పదబంధ పారిజాతము/చౌక అగు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

చోఱవాడు

 • బాలసేవకుడు.

చోళము విఱుచు తెఱగున

 • జొన్నలను పేలాలుగా వేచినట్లు.
 • "పాదరసంబు మర్దించుపంతంబునఁ జోళంబు విఱుచు తెఱంగున." ఉ. హరి. 3. 71.

చోళవాళిక కాక వేళవాళికి కర్తవే?

 • జీతమునకే కాని, కాలమునకు నీవు కర్తవా?
 • జొన్నలకూలికే కాని జీవిత విధానమునకు నీవు కర్తవా ? అని ప్రభాకరశాస్త్రిగారు. నిశ్చితంగా తేల లేదు.
 • "చోళవాళికె కాక క్షోణితలేశ, వేళ వాళికిఁ గర్తవే?" పండితా. ద్వితీ. మహి. పుట. 184.

చౌక అగు

 • చులుక నగు.
 • "కారు కాలానఁ గలిగిన గౌరవంబు, చౌక యై తోఁచె శరదృతుసౌష్ఠవమున." పాండు. 4. 42.
 • వాడుకలో - తక్కువవెల అనే అర్థంలో పరిపాటి.
 • "వంకాయలు ఈ కాలంలో బాగా చౌక అయినవి." వా.

చౌక చేయు

 • చులుకన చేయు
 • "సాహిత్యమార్గంబు చౌకఁ జేసినవాఁడు." నిరంకు. 2. 34.
 • "న న్నిటు చౌక సేసినను నాతిరొ! యేగతి నోర్వ వచ్చునే?" రాజగో. 3. 9.

చౌకపడు

 • చౌక అగు. మత్స్య. 1. 151.

చౌకపఱచు '*చౌక చేయు. చౌక సేయు

 • చూ. చౌక చేయు.

చౌకాడిగుదియ

 • నాలుగుప్రక్కలు తీర్చిన ఇనుపదండము.

చౌకాలిపీట

 • నాలుగుకాళ్ళ పీట.

చౌటిపడియలు

 • చౌటినేలలోని చెలమలు. నీటికుండములు.
 • "ఇందుల చౌటిపడియ లూహింప, నిరతంబు క్షీరాంబునిధి పుట్టినిండ్లు." పండితా. ద్వితీ. పర్వ. పుట. 241. బస. 7. 181.

చౌటుప్పు

 • చౌటి నేలలో తేలేఉప్పు.

చౌడోలి

 • అంబారి.
 • రూ. చౌడోలి; చౌడోలు.

చౌదరితనము

 • గొప్పతనము. శుక. 2. 414. చౌపదము
 • ఒక గీతి విశేషము.

చౌపుట

 • నాల్గు కాళ్ళతో కుప్పళించి దుముకుట.

చౌరు కొట్టు.

 • లొట్టలు వేస్తూ ఆస్వాదించు.
 • "విరులు సిగఁ దాల్చి కర్పూరవీటఁ జౌరు,కొట్టుచు." ఆము. 2. 73.
 • "గొంటు వక్కలు చౌరు గొట్టుచు నమలి." అష్ట. కల్యా. 2. 82. పు.
 • రూ. చౌరు గొట్టు.

చౌవంచ

 • అయిదు.
 • రూ. చవ్వంచ, చౌవంచి.

చౌవీధి

 • చౌకు.
 • రూ. చవువీధి.

చౌషష్ఠికళలు

 • అరవైనాలుగు విద్యలు.

చౌసాల

 • చతుశ్శాల.

చౌసీతిబంధములు

 • ఎనభై నాలుగు రతి బంధ విశేషములు.

ఛత్రచామరములు

 • గొడుగు, వింజామరము. జం.
 • పండితా. ప్రథ. పురా. పు. 290.

ఛస్తే....

 • ఎంత కష్టపడినా, ఏ మయినా. మాటా. 134.

ఛిన్నాభిన్నముగ

 • ముక్క చెక్కలుగా.

జంకించు

 • జంకునట్లు చేయు, బెదరగొట్టి పారద్రోలు.
 • "పాతకంబుల జంకించు బహువిధముల."

జంకె యొనర్చు

 • భయపెట్టు.

జంకె సేయు

 • భయపెట్టు.

జంగగొను

 • దాటు.

జంగనడ

 • అశ్వగతిలో భేదము.

జంగనడక

 • కాలు చాపి నడచు నడక. శ. ర.

జంగనడపు

 • చూ. జంగనడక.

జంగమురాలు

 • జంగము స్త్రీ.

జంగిలి కాయు

 • పశువులను కాచు.
 • "పసుల జంగిలికాయ పాలేరు దున్నఁ, గొఱ మాలి..." గౌర. హరి. ద్వి. 560-561 జంగుబిల్లి
 • అడవిపిల్లి.

జంటిరైక

 • ఒక విధమయిన రవిక. రాధి. 1. 99.

జండా పీకివేయు

 • పరారి అగు.
 • "ఊరంతా అప్పులు చేసి తెల్లారేసరికి వాడు జండా పీకేశాడు." వా.

జండా యెత్తి వేయు

 • పరారి అగు.
 • చూ. జండా పీకి వేయు.

జంతపట్టు

 • పైరునడుమ కలుపు పోవుటకై దున్ను.

జంతమాటలు

 • మాయమాటలు.

జంతికచుట్లు

 • మురుకులు, ముచ్చాఱలు, మణుగుబూలు అని వేరువేరు ప్రాంతాల్లో వ్యవహరించే పిండివంట.
 • జిలేబి అని బ్రౌన్ - సరి అనిపించదు.

జంతికపుండు

 • అనేకరంధ్రా లేర్పడే కుఱుపు, సెలల కుఱుపు.

జంత్రగాడు

 • యంత్రం నడిపేవాడు.

జంత్రబొమ్మ

 • కీలుబొమ్మ, మాయలాడి.

జందెపువాటుగా

 • జందెము వ్రేలు వాటముగా.
 • "ఖడ్గంబుతో నొడిచి, తీసుక వాని జందెపువాటు గాఁగ." వర. రా. యు. పు. 337. పంక్తి. 13.

జందెములు త్రెంచుకొను

 • కోపముతో చేయు చేష్ట. జంధ్యాలు తెంచుకొని. సన్యాసి నై పోతా నని బెదరించే అలవాటుపై వచ్చిన పలుకుబడి.
 • "ఆసపడి యేమి కోరిన నాగ్రహించు, జందెములు ద్రెంచుకొని తద్ద్విజన్మ ఖలుఁడు." శుక. 4. 109.

జంపు నడపు

 • ఆలస్యము చేయు.
 • "నీ వేల జంపు నడపెదు, రావే మాఱాడ కిందు రాకేందుముఖీ!" విజ. 2. 18.

జంపు చెల్లు

 • ప్రాభవము, తన ఆనతి నడచు. చం. రా. 2. 24.

జంపుమాటలు

 • జాగు చేసే మాటలు. విజ. 1. 102.

జంపువలపుబేరము

 • కాలహరణము చేయు ప్రేమ. తాళ్ల. సం. 12. 145. జక్కిణి గొను
 • నాట్య మాడు.
 • చూ. జక్కిణీ....

జక్కు గావించు

 • చెక్కి వేయు.
 • "మే,దినికిం దెచ్చితి కార్తవీర్యభుజ పంక్తిం జక్కు గావించితి." పారి. 3. 34.

జక్కు జక్కను

 • ధ్వన్యనుకరణము.
 • కుమా. 11. 155.

జక్కుల బోనము లగు

 • భోజనశూన్య మగు, భోజనం వట్టి దగు.
 • కొన్ని వర్గాల పెండ్లిండ్లలో అరివేణి కుండల నెత్తుకొని బోనాలు బోనాలు అనడం అలవాటు. ఆ కుండలలో బోనం మాత్రం ఉండదు. అందుపై వచ్చిన దని ఆముక్తమాల్యద టీక.
 • జక్కు లనగా యక్షులు. యక్షిణీవిద్య గారడీవిద్య. కాబట్టి ఊరకే నామకార్థంగా ఉన్నట్టు కనిపించుటే కానీ అస లుండని మాయా భోజనమే అనుట కూడా కావచ్చును.
 • "బోనంబు ప్రజకు జక్కుల, బోనంబులె యయ్యెఁ బ్రొయ్యి పొగయమి వృష్టిన్." ఆము. 4. 126.

జక్కొను

 • దొరకు.
 • "పలిమెడు మహిసాక్షి ప్రతిదివసంబు, మలహరునకుఁ ద్రిసంధ్యల సమర్పింప, నొక్క నాఁ డెట్టును జక్కొనకున్న, గ్రక్కున మేని కండలు కోసి." పండితా. పురా. 135. పు.

జక్కొలుపు

 • వినియోగించు, సవరించు.
 • చూ. జక్కొల్పు.

జగజంత

 • గయ్యాళి, మాయలాడి.
 • "ఔ,రౌర! జగజంత యని తెల, వారుటఁ గని భామ కేళివసతికిఁ జనియెన్." హంస. 3. 243.

జగజంపు

 • ముత్యాల కుచ్చు - పెద్దది...

జగజెట్టి

 • జగదేకవీరుడు. హర. 3. 92.
 • "జెట్టి సింగారించుకొనే టప్పటికి పట్నం కొల్ల పోయింది." సా.

జగజోలి ఏల

 • (ఈ) జంజాటము (ఈ) పీకులాట ఎందుకు?
 • ఎవరి సంగతో మన కెందుకు?
 • "చాలు చాలును వట్టి జగజోలిమాట, చాలింపుమా." రంగ. రా. అయో.
 • "ఎక్కడి జగజోలి యటంచు నెరసి చన జూతురు." శుక. 3. 127.
 • "ఫలము వారలొ కాక పనిమాలినట్టి, చలమువారలొ వట్టి జగజోలి యేల." ద్వి. పరమ. 7. జగడగొండి
 • కలహశీలి.

జగడ మాడు

 • కొట్లాడు, దెబ్బలాడు.

జగడాల చీలి

 • జగడగొండి. కుక్కు. 40.

జగడాలమారి

 • కలహశీలి.

జగడించు

 • జగడ మాడు.
 • "....వృధా జగడింపకుఁడు." జైమి. 8. 209.

జగదొంగ

 • గొప్ప దొంగ.

జగనీలి పిసాళిజంత

 • గయ్యాళి, ధూర్తురాలు. జగనగా జగత్ప్రఖ్యాతురా లయిన, నీలి = కృత్రిమపు మాయలు నటించు, పిసాళిజంత - గొప్ప గయ్యాళి.
 • "జగనీలి పిసాళిజంత య,మ్ముద్దియ." పాండు. 3. 71.
 • నీలి అనుటకు -
 • "ఎన్ని నేరిచితివే మటుమాయల నీలి కాన." సారంగ. 3. 53.
 • చూ. నీలివార్తలు, నీలియేడుపులు.

జగనొబ్బ గండడు

 • జగదేకవీరుడు.
 • (గండ=మగడు, ఒబ్బ=ఒక. కన్నడం.) ఇదొక బిరుదు.

జగబంటు

 • గొప్పభటుడు.

జగబిరుదు, ముండమొఱ్ఱ

 • వీరాధివీర బిరుద ముండినా అనాథవలె ఆశ్రోశించును అనుటపై వచ్చిన పలుకుబడి. పేరు గొప్ప ఊరు దిబ్బ వంటిది.
 • "జగబిరుదు ముండమొఱ్ఱయుఁ, దగవే నీ వెఱుఁగవే సుధాకిరణధరా!" నిరం. 3. 16.

జగమగడు

 • గొప్పశూరుడు. అచ్చ. యు. 68.

జగ మెఱిగిన బ్రాహ్మణుడు

 • ప్రసిద్ధుడు.
 • "జగ మెఱిగిన బ్రాహ్మణునికి జందెం బేలా?" చా.

జగాజెట్టి

 • జగజెట్టి.
 • "చెరువు గట్టినజగాజెట్టి వీవ." శ్రీని. 4. 86.
 • చూ. జగజెట్టి.

జిగిలెకాడు

 • తోడల్లుడు.

జగే యను

 • అపహాస్య సూచక మైన ధ్వన్యనుకరణము.
 • "అద్దిర మత్పతి వచ్చు వేళ నీ, కినుకలు సాగ నిచ్చట జగే యన నాతఁడు భీతచిత్తుఁ డై." శుక. 3. 196. జజ్జరకత్తె
 • మోసగత్తె. శ. ర.

జజ్జరకాడు

 • మోసకాడు.

జజ్జుకొను

 • బలహీన పడు.

జట్టికత్తె

 • మారుబేరకత్తె.

జట్టికాడు

 • కొనువాడు; వర్తకుడు; ఓడ నడుపువాడు; జూద మాడించువాడు.

జట్టికొను

 • కొను, స్వాధీన పరుచుకొను.

జట్టి గొను

 • 1. పోటీ పడు.
 • "విలా, సములచేతఁ దార జట్టి గొనుచు." కవిక. 1. 21.
 • 2. విలుచుకొను.
 • "తన నిండుజవ్వనము విలు విచ్చి జట్టిగొన్నది." తాళ్ల. సం. 12. 87.

జట్టి దక్కు

 • అమ్ముడు పోవు, బేరమునకు కట్టుబడి యుండు.
 • "దాసుఁడ నై జట్టి దక్కు చున్నాఁడ." గౌ. హరి. ద్వితీ. పంక్తి. 1530.

జట్టి యాడు

 • బేర మాడు. హర. 1. 20.

జట్టి యిచ్చు

 • సరికి సరి విక్రయించు, ఇచ్చు.
 • "నా, భామల జట్టి యిచ్చి తన పట్టిన యట్టి కడింది నేమముం,దా మఱి కొన్ని నా ళ్లవిహతంబుగ నిల్పుకొన న్మనంబులోన్." కళా. 6. 97.
 • రూ. జట్టి యిడు.

జట్టీ పెట్టుకొను

 • తగాదా వేసుకొను.
 • "వాడు ఏ చిన్నసందు దొరికినా జట్టీ పెట్టుకుంటాడు." వా.

జట్టు కట్టు

 • సావాసము చేయు.
 • "మా సందులో పిల్ల లంతా జట్టు కట్టాము." వా.

జడకుచ్చులు

 • జడలో కొనన పెట్టుకునే ఆభరణము.

జడకొఱ్ఱ

 • కొఱ్ఱలలో ఒక విశేషం.

జడ గట్టు

 • వెండ్రుకలు ఉండలు కట్టు.
 • "నెరుల్ జడగట్టఁగా." విప్ర. 2. 79.
 • రూ. జడ కట్టు.

జడ గొను

 • జడగట్టు.
 • "ఏఁచ మాటలు జడగొన్న పీఁచుఁ గురులు, గలుగు నెఱుకులు దగఁ బొడ గనఁగ వచ్చి." యయా. 1. 102. జడ చిక్కు దయ్యముచందము
 • బంధిత మై ఎటూ వెళ్ల లే నట్లు.
 • దయ్యాన్ని మంత్రగాళ్లు తల మీద కొద్దిగా వెండ్రుకలు తీసి, జడ వేసి, అందులోనికి దయ్యాన్ని ఆవహింపజేసి జడ కత్తిరించి వేస్తారు. అందులో తగులుకొన్న దయ్యము దిగ్బంధనం చేసి ఉంటారు కనుక ఎటూ పోలేక గిలగిల లాడుతుందట. దీనిపై వచ్చిన పలుకుబడి.
 • "జడ చిక్కుదయ్యంబు చందమునను." హంస. 1. 220.
 • "ఇపు డేఁగి యమరనాథుఁడు మెచ్చన్, జడ లొడిసి పట్టి తెత్తునె, జడఁ జిక్కిన దయ్యమట్లఁ జనుదేరంగన్." చంద్రా. 8. 40.

జడతల

 • వెండ్రుకలు ఒత్తుగా ఉన్న తల.
 • "ఆ పిల్లది మంచి జడతల. ఏం చేసుకున్నా అందంగానే ఉంటుంది." వా.

జడను పడు

 • 1. మ్రాన్పడు.
 • "ఆ జననాథుఁడు శోక మంది జడను పడియు." భాస్క. అయో. 183.
 • 2. అలస మగు.
 • "నడ జడను పడియె నా రే,ర్పడియెన్ జనుమొనలు నల్ల వడియెన్." మను. 3. 119.

జడప్రత్తి

 • జడలు జడలుగా గింజ లుండే పత్తి.

జడబిల్ల

 • జడలో పెట్టుకునే బిళ్ళ - ఒక నగ.

జడముడి

 • ఈశ్వరుని జటాజూటం - కపర్దం.

జడలు గట్టుట

 • మునివృత్తి నవలంబించుట.
 • "జడలు గట్టుట వృథా శ్రాంతి యాతనికి." గౌ. హరి. ప్రథ. పంక్తి. 565.

జడిగాడ్పు

 • ప్రచండవాయువు. బ్రౌన్.

జడి గురియు

 • ఎక్కువగా కురియు.
 • "ఆనందబాష్పములు జడి గురియన్." భాగ. స్క. 3. 394.

జడి గొను

 • నిరంతరముగా కురియు. లక్షణయా వ్యాపించు.
 • "ఒడి దారముల కాంతి జడిగొనంగ." నిరంకు. 4. 89.
 • ఇది విశేషంగా అన్నట్లు 'జడిగొన్ కోర్కులు' ఇత్యాదులలో విధవిధాలుగా ఉపయుక్త మవుతుంది.
 • "జడిగొని సమ్మదాశ్రుకణజాలము లొల్కఁగ." పారి. 3. 5.
 • చూ. జడి పట్టు, జడివాన.

జడిగొలుపు

 • జడిగొనునట్లు చేయు.
 • "మిగుల బిరు సగుశరముల్, జడిగొలిపి తద్బలంబుల, మడియింపఁగఁ జొచ్చె మారి మసఁగినభంగిన్." జైమి. 5. 56.
 • చూ. జడిగొను.

జడి పట్టు

 • 1. ముసురు పట్టు.
 • "మరీ జడిపట్టి కురుస్తూంది." వా.
 • 2. పట్టు పట్టు.
 • "తడఁబడక తప్పు లాడక, జడి పట్టక పరుసు గాక...మాటాడ వలయు." సకల నీతి. స.

జడి పెట్టు

 • భయపెట్టు.
 • "విడువక జడిపెట్టు విసిగి యల్లమయు." ప్రభు. 2. 32. పు. కాశీ. 4. 50.
 • రూ. జడి వెట్టు.

జడివాన

 • వదలకుండా ముసురు పట్టి కురిసే వాన.
 • "క్రొవ్విరి జడివాన కుంభినిఁ గురిసె." రంగా. రా. బాల.

జడివెట్టు

 • "....వృధాలాప ప్రబంధోక్తులన్, జడివెట్టం బని లేదు." కాశీ. 4. 50.
 • చూ. జడిపెట్టు.

జడ్డిపెట్టె

 • నడుమ బరువు కట్టి ఇద్దరు మనుషులు మోసుకొని పోవుటకు ఉపయోగించే పొడుగైన కఱ్ఱ - జడ్డి. దానికి కట్టిన పెట్టె - జడ్డిపెట్టె. బ్రౌన్.

జడ్డియీటె

 • నడుమ పిడిగల యీటె. బ్రౌన్.

జడ్డుతనము

 • మాంద్యము; సోమరితనము.

జడ్డుపడు

 • అలస మగు.
 • "జడ్డుపడి యుండె నొక కొంత ప్రొద్దు వేడ్క." శివ. 1. 64.

జడ్డుమనిషి

 • సోమరి.
 • "వాడు వట్టి జడ్డుమనిషి. వాడితో పెట్టుకుంటే ఏ పనీ కాదు." వా.

జడ్డు వడు

 • వెనుక పడు.
 • జడ్డు-జడత, మాంద్యం-జడ్డుమనిషి-సోమరి, అలసుడు అనే అర్థంలో నేటికీ వాడుకలో ఉన్నది. పండితా. ప్రథ. దీక్షా. పు. 178.

జతకట్టు చేయు

 • సన్నాహపఱుచు.
 • "చతురంగబలమున జతకట్టు చేసి." వర. రా. సుం. పు. 156. పం. 5. జత గట్టు
 • 1. పక్షులు మొదలైనవి జతగూడు.
 • 2. గుంపు గూడు.

జత గావించు

 • సరి చేయు.
 • "యథార్హతన్ మెలపు నయ్యల్ సుమ్ము లోకస్థితుల్, జతగావించు మహామహుల్." మల్లభూ. నీతి. 18.

జత గూడు

 • కలియు.
 • "కూయిడి జతగూడి కెడసి కునుకు పరువులన్." హంస. 4. 222.

జతనపడు

 • ప్రయత్నించు.

జతను పడు

 • పదిలముగా ఉండు.

జతను పఱుచు

 • పదిలపఱుచు

జత పట్టు

 • సావాసము చేయు.
 • "వాడు వట్టి పోకిరిపిల్లవాడులా ఉన్నాడు. వాని జత పట్టవద్దు." వా.

జతపడు

 • జత గలియు, సరిపడు, దొరకు.

జత పఱుచు

 • జత పడునట్లు చేయు.

జత యగు

 • సరిపడు, సమకూరు. భాస్కర. 105.

జత వచ్చు

 • సరి వచ్చు; సమాన మగు.
 • "జత వచ్చు ననవచ్చు జంభారి కాంతకు." జాహ్నవీ. 1. 72.

జత్తాయితం బగు

 • సిద్ధ మగు.
 • "కాకోదర లోకాధిపతిని నత్తరి త్రాడుగా హవణించి జత్తాయితం బై శూరు లగుదేవదానవీరులు పొంకంబుగా..." హేమా. పు. 18.

జద్దువడు

 • మైమఱచి యుండు - సంతోషంతో. శివరా. 1. 64.

జన్నిగట్టు

 • బ్రాహ్మడు - యజ్ఞోపవీతధారి.

జన్నిగొను

 • సన్నిపాతం వచ్చు - అలా ప్రవర్తించు.
 • "చంక లడఁచికొంచు శంకరుఁ బొగడు,చును నుర్కుచును గెర్లి చూచుచు జన్ని,గొనుచు గంతులు వేయుచును." పండితా. పర్వ. 371. పు.

జన్నియ వట్టు

 • మీదుకట్టు.
 • "కన్నియఁ గాని వే ఱొకతె గాను మనోహరరూప! నీకు నే, జన్నియ వట్టియుంటి నెలజవ్వన మంతయు నేఁటిదాఁక." విజ. 1. 97.
 • చూ. జన్నె విడుచు. జన్నియ విడుచు
 • మీదుకట్టు, దైవప్రీతిగా వదలు. కవిక. 1 ఆ.

జన్నె చేయు

 • మీదుకట్టు, దైవప్రీతిగా ఆంబోతునో దేనినో వదలివేయు.
 • "గోగణంబులలోన గోవు నొక్కటి నేర్చి, జన్నె చేసిన ధర్మశాలి యొకఁడు." రుక్మాం. 2. 105.
 • చూ. జన్నె విడుచు.

జన్నె విడుచు

 • మీదుకట్టు.
 • దైవప్రీతిగా ఏ ఆబోతునో, దున్నపోతునో వదలి వేయుట అలవాటు. దీనిని జన్నె విడుచుట అంటారు. ఇలాంటివే మీదుకట్టు, జన్నె కట్టు, జన్నియ వట్టు, ముడుపు గట్టు అన్నవి. ఇప్పటికీ పాలూ, పెరుగూ మొదలయినవానిని దేవునికి మీదుకట్టిన వని అంటారు. అంటే ఆ మొక్కుబడి తీరేవరకూ దానిని ఇతరు లెవరూ అనుభవింప నీయరు. ఈ ఆచారం మీద వచ్చిన పలుకుబడి. ఈ అర్థాన్ని సూచించే ప్రయోగాలు -
 • "మున్నె కొలు వున్నవానికి, జన్నె విడిచి యన్నెలంత చక్కని వరునే..." శుక. 2. 206.
 • "విషమశరుపేర జన్నియ విడిచి రనఁగఁ, గ్రొవ్వి చరియించు నవ్వీటఁ గోడెగాడ్పు." కవికర్ణ. 1. 15.
 • చూ. జన్నియ విడుచు.

జన్మ కొక శివరాత్రి

 • అరుదుగా వచ్చిన దనుట.
 • "వాడు రాయక రాయక ఏదో పుస్తకం రాశాడు. చేయక చేయక వీ డో సన్మానం చేశాడు. జన్మ కొక శివరాత్రి అన్నట్లు వాడి కది ఒక గొప్పగా కనిపించదా మఱి?" వా.

జన్మవాసన

 • పూర్వజన్మవాసన. వాసనాత్రయములో ఒకటి. మన స్నేహ శత్రుత్వాలకు పూర్వజన్మవాసనలు కారణమని మన పెద్దల నమ్మకం.
 • "మెలఁతకుఁ బతికిన్, వలపు సమం బగుట జన్మవాసన చెలియా!" మను. 6. 66.

జప్పడించుట

 • చప్పరించుట.
 • ప్చ్ - అంటూ తిరస్కార భావంతో కొట్టివేయుట.
 • "మాటల మిమ్ము జప్పడించుటలు సొప్పగునే." పండితా. ప్రథ. దీక్షా. పు. 152.
 • "వా డేం చెప్పినా చప్పరించి వేస్తాడు." వా.

జప్తీ చేయు

 • సొత్తును, సొమ్ములను, ఆస్తిని అమీనా, కోర్టు ఆజ్ఞప్రకారం స్వాధీనపఱచుకొను.

జబురుజంగి

 • ఒక దినుసు ఫిరంగి.

జబ్బ చఱచుక నిలుచు

 • పోరాటమునకు సంసిద్ధు డగు.
 • "వాడు మాట వస్తే ఏ మయినా సరే జబ్బ చఱచుకొని నిలబడతాడు కానీ వెనకంజ వేయడు." వా.

జబ్బపుష్టి

 • భుజబలం.
 • "వాడి కేం? మంచి జబ్బపుష్టి కలవాడు. నలుగురు వచ్చినా తిప్పి కొడతాడు." వా.

జబ్బుగా

 • గాఢముగా కాక - తేలికగా.
 • "కాంతుని జబ్బుగాఁ గౌఁగలించు." మను. 3. 123.

జబ్బు చేయు

 • అణచు; సుస్తీ చేయు. గౌర. హరి. వూ.
 • చూ. జబ్బు సేయు.

జబ్బుతో తీసుకొను

 • చిక్కిపోవు.
 • "వాడు నాలుగు నెలలనుంచీ జబ్బుతో తీసుకొంటున్నాడు." వా.
 • చూ. తీసిపోవు.

జబ్బుపడు

 • 1. మంద మగు. శ. ర.
 • 2. వ్యర్థ మగు. కకు. 1. 181.
 • 3. నిరుత్సాహపడు. నీలా. 2. 66.
 • 4. చెడు.
 • "జబ్బుపడు సుమ్ము కార్యంబు లెల్ల." ద్వి. తి. సా.
 • 5. సుస్తీపడు.
 • "మొన్న జబ్బుపడి చిక్కిపోయాడు." వా.

జబ్బు సేయు

 • తక్కువ పఱుచు; సుస్తీ చేయు.
 • "భూతసంఘముల యుబ్బులు జబ్బుసేసి." గౌ. హరి. ప్రథ. పంక్తి. 2080.
 • చూ. జబ్బు చేయు.

జమ కట్టుకొను

 • లెక్కించు.
 • "మ, ద్వరకవితామహత్వపుఁబ్రభావముగా జమ కట్టుకొంచు..." నానా. 249.
 • "వాణ్ణి మనవాడికిందనే జమ కట్టుకోవచ్చు." వా.

జమటపాత

 • డేగను వేటలో చేత పట్టుకొనినప్పుడు దానిగోళ్ళు గుచ్చుకొనకుండ వేసుకునే మడతగుడ్డ. బ్రౌన్.

జమలిమండిగ

 • పొరలపూరీ. నైష. 6. 12.

జమాఖర్చులు

 • ఆయవ్యయాలు.

జమాబందీ

 • పన్నులను ఖరారు చేయు టకై కరణాల నందరినీ చేర్చి తాసీల్దారు జరిపే తతంగం.

జమాబంది సిరాబుడ్డి

 • సమిష్టిది ; ఒక అడ్డీ ఆగీ లేనిది; ఒకరి అధికారం లేనిది; అతి వ్యభిచారిణి.
 • జమాబందీ జరిగేటప్పుడు కచ్చేరిలో ఆ తాలూకా రెడ్లు, కరణాలు అందరూ చేరతారు. అక్కడ ఉన్న సమష్టి సిరాబుడ్డిలో ఎవ రంటే వారు కలం ముంచి రాస్తారు. అందుపై వచ్చిన పలుకుబడి.

జమీందారీ

 • ఒక జమీందారు క్రింద ఉన్న భూమి.
 • ఇప్పుడు జమీందారీలు రద్దయినవి.

జమీందారు

 • జమీందారీకి అధిపతి.
 • చూ. జమీందారీ.

జముకడకు చను

 • మరణించు.
 • "పాంచాలికొడుకు లందఱు జముకడకుఁ జనిరి." భార. సౌప్తి. 203.

జముదళము

 • నిడుపు పిడిగల బాకు.

జముదాడి

 • జముదళము.

జముదాళి

 • చూ. జముదాడి.

జమునిల్లు చొచ్చు

 • చచ్చు.
 • "జమునిల్లుఁ జొచ్చిన జంతువుఁ దెచ్చు, నమితసత్వాఢ్యు లీ యవనిలోఁ గలరె?" ద్విప. మధు. పు. 30.

జముబానసము నింటిత్రోవ చూపు

 • చంపు.
 • యముని వంటయింటదారిని చూపించుట అంతే కదా.
 • "రక్షగాఁ జుట్టి తిరిగెడురాక్షసులకుఁ, దొలుత జముబానసము నింటిత్రోవ చూపి." ఉ. హరి. 1. 139.

జములా గుడారాలు

 • డేరాలు. కాశీయా. 72.

జమువాకిలి గట్టు

 • బ్రతికించు.
 • యముని వాకిలిని మూయుట అనగా చావనీ కుండుట.
 • "మద్గృహంబునన్, వాడిమితోడ నుండి జమువాకిలి గట్టి మదీయ సంతతిన్." ఉ. హరి. 2. 19.

జమ్ముగూడ

 • జంబుతో అల్లిన గూడ. ఆము. 4. 133.

జమ్ముదాడి

 • చూ. జముదాడి.

జయ పెట్టు

 • జయజయ అని జేకొట్టు.
 • చూ. జయవెట్టు. జయము జయము
 • రాజులను, దేవతలను చూచినప్పుడు అనుమాట.
 • "జయము జయము నీకు సంపంగిమన్న! నన్, దయఁ జూడు దక్షిణద్వారకాధీశ!" హేమా. పు. 68.

జయ వెట్టు

 • జయజయధ్వానములు చేయు.
 • "జయ వెట్టుఁ డిటు గూడ సా తెల్ల ననుచు..." పండితా. ద్వితీ. పర్వ. పుట. 291.

జరుగుడాట

 • రాతిపలకలమీదినుండి క్రిందికి జారుతూ ఆడుకొనే ఆట. శ. ర.

జరుగుడుబండ

 • పై ఆట కుపయోగించే బండ.

జరుగుబడి

 • చూ. జరుగుబాటు.

జరుగుబాటు

 • తిండికి, బట్టకు ఉండుట.
 • "వాడికి జరుగుబాటు కేం లోటు లేదు." వా.
 • "వాడిది బాగా జరుగుబా టున్న కుటుంబం." వా.

జఱజఱ యీడ్చు

 • ధ్వన్యనుకరణము.

జఱభిచెయ్వులు దాల్చు

 • గడుసరిచేతలు చేయు. వ్యభిచారిణుల చేష్టలు చేయు - ప్రస్తుతం.
 • "జఱభిచెయ్వులు దాల్చిరి జార కామినుల్." కుమా. 8. 101.

జఱభితనము

 • గడుసుతనము.
 • "అడవిలోనఁ దపమువడఁ బోదు ననునంత, జఱభితనము లెందుఁ గఱచి తీవు." కుమా. 6. 16.
 • మూర్ఖత్వము వంటి దని టిప్పణిలోనూ కోశాలలోనూ ఉన్నా అట్లా అనిపించదు. మేనక పార్వతితో అంటున్న మాట యిది.

జఱభులు

 • గడుసు వారు, పాపులు, దుష్టులు.
 • "కఱకంఠు శుద్ధ నిష్కల భక్తియుక్తి, జఱభుల కది యేల సమకూడు." బస. 7. 204.
 • "ఎఱిఁగితి మద్ది రయ్య తడ వేటికి గుఱ్ఱపుదొంగ వీఁడె యీ, జఱభునిఁ బట్టి చంపుఁ డతిసాధుమునీంద్రుఁడు వోలె నేత్రముల్, దెఱవక...బైసుక పట్టె...." భాగ. 9. 207.
 • "కొఱగాని జఱభుల కొయ్యనగాండ్ర." బసవ. 5.

జలకట్టె

 • ఒకానొక డేగ - సెలకట్టె.

జలక మాడు

 • స్నాన మాడు.

జలకము లాడు

 • స్నాన మాడు. జలకమువాడు
 • స్నానము చేయించేవాడు. ద్వి. పరమ. 3. 203.

జలకము గావించు

 • అభిషేకము చేయించు, స్నాన మాడించు.
 • "గంధోదకములను మఱి జలకంబు గావించి." పండితా. ద్వితీ. పర్వ. పుట. 468.

జలక మార్చు

 • స్నానము చేయించు. పాండు. 2. 17.
 • "మదవతీ కరముక్తమణికుంభసంభృత, సౌరభోదకముల జలక మార్చి." పారి. 5. 70.

జల గడిగినట్లు

 • బాగా కడిగినట్లు అనుట.
 • జల గడుగుట అనగా - బంగారంపై పోగర పనీ, ఆకురాతి పనీ చేసినప్పుడు వారు పెట్టుకొన్న చర్మంమీదనే కాక అటూ యిటూ ఏ కొంతో రాలిపడే అవకాశం ఉంటుంది. అందుకని ఆ తావులో కసపూడ్చి ఆ కసపు నంతటినీ ఒక చోట ఉంచి పెడతారు. దానిని జలగడుగు వాళ్లు, కాలువకో బావికో తీసుకొని వెళ్లి, నీళ్లు పోసి కడిగి, కడిగి పైన ఉన్న కసవు నంతటినీ తొలగించి వేసి, ఆ అడుగున తేలినదానిలో పాదరసం వేసి పట్టి పుఠం పెడతారు. అప్పుడు బంగారం తేలుతుంది. కాబట్టే జల గడుగుట అనగా బాగా కడుగుటగా అలవా టయినది.
 • "వాడి పుట్టు పూర్వోత్తరా లన్నీ ఏకరువు పెట్టి జల గడిగినట్లు వాడి మానం కడిగి వేశాడు." వా.

జలగడుగు

 • నీళ్ళతో కడుగు.
 • "అలివున సంపాదించితి, జలగడిగితిఁ బున్నె మెల్ల శాంతిపర! ననున్." కవిమాయ. అం. 4. 77.
 • చూ. జలగడిగినట్లు.
 • రూ. జల్లగడుగు.

జల గడుగువాడు

 • పైరీతిగా బంగారుపొడి కలిసిన కసవును కడిగేవాడు.
 • చూ. జల గడిగినట్లు.

జలజల రాలు

 • ధ్వన్యనుకరణము.
 • "జలజల రాలెఁ బూలు సుమసాయక సంగరకౌశలంబునన్." రాజగో. 4. 47.

జలతరంగములు

 • అశాశ్వతములు, క్షణికములు. పండితా. ద్వితీ. పర్వ. పుట. 418.
 • చూ. జలబుద్బదములు.

జలతైలబిందు వగు

 • నీటిలో వేసిన నూనెబొట్టు విరివిగా వ్యాపించుటపై వచ్చిన పలుకుబడి.
 • "జలతైలబిందు వయి నా, మెలఁకువ వెల్లి విరి యైన మే లగునే." ఉ. హరి. 5. 198.

జలదమును నమ్మి చేనీరు చల్లు

 • ఎక్కడో ఉన్న దానిని నమ్ముకొని, చేతిలో ఉన్నదానిని జాఱ విడుచుకొను. నమశ్శి. 50.

జలదారి

 • నీళ్లు పోయుటకు వీలుగా ఒక మూల బండ వేసి చుట్టూ కాస్త కట్టవేసిన తావు. అందులోనుండి నీళ్లు పోవుటకు వెలుపటికి ఒక కాలువ కూడా ఉంటుంది. ఈ మాటను దక్షిణాంధ్రంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇదే జలజారిగా కూడ మారినది.
 • రూ. జలజారి.

జలదోషము

 • పడిశము.

జలపూత

 • బంగారు వెండితో చేసిన మొలాము.

జలపోసనము

 • జలతారు అన్న అర్థంలోనూ కొన్నిట ప్రయుక్తం.
 • చూ. జలపూత.

జలపూత బంగారు

 • అశాశ్వతము.
 • పైపై మెఱుగులవంటి మాట. మొలాము వేసినదే కాని అసలు బంగారం కాదు. తాళ్ల. సం. 11. 3. భా. 70.

జలబాధ కలుగు

 • మూత్రవిసర్జనా కాంక్ష కలుగు. కాశీయా. 238.

జలబుద్బుదములు

 • అశాశ్వతములు, క్షణభంగురములు.
 • నీటి బుడగలవంటి వనుటకు నీటిబుడగలే అనుట. ఇట్టివి పెక్కు లున్నవి. పండితా. ద్వితీ. పర్వ. పుట. 418.

జల మాడు

 • స్నానం చేయు.

జలముపా లగు

 • నీళ్లపా లగు - వ్యర్థ మగు.
 • "తన పెద్దతనంబు జలంబు పాలుగ." నైష. 8. 42.

జలసూత్రము

 • 1. ధారాయంత్రము. కాశీయా. 37.
 • 2. అటూ యిటూ నీరు వచ్చుటకై రెండు బానలలోనికీ వదలిన త్రాడు.

జలుబు చేయు

 • పడిసెము పట్టు. జలుబునీళ్లు వదలిపోవు
 • పొగ రడగు. కొత్త. 187.

జల్ల బండి

 • పైన కప్పు లేనిబండి. కొత్త. 48.

జల్లి గంప

 • సందు లున్న గంప.

జల్లి తోక

 • కుచ్చుతోక.

జల్లి నీడ

 • మధ్యమధ్య వెలుతురు పొడలున్న నీడ.

జల్లి పెండెము

 • ఒక నగ.

జల్లిమాటలు

 • వ్యర్థ ప్రలాపాలు, వట్టి మాటలు.
 • జల్లెడ పట్టగా నిలుచునవి గట్టివి. అలా కానివి జల్లి మాటలు.
 • నడుమ నడుమ సడలి విచ్చి పోయిన అనగా సత్యేతరత బయల్పడిన వగుటతోనూ జల్లిమాటలు కావచ్చును.
 • "జల్లిమాటలు గాక సరిసేయ వచ్చు నే, సవరంబు లీశిరోజాతములకు." హంస. 1. 210.

జల్లి ముత్తెము

 • సన్నటిముత్యము. బ్రౌన్.

జల్లిమూకుడు

 • నడుమ సగందాకా రంధ్రాలున్న మూకుడు, సిబ్బి రేకు.

జల్లివేరు

 • కొస కుచ్చుగా ఉన్న వేరు.

జల్దుకొని వచ్చు

 • త్రోసుకొని వచ్చు.
 • "జల్దుకొని వచ్చెఁ బైపైని సారమేయ, యాధములు." హర. 7. 38.

జల్లుకొను

 • మూగు, గుంపగు.

జల్లు లాడు

 • జలక్రీడ లాడు, నీళ్లు చల్లుకొను.
 • "ఒండొరులమీఁద జలములు నిండుకొనఁగ, జల్లు లాడిరి సరసిలో సరసముగను." ఉషా. 2. 12.

జల్లెడపాటు వడు

 • దట్టంగా పెరుగు.

జవకట్టు

 • కూడిన, మేళవించిన.

జవకట్టికొను

 • భద్రపఱుచుకొను, కూడుకొను.
 • "భవరోగములు వీడి పాఱంగఁ బెద్దలు మున్ను, జవ కట్టుకొనిన నిచ్చల మైన మందు." తాళ్ల. సం. 5. 140. జవజవ లాడు
 • ఊగాడు, కంపించు.
 • చూ. జవదాటు వివరం.

జవజవ మను

 • కంపించు.

జవదాటు

 • మేర మీఱు.
 • ఏ కొంత యైన అనే అర్థంలో జవ ఉపయుక్త మైనది. జవదాటక పోవడం అంటే ఏ కొంత కూడా మేర మీరక పోవడం అని అర్థం. సన్నని గోధుమలను జవగోధుమ లంటారు. సన్నని గోధుమంత కూడా దాటకుండడ మన్నమాట. సన్నని వస్తు వేదైనా కదలుటకు జవజవ లాడుట అంటారు.
 • "తనయాజ్ఞ జంగమస్థావరజంతుసం, తాన మెన్నఁడు జవదాట వెఱవ." కా. మా. 1. 28.
 • "ఈ రీతి సకలధర్మవి, చారుం డగు నతనిమాట జవదాటక." శుక. 1. 179.

జవళివాడు

 • బట్ట లమ్మువాడు. బ్రౌన్.

జవళియంగడి

 • బట్టల దుకాణం. బ్రౌన్.
 • నేటి వాడుకలో జవిళి.

జవుజవ్వు '*ధ్వన్యనుకరణము. జవాదివంకి

 • పునుగు, జవ్వాది సౌందర్య వర్ధకములుగా మనకు ప్రతీతి. లక్షణయా అతి సౌందర్యవతి అనుట.
 • "వరల సొంపుల టెంకి జవాదివంకి, జాతి రతినీల నారాజదూతి హేల." హంస. 1. 81.
 • చూ. జవ్వాదివంకి.

జవ్వన మమ్ముకొను

 • డబ్బుకై వ్యభిచరించు.
 • "సంత నెన్నఁడో, జవ్వన మమ్ముకొన్న గడసాని ననుం గవయం దలంచితే." ఉ. హరి. 1. 74.

జవ్వాజివంకెలు

 • ధాన్యవిశేషం.

జవ్వాడు

 • కదలాడు.
 • పలుచగా, సన్నగా ఉన్నవాని కదలికలోనే ఇది ప్రయుక్త మవుతుంది.
 • "నృపుఁ డుపవడ మై, జవ్వాడులతికయో యన, నవ్వెలఁది వడంకఁ జూచి." శుక. 1. 313.
 • చూ. జవజవ లాడు.

జవ్వాదిపిల్లి

 • పునుగుపిల్లి, సంకుమృగం.

జవ్వాదివంకి

 • చూ. జవాదివంకి. జవిళిసరుకులు
 • జవిళి అంగడిలోని సరకులు. (జవిళి=గుడ్డలంగడి) అనగా అందుబాటులో నున్నవి.
 • "నవనిధానంబు లేదేవి జవిళిసరుకులు." పాండు. 1. 2.
 • రూ. జవళి...

జళుకులు వాఱ దంచు

 • మెఱుగుపోటు వేసి దంచు. ఒకసారి దంచి, దానిమీద దంచడాన్ని మెఱుగుపోటు అంటారు. పాండు. 3. 87.
 • చూ. మెఱుగుపోటు.

జాగఱ గట్టు

 • మేలుకొను, జాగారము చేయు.
 • "జాము పోయినదాఁక జాఁగఱ గట్టి, బాములఁ బొందుచు." గౌ. హరి. ద్వితీ. పంక్తి. 1941.

జాగుపడు

 • సాగు. విజయ. 1. 43.

జాగుపెట్టు

 • జాగు సేయు.
 • "పెక్కు మాటల నిటు జాగుపెట్ట నేల." కాశీ. 2. 88.

జాగెనకత్తెర

 • మల్ల బంధవిశేషం.

జాజరకత్తె

 • మాయలాడి.

జాజరకాడు

 • మాయవాడు.

జాజాలపాలిక

 • అంకురార్పణం చేసే మూకుడు.

జాజాలపాలె

 • చూ. జాజాలపాలిక.

జాజు చేయు

 • ఎఱ్ఱవడ జేయు.
 • "బాగుగా జాజు చేసినఁ బ్రజ్వరిల్లు." రాధా. 5. 254.

జాజులు ప్రసాద మగు

 • అత్యనుకూల మగు, అత్యభిలషణీయ మగు.
 • జాజులే కాక ప్రసాదం కూడా అయినప్పుడు మఱింత వాంఛనీయం కదా.
 • "నీ కవితంబ నై నిర్దోష మగుచు, మాకు నంకితము రామాయణం బైన, బంగరు పువ్వుల పరిమళ మైపొ,సంగి జాజులును బ్రసాదమ్మునట్లు." వర. రా. బా. పు. 6. పంక్తి. 7.
 • చూ. జాదులు ప్రసాదము నగు.

జాజువాఱు

 • ఎఱ్ఱబాఱు.
 • "శశికాంతమణిపీఠి జాజు వాఱఁగఁ గాయ, లుత్తుంగకుచపాళి నత్తమిల్ల." మను. 2. 27.

జాజు సేయు

 • ఎఱ్ఱరంగు వేయు, ఎఱ్ఱవడ చేయు.
 • చూ. జాజు చేయు.