పదబంధ పారిజాతము/ఔ
Appearance
ఓహ____ఔగా 322 ఔగా___ఔద
పలుకుబడులలోని భావమే ఇం దున్నది.
- "ఒక తె రూపసి గాకున్న నోసి యన్న, నో యనెడుమాత్రమున కైన నుండ వలయు." శుక. 3. 342.
ఓహరిసాహరిగా
- హోరాహోరిగా.
- "ఓహరి సాహరి నుయ్యాల చేరుగా, వెనుకొంచు దెరలుచు బెనగు నెడలు." భార. విరా. 3. 165.
- "యుద్ధము సేయజాలకయ యోహరి సాహరి నెంత చెప్పినన్." శివ. 4. 62.
ఔ గా దనక
- ఏమీ అనక. ఔను, కాదు - అనకుండా "భూనయకు డిది యౌ గా దన కీయెడ." సారం. 2. 273.
ఔగా దనక యుండు
- న్యాయా న్యాయ నిర్ణయం చేయక మౌనము వహించి యుండు.
- "నాకు మొగ మోడి యౌ గా దనరు తపస్వులు." పాండు. 5. 243.
- "నే నింతదూరం మీతో మొఱపెట్టు కుంటే మీరు ఔను కాదు అని చెప్ప కుండా కూర్చుంటే నే నింక యెక్కడికి పొయ్యేది?" వా.
ఔ గా దను
- అడ్డు చెప్పు; విమర్శించు.
- "యాదవసింహ ! నా తలపు నప్పుడు వారల పా టొకింత యౌ, గా దను దాక లేదు గలకం బడ జొచ్చె." ప్రభా. 1. 83.
ఔ గాములు
- మంచిచెడ్డలు; సత్యాసత్యాలు.
- "దీని యౌగాము లన్నియు దెలిసి శిక్ష...." పరమయోగి. 3. ఆ.
- చూ. అవ్య్గాములు.
ఔడు గఱచు
- కోపముతో పెదవి గఱచు. కోపము వచ్చినప్పుడు సహజముగా పెదవి బిగించడం, పండ్లు కొఱకడం అలాంటివి చేస్తారు. వానిమీద వచ్చిన పలుకుబడి.
- "కన్ను లెఱ్ఱగా నెగాదిగ గన్గొని యౌడు గఱచి దీని నాటదాని..." శుక. 4. 39.
- రూ. ఔడుకొట్టు.
ఔడు మాయు
- ఖండిత మగు. పెదవి దాటివచ్చు అని వావిళ్లని.
- "అగ్ని నాలుక లేడు నౌడు మాసిన యప్పు, డుడురాజు పొట్ట గుజ్జుఱికి నపుడు." భీమ. 6. 44.
ఔదల యంటి చూచుకొని
- దెబ్బ తిని. ఏ దైనా శాస్తి జరిగినప్పుడు ఒళ్లు యథాస్థితిలో ఉన్నదా లేదా అని పట్టి చూచుకొన్నాడు అన్న వ్యంగ్యార్థంలో ఉపయోగించే పలుకుబడి.
- "సల సల మను కలశజు వె, గ్గలపుం గినుక యను వెసట గలవడి వడి నౌ ఔద____ఔన 323 ఔనౌ___కంక
- దల యంటి చూచుకొని యే,యిలు వెడలితి నాక్షణంబ యెత్తినభీతిన్." పాండు. 5. 207.
ఔదల లూచి మెచ్చు
- సెబా సని మెచ్చు. మెచ్చుటలో తల ఊపుటపై ఏర్పడిన పలుకుబడి.
- "అ,ప్పప్ప యి దౌర యంచు జను లందఱు నౌదల లూచి మెచ్చగన్." హంస. 1. 34.
ఔదల వంచుకొను
- అవమానముతో - తల వంచు కొను.
- "ఠీవి నటించెనా దేవలోక పురంభ గొంచక యౌదల వంచుకొనును." రాధి. పీఠిక. 20.
ఔదల వంచుకొన జేయు
- అవమానపడజేయు.
- "అసురేంద్రుని ముందట మాకు నౌదలల్, వంచుకొనంగ జేసితిని." భాగ. స్క. 7. 152.
- చూ. తలవంపులు.
ఔదెంచు
- అగు.
- "తడ నౌదెంచె బుళింద రాజ." హర. 7. 59.
ఔ నను
- సెబా సను, మెచ్చుకొను.
- "పలికి తుత్ప్రేక్షోపమలు జాతి పెం పెక్క, రసికు లౌనన మదాలస చరిత్ర." ఆము. 1. 13.
- "మృగీమదం, బడరెడు పట్టుచీర సొగ సౌ నన దాల్చి నృపాలు కేళికిన్ నడచె వధూలలామ..." హంస. 3. 4.
ఔనౌను:
- ఔనౌను లే; సరే సరే ! నేటికీ వాడుకలో ఉంది.
- "ఔనౌ నీ పోటును జూతము రమ్మ." కుమా. 12. 20.
ఔరు సౌ రగు
- చెల్లాచెద రగు.
- "చీకటి యౌరు సౌరుగా." కాశీ. 1. 125.
ఔ లెండు!
- సరే.
- "ఔ లెం డిటు విమర్శ దూర మైన వాకిట వసించు నెవ్వ డన్వారు నగుచు." ఆము. 4. 7.
కంకణబలము కలిసి వచ్చు
- వివాహమునకు దైవబలము కలిసి వచ్చు. వివాహం దైవికం అన్న భావంతో యేర్పడినపలుకుబడి.
- "మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తే నేం? కంకణబలం కలిసి రావాలి కాని." వా.
కంకణము కట్టు (కొను)
- ప్రతిజ్ఞ పూను. శుభ కార్యాలలో ఈ కర్తవ్యాన్ని నెరవేరుస్తా నన్న దృష్టితో చేతికి కంకణం కట్టడం అలవాటు. దానిపై వచ్చిన పలుకుబడి.
- "ముఖ్యవ్రతస్ఫూర్తి ముంజి కట్టెడు వాడె, కవుల బ్రోచుటకు గంకణము కట్టె." పాండు. 1. 41.