ట్రీట్ చిల్డ్రన్‌' కవిత మన రాష్ట్రంలోని పదవ తరగతి తెలుగు వాచకంలో పాఠ్యాంశంగా స్థానం సంపాదించుకుంది. 'ఖిల్వత' కవిత ఎం.ఏ (లిటరేచర్‌) పాఠ్యాంశంలో చేరింది. రచనలు: 1.ఆకురాలే కాలం (కవితా సంపుటి, 1997), 2.విరామం తర్వాత (కవితా సంపుటి, 2010). అవార్డులు-పురస్కారాలు: జ్యోత్స్న కళాపీరం అవార్డు (2006), యువజన అవార్డు (న్యూడిల్లీ 1997), రమణ-సుమనశ్రీ అవార్డు (1998), రాజీవ్‌ గాంధీ జాతీయ అవార్డు (2007),పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు (2005) అధికార భాషా సంఘం అవార్డు (2009). ఫెలోషిఫ్స్‌: డాడ్‌ జర్మన్‌ ఫెలోషిప్‌ (2000), కల్చరల్‌ యూరోపియన్‌ యూనివర్సిటీ ఫెలోషిప్‌ (2001). చిరునామా: మహజబీన్‌, ఇంటి నం. 2-1-562/2, నల్లకుంట, హైదారాబాద్‌-500004. దూరవాణి: 040-277660020, సంచారవాణి: 98665 87919.

మక్సూద్‌ అహమ్మద్‌ సయ్యద్‌
కరీంనగర్‌ జిల్లా జరాజంగం మండలం చిలకలపల్లిలో

1963 మే ఐదున జననం. తల్లితండ్రులు: సాబిరా బేగం, సయ్యద్‌

ఈసా. చదువు: ఇంటర్‌. ఉద్యోగి. ఉర్దూ, తెలుగు భాషల్లో ప్రవేశం. తెలుగు పత్రికల్లో, వివిధ కవితా సంకలనాలలో పలు కవితలు ప్రచురితం. తెలుగులోని మంచి సాహిత్యాన్ని ఉర్దూ పాఠకులకు పరిచయం చేయడం, ఉర్దూలోని ఉత్తమ సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు తెలియపర్చడం కోసం ఉర్దూ నుండి తెలుగులోకి ఆయాభాషల సాహిత్యాన్ని అనువదించి ప్రచురించడం పట్ల ప్రత్యేక ఆసక్తి. లక్ష్యం: తెలుగు-ఉర్దూ భాషా

100