పదబంధ పారిజాతము/ఇలకఱచు

వికీసోర్స్ నుండి

ఇల_____ఇలా 166 ఇలి____ఇలు

  • "వెఱ్ఱి దెలిసి రోకలి వెస జుట్టుకొన్నట్లు, యిఱ్ఱిదీము భోగముల సే సేము." తాళ్ల. సం. 8. 174.

ఇలకఱచు

  • "మన సిలకఱచి ధైర్య మూత గాగ నిలిచి.-" భా. రా. యు. 702.
  • చూ. ఇల్కఱచు.

ఇలకోడి

  • ఈలపురుగు.

ఇలచేర్పున

  • నేలకు దగ్గఱగా.
  • "మిక్కిలి పొడవు చనగ నీక విమానంబు, నిలచేర్పువన కొంత మేర బోనిచ్చె." కళా. 1. 194.

ఇలట ముండు

  • ఇల్లట ముండు.
  • అల్లుడు పెండ్లి చేసుకొని అత్త వారింటిలోనే ఉండి పోవుట.
  • "వెల్మ డొక్కడు...అతివ నర్థించి యిలట ముండగ."
  • పండితా. ప్రథ. పురా. పుట. 298.
  • చూ. ఇల్లట ముండు.

ఇలలో కలలో లేనిమాట

  • అసంభవము.
  • "వాడు ఆపిల్లను చేసుకుంటా డనుకోవడం ఇలలో కలలో లేనిమాట." వా.

ఇలలో లేనిమాట

  • అసంభవము.
  • "ఇలలో లేనిమాట చేస్తే ఏం లాభం?" వా.

ఇలాకా వేసుకొను

  • సంబంధము కలుపుకొను.
  • 'మీ యిలాకాలో ఎవరైనా పిల్ల లున్నారా' వగైరాచోట్ల మీకు సంబంధించినవారిలో అన్న అర్థం కానవస్తుంది. ప్రాంతం అనేఅర్థంలో కూడా ఇలాకా వాడడం కద్దు.

ఇలిభిక్ష బలిభిక్ష దొరకదు

  • వట్టిలోభి కొంప అనుట. ఎంత లేనిచోటైనా ఇలి (ఈగ) కి యింత దొరకుతుంది. అలాగే భూతబలిగా ఏముద్దో పడవేస్తారు. ఆమాత్రం కూడా లేనిచో టనుట.
  • "వాళ్లింట్లో ఇలిభిక్ష బలిభిక్ష దొరకదు." వా.

ఇలి యిడు

  • ఎంగిలి మెతుకులు విదిలించు.
  • "ఈగ కెన్నడు నే నిలి యిడనివారు." నైష. 7. 53.

ఇలుకరించు

  • పండ్లు బిగబట్టి కోరల కఱచు కొను
  • "భూకాంత నీరువట్టుకు గాక వదన మిలుకరింప గాంపించినపండ్లొ." వరాహ. 10. 30.
  • చూ. ఇలకఱచు.

ఇలు చూఱ విడుచు

  • నిలువుదోపువలెనే ఇంటిలో ఉన్న సర్వస్వాన్నీ యితరులకు ఇచ్చి వేయు.
  • "ని,శ్చలభక్తిం జోగులకును జంగాల ఇలు_____ఇలు 167 ఇలు_____ఇలు

మీ, యిలు చూఱవిడిచి యిటు రా,వలయున్ వైష్ణవుల కొసగవల దేమైనన్." శు.క. 3. 71.

  • చూ. చూఱగొను, చూఱపుచ్చు.

ఇలు డించి

  • ఇల్లు వదలి వేసి.
  • "హీనదశకు నోడి యిలు డించి పరదేశములకు నిట్లు వచ్చి యును." భోజ. 2. 16.

ఇలు తీర్చు

  • గృహము నిర్వహించు. ఇంటి పనులు నిర్వర్తించు.
  • "సుఖు లై తలిదండ్రులు గూడి దేనియున్, దేవరవోలె నుండి యిలు దీర్పగ గాపుర మొప్పు వానికిన్." మను. 1. 53.

ఇలుదొర

  • ఇంటి యజమాని.
  • చూ. ఇలుఱేడు.

ఇలు నించికొను

  • ఇంటికి కావలసిన వస్తుసామగ్రిని సమకూర్చుకొను.
  • "ఇలునించికొనుట మొదలుగ, జలమున మెండొడ్డి మిగుల జండించుచు..." శుక. 3. 344.

ఇలు నింపడము

  • గృహప్రవేశము. బ్రౌను.

ఇలు నెత్తిగట్టుకొని పోగల్గుదురే

  • ఎవ రైనా ఏ దైనా యివ్వక పోయినప్పుడు మీ కున్న దంతా చచ్చిన తరువాత తీసుకు పోతారా అని నిరసనగా అనేమాట.
  • "ఇలు నెత్తి గట్టుకొని పో,గలుగుదురే దివిలి దాము గడపట బొరుగూ, రుల వెంట జనరె?" శుక. 3. 183.

ఇలుపట్టు

  • ఇంటిపట్టు.
  • "ఇలుప ట్టిమ్ముల బడసితి." హరి. ఉ. 1. 36.

ఇలుఱేడు

  • ఇంటి యజమాని.
  • చూ. ఇలుదొర.

ఇలువడి

  • సంప్రదాయము. కులీనత; అట్లా ముందుకు సాగి ఏర్పడిన అర్థం పాతివ్రత్యం.
  • "ఏటంపు బద మగునిలువడి సూచి." పండితా. ప్రథ. పురా. పుట. 479.
  • "వలను గులంబు లేని పరివారము కోటియు నేల...ఇలువడి గల్గెనేని యిల నెల్లను నేలగ జాలు." భార. శాంతి. 3. 103.
  • "కులమును రూపును బ్రాయుము, నిలువ డియుం గలుగునరున కీ గంటి నినున్." రాజ. చ. 3. 195.
  • "ఇలువడి ఘటశుద్ధి గలిగినకాంతలందు నిలుతు." భార. ఆను. 1. 285.
  • "ఇలువడి వదలుట యెగ్గు వొ మ్మనక." పండితా. ప్రథ. దీక్షా. పుట. 125.
  • "కులసతి యనియెడు కూరిమి లేక, యిలువడి గల దనియెడుప్రేమ లేక." అదే. 285. పుట.
  • చూ. ఇల్వడి.

ఇలువరుస

  • కులీనత్వము, గొప్ప వంశమునకు చేరి యుండుట. ఇలు_____ఇలు 168 ఇలు______ఇలు
  • "ఇలువరుసయు మానుషముం, గల రాజుల యిండ్ల గన్నెకలు పుట్టు నెడం." శుక. 3. 521.
  • "ఇలువరుస చెడగ బం దులు తల వంపగ..." భాగ. 9. 382.
  • చూ. ఇల్వరుస.

ఇలువాడు

  • గృహశుద్ధి చేయు. ఇ ల్లలికి ముగ్గు పెట్టు.
  • "లలన యిలువాడి నాథుడు, వలచిన చవి వంటకములు వండి." భార. ఆను. 5. 290.

ఇలువుట్టు

  • దాసి, బానిస.
  • కేలం ఆనాటి పనికి వచ్చిన వాడు కాక ఇంటి వరుసగా వస్తున్న దాసుడు, దాసి.
  • "నంబి, కేతల్లి యేతోడు నేయిలు వుట్టు." పండితా. ద్వితీ. మహి. పుట. 135.

ఇలువుట్టు గొంతి ఇలువుట్టు దాసి, బానిస. వంశపరంపరగా ఇంటిలో దాసికి దాసికి పుడుతూ వచ్చింది.

  • "ఇలువుట్టు గొంతుల కెన గానినన్ను." పందితా. ప్రథ. పురా. పుట. 473.
  • రూ. ఒలువుట్టు దాసి.

ఇలువుట్టుచిన్న

  • దాసికొడుకు.
  • "మాయిలువుట్టు చిన్న, వడుగు సేయ గట్టవచ్చు మా దాసి, కొడుకు." పండితా. ద్వితీ. మహి. పుట. 125.

ఇలు వెడలు

  • బయలుదేరు పాండు. 5. 207.

ఇలు వెళ్ల నీక

  • ఇంటినుండి బయటికి పోనీయక - అ త్యాదరముతో చూస్తూ అనుట.
  • "ఎపుడు సంధ్యలయందు నిలువెళ్లనీక నన్నో మెడుతల్లి యెం తొఱలు నొక్కొ." మను. 2. 17.
  • "అతడు తనకొడుకును ఇల్లు దాటి వెళ్ళనీకుండా చూచుకుంటాడు." వా.

ఇలువేల్పు

  • కులదైవము.
  • ఇలవేల్పు అని వాడుక. ఆ యిలవేల్పే యిలువేలుపు. నిరం. 4. 31.

ఇలుసూఱగా

  • ఇలుదోపిడిగా. అనగా ఇంట నున్న సర్వ స్వం అర్పించి అనుట.
  • "....తమయింట గలయంత వట్టు ....ఇలుసూఱగా భక్తి నెలమి నర్పించి."
  • పండితా. ద్వితీ. మహి. పుట. 183.
  • చూ. ఇలు సూఱపుచ్చు.

ఇలుసూఱ విడుచు

  • 1. ఇల్లు కొల్ల వెట్టు; పూర్తిగా వదలివేయు.
  • "ఇల నిట్టి చోద్యంబు లిటు దొల్లి నేడు ఎందు మేయిలు సూఱ విడుతురే తొల్లి."
  • పండితా. ప్రథ. పురా. పుట. 494.
  • 2. సర్వస్వమూ అప్పగించు, ఇల్క_____ఇల్ల 169 ఇల్ల______ఇల్ల
  • "మిండజంగమునకు...బండరు విలుసూఱ విడుచు." పండితా. ద్వితీ. మహి. పుట. 189.
  • రూ. ఇలు చూఱవుచ్చు.

ఇల్కఱచు

  • 1. ఈలకఱచు - కఱుచుకొని పోవు.
  • "రక్తధారల బెగడు గప్పిన, తెప్ప లిల్కఱచిన, డెంద మదరిన..."
  • పండితా. ద్వితీ. మహి. పుట. 474.
  • 2. గట్టిగా పట్టుకొను.
  • "పం డ్లీలకఱచుకొన్నాడు." వా.
  • చూ. ఇలకఱచు.

ఇల్లంట్రము

  • చూ. ఇల్లఱికము.

ఇల్లంట్రకము

  • చూ. ఇల్లఱికము.

ఇల్ల టము

  • చూ. ఇల్లంట్రము.

ఇల్ల టపల్లుడు

  • అత్తవారింటనే ఉండుఅల్లుడు.

ఇల్ల టపుటల్లుడు

  • చూ. ఇల్లటపల్లుడు.

ఇల్ల డధనము

  • దాపుడుధనము
  • చూ. ఇల్లడసొమ్ము.

ఇల్లడపెట్టు

  • ఇల్ల డగా ఉంచు; ఒకరి ఇంట్లో ఉంచు. భార. విరా. 2. 221.
  • చూ. ఇల్లడల్ పెట్టు.

ఇల్లడ(ల్) పెట్టు

  • ఒకచోట దాచుటకై ఇచ్చి ఉంచు.
  • "అలకలపొల్పు తేటిగములందు, మదాలసయానలీల హం, సలకడ, వక్త్రభాతి జలజంబులపై, దనుకోమలంబు దీ,గల దెస, దృగ్విలాసము మృగంబులచే నగజాత యిల్లడల్, గలయగ బెట్టె నా దను వికాసము లేదె దప:ప్రసంగతిన్." కుమా. 6. 91.

ఇల్ల డామానిసి

  • ఇల్లడగా పెట్టినమనిషి.
  • "ఈతనికి నిల్లడమానిసి నేను." వి. పు. 5. 151.

ఇల్లడసొమ్ము

  • ఒకరి దగ్గర దాచ మని యిచ్చినసొమ్ము.

ఇల్ల నారాయణమ్మ

  • పరమలోభి.
  • 'ఇల్ల' అంటే అరవంలో లేదు అని అర్థం.
  • ఎప్పుడూ లే దనేవా డనుట.
  • "వాడు వట్టి యిల్ల నారాయణమ్మ." వా.
  • ఇల్ల నారాయణమ్మ శతకము.

ఇల్ల ఱికము

  • అల్లుడు అత్తవారింటిలోనే ఉండుట.
  • "ఇల్లఱికం పెట్టుకొని మా పిల్లను ఇద్దా మని ఉంది. కొడుకులు ఎలాగూ లే రాయె." వా.
  • చూ. ఇల్లంట్రము. ఇల్ల_____ఇల్లా 170 ఇల్లా_____ఇల్లా

ఇల్ల లికిన పండు గగునా?

  • ఏదో కొంత తొలిపనులు జరిగినంతమాతంతోనే అంతా అయినట్లు సంతోషింప రా దనుట.
  • ఇల్లలకడం పండుగలో చాలా ప్రాథమిక మైనపని. ఆపని కాగానే పండుగ అయిన దనుకుంటే ఎట్లా?

  • "త్రుళ్లగ నేటికి నిలు నిలు, మిల్లలి కిన బండు వగునె యింతటిలోనే, వల్లభునకు గడు నచ్చిన, యిల్లాలివె? యేను లాతినే పోదోలన్." కళావూ. 3. 190.
  • సా. ఇల్లలకగానే పండుగవుతుందా?

ఇల్లలికి మ్రుగ్గు వెట్టు

  • అలంకరించు. పండుగ పబ్బము లప్పుడూ, ఏదైనా శుభకార్యం జరిగినప్పుడూ ఇల్లలికి ముగ్గు పెట్టడం ఆచారం. దీనిమీద వచ్చినదే 'ఇల్ల లుకగానే పండుగ అవుతుందా' అన్న సామెత.
  • "ఇల్లలికి ంరుగ్గు వెట్టి మ, హోల్లాసము పల్లవింప నొక్క మెఱుంగుం, బళ్లెమున గోసి వైచిన..." శుక. 2. 28.

ఇల్లాది

  • ఇంటిల్లి పాదీ, ఇంటిలోనివా రందరూ.
  • ఇల్లాదివోవు
  • ఇంటివా రందఱూ వెళ్లు. ఇంటిల్లిపాదీ అని నేటి వాడుక. ఇల్లు వదిలి వలసపోవుటగా ఇక్కడ కానవస్తుంది.
  • "కరికాల మండలేశ్వరుడు, కావేరి గట్టింప గడగి యిల్లాది,వోవనీకై యేను వోయెద నంచు...వెట్టికిజను టెల్ల..."
  • బసవ. 4. 115 పుట.

ఇల్లాపె

  • ఇంటావిడ., ఇల్లాలు, భార్య.
  • "అవ్వా బువ్వ బు వ్వంచు ని,ల్లాపెన్ జీర్ణ పటాపకర్షముల నుడ్డాడింపగా." మల్లభూ. వై. 21.

ఇల్లామల్లి

  • చూ. ఇల్లావల్లి.

ఇల్లాలితనము

  • పాతివ్రత్యము.
  • "తార కేయిల్లాలితనము తగ్గె." అహల్యా. 3. 39.

ఇల్లాలు

  • గృహిణి, పతివ్రత.
  • "ఈ పాప నిచ్చెద నిల్లాలిగా నీకు." రుక్మాం. 5. 77.
  • "ఆమె చాలా గొప్ప ఇల్లాలు." వా.

ఇల్లావల్లి

  • ఇటు సంగతులు అటూ, అటు సంగతులు ఇటూ చెప్తూ, తగాదాలు పెడుతూ ఉండే పిల్ల. తిట్టుగా ఉపయోగిస్తారు. చిల్లావల్లి అనడం వాడుక.
  • "అది వట్టి యిల్లావల్లి. దానితో ఏమీ పెట్టుకో వద్దు." వా.
  • చూ. ఇల్లామల్లి.