పదబంధ పారిజాతము/కథ కట్టిపెట్టు
కత్తె____కత్తె 374 కథ____కథ
- గాయంబుల గండముంగిళుల.... నిరంతరమున్ శోధనదీవె లెత్తి." ఉ. హరి. 2. 94.
కత్తెరదొంగ
- జేబులు, సొమ్ములు మొదలగునవి కత్తిరించుకొని పోవుదొంగ.
- "రద్దీగా ఉన్న తావుల్లో మదరా సంతా కత్తెర దొంగలు ఎక్కు వై పోయినారు." వా.
కత్తెరబీవిలీ
- గూబకు పెట్టుకొను ఆడవాళ్ల ఆభరణము. ఇదే గూబబావిలీ; బావిరీ అని కూడా నేడు దీనిని అంటారు.
- రూ. కత్తెరబావిలీ.
కత్తెరయెండలు
- మండుటెండలు. కత్తెర అంటే కృత్తిక. కృత్తికా నక్షత్రంలో సూర్యుడు ఉండేకాలాన్ని దక్షిణాంధ్రంలో 'కత్తెర' అంటారు. అప్పు డటువైపు ఎండలు విపరీతంగా ఉంటాయి. అట్లే ఉత్తరాదిలో నేమో రోహిణి కార్తిలో ఎండలు ఎక్కువగా ఉంటాయి.
- "అప్పుడే కత్తెరయెండ లారంభ మయినవి. ఇక మధ్యాహ్నం బయటికి వెళ్ళడం సాధ్యం కాదు." వా.
కథ కట్టిపెట్టు
- ఈ, ఆ ప్రసంగం చాలించు.
- "నీ కథ కట్టిపెట్టి ఆప నేదో చూడు." వా.
కథకు కాళ్లు ముంతకు చెవులు కల్పించు
- అసంభవములను సంభవము లనునట్లు, చెప్పు.
- "కడమ వన్ని యు నిక నేల కతకు గాళ్లు, ముంతకు జెవులు గల్పింప ముజ్జగముల." సుదక్షి. 4. 25.
కథకు కాళ్లు లేవు ముంతకు చెవులు లేవు
- కల్పితకథలలో వాస్తవికతకు, ప్రత్యక్షప్రమాణాదులకు తావు లేదు అనుట.
- "మీట నొక్కితే సొరంగాలూ, మాళిగలూ ఈ నవలల్లో. కథకు కాళ్లు లేవు, ముంతకు చెవులు లేవు కదా."
కథ చాలదూరము వెళ్లు
- మించి పోవు.
- ఆ వ్యవహారం చాలా నడిచింది అనుపట్ల ఉపయోగిస్తారు. చేయి దాటిపోయింది, ఇక మనం చేసే దే ముంటుంది అన్న ఛాయలు కూడా యిందులో ఉన్నవి.
- "కథ చాలా దూరం వెళ్ళిం దన్నమాట. వీడు పిలవడం వాడు రావడం కూడా నాకు తెలీకనే జరిగిందీ?" వా. కథ____కథ 375 కథ____కద
కథ తెలిసి వచ్చు
- బండారము బయట పడు.
- "ఏమీ తెలియని రైతులను ఏడిపించుకొని తినినట్టు కాదు. కరణమయ్యతో కంటు కట్టుకుంటే నీ కథ తెలిసొస్తుంది." వా.
- "వాని కథ ఈనాటిక్కానీ నీకు తెలిసి రాలేదు. నే నెప్పు డనగా చెప్పాను. వాడు వట్టి దగుల్బాజీ అని?" వా.
కథల కామరాజు
- కథల పుట్ట.
- "వాణ్ణి పలకరిస్తే ఒక కథ చెప్తాడు. ఆ కథలకామరాజుతో పెట్టుకుంటే మన మీనాడు కొంప చేరుకున్నట్టే!" వా.
కథలు పన్ను
- కల్పించు, ఏవో కల్పనలు చేసి మోసగించు.
- "కఱకంఠ! యిది యేల కథలు వన్నెదవు." బసవ. 4. 104.
- రూ. కథలుపన్ను.
కథలు, నీతులు, కారణాలు
- కథలూ అవీ. జం.
- "కథలును నీతులు గారణంబులును." పండితా. ప్రథ. దీక్షా. పుట. 152.
- వాడుకలో రూపం:
- కథలూ కారణాలూ.
కథలూ కారణాలూ
- కథలూ అవీ. జం.
- "ఏదో మధ్యాహ్నం పూట కథలూ కారణాలూ చెప్తూ ఉంటుంది మా బామ్మ." వా.
- చూ. కథలూ కారుణ్యాలూ.
కథలూ కారుణ్యాలూ
- కథలూ అవీ. జం.
- చూ. కథలూ కారణాలూ.
కథా కమామీషూ
- పుట్టు పూర్వోత్తరాలు. జం.
- "దాని కథా కమామీషూ చెబుతాను విను." వా.
కథానాయకుడు
- ముఖ్యుడు.
- "ఈ వ్యాజ్యంలో కథానాయకుడు మీ మామే." వా.
కథాశేషు డగు
- చనిపోవు.
- చూ. కీర్తి శేషు డగు.
కదలారతి పళ్లెరము
- వధూ వ రాదులు గృహ ప్రవేశం చేసేటప్పుడు హారతి యిచ్చు పళ్లెము.
- "జాళువా కదలారతి పళ్లెరంబు సొంపున." చంద్రి. 4. 68.
కదలించి చూచు
- సూచనగా అభిప్రాయం తెలుసుకొను.
- "పోనీ. మీ మామ ఏమంటాడో కాస్త కదలించు చూడు. తర్వాత సంగతి చూతాం." వా.
- చూ. కదిలించి చూచు.
కదలించు
- అనవసరముగా రెచ్చగొట్టు.
- "కదలింపకుము నన్ను గన్న మాయయ్య." పల. పుట. 48.
- "న న్ననవసరంగా కదలించకు. తర్వాత విచారిస్తావు." వా. కది____కన 376 కన____కన
కదియబడు
- కలబడు; పోరులో ఎదుర్కొను.
- "అత్తఱి మాళవుండు గదియంబడి." దశ. 12. 65.
కదిలించి చూచు
- ప్రస్తావవశంగా ఇంగితము తెలుసుకొను.
- "అతణ్ణి కదిలించి చూస్తాను. అత డేమంటాడో చూచి ఆ తరవాత ఈ విషయంలో ఏదో ఒకటి నిర్ణయించు కొందాము." వా.
- "వా రేమో పిలిస్తే తప్పకుండా వస్తాడు అని నువ్వు అంటున్నావు; రాడు అని నా నమ్మకం. అయినా కదిలించి చూడు. పోయే దేముంది?" వా.
- చూ. కదిలించి చూచు.
కదుపు గట్టు (కొను)
- గుంపు కూడు.
- "పులుల కూనలు జింకపిల్లలు మృగేంద్ర, పోతకంబులు నాల క్రేపులును గదుపు, గట్టుకొని కూడి చూడ." శృం. శాకుం. 2. 49.
కదుము గట్టు
- దెబ్బ తగిలి వాచు.
- "నా మోకాలికి ఆ వాకిలి కొట్టుకొని కదుము కట్టింది." వా.
కనకతప్పెట
- బంగారు తప్పెట.
- వాద్యవిశేషము.
కనకన
- కణకణ (మండు)
- "కనకన వెలుగుచు." సడా. 1. 182.
- "పొయ్యిలో నిప్పులు కనకన మండుతున్నాయి." వా.
కనకన మను
- కణకణ మండు.
- "కనకన మను నిప్పుదునుక లనగ." యయా. 2. 76.
- చూ. కనకన.
కనకనలాడు
- చూ. కనకన మను.
కనకస్నాన మాడించు
- బంగారునీట ముంచు; అనగా అంత పచ్చగా అనుట.
- "మేపూత, డంబుతోడ వచ్చె దుంబురుండు, కడలవారిని గనకస్నాన మాడించు, పదకమును సు నేత్రపటము దాల్చి." కళా. 2. 82.
కన నోపునె నుదుట కన్ను గల వా డైనన్
- ఫాలాక్షు డయినా కన్నెత్తి చూడ లేడు అని అర్థం.
- ఎంత గొప్పవా డైనా దానిని కన్నెత్తి చూడజాల డనుట.
- "మత్కాంతారము, గన నోపునె నుదుట గన్ను గలవా డైనన్." శుక. 1. 280.
- నేటిరూపం:
కనరువోవు
- కాటు వోవు.
- మంట సరిగా లేక వంట చెడి
- 'ఫాలాక్షు డయినా సరే నేను జంకను', ఇత్యాది... కన_____కని 377 కని_____కని
- నప్పుడు వేసే వాసనను కనరూ, కాటూ అంటారు.
- "కనరు వోకుండ గాచిన యాన వాలతో." శృం. శాకుం. 1. 135.
కనరెక్కు
- కాటు పోయి వాసన వచ్చు.
- "ఈ కూర కన రెక్కి పోయింది. తిన లే నంటే తిన లేను." వా.
కనాకష్టం
- కనీసం.
- "ఆ తిరనాళ్లకు పోవా లంటే కనా కష్టం చేతిలో పదిరూపాయ లన్నా ఉండవలె గదా!" వా.
కనాకష్ట మైన
- అతినీచ మయిన కొత్త. 253.
కనాతి గోడ
- బట్టతో కట్టిన అడ్డు, హద్దు. వావిళ్ళ ని.
కని గుడ్డి - విని చెవుడు
- కండ్లుండి కానలేక వీను లుండి వ్నలేక పోవుట.
- "కని గుడ్డును నదె విని చెవుడును నిదె." తాళ్ల. సం. 8. 185.
- "కని గ్రుడ్డియు విని చెవుడును, జనవర! నీ మాయ కిక నసాధ్యము గలదే?" కవిక.
- "మీ లాంటివారి కెవ రేం చెప్తారు? కని గుడ్డీ విని చెవుడూ." వా.
కనినది గాదు విన్నదియు గాదు
- అపూర్వం; అసంభవం.
- "................నే, గనినది కాదు విన్నదియు గా దది తెల్పిన దెల్పు లేక యుం, డిన మఱి యూరకుండెదవు...." శుక. 2. 226.
- వాడుకలో నేటిరూపం.
- కన్నదీ విన్నదీ కాదు.
కనిపట్టు
- కనిపెట్టు.
- చూ. కనిపెట్టు.
కనిపెట్టు
- ఏదో తెలుసుకొను.
- "ఇందులోని ఆంతర్యం కని పెట్టి చెప్పావంటే కృతజ్ఞుణ్ణి." వా.
- చూ. కనిపట్టు.
కనిపెట్టుకొను
- నిరీక్షించు.
- "నీ, కొనర నిత్తు నేను గనిపెట్టుకొని వచ్చి." కళా. 5. 197.
- "నీ కోసం నేను పొద్దున్నించీ కనిపెట్టుకొని ఉన్నాను." వా.
కని పెంచు వయసు
- పిల్ల లను కని పెంచ వలసిన వయసు అనగా యౌవనము. దశా. 6. 45.
- వాడుకలో రూపం : కనీ పెంచే వయసు.
కని యెత్తి పెంచు జోలి లేదు
- కని పెంచే బాధ్యత లేదు.
- నేటి వాడుకలోనూ 'దానికి కని పెంచే బాధ లేదు' అన్నట్లు వినవస్తుంది.
- "బిడ్డ పాపల గని యెత్తి పెంచు జోలి, లేదు." హంస. 3. 131. కనీ____కను 378 కను____కను
కనీ పెంచే వయసు
- యౌవనం; ప్రాయము ఆడవారి విషయంలోనే దీనిని ఉపయోగిస్త్తరు.
- "కనీ పెంచేవయసులో ఈ మలేరియా పట్టుకున్న దేమిటే నీకు?" వా.
కనీసపక్షము
- అధమపక్షము; అంతకు తక్కువ కాకుండా.
- "జయపురపాలనం బొసగి సాకినదాత కనీసపక్ష మా." నానా. 248.
- "కనీసపక్షం ఆసభకు యాభై వేలమంది జనం వచ్చి ఉంటారు." వా.
కనుకట్టు
- 1. మోసగించు. కన్నులు మూయు. లక్షణయా వంచించు, కానకుండ చేయు అని కూడా అర్థం.
- "కనుకట్టి గాంగేయగర్భు డాగురు మూత, లాడించె వత్సాపహరణ వేళ." పాండు. 3. 178.
- 2. ఇంద్రజాలము. మంత్రముతో - ఉన్నది కనబడకుండానో, మరొకవిధంగా కనబడునట్లుగానో చేయుట.
- "కనుక ట్టొనర్చిన ఘాత లిడిన." ప్రబంధ. 7. 38.
కనుకట్ట విద్య
- ఇంద్రజాలము.
కనుకని
- వేగముగా, సంభ్రమముతో, తత్తఱపాటుతో, పట్టుదలతో. భార. అర. 6. 231.
- "కాందిశికు లై కనుకనిం జని." కుమా. 2. 76.
- "క్రతురక్షకుల దాకి కనుకని బో ద్రోలి." కుమా. 2. 66.
- "ఎదిరిరిపుల్, గాలుదురు వీని గను కని, దూలందు రెందేని నర్కతూలమ వోలెన్." అదే. 4. 17.
- "కనుకని దొల్లి దానిదె గన్నుల జూచినవాని నేయు నా,మనసిజుడు." అదే. 8. 153.
కనుకని బాఱు
- వేగముగా పాఱు.
- "కపులు వెనుదగుల గ్నుకనిం బాఱి." భాస్క. యుద్ధ. 650.
కనుకలి
- చూడగా కలిగిన ప్రేమ. ఇలాంటిదే - వినుకలి.
- "కర మర్థి నిను జూచి కనుకలి గలిచిన, పడతుల కల్పు నిష్ఫలము గాగ." కుమా. 5. 74.
- "ఇన్నాతి చెలువంబు గన్న శచీ ప్రియుం,డైనను గనుకలి నవయకు న్నె." భార. విరా. 2. 27.
- "ఈస్వరు జూచి, కనుకలి మింద్రియ స్థలనంబు గాగ." పండితా. ప్రథ. వాద. పుట. 683.
- "కనుకలి వినుకలి గలిగినట్టి పాపము." భాగ. 6. స్కం. 46.
- దృష్టి, చూపు అని వావిళ్ల ని. అది సరి అని పై ప్రయోగాలు సూచించుట లేదు.
కను కల్గి
- సావధానతతో. కను____కను 379 కను____కను
- "కనుకల్గి తత్పాద కంజాతములకు సాగిలి మ్రొక్కి." వర. రా. రా. పు. 195. పంక్తి. 24.
- "ఈ విషయంలో కాస్త కనుకలిగి ప్రవర్తించక పోతే ప్రమాదం తప్ప దనుకుంటాను.." వా.
- చూ. కను గలిగి...
కనుకుట్టు
- పగదాయి; అసూయ.
- "కలువకనుకుట్టు." సాంబో. 2. 145.
- "వాడికి నన్ను చూస్తే కనుకుట్టు." వా.
కనుకుట్టుతనము
- అసూయ; ఓర్వ లేనితనము.
- "కనుకుట్టుతనంబున నతని ధర్మంబునకు విఘ్నంబు గావింప దలచి." భోజ. 6. 125.
కనుకూర్కు
- నిద్రించు.
- "జరఠ యొకర్తు...కనుకూర్కు చుండ." రమా. 2. 97.
కనుకూలి
- గింజల కూలి. బ్రౌను.
కనుకోనలు
- కండ్ల లోతులు.
- "వాడికి కనుగోనలలో ఎక్కడో కాస్త ఊపిరి టకటక లాడుతూ ఉంది." వా.
కనుగంట చూచు
- కన్ను లార చూచు.
కనుగట్టు
- కనులు కానకుండా చేయు. మఱపించు, మోసగించు.
- "నీకామ శాస్త్రముల్ బిడ్డ, కన్గట్టి కాళ్ళను గట్టింప నెట్లు, విచ్చేయు." పండితా. ప్రథ. పురా. పుట. 362.
- "కనుగట్టి గాంగేయగర్భు డా గురు మూత, లాడించె వత్సాపహరణవేళ." పాండు. 3. 178.
- "సొరిది నిందఱి కనుగట్టి సున్న బెట్టి." రాధి. 4. 81.
- రూ. కనుకట్టు.
కను గలిగి యరయు
- జాగ్రత్తగా పరిశీలించు.
- "కను గలిగి యరసిననుం దేటపడి యెడు." భార. శాంతి. 2. 366.
కను గలిగి మెలగు
- జాగ్రత్తగా మెలగు.
- "పెనిమిటియు నత్త వదినెలు, కను గలిగి మెలంగ వెడలగా నెడ లేమిన్..." శుక. 2. 508.
కను గల్గి యుండు
- జాగ్రత్తతో నుండు.
- "తనకు మృత్యువుచేర దఱి యయ్యె గానం కనుగల్గి యుండ వేగ మె పల్కు డరిగి." వర. రా. సుం. పు. 89. పంక్తి. 17.
కనుగవ కోరగించు
- కను లెఱ్ఱ నగు.
- "అచ్చట నెత్తురు గ్రక్కెనో యనం, గనుగవ గోరగింప బొడకట్టె సముజ్జ్వల సాంధ్య రాగముల్." పారి. 2. 32.
కనుగవ నెఱసంజ వొడము
- కన్నెఱ్ఱజేయు అనగా కోపించు.
- "చ,య్యన వచ్చి యొక్క నెచ్చెలి, కను కను____కను 380 కను____కను
గవ నెఱసంజ వొడమగా నిట్లని యెన్." పారి. 1. 74. కనుగానమి
- గర్వము.
కనుగాపు
- కనుసైగను గ్రహించి పని చేయు సేవకుడు. కనిపెట్టుకొని యుండువాడు.
- "కనుగాపు లట్ల మువ్వెట్టియు జేసి చేసియును వేసరి." హర. 3. 11.
కనుగిట్టు
- కను గీటు.
- "కనుగిట్టి చూపువారును..." కుమా. 2. 82.
కనుగిఱపు
- కనుసన్న చేయు.
- "విప్రస్ఖాలిత్యము బైలు సేసి కనుగిఱపు సభన్." ఆము. 4. 47.
కను గీటు
- కనుసైగ చేయు.
- "గౌతము డత్రికి గను గీటె." గౌ. హరి. ప్రథ. పంక్తి. 125.
కనుగొనల నిప్పు లురలు
- కోపించు. కోపము వచ్చినప్పుడు కన్ను లెఱ్ఱబడుట ద్వారా వచ్చిన పలుకుబడి.
- "అని తెంపు చేసి కనకన, గనుగొనల న్నిప్పు లురలగా వాలము..." శుక. 2. 252.
- చూ. కన్నెఱ్ఱ, కన్నెఱ్ఱ చేయు.
కనుగొను
- కన్ను గలుగు, చూచు.
- "ఈ తటినిం, గను గొను పుణ్యుడు మిక్కిలి, కనుగొను నెన్నుదుట." దశా. 1. 123.
కనుగొలుపు
- సైగ చేయు.
- "తనమ్రోలం, గనుపట్టు ననుంగుపట్టి కనుగొలుపుటయున్." నీలా. 1. 84.
- రూ. కనుగిలుపు.
కనుచాటు
- 1. రహస్యము.
- "కన్నయాత్మజుని గనుచాటుగా నుండగను జాటు వెట్టి." రంగ. ఉత్త. 92.
- 2. కనుమఱుగు.
- "చని నూతిలోపల గుభు, ల్లన నొకగుం డెత్తి వైచి యల్లన గనుచా, టున నిలువ బడియె..." శుక. 2. 135.
కనుచాటు చేయు
- అదృశ్యము చేయు.
- "రాఘవామోఘాస్త్ర మేను, కను చాటు చేసి యేగతి నైన దొలగి, చంపి వచ్చెద." వర. రా. యు. పు. 45. పంక్తి. 12.
కనుచాటుతిండి
- దొంగతిండి.
- ఒకరికి తెలియకుండా అనుభవించుట అన్న అర్థంమీద లక్షణయా వ్యభిచారం అన్న అర్థంలో కూడా యిది ప్రయుక్తం. కను____కను 381 కను____కను
- "కనుచాటుతిండి నడిపిన, పనులం గండలును బెరిగి బకుతండ్రి హిడిం,బుని కొడుకు..." శుక. 2. 207.
కనుచాటుమెలకువ
- రహస్యప్రవర్తనలు - దొంగ చాటు వ్యవహారాలు.
- "సతి కొడిగట్ట లేనికనుచాటు మెలంకువ తీగ బోండ్లకున్, గడుపులు దించ..." శుక. 2. 24.
కనుచీకటి
- మునిచూపు చీకటి. అప్పుడప్పుడే చీకటి వ్యాపిస్తున్న సమయము.
- "అప్పుడే కనుచీకటి పడింది. త్వరగా ఊరు చేరుకోవడం మంచిది." వా.
కనుచూపు
- దృష్టి.
- "వాడి కీ మధ్య కనుచూపు తక్కువయింది. అద్దాలు పెట్టుకోవాలో ఏమో?" వా.
- "వాడికి ఈ మధ్యే కనుచూపు కొంచెం మధ్యస్థ మయింది." వా.
కనుచూఱ యొసగు
- కనువిందు కూర్చు.
కను చెదరు
- అజాగ్రత్తగా నుండు.
- "కార్యవేళల నిట్లు కను చెదరుదురె." వర. రా. యు. పు. 182. పంక్తి. 10.
కనుదోయి నీరు చిలుకు
- కన్నీరు చిందు.
- "కర్ణి కాకుసుమ రింఖన్మరందంబుతో, నిడువాలు గనుదోయి నీరు చిలుక." శుక. 1. 486.
కనుదోయి పదివేల్ వలయు
- అంత దర్శనీయము అనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
- చూచుటకు పదివేల కండ్లు కావలె ననుట.
- ఈ సంఖ్య అటూ యిటూ ఎక్కు వవుతూ, తగ్గుతూ ఉంటుంది.
- "నరు నత్యద్భుతవిక్రమ, పరిణతి సూడ గనుదోయి పదివే ల్వలయున్." భార. కర్ణ. 2. 283.
- చూ. రెండు కండ్లు చాలవు.
కనుపట్టు
- కనబడు.
- "నవాంబుదంబు కనుపట్టె." రుక్మాం. 3. 82.
కనుపాటు
- 1. దృష్టిదోషము.
- "సుదతి నీమై జక్క జూచుట కోడెద, గనుపాటు వొరయునో యని తలంచి." భార. విరా. 2. 47.
- 2. దృష్టి.
- "శివుని కనుపాటు దాకని చిత్త భవుడొ." విక్ర. 8. 52.
కనుపాప వలె
- అత్యాదరంతో అపురూపంగా - చూచుకొనవలసిన దనుట. కనుపాప వంటిది అనుటపై వచ్చిన పలుకుబడి.
- "లేక లేక కలిగిన ఆ పసిపాపను వాళ్లు కనుపాపలాగా చూచుకొంటారు." వా. కను_____కను 382 కను_____కను
కనుపుగొట్టు
- 1. పశువులను కొట్టినట్లు కొట్టు, పాఱు వేటాడి కొట్టు, తఱిమి తఱిమి కొట్టు అనుట. కనుముపండుగలో పాఱువేట ఒకభాగము. కనుము పైనే వచ్చినది కనుప. (కనుపు+కొట్టు.)
- "కర్ణనందను డిట్లత్యుదీర్ణ భంగి, బాండు రాజతనూజుల బలము నెల్ల, గనుపుగొట్టంగ జొచ్చిన..." భార. ద్రో. 1. 196.
- "ఇవ్విధంబునం గురుసేనం గనుపుకొట్టి నవ్వుచున్న కవ్వడిం గనుగొని." భార. ద్రో. 3. 159.
- "వేదండకాండంబులు తండతండంబు లై పయింబడం బడలు వడం గనుపు కొట్టినయప్పట్టున." జైమి. 2. 75.
- 2. క్షోభపెట్టు.
- "అతండు ప్రీతుం డై కశ్య పాదులం గనుపుగొట్టు మని పనిచిన." భార. అను. 3. 220.
- 3. నశింపజేయు.
- "అమ్మహాభాగు డద్రిజాప్రాణనాథ, కథలదురితంబు లన్నియు గనుపు గొట్టె." ఉద్భ. 1. 8.
- "అందు మందాకినీ నందనుం డమంద పరాక్రమ క్రీడం గౌంతేయబలంబు గనుపుగొట్టె." భార. భీష్మ. 2.
కనుబడి యగు
- ఆదాయము వచ్చు. లాభము కనిపించు. కాశియా. 228.
కనుబా టగు
- దృష్టిదోషము తగులు.
- "కనుబాటు గాకుండ వనిత చన్దో యికి." భాస్క. కిష్కిం. 60.
కనుబేటము
- 1. విరాళి.
- "ఒకచెం,గట నుండెం దెలియరానికను బేట మనన్." సింహ. 12. 30.
- 2. ప్రేమ; దృష్టిజనిత ప్రేమ. కుమా. 5. 44.
కనుబొమ్మలు
- కనుసోగలు.
- "వాని కనుబొమ్మ లెంతో అందంగా ఉన్నవి." వా.
కనుబ్రాము
- మోసగించు. వర. రా. యు. పు. 182. పంక్తి. 10.
కనుమబ్బు
- కనుచీకటి. వేం. పంచ. 1. 246.
కనుమఱి చెడు
- బయట పడిపోవు, చాటు తప్పు.
- "కనుగీటి చూపువారును, గనుమఱిచెడి పట్టు జూప గడగెడివారున్." కుమా. 2. 82.
కనుమఱువడు
- కనుమఱుగు చెందు, దాచి పెట్టుకొను, దాగుకొను.
- "కనుగిట్టి చూపువారును, గను మఱి కను_____కను 383 కను____కను
- "చెడిపట్టు జూప గడ గెడువారున్, గని కడపి పుచ్చువారును, గనుమఱుపడు వారు బరుల గనుగొనువారున్." కుమా. 2. 82.
కనుమాటు
- మోసగించు, కనుమొఱగు.
- "ఒరులు తెలియక యుండన్, గను మాటి తిరుగుచుందురు." రాధా. 1. 99.
కనుమాయ
- ఇంద్రజాలము.
- "కనుమాయకరణి యయ్యె." హరి. పూ. 9. 142.
కనుమారిపడు (ఉఱుకు)
- కొండమీదినుండి దుమికి ప్రాణములు తీసుకొను. మరు ప్రపాత మని సంస్కృతంలో దీనికి పేరు. శిక్షగానూ, లేక తన పాపములకు ప్రాయశ్చిత్తము గానూ దీనిని కొందరు పూర్వం ఆచరించేవారు.
- "కల్లు ద్రావినపాతకంబు...కనుమారి నుఱుకంగ బాయు." భార. శాంతి. 1. 307.
- "పాయ దగు మిమ్ము గనుమారి బడ బొసంగు, విషము ద్రావుట యోగ్యంబు." ఉత్త. 4. 56.
కనుముక్కుతీరు
- అంగసౌష్ఠవం.
- "ఆ అమ్మాయి కనుముక్కు తీరుగల మనిషి." వా.
- "ఆ పిల్ల కనుముక్కుతీరు ఎంతో బావుంటుంది." వా.
కను మూయు
- 1. నిద్రించు.
- "విషాద వేదనన్, ముప్పిరిగొన్న చింత గనుమూయ నెఱుంగక నెమ్మనమ్ములో, నెప్పుడు తెల్లవాఱును..." కా. మా. 2. 137.
- "కనుమూయ నెఱుగక." కవిక. 2. 132.
- 2. మోసగించు.
- "కపురంపుబలు కంచు గనుమూసి కటకటా!, బూది గప్పిన నిప్పు బాదు కొల్పి." చంద్రా. 4. 167.
కనుమూసి గంత
- దాగిలిమూతలాట.
- "కనుమూసిగంత నలుకంబాలాట..." కళా. 6. 202.
కనుమోడ్చు
- నిద్రించు.
- "నడురాత్రి యరుదెంచె నరలోకనాథ,కడు డస్సినా డవు కనుమోడ్తు గాక." రంగ. రా. బాల. పు. 39. పంక్తి. 15.
కనుమోసము
- ఎట్టయెదుటే చేయుమోసము.
- "కను, మోసము లే కొక్క మొగిన ముసరగ వలయున్." భార. విరా. 4. 230.
కనుఱెప్ప వెట్టని
- కన్ను మూయని.
- "కనుఱెప్ప వెట్టని తన వేయి కన్నుల." భాస్క. అరణ్య. 43.
కనుఱెప్పలు తేలవైచు
- తెలివి తప్పిపోవు. కను____కను 384 కను____కను
- శోష వచ్చి పడిపోవుపరిస్థితిలో కనులు తేలవేయడం అలవాటు.
- "కనుఱెప్పలు దేల వైచి కడు సోలుటయున్." కళా. 6. 250.
కనుఱెప్ప వేయక చూచు
- తేఱి చూచు. కాశీ. 4. 99.
కనులకు గంతలు కట్టు
- మోసగించు.
- "అది మొగుడికండ్లకు గంతలు కట్టి ఊరంతా సటారిస్తూ ఉంటుంది." వా.
కనులార్చు
- కనుసైగ చేయు; కనుఱెప్పలు పదేపదే అల్లార్చు.
- "పొరుగింటిబ్రాహ్మణి బుణ్య గేహిని నేల, యపహరించితి కనులార్చి యార్చి." కాశీ. 7. 256.
- "కండ్లార్పేవాడు ఇండ్లార్పుతాడు." సా.
కనులు చింతనిప్పు లగు
- కోపము కలుగు.
- "సభలో అత నేదో తప్పు పట్టేసరికి శాస్తుర్ల వారి కళ్లు చింతనిప్పు లయ్యాయి." వా.
కనులు చెమర్చు
- దు:ఖము కలుగు.
- "అతనిని చూడగానే ఆవిడ కన్నులు చెమర్చినవి. ఎంత సుఖముగా నున్న వాడు ఏ స్థితికి వచ్చినాడు!" వా.
కనులు తీసుకొని చూచు
- కను లింత చేసికొని నిరీక్షించు.
- "అని కనులు దీసికొని యా,తని రాకకు నెదురు చూచు..." శ్రవ. 4. 62.
కను లెఱ్ఱ చేయు
- కోపించు.
- "కలుషించి అనపోతు కను లెఱ్ఱ చేసి." పల. పు. 48.
కనువిం దగు
- నేత్రపర్వ మగు. శుక. 1. 507.
- చూ. కన్నులపండువగు.
కను విచ్చి చూచు
- కండ్లు తెఱచి చూచు.
- "అంత గను విచ్చి చూచె నన్నాత డేను, బ్రణతి జేసితి..." కళా. 4. 154.
కను విచ్చు
- కనులు తెఱచు.
- "కను విచ్చి ననుం జూచు." భర. ద్రోణ. 1. 40.
కనువి ప్పగు
- తెలిసి వచ్చు.
- "వాడు చెప్పిం దంతా వినేసరికి నాకు కనువి ప్పయింది." వా.
కనువెలుగు
- దారి చూపువాడు.
- "కనువెలుగు నీవు గా నీ, వెనుక భవన్మతమ యూది వీరలు నేనుం, జను దెం చెదము..." భార. ద్రోణ. 1. 66.
కనువేదుఱు
- విరహము.
- "చూపులన్, విన్నదనంబు దోప గను వేదుఱునన్ బయిగాలి సోకినన్, వెన్న వలెం గరంగు..." మను. 2. 57. కను____కన్న 385 కన్న____కన్న
కనువేదు ఱెత్తు
- చక్షూరాగము కలుగు.
- "కసిగాటుపెనకువ కనువేదు ఱెత్తి." వర. రా. బా. పు. 50. పంక్తి. 6.
కనువేయు
- మోహించు.
- "వీ డా పని పిల్ల మీద కనువేసినట్టున్నాడే!" వా.
- చూ. కనువైచు.
కనువైచు
- కన్ను వేయు.
- "ఒక్కమగవానిపయిన్ గనువైచి తేమొ? కువ. 3. 107.
- వాడుకలో రూపం; కన్ను వేయు.
- చూ. కనువేయు; కన్నువేయు.
కనుసన్న
- సైగ.
- "అన్యసతుల, యునికి గనుసన్న జూపె నా యుత్పలాక్షి." కళా. 6. 124.
కనుసన్న మెలగు
- అజ్ఞానువర్తి యగు.
- "నీ కనుసన్నన మెలగెద, నేకార్యం బైన నడపు మీవ తగంగన్." భార. విరా. 2. 124.
కనుసోగ
- కనుబొమ్మ.
- చూ. కన్సోగ.
కన్న కడుపు
- కన్న తల్లి
- "కన్నకడుపు గాన గాంక్ష మిక్కుటము." పల. పు. 52.
కన్నకూళ్లు కుడుచు
- అన్ని నీచాలకు పాల్పడు.
- "వాడు కన్నకూళ్ళూ కుడిచి అంత బావుకున్న దేమిటో తెలీదు." వా.
- చూ. కన్నగడ్డీ కఱచు.
కన్న కొడుకు
- ఔరసుడు. ప్రేమాతిశయాన్ని తెలియ జేయవలసినపట్ల దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు.
- "వాణ్ణి చిన్నతనంనుంచీ కన్న కొడుకుగా చూచుకుంటూ వచ్చాను." వా.
కన్న గడ్డీ క`రచు
- ఎంత నీచాని కైనా పాల్పడు.
- "కన్న గడ్డీ కఱిచేవాడు ఎం తైనా సంపాయించ వచ్చు. దాని కేం?" వా.
- చూ. కన్నకూళ్లు కుడుచు.
కన్న గడ్డీ తిను
- చూ. కన్నగడ్డీ కఱచు.
కన్నగాడు
- దొంగ. ఇండ్లకు కన్నము వేసేవాడటవల్ల వచ్చినది.
- "నా దగు తారకా రుచిధనంబు హరించినకన్న గాడు." విప్ర. 3. 22.
కన్నడసేయు
- తిరస్కరించు, ఉపేక్షించు.
- "సేవకునింట శివార్చనంబు మే, ల్గదుర నొనర్పగా వలయు గన్నడ సేయక మీర లన్న..." చెన్న. 4. 333.
కన్నడుగుచేయు
- అగుడు పెట్టు. కన్న____కన్న 386 కన్న____కన్న
- ".....నీవే, కన్నడుగు చేసి తేమని విన్నప మొనరింతు..." వాల్మీ. 3. 33.
- ఇది కాన్నగుడు కావచ్చును.
కన్నతండ్రి
- 1. ఆదరంతో చేయుసంబోధన.
- "ఎన్న డభ్యాస మాయెరా కన్న తండ్రి." నిరంకు. 2.83.
- 2. తండ్రి.
కన్న తల్లి
- తల్లి; కన్న తల్లివలె అతి వాత్సల్యంతో చూచుకొను ఇల్లాలు.
- "నన్ను కన్నతల్లి యన్న పూర్ణా మహాదేవి." భీమ. 3.9.
కన్నదిక్కున జాఱు
- దిక్కులుపట్టి పరుగెత్తు.
- "కలగి కన్నవారు కన్నదిక్కున బాఱి, పోయిరి." ఉ. హరి. 4. 66.
- ఈ 'కన్న' అన్నది 'నానా' అన్న అర్థంలో మనకు బాగా అలవాటు.
- "వాడు కన్నవాళ్ల కాళ్లు పట్టుకొన్నాడు." వా.
- ఇత్యాదు లూహ్యములు.
కన్నది గతిగా
- ఎటు పడితే అటుగా
- "కన్నది గతి గాగ గిన్నరు లరిగిరి." పారి. 5. 37.
కన్నదే గాతిగా
- దొరకినదే చాలు నని.
- "తండ్రీ! సారెకు దువ్వు నాగ్రహము మీదం గన్నదే గాతిగా, గుండ్రాలం గొని దాయ గాక...." వరాహ. 59. 3.
కన్నపుదొంగ
- గజదొంగ.
- కన్నము వేసి దొంగతనము చేయువాడు.
- "సిరిమనోధనము మ్రుచ్చిలినకన్నపు దొంగ." నిరంకు. 1. 2.
కన్న పెట్టు
- 1. దొంగిలించుటకై కన్నము వేయు.
- "యామికావళికన్ను బ్రామి యంత:పురాం,గణము లైనను జొచ్చి కన్న పెట్ట...." శుక. 2. 502. క్రింద.
- 2. దొంగతనము చేయు.
- "ప్రజల యిండ్ల గన్న వెట్టని దొక్కటే కాని కొదవ." నిరంకు. 2. 26.
- "మావీటం గన్న పెట్టి..." దశ. 4. 24.
- చూ. కన్న మిడు.
కన్న మరులు
- పితృమాతృవాత్సల్యము.
- "కన్న మరులుకన్నా పెంచిన మరు లెక్కువ." వా.
కన్న మిడు
- కన్నము వేయు.
- "ఒకనా డేగురు దొంగలు...కన్నమిడువాంఛన్ వచ్చి." ద్వాదశ. 10. 115.
- చూ. కన్న పెట్టు.
కన్నము పెట్టు
- కన్నము వేయు. కన్న_____కన్న 387 కన్న_____కన్న
- "రాత్రి సెట్టిగారిల్లు కన్నంపెట్టి సొత్తుల పెట్టె దొంగిలించా రట." వా.
- చూ. కన్న పెట్టు.
కన్న పోవు
- దొంగతనము పోవు. పరమ. 5. 15.
కన్నయ్య
- 1. కన్న తండ్రి.
- "అని యామిటారి చిగురుకటారి రాయల కన్నయ్యతో మఱియు నేననుచున్నది:-" హేమా పు. 51.
- 2. కృష్ణుడు. శ. ర.
కన్నఱ
- చూచుటకు దుర్భర మైన విచారము.
- తమి. కన్ఱావి.
- "తలిదండ్రులు వా రెట నున్న వారొ యీ,కన్నఱ జూడ బా లయితి." రామా. 2. 41.
కన్నఱి
- కన్నఱ కలవాడు, దు:ఖితుడు.
- "కిన్నరులు గన్నఱులుగా భూతంబులు భీతంబులుగా." ఉ. హరి. 6. 28.
- చూ. కన్నఱ.
కన్నవస్థా పడి
- నానాబాధ పడి.
- "కన్నవస్థాపడి ఆ ఉద్యోగం యిప్పిస్తే మీవాడు రాజీనామా పెట్టి వచ్చాడు." వా.
కన్నవస్థా పడి కంచిలో చేయి కడిగి
- ఎన్నో బాధలు పడి.
- "చేతిలో దమ్మిడీ లేకుండా బయలు దేరాను. కన్నవస్థా పడి కంచిలో చెయ్యి కడిగి ఎలాగైతే నేం పట్ణం చేరుకున్నాను." వా.
కన్న వాడు
- తండ్రి.
- చూ. కన్నాడు.
కన్న వారు
- ప్రతివారు.
- "కోరెన్ వెండియు గన్న వారలకు సంక్షోభింపకే మ్రొక్కి." కా. మా. 2. 89.
- "ఉన్నదైతేయు లందఱు గన్నవారు, కన్నదిక్కుల బోయి సాగరములోన, నడగిరి." ఉ. హరి. 4. 240.
కన్నవిటి
- గ్రుడ్డివాడు.
- "చెవిటికి శంఖధ్వని గ,న్న విటికి దీపంబు...వృథ యగున్." భల్లాణ. 4.
కన్న విన్న యది కాదు
- వింత.
- "ఎన్నుకొన్న లో,కమునను గన్న విన్న యది గా దది కొంత నిజంబు కొంత స్వ,ప్నము నని..." ప్రభా. 122.
కన్న వెట్టు
- దొంగిలించు.
- "వన్నె మాటల వలతువా నీవు నా మనసు, కన్న వెట్టంగ గదా కడు బేల నైతి." తాళ్ళ. సం. 3. 281.
- చూ. కన్న పెట్టు.
కన్నళవి సేయు
- గొడవ పెట్టు; ఉపేక్షించు.
- "కన్నళవి సేయక కరుణ మీఱగా." హేమా. పు. 51. కన్న____కన్నా 388 కన్నా____కన్ని
కన్నళవు చేయు
- అగుడు పెట్టు; గొడవ పెట్టు.
- "కన్నళవు సేయు గచ్ఛపాకారగరిమ గరిమరాళికయాన నీ చరణమహిమ."
- అరవంలో ఎళువు - ఏడుపు, నేటికీ దక్షిణాంధ్రంలో అల్లరి, అగుడు అనే అర్థాలలో ఈ మాటను ఉపయోగిస్తారు.
- "ఏమిట్రా ఈ యెళువు?" వా.
కన్నాకు
- ప్రథానము, ముఖ్యము. ముఖ్యుడు. శ్రేష్ఠుడు.
- తమలపాకులకట్టలో పైన పెట్టేఆకు మంచిది చూచి పెడతారు. అదే కన్నాకు. తద్వారా వచ్చిన పలుకుబడి.
- "కన్నాకు మనకు భీష్ముడు." భీష్మ. 1. 76.
- "మంత్రులు పన్నిద్దఱకును... గన్నాకుగా బెద్ద గద్దియ నునిచి." బస. 2. 27.
కన్నాగు (కన్ను + ఆగు)
- కన్ను మూయు; మూర్ఛిల్లు.
- "నేడు రణశయ్యన్ భూవిభుం డుండగా, గన్నాగం దగు నయ్య నీ నిదురకుం గాలం బయోధ్యం గదా!" భాస్క. యుద్ధ. 5. 83.
కన్నాడు
- తండ్రి.
- "నిన్ను గన్నాని రప్పింపక." ఉద్భ. 3. 28.
- చూ. కన్న వాడు.
కన్నార చూచు
- 1. కనులు తెఱచి చూచు.
- "సన్ను తానందబాష్పంబుల జేసి, కన్నార జూచు వీక్షణములు మునుగ." పండితా. ప్రథ. దీక్షా. పుట. 221.
- 2. ప్రత్యక్షంగా చూచు. వాడుకలో ఇది కండ్లారా అన్న ట్లుంది.
- "కండ్లారా చూచినసంగతి చెప్పడానికి భయ మేమిటి?" వా.
కన్నాస
- కనుపండు వైనది. కంటికి ఆశ గొలుపునది.
- "అది విటాళుల కన్నాస యై మెలంగు." హంస. 5. 215.
కన్నిగట్టు
- త్రాడు కట్టు; బంధించు; నిర్బంధించు.
- పశువులకు దూడలకు మెడకు తగిలించి కట్టేత్రాడును కన్ని త్రా డని అంటారు.
- "మన్ను దినియెడిదూడ...కన్నిగట్టి యెందాక గాయవచ్చును." తాళ్ల. సం. 11. 3. భా. 79.
కన్నిచ్చకు వచ్చు
- కంటి కింపగు, కంటికి ప్రియమగు.
- "మృగంబులుం దెగ జూచి యేచి కన్నిచ్చకు వచ్చు పెక్కునంజుడులు చేవ డించక కావడించి..." పాండు. 3. 89.
- చూ. కన్నిచ్చ వచ్చు. కన్ని_____కన్నీ 389 కన్నీ_____కన్నీ
కన్నిచ్చ వచ్చు
- ప్రియ మగు; దృష్టి నాకర్షించు.
- "కనుగొని పాఱిన గన్నిచ్చవచ్చు, కనుపారుచీరలు ధరియించి శౌరి." ద్విప. మధు. 5.
- చూ. కన్నిచ్చకు వచ్చు.
కన్నిడి యుండు
- గమనించి యుండు.
- "అన్నిటన్ ధరణిపాలుడు గన్నిడి యున్న బెం పగున్." భార. శాంతి. 2. 283.
- చూ. కన్ను పెట్టి ఉండు.
కన్నిడు
- 1. కన్ను వేయు.
- "రుచిమీదన్ గన్నిడి యా శచీ విభుడు దిరుగు..." భార. అను. 2. 189.
- 2. చూపు పెట్టు. దృష్టి సారించు.
- "వసంతకుడు దమపై గన్నిడ గా రాకు గెం,దలిరా కయ్యెనొ నా." కుమా. 4. 85.
కన్నియమెఱుగు
- క్రొక్కారు మెఱపు. తొలకరి వానలలో మెఱిసే తొలి మెఱుపు.
- "తళుకు తళుకున నింగి దాటించె బలుమాఱు, నీరాళ్లగొంది గన్నియ మెఱుంగు." పాండు. 4. 21.
కన్నీరు
- అశ్రువులు. దు:ఖము కల్గినప్పుడు కండ్లలో వెడలునీరు.
- "కన్నీ రొలుకగ నేడ్చిన, నన్నరపతు లెల్ల నేడ్చిరి..." భార. ద్రోణ. 1. 29.
- "వాడు కన్నీరు కారుస్తూ కూర్చున్నాడు." వా.
కన్నీరు కాలువలు కట్టు
- అధికముగా విలపించు.
- "ఆమె కన్నీరు కాలువలు కట్టేటట్లు ఏడుస్తుంటే చూడలేక పోయాను." వా.
కన్నీరు గ్రుక్కుకొను
- దు:ఖోద్వేగ మాపుకొను.
కన్నీరు గోట మీటు
- కన్నీరు గోటితో తుడిచి వేసి కొను.
- "కెందలిరుపాన్పునం దను వొందక లేచి కూర్చుండి కన్నీరు గోట మీటుచు బోటితో వరూధిని యి ట్లనియె." మను. 3. 28.
కన్నీరు మున్నీరుగా (ఏడ్చు)
- ఎక్కువగా (దు:ఖించు.)
- "అబ్బాయి కారుకింద పడ్డా డని వినగానే ఆవిడ కన్నీరు మున్నీరుగా యేడుస్తూ కూర్చుంది." వా.
కన్నీళ్లు తుడుచు
- తాత్కాలికంగా ఏవో మాటలు చెప్పి ఓదార్చు.
- "మమ్ము గన్నీళ్లు తుడిచి వే పొమ్మని యెను." నందక. 43 పు.
- "ఏవో నాలుగు మాటలు చెప్పి కన్నీళ్లు తుడిచి పంపించాడు గానీ, ఈ పిల్లల కేమైనా సాయం చేద్దా మనుకున్నాడా వాళ్ళ చిన్నాన్న?" వా. కన్నీ____కన్ను 390 కమ్ము____కన్ను
కన్నీళ్లు తుడుచుమాటలు
- శుష్కప్రియాలు; పై పై ఓదార్పుమాటలు.
- "ఈ కన్నీళ్లు తుడిచేమాటలతో ఏం లాభం? కొంప మునిగిపోయి ఛస్తుంటే." వా.
- చూ. కళ్లతుడుపు మాటలు.
కన్నీళ్ల నడచుకొను
- కన్నీళ్లు గ్రుక్కుకొను, దు:ఖమును సమాళించుకొను.
- "ఇందాక నెఱుగకే నేమి యంటినొ మిమ్ము?, ననుచు గన్నీళ్లు రా నడచు కొనుచు..." కళా. 4. 171.
- చూ. కన్నీళ్లు గ్రుక్కుకొను.
కన్ను
- రీతి, జాడ.
- "నాకడనుంచి, యేగినక న్నేల నెఱుగ నైతి." కుమా. 6. 160.
కన్నుండ కనుపాప తీయు
- అతి నేర్పరితనము సూపు. కొంత నిరసనగా అనుమాట. కను పాపను తీస్తే కన్ను పోవాలి; కానీ అలా కాకనే తీయగల దంటే ఎంత నేర్పరి అని!
- "విను వల్లభ ! కన్నుండం, గనుపాపం దివియ నేర్పు గల మునిము చ్చీ, వనిత..." కళా. 3. 199.
- "అమ్మా ! ఆవిడా? కన్నుండగానే కనుపాప తీసేరకం." వా.
- చూ. కన్నుండ కనుపాప కొన్నట్లు.
కన్నుండ కనుపాప కొన్నట్లు
- అతినేర్పుగా.
- "కన్నుండ గంటిపాపం, గొన్నట్లు మొఱంగి బాలు గొనిపోవుటకున్, అన్నీచు బంధుయుతముగ, మన్నిగొనక యున్న నేటిమాటలు మనకున్." ఉ. హరి. 5. 288.
- "కన్నుండగ గనుపాపను, గొన్నవిధంబునను సతుల గూడకయును దా, గన్న మిడి మనోధనములు, గ్రన్నన గొనిపోవు గన్న కాడుంబోలెన్." విక్ర. 8. 9.
- "కన్నుండగానే కనుపాపను తీసి నట్లుగా, ఆ పిల్ల తనేమీ ఎఱగనట్లూ, అత్తదే అంతా తప్పన్నట్లూ మగనికి చెప్పి ఒప్పించిం దంటే నమ్ము." వా.
- చూ. కన్నుండ కనుపాప తీయు.
కన్నుండ గంటిపాపను గొను
- మోసము చేయు, అతి చాక చక్యముతో ప్రవర్తించు. నేడు వాడుకలో దీని రూపం.
- "వాడా అమ్మా! కన్నుండగానే కంటిపాపను తీసేరకం." వా.
కన్ను కట్టు
- 1.ఒక పిల్లల ఆట.
- "వెన్నెలకుప్పలు కన్నుకట్టు." ప్రబంధ. 6. 3.
- కన్నులకు బట్టకట్టి తోడి వారిని తెలుసుకొనే ఆట కావచ్చును.
- 2. మోసగించు.
- "నే నెవరి కన్ను కట్టి ఈ డబ్బు తేలేదు. కష్టార్జితం." వా. కన్ను____కన్ను 391 కన్ను____కన్ను
కన్ను కన్నూ కనిపించని చీకటి
- కటిక చీకటి. కంటికి కన్నే కనిపించనంత చిమ్మచీకటి అనుట.
కన్ను కానక
- గర్వముతో - పొగ రెక్కి.
- "వనితా ! యె ట్లోర్వవచ్చు వలవని గర్వం,బున గన్ను గాన కాడెడి, యనుచితవాక్యంబు లేరి కైన దలంపన్." కళా. 1. 175.
కన్ను కానక పోవు
- గర్వించు.
- చూ. కన్ను కానక.
కన్ను కానమి
- గర్వము.
- చూ. కన్ను కానకపోవు.
కన్నుకుట్టు
- 1. అసూయ.
- "వాడికి నన్ను చూస్తే కన్ను కుట్టు." వా.
- 2. అసూయపడు.
- "వానిసిరిం జూచి కన్ను కుట్టినది." ధర్మజ.
- "ఆపిల్ల కాస్త తల దువ్వుకుంటే ఆ ముసలిమొగుడికి కన్ను కుడుతుంది." వా.
- 3. కండ్ల కలకరోగము వచ్చు.
- "వాడు గాలిలో తిరిగేటప్పటికి కండ్లు కుట్టాయి. కంద్లు తెరవకుండా బాధపడి పోతున్నాడు." వా.
- ఇందులోనుండే పై రెండు పలుకుబళ్లూ వచ్చినవి.
కన్ను కొట్టు
- సైగ చేయు. కామమోహాదుల విషయంలోనే దీనిని ఉపయోగిస్తారు.
- "వాడు ఆ పిల్లను చూచి కన్ను కొట్టే సరికి అది వాళ్లవాళ్లకు చెప్పడం, వాళ్లు ఇంటిమీదికి రావడం గొడవో గొడవ అయి పోయింది." వా.
కన్నుకొదమలు
- ఉత్తమనేత్రములు. సింగపుగొదమ అనుచోట తరుణ మని అయినా 'కొదమ' యువతను. ఉద్ధతిని, ఉత్తమతను సూచించును.
- "శంభు వికసితాంబకస,ముదితంబు లగు కన్ను కొదమలో యనగ." పండితా. ద్వితీ. మహి. పుట. 100.
- చూ. కొదమగుబ్బలు.
కన్ను గానక
- పొగ రెక్కి.
- "జనకకన్య జగన్మాన్య జెనక వచ్చి కన్ను గానక చనె బలుగాకి కాకి." రామాభ్యు. 5. 70.
- చూ. కన్ను కానక.
కన్ను గిలుపు
- కనుసైగ చేయు.
- చూ. కన్ను కొట్టు.
కన్ను గీటినంతలో
- అతిశీఘ్రముగా, ఱెప్పపాటులో, ఒక నిమిషములో.
- "....అఖిలాన్నంబుల్, కను గీటినంత కన్ను____కన్ను 392 కన్ను____కన్ను
- లోననె, యనుజునకు దదగ్రజాత యమరించి..." పాండు. 3. 26.
కన్ను గూర్కు
- నిద్రించు.
- "కన్ను గూర్కెడునంత నగ్గహనభాగ, మేలుబేతాళు డతి దుర్నిరీక్ష్యు డగుచు." శుక. 1. 279.
- చూ. కనుగూర్కు.
కన్ను చెదఱు
- మిఱుమిట్లు గొలుపు.
- "ఆ అమ్మాయి రవ్వలకమ్మలు చూస్తే కన్ను చెదరుతుంది." వా.
కన్ను దనియగా
- కనులవిందుగా, నేత్రపర్వముగా.
- "కన్ను దనియగ బదపదార్థములును... వడ్డింప..." పండితా. ప్రథ. దీక్షా. పుట. 119.
కన్ను దనియు
- కనులకు తృప్తి చేకూర్చు.
- "మొలపించె బహునూపముల గన్ను దనియ." వర. రా. బా.పు. 161. పంక్తి. 21.
కన్ను దెఱచు
- కటాక్షించు, అనుగ్రహించు, గుర్తించు.
- "ఇంక నెన్నండు దయ బరమేశ్వరుండు, గన్ను దెఱచునో యని." కుమా. 7. 19.
- "ఆ దేవు డెప్పుడు కన్ను తెరుస్తాడో గాని అంతదాకా నే నిలా అఘోరించ వలసిందే." వా.
కన్నునీరు
- కన్నీరు.
- "కన్నునీరు గొ,బ్బున వెడలంగ." భోజ. 4. 167.
కన్ను పడు
- ఆసక్తి కలుగు. ఇందులో ఈఆసక్తి అత్యాశో, దురాశో అన్నధ్వని కూడా ఉన్నది.
- "వానికి ఆ ఉద్యోగంమీద కన్ను పడింది." వా.
- "వానికి ఆ యింటిమీద కన్ను పడింది." వా.
కన్ను పెట్టు
- కనిపెట్టు.
- "ఆ వ్యవహారంమీద కాస్త కన్నుపెట్టి ఉండక పోతే లాభం లేదు." వా.
కన్ను పొడుచు
- అపకారము చేయు.
- "కన్ను పొడిచి కంటిలో నీ రెందు కంటే ఏం లాభం?" వా.
కన్ను పొడుచుకొన్నా కనుపించని
- ఏమాత్రం కనపడని.
- "కన్ను పొడుచుకున్నా కనిపించని చీకట్లో వెళ్లాడు పాపం!" వా.
- "ఆ కొంపలో కన్ను పొడుచుకొన్నా ఏదీ కనిపించదు." వా.
కన్ను పొడుచునట్లు
- ఎదుటివారికి బుద్ధి వచ్చునట్లు, ఎదుటివారి కన్ను కుట్టునట్లు.
- "నానాట గృశియించు నను జూచి కనుగీటు, పువ్వుబోడుల గన్న పొడిచిమట్లు." రాధికా. 3. 63. కన్ను____కన్ను 393 కన్ను____కన్ను
- "నే నిందుకొఱకె, నవ్వ స,హా నోడుదు వట్టి నింద లందితి నయ్యో, యైన దిక నాయె నందుకె, పూనుద మందఱకు గన్ను పొడిచినరీతిన్." రాధామా. 1. 46.
కన్ను మూతపడు
- నిద్ర వచ్చు.
- "రాత్రంతా కన్ను మూతపడ లేదు." వా.
- "అదేం కర్మమో! కాస్త కన్ను మూత పడేసరికి కలలు వస్తాయి." వా.
కన్ను మూయు
- చనిపోవు.
- "అని ప్రలాపించి కనుమూసె నా క్షణంబు." శుక. 1. 396.
- "ఈ పిల్లలను నా చేతుల్లో పెట్టి ఆయన కాస్తా కన్ను మూశాడు." వా.
- "వాడు కన్ను మూసి మూడు నెల లయిందో కాలేదో? వాడికొడు కా ఆస్తినంతా ధ్వంసం చేశాడు." వా.
కన్ను మూసి తెరచేలోగా
- వెంటనే; ఒక్క త్రుటిలో.
- "కన్ను మూసి తెరచేలోగా అంతా అయి పోయింది." వా.
కన్ను మూసే అవకాశం లేదు
- ఏమాత్రం వ్యవధి లేదు.
- "కను మూయు నెడయు లేదు." బస. 3. 64.
- "కన్ను మూసే వీలు లే దమ్మా! ఈ కొంపలో పొద్దస్తం చాకిరీ అలా చేస్తూ ఉండ వలసిందే!" వా.
కన్ను మూసే తీరిక లేదు
- వ్యవధి లేదు అనుట.
- "నాకు కన్ను మూసే తీరిక ఉంటే ఎంతో చదవాలసి ఉంది. ఏదీ ఈ వెధవ చాకిరీతోనే సరిపోతుంది గా." వా.
కన్ను మొగడు
- కన్ను మూయు; నిద్రించు.
- "ఇన్నాలుగుతెఱగులందు నెయ్యది యైనన్, గన్ను మొగుడ నీ దటె." భార. సౌప్తి. 1. 67.
కన్ను మొగము ఏర్పడు
- రూ పేర్పడు; ఒక స్వరూపమునకు వచ్చు.
- "అల్లనల్లన మూడేడు లయ్యె నకట, కన్ను మొగ మేరుపడదు నాగర్భమునకు." పద్య. బసవ. 1. 96.
- రూ. ముక్కు మొగ మేర్పడు.
కన్ను మొగుచు
- కన్ను మూయు, నిద్రించు.
- "ఒయ్య నొయ్యనం గదలు తూగు టుయ్యెలలం గన్ను మొగిచియున్న విలాసినీవిలాసులునుం గలిగి." పారి. 2. 53.
- "గవనిమొగసాల యరుగుపై భైరవుండు, గన్ను మొగిచె." కాశీ. 3. 23/
కన్ను మొఱగు
- మోసగించు.
- "అంత:పురాంగనలన్ గన్ను మొఱంగి." భీమ. 1. 111.
- చూ. కనుమొఱగు.
కన్ను మోడ్చు
- నిద్ర పోవు.
- "ఏ నింత కన్ను మోడ్చు, తఱిని గలలోన." రా. వి. 1. 15.
- రూ. కనుమోడ్చు. కన్ను_____కన్ను 394 కన్ను_____కన్ను
కన్ను మోడ్పు
- నిద్ర.
- "ఇంచుకసేపు కన్ను మోడ్పు నెఱపి." హంస. 2. 53.
కన్నుల కచ్చి
- ఒక బాలక్రీడ.
- "కన్నుల కచ్చి గుడుగుడుగుంచాలు కుందనగిఱి." హంస. 3. 146.
కన్నుల కద్దుకొను
- అత్యాదరముతో చూచు, అభిమానించు.
- "పేదవాని కన్నం పెడితే కన్నుల కద్దు కొని తింటాడు." వా.
కన్నుల కరవు దీరగా
- కండ్లార; తృప్తిగా.
- "ఇమ్మహాభుజు నిప్పు డోకొమ్మలార!, కంటిమి గదమ్మ కన్నుల కఱవు దీఱ." విజ. 1. 72.
- "కంచిలో వరదరాజస్వామిని కన్నుల కరువు దీరా చూశా మమ్మ్మా ఈనాడు. జనసమ్మర్దం లేదు కదా." వా.
కన్నుల గట్టినట్టు
- ప్రత్యక్షముగా ఉన్నట్లు. బొత్తిగా ఒక సంఘటననో మనిషినో మఱచి పోలేకున్నా మనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
- "మలయుచూడ్కులు గల మంచి నీ మోము, గన్నుల గట్టిన కైవడి దోచు." హరి. 2. భా. 1879.
- "మా కోడలు ఊరికి పోయి నెలనాళ్లయింది. మనమడు కన్నులకు కట్టినట్టుగా ఉన్నాడు. వెళ్ళయినా చూచి రావాలి." వా.
కన్నుల గప్పుకొను
- కన్నుల నద్దుకొను; ఆదరముతో అభిమానించు.
- "కన్నియ నన్ను వల్లభుడు గన్నుల గప్పుకొనంగ నుండి." పారి. 1. 88.
- "గరిమ నందుడు గన్నుల గప్పుకొనగ." రాధికా. 1. 56.
- "ఆ కాంతలు గొల్వ నన్ను సముఖంబున గన్నుల గప్పుకొంచు." రాజగో. 1. 36.
కన్నుల గెంపొదవు
- కోపము కలుగు.
- "విని కన్నుల గెం పొదవగ." జైమి. 7. 192.
కన్నుల నద్దుకొను
- గౌరవ ప్రేమ సూచకంగా ఒకవస్తువును కన్నులకు అద్దుకొనడం అలవాటు. గౌరవ ప్రేమలను సూచించుట భావార్థము.
- "శిరంబున మోపుకొని కన్నుల నద్దుకొని తిరుగ నతని చేతిక యిచ్చి." కళా. 4. 60.
- "ను వ్వేమో అంత సంకోచిస్తున్నావు. ఇదే ఇంకొక రైతే కండ్ల కద్దుకొని తీసుకొంటారు." వా.
- చూ. కన్నుల కద్దుకొను.
కన్ను ల నవ్వు
- హసన్ముఖు డగు, ప్రసన్న ముఖు డగు. బస. 1. 9. కన్ను_____కన్ను 395 కన్ను_____కన్ను
కన్నుల నిప్పులు డుల్లు
- కోపించు, కన్నెఱ్ఱ చేయు.
- "కోపాటోపశిఖలు, నిండారి కన్నుల నిప్పులు డుల్లి." పండితా. ద్వితీ. మహి. పుట. 15.
- చూ. కన్నుల నిప్పులు రాలు.
కన్నుల నిప్పులు రాలు
- ఆగ్రహోదగ్రత కలుగు. కన్ను లెఱ్ఱవడు.
- "కనుగొని కోపవేగమున గన్నుల నిప్పులు రాల..." భార. విరా. 2. 133.
- "కనుగొని కౌశికుం డలిగి కన్నుల నిప్పులు రాల ని ట్లనున్." మార్కం. 1. 228.
- "అప్పుడు విశ్వామిత్రుడు, ముప్పిరి గొనునట్టి కోపమున గన్గొనలన్, నిప్పులు రాలగ నమ్ముని, దప్పక వీక్షించి పలికె దారుణభంగిన్." హరి. 1. 150.
- "వా డేదో తూస్కారంగా మాట్లాడగానే రెడ్డిగారి కండ్లలో నిప్పులు రాలాయంటే నమ్ము." వా.
- చూ. కన్నుల నిప్పులు డుల్లు.
కన్నుల నిప్పు లొల్కు
- అతిక్రోధంతో కన్ను లెఱ్ఱనగు. కోపాన్ని నిప్పులతో పోల్చుట అలవాటు.
- "అల్కతో, గన్నుల నిప్పు లొల్కు హరుకాదిలి దక్షుని జూచి యిట్లనున్." కుమా. 2. 82.
- చూ. కన్నుల నిప్పులు రాలు.
కన్నుల నీలాలు గారు
- ఏడ్చు. కన్నీరు రాలు.
- "ఏడిస్తె నీ కండ్ల నీలాలు గారు." పాతపాట.
- చూ. కన్నుల ముత్యాలు గారు.
కన్నుల నీళ్లు కుత్తుక వట్టు
- డగ్గుత్తిక పడు.
- "గొనకొని కన్నుల నీళ్లు గుత్తుక వట్టెడిని." తాళ్ల. సం. 12. 290.
కన్నుల నూపిరి పెట్టుకొను
- ప్రాణావసానదశలో నుండు.
- "ఎం డనక వా ననక యరక కొయ్య కొట్టుకొని కనుల నూపిరి పెట్టుకొని యున్నచో జేటుపాటు మీకు దెలియ కుండునా?" ధర్మజ. 47 పు. 2 పం.- తెను. జాతీ.
కన్నులనె ప్రాణము నిల్పు
- ప్రాణావసానదశలో నుండు. ప్రాణం పోవునప్పుడు ఆఖరున కనులలో నుండి పోవు ననుటపై యేర్పడినది.
- "....శకుంతల ప్రాణనాయక, ధ్యానము తోడ గన్నులనె ప్రాణము నిల్పి శరీర మాత్ర యై." శృం. శా. 3. 74.
- "వాడు కళ్లల్లో ప్రాణం నిలుపుకొని ఉన్నాడు." వా.
కన్నుల నొత్తుకొను
- కన్నుల కద్దుకొను. ఇది ప్రేమాదరసూచకము.
- "పొలతి నీచిఱునవ్వు బువ్వు లాతడు గోసి, కులికి కన్నుల నొత్తుకొనంగాను." తాళ్ల. సణ్. 3. 279.
- చూ. కన్నుల నద్దుకొను; కన్నుల కద్దుకొను. కన్ను____కన్ను 396 కన్ను____కన్ను
కన్నుల పండువు(గా)
- నేత్రపర్వము. మనోజ్ఞము. మనోహరము.
- "సుందరాకృతులు గన్నులపండువు." 7. 123.
- "ఆ అమ్మాయి నడుస్తుంటే కన్నుల పండువుగా ఉంటుంది." వా.
కన్నుల బడు
- కానవచ్చు. కువ. 3. 59.
కన్నుల ముంచి క్రోలు
- ఆసక్తితో చూచు.
- "నీ వన్నెల్ కన్నుల ముంచి క్రోలుటలు." నారా. శత. 46.
- వాడుకలోనూ: "కళ్ళతో త్రాగి వేస్తున్నా డా అమ్మాయిని" వంటి రూపాలలో ఇది వినవస్తుంది.
కన్నుల ముత్యాలు గారు
- ఏడ్చు.
- "ఎన్నడు నెండక న్నెఱుగనిశిశువు కన్నుల ముత్యాలు గాఱ నేడ్చెడిని." హరిశ్చ. 2. 924.
- చూ. కన్నుల నీలాలు గారు.
కన్నుల ముసు గిడు
- కన్నులు గప్పు.
- "కన్నుల ముసుగిడ్డ కంతుని మాయాం ధతమసపటము..." రాధా. 2. 199.
కన్నులమ్రాను
- చెఱకు.
కన్నులలో నిప్పులు పోసికొను
- ఓర్వలేక పోవు.
- "మనము నేర్చుచున్న విద్యను గాంచి తాను గన్నులలో నిప్పులు పోసికొను చున్నాడు." సాక్షి. 47. పు.
కన్నుల సన్న నునుచు
- ఆజ్ఞానువర్తులనుగా చేయు. కనుసన్న మెలగున ట్లొనర్చు.
- "దిగధీశ్వరుల నోలి, మన్నించి కన్నుల సన్న నునిచె." కుమా. 7. 155.
కన్ను లాకలి తీర్చు
- కన్నులు తనియించు; కండ్లారా చూడ నిచ్చు.
- "ఎన్నడు వచ్చునో యిందిరావిభుడు, కన్ను లా కలి తీర్ప గలుగునో యనుచు." ద్విప. మధు. పు. 38.
కన్ను లార
- కనులకు సంతృప్తిగా, బాగా, ప్రత్యక్షంగా.
- "కన్నులారా జూచుచును." పండితా. ప్రథ. దీక్షా. పుట. 155.
- "కన్నులారా అందరు చూస్తుండగా దొంగ పారిపోయాడు." వా.
కన్ను లార్చు
- వంచించు.
- "...వనితకు గన్ను లార్ప నిటు వచ్చిన వాడవె..." రుక్మాం. 5. 22.
కన్నులు కట్టు
- మోసగించు; కన్నుకొట్టు.
- "నన్ను నమ్మించి తెచ్చి, కాననంబు లో గన్నులు కట్టి కాడు, పఱచి నీ కిట్లు పోజన్నె భావజన్మ!" కుమా. 5. 65.
- చూ. కన్నులు గట్టు.
కన్నులు కానని
- అంధురాలయిన. చూపు లేని. కన్ను____కన్ను 397 కన్ను____కన్ను
- "తల్లి మదేక పుత్రక పెద్ద కన్నులు, గాన దిప్పుడు మూడుకాళ్ల ముసలి." శేం. నైష. 1. 108.
కన్నులు గలవే! (చూడగా)
- కన్నులు చాల వనుట, అతి దర్శనీయము.
- "శృంగారించిన నిన్ను జూడ గన్నులు గలవే?" భాస్క. సుంద. 189.
- చూ. రెండుకన్నులు చాలవు.
కన్నులు గట్టు
- మోసగించు.
- "పౌండ్రవిభు కన్నులు గట్టి ప్రలంబ వైరికిన్, సేవ యొనర్చి." ఉ. హరి. 2. 98.
- చూ. కన్నులు కట్టు.
కన్నులు గప్పు
- మోసగించు.
- "తలిదండ్రుల కనులు గప్పి వా డలా చెడుతిరుగుళ్లు తిరుగుతున్నాడు." వా.
కన్నులు చల్లగా
- తృప్తిగా - నేత్రపర్వముగా.
- "కన్నులు చల్లగా గనుగొందు నేను మి,మ్మిరువుర దేవి దేవరను బోలె." శృం. నైష. 2. 86.
- "మా అమ్మాయి పిల్లవా ణ్ణెత్తుకొని యింట్లో తిరుగుతుంటే కన్నులు చల్లగా చూడా లని ఉంది." వా.
కన్నులు చల్ల నగు
- సంతోషము కలుగు; సంతృప్తి కలుగు.
- "జముని జూడగ గన్నులు చల్ల నయ్యె." కాశీ. 3. 147.
- "నిన్ను చూడగానే కన్నులు చల్ల నయ్యాయి నాయనా! అంతే చాలు." వా.
కన్నులు చెదరి పోవు
- మిఱుమిట్లు గొలుపు.
- "చీకట్లో నుంచి వెలుతురులోకి వస్తే కండ్లు చెదిరిపోతాయి." వా.
కన్నులు చెమర్చు
- చూ. కన్నులు చెమ్మగిల్లు.
కన్నులు చెమ్మగిల్లు
- దు:ఖము కలుగు.
- "హరిశ్చంద్ర నాటకంలో చంద్రమతి యేడుస్తుంటే ప్రేక్షకు లందరి కండ్లూ చెమ్మగిల్లినవి." వా.
- రూ. కనులు చెమర్చు.
కన్నులు జేవురించు
- కన్ను లెఱ్ఱ నగు - కోపము కలుగు.
- "క, న్గానడు యాదవుం డనుచు గన్నులు వేయును జేవురింప." పారి. 4. 63.
కన్నులు తల కెక్కు
- పొగ రెక్కు. వినయవంతుడు క్రిందికి చూస్తాడు. అట్లే పొగరుబోతు ఆకాశంలోకి చూస్తూ నడుస్తాడు అనుటపై ఏర్పడిన పలుకుబడి. ఇలాంటి వేకన్నులు నెత్తి కెక్కు, కన్నులు నెత్తికి వచ్చు ఇత్యాదులు. చితా. 6 అం. 59 పు.
- "వాడి కీమధ్య కన్నులు తల కెక్కినట్లు కన్ను_____కన్ను 398 కన్ను_____కన్ను
- న్నాయిలే. అందుకే అలా వాగుతున్నాడు." వా.
- చూ. కన్నులు నెత్తి కెక్కు.
కన్నులు దనియు
- కన్నులు చల్ల వడు.
- "అ,గ్గలిక మెఱసె నట్ల మీకు గన్నులు దనియన్." భార. ద్రోణ. 1. 33.
కన్నులు నీరుబుగ్గ లగు
- కన్నులనుండి కన్నీరు ఏక ధారగా కారు. నీటి బుగ్గలలో నేల చీల్చుకొని నీరు పై కుబుకుతుంది. ఏక ధారగా అలా వస్తూనే ఉంటుంది. అలాగే కన్నుల నుండి కన్నీరు అపరిమితంగా వస్తున్న దని తెలుపు పలుకుబడి.
- "మతి వెత జెంద బేడిసల మార్కొను కన్నులు నీరుబుగ్గ లై, పొదలగ." శుక. 1. 188.
కన్నులు నెత్తికి వచ్చు
- పొగ రెక్కు.
- "అయ్యో! రామా! వాడు మనతో మాట్లాడు తాడా ఇప్పుడు? కన్నులు నెత్తికి వచ్చాయే." వా.
కన్నులు నెత్తి కెక్కు
- గర్వించు, పొగ రెక్కు.
- "ఏమిట్రోయ్! కన్నులు నెత్తి కెక్కా యేమిటి? అలా తోసుకొని పోతున్నావు." వా.
కన్నులు పైకి వచ్చు
- పొగ రెక్కు.
- చూ. కన్నులు నెత్తికి వచ్చు.
కన్నులు మూసి చరించు
- మోసగించి తిరుగు. ఒకరి కంట పడకుండా రహస్యముగా వర్తించుటపై వచ్చినది.
- "....నేర్పు వగమాటలు నేరని తప్పు పాటలుం, గనబడ నవ్వధూటి పతి కన్నులు మూసి చరించు నిచ్చలున్." శుక. 3. 109.
- చూ. కన్నులు గప్పు.
కన్నులు వాచు
- 1. అత్యాసక్తితో ఎదురు చూచు.'
- "కన్నులు వాచు నీ మొగము గానక యెప్పుడు జూడకున్న." యయా. 2.
- చూ. మొగము వాచు.
- 2. ఏడ్చి యేడ్చి కను లుబ్బు.
- "నీదు చై,దములకు వాచె గన్నులు." శ్రవ. 5. 37.
కన్నులు విచ్చి చూచు
- కనులారా చూచు.
- "కన్నులు విచ్చి చూచి పురఘస్మరు దిక్పరి పూర్ణ దీప్తి సం, పన్నతకున్ భయాకులితపద్మనిరీక్షణు డై." కా. మా. 1. 77.
కన్ను వఱపు
- చూచు; దృష్టి సారించు.
- "అయ్యింటిలో గన్ను వఱపి." భార. అను. 1. 76.
కన్ను వేయు
- 1. మోహించు; కాముకతతో ఆశించు. కన్ను_____కన్ను 399 కన్ను_____కన్నూ
- "అయ్యబలమీద నలిననాభుండు కను వేసినాడు." వరాహ. 11. 52.
- "కల నైన నన్యకాంతకు గానికాపును, గనువేసి విటుని జేసినగయాళి." బహులా. 5. 87.
- ".............ఏ వధూటిపై దమి గను వేసితో..." విప్రనా. 4. 37.
- "వా డా పిల్లమీద కన్ను వేశాడు." వా.
- "వా డెప్పుడూ ఆ సందులోనే తిరుగుతుంటాడు. ఆ పిల్లమీద కన్ను వేశాడా యేమిటి?" వా.
- 2. చూచు, దృష్టి సారించు.
- "గుబ్బ పాలిండ్ల క్రేవ గ్రక్కున మురారి, కన్ను వేయుట గని లజ్జ గదుర..." ఆము. 6. 133.
- చూ. కను వేయు.
కన్ను వొందకుండు
- కనుమూత పడక పోవు; నిద్ర పట్టక పోవు.
- "కడుపునిండ గుడువ గానమి రే యెల్ల, గన్ను వొందకున్న గరము డస్సి, యున్నవాడ." భార. ఆది. 6. 289.
- "సౌఖ్య మొదవ నాకు గన్ను వొంద కుండు." ఈదురుపల్లి భవానీశంకరకవి. ధర్మ ఖండము. 1. 237.
- కన్ను వొందు అన్నట్లు కాకా ఇలా తద్విరుద్ధస్థితి సూచక రూపంలోనే ఇది కానవస్తుంది.
కన్ను వైచు
- కన్ను వేయు.
- "సితభాను డాచార్యు చికు రాకు బోడిపై, గన్ను వైచిన కన్నె కలుపు మరులు." నైష. 7. 151.
- చూ. కనువైచు.
కన్ను సన్న మెలగు
- ఆజ్ఞానువర్తి యగు.
- "ఎయ్యది పనిచిన నొయ్యన జేయుచు, గనుసన్న మెలగు భూజనుల దలచి." విక్ర. 6. 59.
- రూ. కనుసన్న మెలగు.
కన్ను సన్నల ద్రిమ్మరు
- ఆజ్ఞానువర్తి యగు.
- "ఇందఱలో నల సత్యభామ కన్, సన్నల ద్రిమ్మరున్ హరి వశంవదుడై యన విందు గాని." పారి. 1. 65.
కన్ను సిమి<.big>
- కన్ను బ్రామి, మోసగించి,
- "చంపకు నన్ను గన్ను సిమి." పాండు. 5. 224.
కన్నూ మిన్నూ కానక పోవు
- పొగ రెక్కి మెలగు; ఎవడేమిటి లెక్ఖ అన్నట్లు ప్రవర్తించు.
- "వాడి కీ మధ్య కాస్త డబ్బు రాగానే కన్నూ మిన్నూ కానక పోతున్నాడు." వా.
కన్ను మిన్నూ కానరాక పోవు
- హెచ్చు తక్కువలు తెలియక పోవు; పొగ రెక్కి తిరుగు.
- "వాడి దిప్పుడు కన్నూ మిన్నూ కానరాని వయస్సు." వా. కన్నె___కన్నె 400 కన్నె____కన్నె
- "వాని కీమధ్య డబ్బున్న స్నేహితుడు చిక్కా ళ్ళే. అందు కని కన్నూ మిన్నూ కానరావడం లేదు." వా.
కన్నె కయ్యము
- తొలిపోరు.
- "కన్నెకయ్యం బిది కని పెట్టి పోరు." పల. పు. 107.
కన్నె కలుపు
- తొలి కూటమి, ప్రథమ సంగమము.
- "సితభాను డాచార్యు చికురాకు బోడిపై, గన్ను వైచిన కన్నెకలుపు మరులు." శృం. నైష. 7. 151.
కన్నె కూర్మి
- తొలివలపు.
- "జనవిభుండు, కన్నెకూర్మి ప్రకాశంబు గాక యుండ." శృం. నైష. 1. 84.
కన్నె గోరుకోత
- కన్నెలకు గోళ్లు తీసే ఒక సంస్కారము. బ్రౌను.
కన్నె బావి
- చిన్న బావి.
- నిర్జలకూప మని బ్రౌను.
కన్నె ముత్తైదువ
- కన్య.
- "ఎవ రైనా కన్నెముత్తైదువుకు చీరా రవికా, పసుపు, కుంఖం మా ఆవిడ రే పివ్వా లట." వా.
కన్నె ఱికము పెట్టు
- తొలిసారిగా యుక్తవయస్కు రా లయిన వేశ్యను పొందుటకై ఒకానొక సంస్కారము జరుపు.
- "ధనదత్తు డపుడు తన చెలికానిన్, బని చెను పుష్ప సిగంధికి, నొనరంగ గన్నె ఱికమునకు నొడబఱపింపన్." మల్హ. 2.3.
క న్నెఱుగు
- 1.విధము తెలియు, జాడ తెలియు.
- "పరమేశ్వరుండు...సుప్రసన్నుం డైన కన్నెఱింగి గౌరి." కుమా. 5. 25.
- "తమ యందఱకు వగ గల్గిన కన్నెఱింగి." కుమా. 6. 29.
- "త న్నెర్గకున్న కన్నె ఱిగి." పండితా. ప్రథ. పురా. పుట. 351.
- "కరితురంగ, రథ పదాతిచయము రావింవుచున్న యా,క న్నెఱింగి కోప కలితు డగుచు." వి. పు. 7. 413.
- 2. భావమెఱుగు, ఇంగిత మెఱుగు.
- "నిజ జీవితేశ్వరి కన్నెఱింగి దానికి సమ్మతించిన..." కుమా. 1. 102.
- కన్ను జాడ, తీరు, లక్షణయా భావము అను అర్థములలో విరివిగా ప్రయుక్తం.
- చూ. కన్నెర్గు.
కన్నెఱ్ఱ చేయు
- కోపించు.
- "చేడెపై గన్నెఱ్ఱ చేసె దేమి?" రసిక. 5. 164. కన్నె____కన్వే 401 కన్వే____కపు
కన్నెర్గు
- కన్నె ఱుగు, జాడ తెలియు.
- "విన్న వింపగ నున్న కన్నెర్గి." బస. 1. 5.
- చూ. కన్నెఱుగు.
కన్నే చు
- కనుకుట్టు; ఒకరిని చూచి ఓర్వ లేక పోవు.
- "కన్నే చినయట్టు, జైనులకన్ను లీక్షణములో జెఱచి." పండితా. ద్వితీ. మహి. పుట. 114.
- చూ. కన్నుకుట్టు.
కన్నోట
- సంకోచము.
- "మున్ను పలికినట్ల కన్నోట లేక ప,ల్కుటయు." భార. శాంతి. 4. 392.
కన్పండువు
- చూ. కనుపండువు.
కన్గిలుపు
- కన్ను గీటు. విజయ. 3. 28.
కన్పెట్టు
- చూ. కనుపెట్టు.
కన్మొఱగు
- వంచించు, మోసగించు.
- "శ్రీ కాంతామణి గన్మొఱంగి." పాండు. 1. 1.
- చూ. కనుమొఱగు.
కన్వెలుగు
- చూ. కను వెలుగు.
కన్వేగిన వెనుక
- చీకటి విచ్చగనే.
- కను చీకటి అనగా కనుల కంతగా కనిపించని వేళ, కను వేగుట అనగా కనులకు కొంత కనిపించు సమయము.
- "ఒనరంగ నిట బొండకొయ్య నుంచిరి కన్వే,గినవెనుక దెలిసికొని య, చ్చని నను బొ మ్మాందురు..." శుక. 3. 204.
కన్వేగు
- తెల్ల వారుజాము అగు.
- "కన్వేగినవెనుక దెలిసికొని." శుక. 3. 204.
కన్సోగ
- కనుబొమ్మ.
- రూ. కనుసోగ.
కపటధర్మకంచుకము
- పైకి ధర్మముగా కనబడుతూ లోన పాపభూయిష్ఠ మైనది.
- "ఇది పాపశీలంబు, కపటధర్మకంచు కంబు నువ్వె." భార. శాంతి. 3. 65.
కపురపుబాగాలు
- కర్పూర ఖండముల తోడి విడెము; అందులో చేర్చు సుగంధద్రవ్యములు.
- "తుఱుములోపల నరవిరిసరులు దుఱిమి, వేడ్క గపురపు బాగాలు వేసి కొనుచు." హంస. 5. 254.
- "పండుటాకులు గపురంపు బాగములును, బరగ జేపట్టిరి." రాజ...
- "కట్టెడు తెల్ల నాకులును గప్పుర బాగలు నిచ్చు నిచ్చలున్." తారా. 2.
- "క,ర్పూరంబుతోడి బాగా, లీరాదో యాకు మడిచి యీరాదొ చెలీ!" కళా. 4. కప్ప____కప్ప 402 కప్ప_____కప్ప
కప్పకాటు
- అసంభవము.
- కప్ప కఱవదు గనుక.
- "బాపనపోటు కప్పకాటుం గలదే?" రుక్మాం. 5. 28. వేంకటేశ. 72.
కప్పకుఱుపు
- బొబ్బ. శ. ర.
కప్పచిప్ప
- ఆలిచిప్ప.
కప్పడి కంబళి.
- కప్పుకొను కంబళి.
- "గద్దెకంబళ్లు గప్పడి కంబళ్లు." పండితా. పర్వ. 346.
కప్పతాళము
- తాళం కప్ప.
- "వాళ్ళింటికి పెద్ద కప్ప తాళం తగిలించి పోయారు. అయినా దొంగలు విడిచి పెట్టారా?" వా.
కప్పదాటులు వేయు
- మధ్యలో మధ్యలో వదలిపెట్టి అక్కడ ఒకటీ యిక్కడ ఒకటీ చెప్పి - వ్రాసి సరిపుచ్చు.
- "ఏది వ్రాసినా సక్రమంగా సంపూర్ణంగా వ్రాయాలి గాని, ఇలా కప్పదాటులు వేయడం నాకు సరిపడదు." వా.
కప్ప నాగు(వు)రు
- చిఱుకప్ప కాటుచే పశువులకు కలిగెడు రోగవిశేషము. హరి. పూ. 6. 45.
కప్పయెలుగు పాము
- పైకి సాధువుగా కనిపించే క్రూరవ్యక్తి.
- గోముఖవ్యాఘ్రము వంటిది. ధ్వని కప్పదే కాని అసలు పా మనుట.
- "....మన మటు గాన నెప్పుడును మాదెస గప్పయెలుంగుపామ వై, యునికి యెఱుంగ వచ్చె నెటు లూరటగా వర మిచ్చినాడవో!" భార. ద్రోణ. 3. 101.
కప్పరపడు
- సంభ్రమము చెందు; అబ్బుర పడు.
- "వాల్మీకి వచ్చి సీతాసుతులన్, గప్పర పడి చూచి..." జైమి. 6. 89.
- "చెప్పిన నంతయు విని నే, నప్పుడు తల యూచి యమ్మహాదేవి మొగం, బొప్పార జూచి నవ్విన, గప్పరపడి నన్ను బలికె..." విష్ణు. నా. 1. 206.
- "ఉప్పొంగి మానసంబున, గప్పరపడి భూతములు జిఘాంసా పేక్షన్." 5. 193.
- చూ. కప్పరపాటు.
కప్పరపాటు
- సంభ్రమము.
- "కప్పరపాటుతో నతని గన్గొని..." రంగా 1. 70.
- చూ. కప్పరపడు.
కప్పల తక్కెడగా
- ఒకటి సరిపడితే మరొకటి చెడిపోతున్నప్పుడు అనే మాట. కప్పలను తక్కెడలో పెట్టి కప్ప_____కప్పి 403 కప్పి_____కప్పు
సరిగా తూచవలె నంటే అసాధ్యం. ఒకటి వేస్తే మఱొకటి ఎగిరిపోతూ ఉంటుంది. అందుపై వచ్చిన పలుకుబడి.
- "ఈ వ్యవహార మంతా కప్పల తక్కెడగా తేలింది. వీడు దారికి వస్తే వాడు దారికి రాడు; వాడు దారికి వస్తే వీడు దారికి రాడు." వా.
కప్పవలె నోరు తెఱచుకొను
- తెలివి తక్కువను కనబరుస్తున్నా డనుపట్ల ఉపయోగిస్తారు. నోరు తెరచుకొనుట బుద్ధిమాంద్యసూచకము.
- "ఆవెధ వేవో కారుకూతలు కూస్తుంటే వీడు కప్పలాగా నోరు తెరుచుకొని వింటున్నాడు." వా.
కప్పారు
- నల్ల పడు.
- "కుచాగ్రతలంబులతోన యారు గ,ప్పారె." కుమా. 3. 24.
- "కప్పారు రేణువు కమలాప్తబింబంబు, రాహుమండలమున రమణ గప్ప." భార. భీష్మ. 1. 242.
కప్పిడు
- కప్పి పుచ్చు.
- "కప్పిడగ నేల యొప్పమి, నిప్పుడ యెఱిగింపు కలిగెనేని మహాత్మా!" శేష. 4. 38.
కప్పినకన్ను
- మూసుకుపోయిన కన్ను. పండితా. ద్వితీ. మహి. పుట. 108.
కప్పి పల్కు
- దాచి మాట్లాడు. ప్రచ్ఛన్నంగా పలుకు.
- "అని కప్పి పల్కం బోయి బయల్పడ బల్కి వెలవెలబాఱుచు..." కుమా. 5. 126.
కప్పిపుచ్చు
- దాచు.
- "కల్లతనములు పలుమాఱు గప్పిపుచ్చు." కాశీ. 4. 90.
- "వాడు చేసిన దంతా కప్పిపుచ్చా లని నీ వెంత తాపత్రయపడుతున్నావో నాకు తెలుసు. కానీ ఏం లాభం! ఆ వెధవ పనులు దాచితే దాగేవి కావు." వా.
- చూ. కప్పిడు.
కప్పుకొను
- 1. దాచుకొను.
- "కప్పుకో నేల బంగారమా పువుబంతు, లవి సువర్ణలతోదయములు సుమ్ము." కవిరా. 1. 31.
- 2. క్రమ్ము.
- "ఒప్పనితమకము చిఒత్తము, గప్పుకొనుట నుత్తలంబు గదురగ." భార. విరా. 2. 36.
కప్పుదెంచు
- క్రమ్ము.
- "అఱిముఱి కప్పుదెంచు విలయాభ్రము చాడ్పున." భార. ద్రోణ. 1. 89.
కప్పుదేరు
- నల్ల నగు.
- "కప్పుదేరు తెగబారెడు నిద్దపు సోగ వెండ్రుకల్." విజయ. 3. 89. కప్పు____కప్పు 404 కప్ర___కమ
కప్పురగంది
- స్త్రీ.
- "కప్పురగంది రాధ యనుకన్నియ." రాధా. 1. 12.
కప్పురభోగాలు
- ధాన్యవిశేషం.
- "కప్పురభోగి వంటకము." క్రీడా. పు. 54.
కప్పురము పెట్టి యుప్పు గొను
- అమూల్య మయినదానికి బదులుగా పనికిమాలినదానిని తీసికొను.
- కర్పూరం అమూల్య మనీ ఉప్పు కా దనీ అన్న అభ్యూహపై ఏర్పడినది.
- "మేను...దీనిరహి బుణ్య మమ్ముట, కప్పురంబు వెట్టి యుప్పు గొనుట." ఆము. 6. 62.
కప్పురముల క్రోవి
- సౌదర్య రాశి. పచ్చకర్పూరమూ, పునుగు, జవ్వాజి మొద లైనవి సౌందర్యప్రవర్ధ కాలుగా మనవారు భావిస్తారు. అందు పై వచ్చినపలుకుబడి.
- "కప్పురంబుల క్రోవి యక్కాంత మోవి." హంస. 2. 20.
కప్పు వెట్టు
- పోరాడుటలో దెబ్బ తీయుటకై పొంచి నిలుచు.
- "కప్పు వెట్టి వెన్ను కందమ్ము సమముగా, బొదవి." మను. 4. 23.
కప్రంపుదిమ్మ
- అంద మైనది. కర్పూరపుదిమ్మెవంటి దనుట. మదన. శత. 72.
కబంధహస్తాలు
- దూరంలో ఉన్నవాటి నన్నిటినీ పట్టుకొని బంధించేవి అనే పట్ల ఉపయొగిస్తారు.
- రామాయణంలోని కబంధుని కథపై వచ్చిన పలుకుబడి.
- "ఈ జిల్లాలో ఎవ డెక్కడ దావా పడవేసినా మా ఊరి కరణంగారి కబంధ హస్తాలకు దొరకి పోవలసిందే." వా.
కబోది (పక్షి)
- గుడ్డి.
- "కండ్లు లేని కబోదిని తల్లీ ! కాస్త భిక్షం వేయి." వా.
- చూ. కళ్ళు లేని కబోది.
కబ్బము కరాటము
- పుస్తకము, మందుల సంచి. జం.
- వైద్యులు వెంట కొనిపోవు నవిగా ఉపయోగించే మాట. నారా. శత. 6.
కమరులు వోవు
- ఎండి పోవు. కుమా. 5. 169.
కమలించు
- కమలి పోవు. వాడుకలో కొంత మారీఆవేడి కా పువ్వు కమలి కమ_____కమి 405 కమి_____కమ్మ
పోయింది.' 'ఆ మంటలలో వానిశరీరం కమలి పోయింది.' అన్న ట్లుంది.
- ".....రాతి...పతిం దలంచి కమలించి." కుమా. 5. 98.
కమలి పోవు
- వాడిపోవు.
- "పాపం ఎండకు పిల్లమొగం కమ(మి)లి పోయింది." వా.
కమాను వెళ్లు
- కాంపు వెళ్లు.
- ఇది యిప్పుడు జైళ్లల్లో విశేషంగా వినవస్తుంది. ఉద్యోగస్థులలో దాదాపు మాసిపోయినట్లు కనబడుతుంది.
- "దొరగారు మొన్న కమాను వెళ్లారు. రేపటికి గానీ రారు." వా.
కమామీసు
- వ్యవహారదక్షత; కాలము. బ్రౌను.
- కథా కమామీషూ అన్నచోటే నేడిది జంటపదంలోని భాగంగా వినవస్తుంది.
కమిచికొను
- నోటితో పట్టుకొను, కఱచి కొను.
- "...నేల బడ్డవనజగర్భు, గమిచికొని మరాళకము వాఱె జెందమ్మి, గఱచి కొని రయమున బఱచినట్లు." కుమా. 2. 70.
కమియార
- పూర్తిగా, సంతృప్తిగా. కమియు అనగా పూర్ణముగా. ఈ అర్థంలో చాలాతావుల ప్రయుక్తం; కమియార పండు ఇత్యాదులు.
- "కాంతాజనంబులు కమియార నిడుదురే, పురములో దత్కాలపుణ్య భిక్ష." భీమ. 3. 7.
కమ్మకట్టు
- చేసుకొన్న ఒడంబడికనుబట్టి ఇతరరాజులు పంపుసైన్యము.
- "కోయిలవజీరుల దుమ్మెద కమ్మకట్టు మూ, కల గొరవంకరాదొరల." చంద్రి. 2. 82.
కమ్మగుట్టు
- అతిరహస్యం.
- "అదంతా కమ్మగుట్టు. చచ్చినా బయటికి తెలియదు." వా.
కమ్మచుట్ట
- జాబు. తాటాకుతో వ్రాసి గొట్టంలో పెట్టి పంపే అలవాటుపై వచ్చినమాట.
- "శుభవార్తల బంగరు కమ్మచుట్ట నా, దినకరమండలంబు...." విజయ. 3. 92.
కమ్మనూనె
- వాసననూనె.
కమ్మచ్చు
- బంగారు వెండి కమ్మిగా తీసే కమ్మ____కమ్మ 406 కమ్మ____కమ్మే
- ఒక అచ్చు, ఇనుప పలకలో రక రకాల పరిమాణాలలో రంధ్రాలు వేసి ఉంటారు.
- "వెండి తీగలు నిగిడించు, చదలు కమ్మచ్చు బెజ్జము లనంగ." పారి. 2. 39.
- "దీన్ని సాగ్గొట్టి కమ్మచ్చులో లాగ రా." వా.
- రూ. కమ్మెచ్చు.
కమ్మటాకు
- ఒక ఆభరణం. ద్వార. 4. 140.
కమ్మనీరు
- 1. తేనె.
- "మున్నీ రైనయా కమ్మనీ,రు రహిన్ గూడిన నేర్పరించు గము లై రోలంబ కాదంబముల్." ఆము. 5. 121.
- 2. పన్నీరు.
- "...ఒక పంకజలోచన వ్రాసె... గుబ్బవలిచన్నులపై మకరీకలాపముల్, వావిరి గమ్మ నీరు మృగ నాభి రసంబున మేళవించి." శృం. నైష. 3. 102.
కమ్మపంజు
- కమ్మలోని రాళ్ళు పొదిగిన భాగం.
కమ్మపిల్లి
- పునుగుపిల్లి. శృంగా. శాకుం. 1. 98.
కమ్మ పూత
- గందపు పూత.
కమ్మ యగు
- రుచికరముగా నుండు.
- "కాలెనొ చవి గావొ కమ్మ గావో నీకున్." కా. మా. 3. 88.
కమ్మవడ
- ఒక భక్ష్యము. పాంచా. 4. 59.
కమ్మిచీర
- కమ్ములు పోసి నేసినచీర.
కమ్మితీయు
- 1. చిక్కిపోవు.
- "బాల్యంబు కమ్మితీసె." పార్వ. 2. 24.
- 2. చల్లగా జారుకొనిపోవు. దక్షిణాంధ్రంలో ఇది ఈ అర్థంలో ఎక్కువగా వినవస్తుంది.
- "వాడు మేం మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండగానే చల్లగా కమ్మితీశాడు."వా.
- చూ. కంబి తీయు.
కమ్మినూకు
- కమ్మచ్చున బెట్టి తీగగా తీయు.
- "కమ్మి నూకిన నూత్నకలధౌతమును బోలె." భీమ. 4. 130.
కమ్మిపెట్టు
- కప్పిపెట్టు. కొత్త. 340.
కమ్మీ చేయు
- నేరము దాచు.
- కమ్మేరాకు. తమలపాకులో ఒక విధం. అవి రెండు రకాలు. కారపాకులు, కమ్మేరాకులు. కయి____కయి 407 కయి____కయ్య
కయికాన్క చేయు
- బహుమతు లిచ్చు.
- "విశేషభూషణో,ద్భాసిత చిత్రచేలము లపారముగా గయికాన్క చేసి..." శుక. 4. 80.
- చూ. కైకాన్క.
కయిచూఱగా
- కొల్లగా.
- "హయగజరథములు నావు లెద్దులును, గయిచూఱగా మాకు గలిగినకొలది." ద్వి. భల్లాణ. 1. 19.
కయిదండ
- చేయూత.
- "ఇకన్ గయిదండ గొమ్ము." ఉ. రా. 6. 66.
- చూ. కైదండ.
కయిదండ బట్టు
- చేయూత నిచ్చు.
- "చెలికత్తె ల్గయిదండ బట్టగ సురస్త్రీ లెంద ఱైన న్గెలం, కుల సేవింపగ." కా. మా. 2. 6.
కయిలకట్ట
- కవిలకట్ట. కుక్కు. 31.
- చూ. కవిలకట్ట.
కయిలాగు
- చేయూత.
- "చెట్లు వెంబడి గయిలా గొసంగ." కువ. 2. 47.
కయివారము
- స్తోత్రపాఠము. రాజులు మొదలగువారు వెడలునప్పుడూ, కొలువు తీరినప్పుడూ చేసే స్తోత్రపాఠాలనే కైవారము లంటారు. బస. 2. 26.
- చూ. కైవారము.
కయివ్రాలు
- వంగు.
- "క్రిందికి గయివ్రాలు తత్సలిలనిర్మలధార." ఆము. 4. 21.
- "కయివ్రాలక వాడక తావి వోక." విప్ర. 2. 29.
- చూ. కైవ్రాలు.
కయిసేయు
- అలంకరించు.
- "చెలువ చాల నిట్లు గయిసేయగ." వసు. 5. 123. హర. 2. 108.
- చూ. కై సేయు.
కయ్యపుగ్రచ్చ
- జగడగొండి.
- "గొడవగొట్టులు మడివిడుపులు చాల, గడసరుల్ కయ్యంపు గ్రచ్చలు... వారవనితలు." పండి. పురా. 115.
కయ్య మిచ్చు
- యుద్ధము చేయు.
- "కయ్య మి మ్మని...పిల్చుటయు." హరి. ఉత్త. 4. 16.
కయ్యమునకు కాలు దాచు
- యుద్ధానికి పిలుచు.
- "...దివ్యమౌనీంద్ర! నా, కమృగీనేత్రల మీద గయ్యమునకుం గాల్ దాచులా గొప్పెడున్." కళాపూ. 1. 147.
- చూ. కయ్యమునకు కాలు ద్రవ్వు. కయ్య_____కయ్యా 408 కయ్యా_____కర
కయ్యమునకు కాలు ద్రవ్వు
- జగడమున కీడ్చు.
- "కయ్యమునకు వలదు కాల్ద్రవ్వ." భార. శాంతి. 2. 282.
- చూ. కయ్యమునకు కాలు దాచు.
కయ్యము పొడుచు
- యుద్ధము చేయు.
- "అధిప! నీ తనయుడు కయ్యంబు వొడుచు, తెంపు వదలక విభవంబు పెంపు మెఱసె." భీష్మ. 1. 142.
- చూ. కయ్యము వొడుచు.
కయ్యము లిడు
- కలహములు పెట్టు.
- "...కయ్యంబు లిడ నెందు గతి గల్గునో యని, వెదకుచు..." కళా. 2. 6.
కయ్యము వొడుచు
- కలహించు, యుద్ధము చేయు.
- రూ. కయ్యము పొడుచు.
కయ్యము సెల్లు
- యుద్ధ మగు.
- "పిదప నెట్లు గయ్యము సెల్లెన్." భార. కర్ణ. 2. 215.
కయ్యము సేయు
- యుద్ధము చేయు.
- "కయ్యము సేయుట కప్పు డిమ్మగున్." భార. విరా. 4. 207.
కయ్యాలక్రచ్చ
- జగడగొండి.
- "కయ్యాలక్రచ్చ లై కడగి యీవచ్చు, దయ్యాల ముక్కులు దఱిగి ఖండింతు." గౌ. హరి. ప్రథ. పంక్తి. 1981-82. పాండు. 4. 210.
కయ్యాలమెకము
- నక్క. వావిళ్ళ.
కరకర ధ్వన్యనుకరణము.
- "వాడు కరకర నమలి మ్రింగా లని చూస్తున్నాడు." వా.
కరకర ఆకలి అగు
- బాగా ఆకలి వేయు.
- "జబ్బుపడి లేచావు. కరకర ఆకలి అయ్యేదాకా యేమీ తినకు." వా.
- "ఈ మందు నాలుగురోజులు పడుకో బోయే ముందు వేసుకున్నా వంటే కరకరా ఆకలి వేస్తుంది." వా.
కరకర పడు
- కోపపడు.
- "పటురోషమునన్, గరకరపడుచును నెదిరిన, ఖరకరవంశజుడు ద్రుంచె ఖరుని శిరంబున్." మొల్ల. రామా. అర. 15.
కరకర ప్రొద్దు పొడుచు
- అప్పు డప్పుడే సూర్యోదయ మగు.
- "పూర్వదిశయందు గరకర బ్రొద్దు పొడిచె." హర. 7. 139.
- "కరకర పొద్దు పొడిచేవేళకు మన మా ఊరు చేరుకుంటే, మనపను లన్నీ ముగించుకొని సాయంకాలానికి ఇల్లు చేరవచ్చు." వా.
కరకరించు
- కొట్లాడు.
- "మఱియొకడు వానిపై గరకరించి." పార్వ. 6. 70.