Jump to content

పదబంధ పారిజాతము/ఆ

వికీసోర్స్ నుండి

అస్థు____ఆక 106 ఆక_____ఆక

  • అస్తవ్యస్తానికి జానపదరూపం కావచ్చును.

అస్థు లరిగేటట్లు

  • ఎముకలు విరిగేటట్లు.
  • "అస్థు లరిగేటట్లు పనిచేసినా అక్కడి కక్కడికే సరిపోవడం కష్టంగా ఉంది." వా.

అస్మాకం

  • ఉంపుడుకత్తె.
  • వైదికులు మాత్రమే ఉపయోగించేమాట.
  • 'అస్మాకం సహ కుటుంబానాం' ఇత్యాది సంకల్పంలోని వాక్యంలోని భాగం.ఇతర వైదిక పరిభాషలవలెనే ఇది తర్వాతి పదానికి - కుటుంబానికి సూచక మయినది.
  • ఆ కుటుంబమే ఉంపుడుకత్తెగా నెమ్మదిగా మారినది.

అహమించు

  • నేనే అన్నిటినీ చేయగలను అని ధీమాతో విజృంభించు.
  • "లెక్కకున్ మిగిలినసేన నొక్క డహమించి వధించుట." జైమి. 2. 48.

అహోరాత్రస్య

  • ఎల్ల ప్పుడూ.
  • "అహోరాత్రస్య వాడి కదేపని. వేరే పని లేదు." వా.

ఆకను బెట్టు

  • కష్టపెట్టు, అడ్డగించు.
  • "తద్భటపరంపర యాకను బెట్టి యుండగన్." విప్ర. 5. 24.

ఆకతాయి

  • శుంఠ.
  • "వాడు వట్టి ఆకతాయి. చదువూ లేదు, సామూ లేదు." వా.

ఆకత్రాడు

  • కవ్వమునకూ స్తంభమునకూ కట్టుత్రాడు.
  • "ఆహవప్రవహాదు లగుమారుతంబులు తగులగట్టిన యాకత్రాళ్లు కాగ." భీమ. 4. 59.

ఆకపెట్టు

  • అడ్డగించు.
  • "నభస్థలి నంబుధి నాకపడక చరి యింపక." భాస్క. కిష్కిం.

ఆకసము తూటు పొడుచుక యైన చనును

  • ఏవిధముగా నైనను తప్పించుకొని పోవును.
  • "ఆకసము తూటు వొడుచుక యైన జనును." హంస. 4. 198.

ఆకగొను

  • నిరుద్ధు డగు.
  • "ద్రోణు బాణవృతు జేయ నతం డాక గొనక యతని ధనువు వ్రే కని భల్లమున ద్రుంచి."
  • భార. ద్రోణ. 1. 201.

ఆకగొలుపు

  • ఆకర్షించు, నిలబెట్టు.
  • "మడుగు మాసిన నైన మగువ పిఱుందు సో,యగము చూపఱ చిత్త మాక గొలుప."
  • ఉ. హరి. 1. 57. ఆక_____ఆక 107 ఆక_____ఆకా

ఆకటదూకట నలుగు

  • ఆకటిదప్పులచే బాధ చెందు.
  • "ఆకట దూకట నలిగితిరి." భా. 2. 124.

ఆకటిపంట

  • పోషకము.
  • ఆకలి తీర్చుట కనువైన పంట వంటి దనుట.
  • "..........సురసమూహము నాకటి పంటలు." పాండు. 1. 109.

ఆకట్టు

  • అడ్డగించు.
  • "డొల్లునీరంబు నాకట్ట జెల్లు గాక, డొల్లుగుణ మది మాన్పంగ జెల్లు నెట్లు?" కవిక. 4. 119.

ఆకయిల్లు

  • చెఱసాల.
  • "ఆకయింటి కావలివారు మేల్కని చూచి." భాగ. దశ. పూ. 148.

ఆకలి ఆఱిపోవు

  • ఆకలి మఱింత ఎక్కువైనప్పుడు అనుమాట.
  • "ఇంక అన్నం తినలేను. ఆకలి ఆరి పోయింది." వా.

ఆకలి చచ్చిపోవు

  • ఆకలి అడగిపోవు.
  • "వేళ మించిపోయి ఆకలి చచ్చి పోయిం దమ్మా?" కొత్త. 63.

ఆకలిచావు

  • తిండి లేక చనిపోవుట.
  • "బెంగాలు కరువులో ఆకలిచావులు విపరీతమై పోయినట్లు మనం పత్రికల్లో చదివాం." వా.

ఆకలి రుచి ఎఱుగదు

  • ఆకలివల్లనే రుచిగా ఉన్నది అన్న సందర్భంలో ఉపయోగిస్తారు.
  • "ఆకలి రుచెఱుగదు, నిద్ర సుఖ మెఱుగదు." సా.
  • "పది మైళ్లు నడిచి వెళ్లాను. మిట్ట మధ్యాహ్నం. ఆ మహాతల్లి అన్నం మాత్రమే ఉంది నాయనా అని అప్పటికప్పుడు నాలుగు మిరపకాయలు ఉప్పురాళ్లు విస్తట్లో నలిపి వేసింది. ఆ రోజు తిన్నానూ ఏం చెప్పను లే. అంత రుచైన భోజనం ఇంతదాకా మరి నా అనుభవములోకి రాలేదు. అందుకే ఆకలి రుచి యరుగదు అంటారు." వా.

ఆకల్లాడ్డం లేదు

  • గాలి యేమాత్రం లేదు. ఆకులు ఆడితే గాలివస్తుంది కదా.
  • "ఊరికే ఉక్క పోస్తూ ఉంది. ఆకల్లాడ్డం లేదు." వా.

ఆకారపుష్టి

  • వేషం మాత్రమే అనుట. ఆకారపుష్టి నైవేద్యం నష్టి.
  • "వాడి దంతా ఆకారపుష్టి. పొట్ట పొడిస్తే అక్షరంముక్క లేదు." వా.

ఆకాశంగద్ద తన్నుకు పోవు

  • సంబంధం లేనివాడు కాజేయు.
  • "వీడూ వాడూ ఆ ఆస్తికోసం వివాద పడుతూ ఉంటే అది కాస్తా ఆకాశం గద్ద తన్నుకు పోయింది." వా. ఆకా_____ఆకా 108 ఆకా______ఆకా

ఆకాశంనుండి ఊడిపడ్డట్టు

  • మానవాతీతునివలె.
  • "ఏదో ఆకాశంనుండి ఊడిపడ్డట్టు మాటాడుతున్నావే?" వా.

ఆకాశంవంక చూచు

  • ఏమీ చెప్ప లేకపోవు.

ఆకాశచిత్రము

  • నిరాధార మైనది.
  • "......ఇటు లే దర్కింప నిం కేల కణ్వుని లోకమ్మున నూర్ధ్వరేతు డన విందుం గాదె యట్లౌట నా, యనఘుం డీచెలి నెట్లు గాంచు గలదే యాకాశ చిత్రం బిలన్."
  • శకుం 2. 24.

ఆకాశతాండవం

  • ఊరికే గంతులు వేయుట.

ఆకాశ పంచాంగం

  • "వాడి దంతా ఆకాశపంచాగం. దాన్ని ప్రమాణంగా నమ్ముకుంటే నగుబాట్లపా లవుతాం." వా.
  • చూ. ఆకాశపురాణం.

ఆకాశపురాణం

  • అర్థం లేనిసంగతి. ఆధారం లేని వట్టి ఊకదంపుడు. నానా. 38
  • "వాడి దంతా వట్టి ఆకాశపురాణం." వా.
  • చూ. ఆకాశపంచాంగం.

ఆకాశమంత పందిరి

  • పెద్ద పందిరి.
  • జానపద కథల ద్వారా వచ్చినపలుకుబడి.
  • "ఆకాశమంత పందిరి. భూమంత అరుగు. కస్తూరి కళ్లాపు. ముత్యాల ముగ్గులు. ఆ రాజకుమార్తె వివాహం రంగరంగవైభవంగా జరిగింది." వా.

ఆకాశమున దాపరము లిడగల

  • నింగికి నిచ్చెన వేయగల - అసాధ్య కార్యములను నిర్వర్తించే నెఱజాణ అనుటలో....."
  • కుమా. 8. 135.

ఆకాశరామన్న

  • పేరు లేకుండా ఉత్తరాలూ, అర్జీలు రాసేవాడు.
  • "ఎవడో ఆకాశరామన్న ఏదో రాశాడట! వీడు నమ్మాడట. ఏం లక్షణంగా ఉంది వ్యవహారం?" వా.

ఆకాశరామన్న అర్జీలు

  • అనామక లేఖలు.
  • "ఆ సబ్ యిన్ స్పెక్టరు లంచాలు తీస్తాడని ఈమధ్య బోలెడు ఆకాశరామన్న అర్జీలు వచ్చా యట. దాంతో వాణ్ణి మార్చేశారు." వా.
  • చూ. ఆకాశరామన్న జాబులు.

ఆకాశరామన్న జాబులు

  • ఆకాశరామన్న అర్జీలు.
  • చూ. ఆకాశరామన్న అర్జీలు.

ఆకాశవాణి

  • అశరీరవాక్కు.
  • మన పురాణాలలో ఏదయినా ఆకాశవాణి చెప్పడం, దానిని వేదవాక్కుగా స్వీకరించడం ఆకా______ఆకు 109 ఆకు______ఆకు

ప్రసిద్ధంగా కనబడుతుంది. అందుపై వచ్చినపలుకుబడి.

  • "నీ కేం ఆకాశవాణి చెప్పిందా?" వా.

ఆకాశానికి ఎత్తు

  • గొప్పగా పొగడు.
  • "వాడికి సరిపోతే ఆకాశానికి ఎత్తుతాడు. లేకపోతే పాతాళంలోకి తోసేస్తాడు." వా.

ఆకాశానికి చిల్లి పడినట్లు

  • వర్షం విపరీతంగా వచ్చిన దనుటలో ఉపయోగించే పలుకుబడి.
  • "ఈరోజు వర్షం ఆకాశానికి చిల్లిపడినట్లు మహాజోరుగా కురుస్తూ ఉంది." వా.

ఆకాశానికి నిచ్చెన వేయు

  • అసాధ్యకార్యము చేయు.
  • "ఆకాశానికి నిచ్చెనలు వేయా లంటే మన తరమా?" వా.

ఆకు, అలము

  • ఆకులు. జం.
  • "వనమున నాకలంబు దిని వంతల గుందుచు నింత కెన్నడే, ననుజుడు దాను జచ్చు నడియాస లి కేటికి..."
  • బాస్క. సుంద. 186.
  • చూ. ఆకలములు.

ఆకుకందకుండా పోకకు పొందకుండా

  • అందికా పొందికా లేకుండా, ఏదీ తేల్చీ చెప్పడం లేదనే అర్థంలో ఉపయోగిస్తారు.
  • నాయకు. 7 పు.
  • "ఆకుకు అందకుండా పోకకు పొందకుండా మాట్లాడితే ఏం లాభం రా." వా.

ఆకుచాటు పిందెవలె

  • పెద్దలచాటున; ఏమాత్రం దెబ్బ తగలకుండా.
  • "......మీ పదయుగంబుల దాపున నాకుచాటుపిం దియవలె నుండు నేను ధరణీతలభారము బూన నేర్తునే."
  • నలచ. 2. 69.
  • చూ. ఆకుమఱుగుపిందెవలె.

ఆకుజిలుకల మొత్తంబువంతున

  • అధికముగా, గుంపులు గుంపులుగా.
  • చేలలో పంట నిండుగా ఉన్నప్పుడు ఈ ఆకుచిలుకలు విపరీతంగా వస్తాయి. దానిమీద యేర్పడినపలుకుబడి.
  • "బేడిసెకదుపుభంగిని... యాకుజిలుకల మొత్తంబు వంతున..." హంస. 3. 29.

ఆకు మడిచి ఇచ్చు

  • తాంబూల మిచ్చు.
  • "కర్పూరంబుతోడి బాగా లీరాదో యాకు మడిచి యీరాదొ చెలీ!" కళా. 4. 70.

ఆకుమడుపులు

  • తములపాకుల చిలకలు.
  • "హెచ్చువాసన వక్క లిచ్చి చుట్టిన యాకు మడుపు లీ దివిరెడునడపదాని."
  • ఉత్త. రామా. 423.

ఆకుమఱుగుపిందెవలె

  • ఆకుచాటుపిందెవలె. ఆకు______ఆకు 110 ఆకు_______ఆకొ
  • "తల్లి తండ్రులయొద్ది తనయులగతి నాకు మఱుగుపిందెలరీతి నెఱి వహించి."
  • హరిశ్చంద్ర. 1. 212.
  • చూ. ఆకుచాటుపిందెవలె.

ఆకులపడు

  • కలత చెందు.
  • "ఆ కలకల మాలించిన, దాకులపడినది వగర్చినది." నాయకు. పు. 89.

ఆకులు వేసికొను

  • తాంబూలము వేసికొను.
  • "పండుటాకులు కప్రంపు భాగములను వేడ్కతోడుత నిద్దఱు వేసికొనుచు." హంస. 1. 240.
  • చూ. వక్కాకు వేసికొను; ఆకు వేసుకొను.

ఆకులలోపలి పిందె

  • మానినీ. 56.
  • చూ. ఆకుమఱుగుపిందె.

ఆకులు అలము

  • ఆకూ అలమూ అని వాడుక. చెట్టు చేమలాంటిది. ఒకే అర్థ మున్న పదాలయుగళం. జం.
  • "అడవి చెట్టుల బంక, లాకులు నలము." పండితా. ప్రథ. పురా. పుట. 378.

ఆకులు లేచినవి

  • ఇంతమంది భోజనం చేసినారు అనేసందర్భంలో ఉపయోగించేపలుకుబడి.
  • "వారింటి పెండ్లిలో పూటకు వెయ్యి ఆకులు లేచినవి." వా.

ఆకులు వేసినారు

  • భోజనానికి లేవండి అనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • "ఆకులు వేసినారు. కాళ్లు కడుక్కోండి." వా.
  • చూ. కంచాలు పెట్టినారు.

ఆకులో మిడత

  • మహా నెఱజాణ అనే అర్థంలో వెక్కిరింపుగా అనేమాట.
  • ఆకులమీద ఉన్న మిడత ఎగి రెగిరి పడుతూ ఉంటుంది. అందుపై వచ్చినపలుకుబడి.
  • "అదా అమ్మా! ఆకులో మిడత." వా.

ఆకులోకి వచ్చు

  • భోజనము సమకూరు.
  • "ఊరికే కూర్చుంటే ఆకులోకి ఎట్లా వస్తుంది?" వా.

ఆకు వేసుకొను

  • తాంబూలము వేసుకొను.
  • "ఆకు వేసుకోండి సామీ!? వా.
  • చూ. ఆకులు వేసికొను.

ఆకుసన్నాలు

  • ధాన్యంలో ఒక భేదము.

ఆకూ వక్కా

  • తాంబూలం.
  • "ఆకూ వక్కా తెచ్చి యీవే, అయ్యగా రొచ్చారు." వా.

ఆకొత్తు

  • అడకత్తెర. ఆగ_____ఆచ 111 ఆచ______ఆజ్ఞ

ఆగడపలు

  • సోపానములవలె తీరిన మబ్బులు.
  • పాండు. 3. 179.

ఆగడించు

  • ఆగడము సేయు. రచ్చ కీడ్చు, అగుడు పెట్టు.
  • "అజ్జదాసయగారి నాగడించితిమా."
  • పండితా. ద్వితీ. మహి. పుట. 214.

ఆగమేగాలమీద పోవు

  • అతివేగంగా పోవు.
  • "ఆవిడకు జబ్బని తెలిసేసరికి అతడు ఆగమేగాలమీద పోయినాడు." వా.

ఆగమ్మకాకిలా తిరుగు

  • అనవసరంగా ఊరికే తిరుగు.
  • "వాడు ఆగమ్మకాకిలా ఊరంతా తిరుగుతూ ఉంటాడు. వాడికి పిల్ల నివ్వమంటే ఎవ రిస్తారు?" వా.

ఆగ్రహోదగ్రు డగు

  • కోపంతో మండిపడు.
  • ఇది ఇలా కలిసి ప్రచురంగా వాడుకలో ఉన్నది.
  • "వాడు అగ్రహోదగ్రు డయినాడు - నే నామాట చెప్పేసరికి." వా.

ఆఘాయిత్యము చేయు

  • 1. చిన్న దానికి పెద్దగా అల్లరి పెట్టు.
  • 2. దౌర్జన్యము చేయు.

ఆచంద్రతారకం

  • కలకాలమూ.
  • చూ. ఆచంద్రతారార్కం.

ఆచంద్రతారార్కం

  • కలకాలం.
  • చంద్రుడూ, నక్షత్రాలూ, సూర్యుడూ ఉన్నంత కాలం.
  • చూ. ఆచంద్రతారకం.

ఆ చెంపా యీచెంపా వాయించు

  • ఎడాపెడా కొట్టు.
  • "ఆ చెంపా యీ చెంపా వాయిస్తే వాడే నిజం చెప్తాడు." వా.

ఆచూకి తీయు

  • జాడ తీయు.
  • "ఆ దొంగ కేసు విషయ మై ఆచూకీ తీయడానికి పోలీసు వాళ్లు తిరుగుతున్నారు." వా.

ఆజానుబాహుడు

  • ఒడ్డుపొడుగూ అయినవాడు. మోకాలు తాకేచేతు లున్న వాడని వాచ్యార్థం.
  • "వాడు మాంచి ఆజానుబాహుడూ, స్ఫురద్రూపీ." వా.

ఆజు బాజుల

  • చుట్టుపట్ల.
  • "మోజుపడి యున్న నాజుం, బాజుల నిలువంగ వీలుపడునే? చెపుమా?" మగువ. 2. 31.
  • "ఈ ఆజుబాజుల్లో అతనంత మాటవాసి కలవాడు మరొకడు లేడు.? వా.

ఆజ్ఞ తల మోచు

  • ఆనతి శిరసావహించు.
  • "మీ యాజ్ఞ దల మోచి పోయెద."
  • పండితా. ద్వితీ. పర్వ. పుట. 287. ఆజ్ఞ____ఆట 112 ఆట_____ఆట

ఆజ్ఞ వెట్టు

  • ఆజ్ఞాపించు.
  • "ఆజ్ఞ వెట్టించి చే తడియాఱ దిపుడు." కా. మా. 1. 54.

ఆజ్ఞ సేయించు

  • ఆజ్ఞానువర్తిని చేయు.
  • "శూర్పణఖ వచ్చుటయు ఆ పొలతిని బట్టి యాజ్ఞ సేయింప."
  • వర. రా. బా. పు. 16 పంక్తి 2.

ఆండ్రెబ్బతనం

  • పెంకెతనం, పిల్లలు చేసే అల్లరి అని వావిళ్ళ. అహం అనే అర్థంలో పెద్దాపురం ప్రాంతంలో వాడతా రటి.

ఆట ఆడించు

  • వేధించు.
  • "వా డేదో మహా మిడిసిపడుతున్నాడు. వాణ్ణి ఒక్క ఆట ఆడించి వదిలి పెడతాను." వా.

ఆట కట్టు

  • పని ముగియు.
  • చదరంగం ద్వారా వచ్చిన పలుకుబడి.
  • రాజు మహా చెప్పగానే ఆట కట్టిపోతుంది.
  • "మహా మిడిసిపడుతూ ఉండేవాడు. ఆ దావాతో వాడి ఆట కట్టింది.: వా.
  • "ఏ మనుకున్నావు? నా తడాఖా. మూడు నిమిషాల్లో వాడి ఆట కట్టించేస్తాను చూడు." వా.

ఆటకూటమ్ములు

  • నటకుల సంఘాలు, నాటక సంఘాలు.
  • పండితా. ద్వితీ. పర్వ. పుట. 470.

ఆటది

  • 1. ఆడుది.
  • 2. చిన్నపిల్ల, ఆటలాడు కొనునది.
  • ఆడునది వేశ్య, నట్టువరాలు.

              "ఆటదాన నబల నైన నే నించుక,
               యలిగి చూచుడును భయమున దలరు.
               దుగ్రు నుగ్రలోచనోద్భూతవహ్నికి,
               నెదిరి నిలువ నీకు నెంత కొలది."
                                       కుమా. 4.74.

  • ఇక్కడ ఆడదానను అన్న అర్థంలో ఉన్న ట్లున్నది.
  • "ఆటదానికి వశ మమ్మ యీ మేటి కోటలు దాట..." గౌర. హరి. ద్వి. 2407.
  • "ఆటదానిని జంపు టవినీతి యనక."
  • పండితా. ప్రథ. పురా. పుట. 285.

ఆట పట్టించు

  • ఏడిపించు, శాస్తి చేయు.
  • "వాడి ఆట పట్టిస్తాను. ఏ పెద్ద మనిషి అడ్డు వస్తాడో తెలుస్తుంది." వా.

ఆటపట్టు

  • స్థానము.
  • "రామేశ్వరతీర్థము కఱకంఠున కాట పట్టు." భీమ. 3. 155.

ఆటపాటలు

  • ఆటలు, పాటలు. జం.
  • "అట్టి హరికీర్తనములు నీ కాటపాట, లిందిరాప్రాణవిభుడు నీ కిష్టదైవము." నలచ. 2. 27. ఆట_____ఆట 113 ఆటి_____ఆడ

ఆట మాని ఒడ్డుకొనబడు

  • మధ్యలో ఆట మానివేసి ఓటమిని అంగీకరించు.
  • త న్నెలానో వదిలివేయ మని చెప్పుపట్ల ఉపయోగించే పలుకుబడి.

            "సకియలు జాగు మాను డిక జాలును
             బోవుద మాట మాని యొ, డ్డుకొన
             బడెన్ నృపాత్మజ కడున్ బరితాపము
             నొంది....."
                                   నలచ. 3. 264.

ఆటలమ్మ

  • మశూచికంలో ఒక భేదము. ఇది సామాన్యంగా పిల్లలకు వస్తూంటుంది. తట్టు, చిన్నమ్మ, పెద్దమ్మ ఇతరభేదాలు.

ఆటలో అరటిపండు

  • వట్టిది.
  • ఆటలో ఒక్కొక్క రాయికో పండుపేరు పెడతారు. అసలవి ఊహామాత్ర మైనవే.

ఆటవిడుపు

  • సెలవు.
  • వీధిబళ్ళలో నేటికీ ఈ మాట ఇలాగే వినవస్తూంది.
  • "ఉడిగములవారలకు నాటవిడుపు గాగ." కువల. 4. 101.

ఆట సాగదు

  • తోచినట్లు ప్రవర్తించుటకు వీలు లేదు అనుపట్ల ఉపయోగించేపలుకుబడి.
  • "సంస్కృతమ్మున నింతగా సాగ దాట." పాణి. 1. 29.

ఆటి నిల్చు

  • ఆగి నిలుచు.
  • "ఏమియున్, డయ్యక కొంతసేపు పెను ఢాకను జేతుల కాటి నిల్చువా, డెయ్యెడ." ప్రభా. 2. 59.

ఆటోపంగా

  • అట్టహాసంగా.
  • "చాలా ఆటోపంగా ఉన్నాడు." వా.

ఆట్లాడుకుంటున్నాను!

  • చూ. ఆడుకుంటున్నాను.

ఆట్లుపోట్లు

  • బాధలు. జం.

ఆడంగులలో పెదబావగారు

  • ఎప్పుడూ ఆడవాళ్లతో ఉండే వాడు.
  • నిరసనగా అనేమాట.
  • "ఉన్నాడుగా ఆడంగుల్లో పెదబావగారు. ఎక్క డెక్కడి కబుర్లూ తెస్తాడు." వా.

ఆడంగులవాడు

  • ఆడచేష్టలు చేసేవాడు, నపుల సకుడు.
  • "వాడు వట్టి ఆడంగులవాడు. బయట ఏం కనిపిస్తాడు?" వా.

ఆడకాడకు

  • అక్కడి కక్కడకు.
  • "ఏం జరగడం లే అమ్మా ! ఆడకాడకు సరిపోతుంది." వా.

ఆడదక్షత

  • ఆడదిక్కు. ఆడ_____ఆడ 114 ఆడి_____ఆడు
  • "ఆడదక్షత లేనియింట్లో పిల్లలు ఎలా ఉంటారు మరి!? వా.
  • చూ. ఆడదిక్కు.

ఆడదానిచేతి అర్థము

  • నిలవనిది.
  • చూ. ఆడుపడుచు సిరి.

ఆడదిక్కి

  • చూ. ఆడదక్షత.

ఆడపాప

  • రాజాస్థానాలలో పెండ్లి చేసు కొనకుండా ఉండేదాసి.
  • 'కార్వేటినగరంలో ఇన్నూరుమంది ఆడపాపలు ఉండేవారు." వా.

ఆడబిడ్డలాంఛనాలు

  • పెండ్లిండ్లలో వరుని తోబుట్టువులకు చీరలు, సొమ్ములు వగైరాల కని యిచ్చు కానుకలు.
  • "ఆడబిడ్డలాంఛనాలకు అధమపక్షం అయిదువంద లయినా యివ్వందే పెండ్లి కుదరడం కష్టం అన్నారు అవధానులు గారు." వా.

ఆడబోవుతీర్థ మెదు రగు

  • కోరినపని తనంతటనే సిద్ధించు.
  • "ఆడుమిందున గైలాస మాడబోవు తీర్థ మెదు రైనరీతి సిద్ధించు ననుడు." కా. మా. 3. 214.

ఆడబోయిన తీర్థ మెదురు వచ్చినట్లు

  • శ్రమ లేక మనోరథం సమకూరిన దనుట.
  • పండితా. ప్రథ. పురా. పుట. 387.
  • చూ. ఆవులు తలచినచోట పూరి మొలచినట్లు.

ఆడికపడు

  • నిందపడు.
  • "ప్రజలచే నాడికపడుదును." జైమి. 8. 114.

ఆడికొను

  • 1. ఒకరిని గూర్చి చెప్పుకొను, నిందగా మాటలాడుకొను.
  • "అతని దుశ్చారిత్రము లెల్లవిని యక్క డక్కడ నాడికొనం దొడంగిరి." శివ. 3. 119.
  • 2. నిందలు వేయు.
  • "బంధువుల్ గనినచో బరగ నిందింతురు, తోడికోడలు చూడ నాడికొనును." హంస. 1. 125.

ఆడికోలు

  • నింద.
  • "కుల మెంచ రాడికోళ్ళకు దలకరు." హంస. 5. 267.

ఆడిన దాట పాడినది పాటగా

  • స్వేచ్ఛగా, అడ్డుపెట్టువారు ఎవరూ లే రనుట.
  • "వా డాడింది ఆట, పాడింది పాటగా ఉంది. అనేవారా? ఆడేవారా?" వా.

ఆడిపోసికొను

  • వెనుక తిట్టుకొను.
  • "వారు ఊరికే నన్ను ఆడిపోసుకొంటున్నారు. నే నేపాపమూ ఎఱుగను." వా.

ఆడుంబసిపని

  • బాల్య చేష్ట, పసిపిల్ల చేయ వలసినపని. ఆడు_____ఆడు 115 ఆడు______ఆడు
  • "వసుధాధరేంద్రసుత నీ వసదృశముగ, శివుని గూడియాడుట యాడుం బసిపని." కుమా. 7. 37.

ఆడుకట్టు

  • ఆడుపోడిమి.
  • "కాళ్ల యొప్పిద మాడుకట్టు నుజ్జ్వలము సేయంగ...." భార. విరా. 1. 228.

ఆడుకుంటున్నాను!

  • వినోదంగా గడపడం లేదు; పనే చేస్తున్నాను అని చెప్పడానికి వ్యంగ్యంగా ఉపయోగించే పలుకుబడి.
  • "ఏమటమ్మా! అన్నిసార్లు పిలుస్తావు. నే నేం ఆడుకొంటున్నానా?" వా.
  • "ఆ అవును. నువ్వే ఇంటిపను లంతా చేస్తున్నావు. నే నేమో ఆడుకొంటున్నాను." వా.
  • చూ. ఆట్లాడుకుంటున్నాను.

ఆడుకూతురు

  • ఆడపిల్ల.
  • "పడసె గాదె శంకర, గొనకొన బుంస్త్వమ్ము నాడుకూతురు నీచేన్." శివ. సా. 417.
  • "ఆడుకూతురు నలా ఏడిపించరాదురా." వా.

ఆడుకొన నోరు గల్గు

  • దూషించుట కవకాశము కలుగు.
  • "అకట! నాయీడు రాచకన్నెకల కెల్ల, గడగి న న్నాడుకొన నోరు గల్గె నే మనందు." శుక. 1. 474. ప.

ఆడుగోడు పోసికొను

  • ఆడవారిని యేడిపించు.
  • "ఈ ఆడుగోడు, పోసికో నేల నీవంటి పుణ్యమతికి." పాండ. జన. నాట. 26.

ఆడుగొల

  • స్త్రీహత్య.
  • తాళ్ల. సం. 6. 57.

ఆడుచు పాడుచు

  • తీరికగా, అనాయాసంగా. జం.
  • "ఆడుచు బాడుచు నభిమతార్థములు, వేడుక భక్తులు వేడిన నిత్తు." ప్రభులిం. 14. 112 పు.
  • "అంటును సొంటునుం దెలుప కాడుచు బాడుచు గూడుచుండె బో." పాణి. 3. 82.
  • చూ. ఆడుతూ పాడుతూ.

ఆడుతీర్పరులు

  • ఆడపెత్తనదారులు; పొసగ రనుట.
  • తీర్పరు లెప్పుడూ మగవారే అయి యుండవలె నన్న అపోహపై యేర్పడినపలుకుబడి.
  • కుక్కు. 22.

ఆడుతూ పాడుతూ

  • హాయిగా, అవలీలగా.
  • "ఆడుతూ పాడుతూ ఆ యింతపనీ చేసుకోవచ్చు." వా.
  • చూ. ఆడుచు పాడుచు.

ఆడుతోడ బుట్టరె?

  • అక్క చెల్లెండ్లు లేరా?
  • ఏ పురుషు డైనా ఒక స్త్రీతో అవమానకరంగా ప్రవర్తించి ఆడు______ఆడు 116 ఆడు_____ఆత

నప్పుడు ఆడవాళ్లు అనేమాట. 'నీకు అక్కా చెల్లెళ్లు లేరా? న న్నలా అవమానిస్తావా' అని. నేటికీ వాడుకలో 'నీ కేం అక్కా చెల్లెళ్లు లేరా? నా వెంట బడుతున్నావు?" అంటారు. ఆడుతోడు లేరా>? అని కూడా క్వాచిత్కంగా అంటారు.

  • "పుర మిది చూడ నింత చెడిపోయె నయోమఱి యాడుతోడ బు, ట్టరె? ననువంటి సాధ్విని..." శుక. 2. 369.

ఆడుదోడునను బుట్టవె?

  • నీకు అక్కా చెల్లెండ్లు లేరా?
  • "బోయవె యాడుదోడునను బుట్టవె శాపనిమిత్తమే తపంబు." మను. 4. 87.
  • చూ. ఆడుతోడ బుట్టరె.

ఆడుపడుచు

  • భర్తృ సోదరి.
  • చూ. ఆడుబిడ్డ.

ఆడుపడుచు సిరి

  • నిలవనిది.
  • ఆడవాళ్ల చేతిలో డబ్బు నిలవ దనుట. మగవారే పెత్తనం వహించవలెనన్న నాటి భావంపై ఏర్పడినది.
  • గువ్వలచెన్న. 33.
  • చూ. ఆడదానిచేతి అర్థము.

ఆడుపాటు

  • స్త్రీత్వము.
  • "మాయయు జీవుడుం బెరసి మైత్రి యొకానొక డాచరించుచుం బాయక యాడుపాటు మగపాటువడన్."
  • పాండు. 4. 274.

ఆడుబిడ్డ

  • ఆడుపడుచు.
  • ఆడుబిడ్డ, ఆడుపడుచు అను మాటలు భర్తృసోదరి అన్న అర్థంలో నేటికీ వాడుకలో ఉన్నవి.
  • "కొత్తగా జేయించుకొన్న ముక్కరకు నై యడలు దుర్వారమై యాడుబిడ్డ." పాండు. 3. 50.
  • "పెళ్లిలో ఆడబిడ్డ (పడుచు) లాంఛనాల కని వాళ్లు చాలా అడిగారు. అంచేత పెళ్ళి కుదర లేదు."
  • "ఉగాదికి మా ఆడపడుచును పంప మని మా వారు వాళ్ల వాళ్ళకు రాశారు." వా.
  • చూ. ఆడుపడుచు.

ఆడ్యుడు

  • నాథుడు.
  • "వాళ్ళ యింటికి ఆడ్యుడు ఎవడూ లేడు." వా.
  • "వాళ్ళది ఆడ్యుడు లేని సంసారం." వా. *చూ. నాథుడు.

ఆణిపూస

  • శ్రేష్ఠుడు.
  • "కాళిదాసు కవుల్లో ఆణిపూస." వా.

ఆతని పేరికూర నంజకుము

  • అతని పే రయినా యెత్తకు మనుట. వాని పేరున్న కూర కూడా ముట్టకూడదంటే అంతేకదా. ఆత_____ఆద 117 ఆద_____ఆది

పరమ పాపిఅని భావము.

  • "కడు గుటిలవర్తనుం డెన్నడు నాతని పేరికూర నంజకుము నృపా!" హరి.. 2. 38.

ఆతపత్రంబు లూదు

  • గొడుగులు పట్టు.
  • "దిగధీశు లున్నతస్థిరభక్తియుక్తి నాతతమౌక్తికా తపత్రంబు లూద." కుమా. 9. 28.

ఆతురసన్యాసం

  • ప్రాణాపాయస్థితిలో తీసుకొను సన్యాసం.
  • ఎలాగూ ఆశ లేనప్పుడు వదలు కొన్నాడు - అన్న సందర్భంలో ఉపయోగించే పలుకుబడి.
  • "వాడు లక్షరూపాయలు ఆ స్కూలుకు విరాళం ఇచ్చ డట. ఎందుకో తెలుసా? ఇన్‌కంటాక్సు భాధ తప్పించుకోడానికి. ఇదంతా ఆతురసన్యాసం." వా.

ఆదట వోవక

  • ఆశ తీరక.
  • "అ య్య న ఘు డు దాని జిత్తమున నాదట నోవక చూచె." భార. ఆది. 4. 145.

ఆద మఱచి నిద్రపోవు

  • నిర్భయముగా నుండు.
  • "పగతురు నే డాదమఱచి నిద్ర వోదు రది తఱి పొడువన్." భార. సౌప్తి. 1. 51.

ఆదము నిద్రపోవు

  • ఆదమఱచి నిద్రించు.
  • నేడు ఆదమఱచి ... అన్న రూపంలోనే వాడుక.
  • "అమృ తాబ్ధి సొచ్చి యాదము, నిద్రవోయిన పీతాంబరుడు బిట్టుచెదరి లేవ." కుమా. 11. 3.

ఆదర బాదర

  • 1. త్వరత్వరగా.
  • "గంట అయిపోయిం దని నేను ఆదర బాదరా బయలుదేరి వచ్చాను." వా.
  • 2. తగిన యేర్పాట్లేవీ లేకనే.
  • "మేనేజరు పిలిచా డనేసరికి ఇతను ఆదరాబాదరా పరుగెత్తాడు. ఆ తొందరలో అకౌంటుపుస్తకం కాస్తా ఇక్కడే పెట్టిపోయి నాలుగుచీవాట్లు తిన్నాడు." వా.
  • 3. తొందరగా.
  • "ఆదరాబాదరా నాలుగు మెతుకులు నోట్లో వేసుకొని వచ్చాను." వా.

ఆదాయము చాలదు

  • చాలినంత వరుంబడి లే దనుట.
  • "ఆదాయం చాలని ఉద్యోగం ఉండీ ప్రయోజనం తక్కువ." వా.

ఆదాయవ్యయాలు

  • జమాఖర్చులు.

ఆది ఇచ్చు

  • కొలత యిచ్చు.
  • "గాజులకు ఇప్పుడే ఆది యిచ్చి వచ్చాను. గుత్తంగా లేకపోతే నా కిష్టంలేదు. అందుకనీ...." వా. ఆది_____ఆదె 118 ఆన_____ఆన

ఆదికారణము

  • మూలకారణము.
  • "ఆదికారణ మతడ మీ యాపదలకు." భార. కర్ణ. 2. 124.

ఆదికొను

  • పై బడు, మార్కొను.
  • "వృషభంబున కాదికొను బెబ్బులియుంబోలె." భార. విరా. 5. 73.

ఆది తీసుకొను

  • కొలత తీసుకొను.
  • "దర్జీవాడు ఆది తీసుకొని పోయి పదినాళ్లయింది. ఇంకా చొక్కాలు కుట్టి యివ్వనంటున్నాడు." వా.

ఆదిమలత్రయము

  • "ఆదిమలత్రయహరణ మౌ."
  • పండితా. ప్రథ. పురా. పుట. 277.

ఆదివావితోడ

  • ఒక వరుసక్రమములో; యథాక్రమముగా.
  • "ఆదివావితోడ నంతంత దవ్వుల, నుండ బంచి యంబుజోదరుండు." హరి. 6. 43.

ఆదివెట్టు

  • తాకట్టు పెట్టు, కుదువ పెట్టు.
  • "కాసువీసంబు వెడలమి గ్రాసమునకు నాది వెట్టిరి క్షేత్రంబులందు గొన్ని." మను. 3. 129.

ఆదెబ్బతో....

  • ఆ పనివల్ల, కొంత నష్టం జరిగాక.
  • "ఆ దెబ్బతో వాడు దారికి వచ్చాడు." వా.

ఆనందపదములు

  • జానపదగేయములలో ఒక నిశ్చితశాఖ అయి ఉంటుంది. ఆనందాన్ని సూచిస్తూ ఆడుతూ పాడుకునే పదాలు.
  • పండితా. ప్రథ. పాద. పుట 513.

ఆనందము మరుగు

  • సుఖము మరుగు.
  • "కాన దటిచ్చల మగురాజ్యానందము మరగి యింద్రియారాముడ నై." ఆము. 2. 81.
  • మరగు వాడుకలో మరుగుగా వినవస్తుంది.

ఆనందవార్ధి దేల్చు

  • ఆనందింప జేయు.
  • "తమకమున నింతు లెల్లను దమక తమక వలచె నని యెంచ నానందవార్ధి దేల్చి." రాజగో. 1. 19.

ఆనకట్ట

  • నదులకూ వానికీ కట్టకట్టి నీరు నిలువచేసి సాగుకు ఉపయోగించడంకోసం కట్టేకట్ట.
  • "గోదావరి కృష్ణలకు ఆనకట్ట కట్టడం వల్ల నే అక్కడ దరిద్రం పోతుంది." వా.

ఆనతిచ్చు

  • చెప్పు - వచించు.

ఆనతి యిచ్చు

  • చూ. ఆనతిచ్చు.

ఆనతి మూరె డైన దాటమి

  • ఆజ్ఞ ఏమాత్రం మీఱక పోవుట. ఆన_____ఆన 119 ఆన_____ఆన
  • మూరెడు అనగా లక్షణయా కొంచెము అనుట. అణు మాత్ర మని యీ సందర్భంలో వాడుక.

ఆననము లేగతి నాలోకింతు?

  • వాడిమొఖ మెట్లా చూస్తాను? ఏదైనా తనకు గొప్ప అవమానం జరిగినప్పుడు తన స్మేహితుల యెదుట పడలేక పోవుట. సహజము. దీనికి వ్యావహారిక రూపం వారి ముఖం ఎట్లా చూస్తాను?
  • "ఈ కలహ మపుడ వినబడు నాకంబున, సురల యాననము లేగతి నాలోకింతు..." కళా. 3. 245.
  • చూ. ముఖం ఎట్లా చూస్తాను.

ఆనపొడుచు

  • ఆజ్ఞాపించు.
  • "ఆలికుంతల చెలుల నేల యాన వొడిచెదు." ప్రభా. 5. 39.
  • చూ. ఆనవొడుచు.

ఆనబెట్టు

  • ఆకలి తీరా అన్నం పెట్టు.
  • నిరసనగా ఒకరినిగురించి తిండిపోతు అంటూ అనేమాట.
  • "వీడికి మేం ఆనబెట్ట లేమమ్మా!" వా.

ఆనమాలు

  • చూ. ఆనవాలు.

ఆన యిడు

  • ఒట్టుపెట్టు.
  • సారం. 2. 205.

ఆన లిడు

  • ఆజ్ఞాపించు.

ఆనలు వొడిపించు

  • ఆజ్ఞాపించు, ఆనవెట్టు.
  • "ఆనలు వొడిపించి యాదృతి స్వర్ణ వర్షం వవర్ష నా వారక వర్షంబు గురియించె."
  • పండితా. ద్వితీ. మహి. పుట. 118.

ఆనవాయితీ

  • మామూలు.
  • క్రొత్త. 26.

ఆనవాలపాయసము

  • నానబాలుతో చేసినపాయసము.
  • "అమృతరస్ఫ్పమం బైనకమ్మని యానవాల పాయసము జంబాల మయ్యె." నైష. 6. 124.

ఆనవాలు

  • చిహ్నము, గురుతు.
  • ఈ ఆనవాలు ఆనమాలు అనే రూపంలో వాడుకలో వినిపిస్తుంది.
  • "ఆనవాలు దెమ్ము నృపుపాల ననియె." భార. అశ్వ. 3. 95.
  • చూ. అడయాళము; ఆనవాలుపట్టు.

ఆనవాలు పట్టు

  • గుఱుతుపట్టు.
  • "అయ్యో! నువ్వు మా రామయ్య కొడుకా! ఆనవాలే పట్టలేదే." వా.
  • "వాడు ఆనమాలు పట్టలేకుండా చిక్కిపోయాడు." వా.
  • చూ. ఆనవాలు. ఆన_____ఆను 120 ఆను______ఆపా

ఆనవెట్టు

  • ఆజ్ఞాపించు.

ఆనవొడుచు

  • ఆజ్ఞాపించు.
  • "దొంగ లాన వొడిచిన గోకల్ విడుతురె?" కళా.
  • "అలికుంతల! చెలుల నేల నాయాస వొడిచెదు." ప్రభా. 5. 39.

ఆనవైచు

  • ఆజ్ఞాపించు.
  • "ఆనవైచినట్లు వాహిని యివుర జలము వాఱె నిసుక దోప." భోజ. 3. 18.

ఆనాలు

  • ఆనవాలు, నానబ్రాలు, వడపప్పు, నానవేసిన పెసరపప్పును ఉపవాసం ఉండవలసిన పండుగలలో ఉపయోగిస్తారు.
  • చూ. ఆనవాలపాయసము.

ఆనిపట్టు

  • ఊని పట్టు.
  • "ఆనిపట్టి నే బాపపుణ్యములు అనుభవించవలె నన్నప్పుడు." తాళ్ల. సం. 9. 17.

ఆనుకొను

  • తిను.
  • నిరసనలోనే వాడుక.
  • "అనుకోవడానికి అయిదిస్తరాకుల అన్నం కావాలనే. ఇక్కడపుల్ల అక్కడ తీసిపెట్టడు గదా? ఎట్లా వస్తుందీ అంట?" వా.

ఆనుపానులు

  • పుట్టుపూర్వోత్తరాలు. జం.
  • "ఆ విషయంలో అనుపానులు తెలుసుకొని నాకు రాస్తే చూస్తాను." వా.

ఆనోటా ఆనోటా

  • కర్ణాకర్ణికగా.
  • "ఆనోటా ఆనోటా పడి వీడి వ్యవహారం నలుగురికీ తెలిసిపోయింది." వా.

ఆపదమొక్కులు సంపద మఱపులు

  • ఆపదలు వచ్చినప్పుడు మొక్కుకోవడం, సంపదలు వచ్చినప్పుడు మఱచిపోవడం మానవనైజ మనుట. సంపదగునుపులు అని కొన్ని ప్రాంతాల వాడుక. జం.

ఆపసోపములు పడు

  • అసురుసు రను; అలయు.
  • "పలుతాపంబున నాపసోపములు చూపట్టంగ నిట్టట్టుగా, నల సెం బంటవలంతి దీని కిక శైత్యప్రక్రియల్ సేయగా వలె......" భద్రాయు. 3. 191.

ఆపాతమధురము

  • వినగానే బాగుంటుంది - తరచి చూస్తే కాదు.

ఆపాతరమణీయము

  • విన్న వెంటనే ఆనందింప జేయునది.
  • సంగీత మాపాతరమణీయమని పెద్దలు చెప్తారు.
  • ఇంతేకాక యిది పైకి బాగా ఆపూ_____ఆపో 121 ఆపో_____ఆబు

కనిపించినా లోతుగా చూస్తే అలా ఉండదు అనే అర్థంలో కూడా ఉపయోగిస్తారు.

  • "ఇది కేవలం ఆపాతరమణీయమైన మాట. ఆలోచిస్తే యిందులో సారం నిస్సారమే అని నీకే తేలుతుంది."
  • చూ. ఆపాతమధురం, అవిచారితరమణీయము.

ఆపూటకు లేని

  • మిక్కిలి పేద యైన.
  • "ఆపూటకు లేనివాడే అంత మిడిసిపడితే యింక ఉన్న వాడిసంగతి చెప్పాలా? వా.

ఆపేరికూర నంజమి

  • ఆపేరే పడదనుట.
  • "భీమధంవుండు దినిన నా పేరి కూర నంజ నే నిది వెలి గాగ నాకు నొక్క." దశకు. 10. 18.
  • చూ. ఆతని పేరికూర నంజు.

ఆపైన దేవు డున్నాడు

  • చేయగలిగింది చేసితి ననుట.
  • "నేను చేయగలిగింది చేశాను. ఆపైన దేవు డున్నాడు." వా.

ఆపోవని

  • సంతృప్తి చెందని.
  • "కోపము నుబ్బును గర్వము, నాపోవని యునికియును దురభిమానము ని, ర్య్వా పారత్వము ననునవి, కా పురుషగణంబు లండ్రు కౌరవనాథా!" భార. ఉద్యో. 1 ఆ.

ఆపోశనము పట్టు

  • సంధ్యావందనాదులలో తర్జనితో చూపుడువేలిని మడిచి ఆ అరచేతిలో ఏర్పడు పల్లములో తీర్థము పోసుకొని మంత్రపూర్వకముగా తీసుకొనుటకు ఆపోశనంఅంటారు. ఆవిధముగా జలమును లోనికి తీసికొను.
  • "బడబాగ్ని వడికి లోపడని పాథోరాశి భోరున గొనియె నాపోశనముగ." కా. మా. 1. 124.

ఆపోశనించు

  • ఆపోశనము గొను.
  • "దివ్యాస్త్రనైపుణి ... ప్రాణములు నాపోశనింపగా నాశించె."
  • వర. రా. యు. పు 240 పంక్తి 13.

ఆప్రొద్దు పొయి రాజనట్టి

  • ఆపూటకుకూడ గడవని (పేద).
  • "ఆప్రొద్దు పొయిరాజనట్టి నిఒర్పేదయు." పాండు. 1. 101.

ఆబాలగోపాలము

  • చూ. ఆబాలవృద్ధాదులు.

ఆబాలవృద్ధాదులు

  • అందఱూ.
  • చిన్నా పెద్దా అంతా అని నేటి వాడుక
  • పండితా. ప్రథ. దీక్షా. పుట. 161.
  • చూ. ఆబాలగోపాలము.

ఆ బుర్రలో విత్తనాలే

  • అదే రకమే అనుట.
  • కూరగాయల విత్తనాల వంటి వానిని సొరకాయ బుర్రలో వేసి ఉంచే అలవాటుపై యేర్పడినది. ఒకేబుర్రలో ఒకరకమైన విత్తనాలే వేస్తారు. ఆభా_____ఆమ 122 ఆమ_____ఆము

ఆభాస్యుడు

  • అపహాస్యపాత్రుడు.
  • అనగా పనికిరానివాడు అనుట.
  • "ఇదేమి సిద్ధి యాభాస్యున కేల చొప్పడు." విక్రమ. 3. 7.

ఆభిచారంబు వేల్చు

  • ఒకరికి చెరుపు సేయుటకై హోమాదులు చేయు.
  • "భూరిక్రియల నాభిచారంబు వేల్చ." పండితా. ప్రథ. వాద. పుట. 688.

ఆభ్యంతరరతి

  • బాహ్యరతికి భిన్నమైన సంభోగము. కుమా. 9. 152.

ఆమంత్రణము వడయు

  • సెలవు తీసుకొను, పొందు.
  • "అతనిచే నాలింగితుండై యామంత్రణంబు వడసి." భాగ. స్క. 1. 233.

ఆమంత్రణము సేయు

  • పిలుచు, సెలవు తీసికొను.
  • "ఆమంత్రణంబు సేసి యంతర్హితుండయ్యె." భార. అశ్వ. 3. 155.

ఆమటపదిట

  • పదామడల దూరంలో.
  • ఇంతపరిధిలో ననుట - దీనిని అనేకరకాలుగా అంటారు. ఆమడ అంటే పదిమైళ్లు. నేటికీ ఈ లెక్క ఉన్నది.
  • "ఆమట పదిట లింగార్చకుం డనెడు నామంబు వినగ రా దేమి కర్మంబొ." బస. 6 ఆ. 155 పుట.
  • "పదామట్లో అంత పండితుడు లేడు."
  • "చుట్టూ పదామడల్లో స్టేషను లేదు."
  • "పది ఆమట్లో పోస్టాఫీసు లేదు. వా.

ఆమని బుగబుగలు

  • అస్థిర మైనవి.
  • వసంతకాలములో మాత్రమే వాసనలు గుబుల్కొను నని వాచ్యార్థము.
  • పాండు. 3. 72.

ఆమవడ

  • పెరుగువడ. పెరుగు గారె.

ఆమశ్రాద్ధం

  • బియ్యం పిండి వగై రాలతో - అన్నంతో వంటతో నిమిత్తం లేకుండా చేసే శ్రాద్ధం.

ఆమాటా యీమాటా

  • ఒక నిర్దిష్ట కార్యాన్ని సూచించేవి కాక లోకాభిరామాయణంగా మాట్లాడుమాటలు.
  • "వాడు ఆమాటా యీమాటా మాట్లాడి పోయాడే కాని ఈ సంగతే చెప్పలేదే?" వా.
  • "మేము ఆమాటా ఈమాటా మాట్లాడు కొంటూండగా నీ సంగతీ వచ్చింది."
  • "ఆమాటా యీమాటా మాట్లాడి వాడు నన్ను బుట్టలో వేశాడు." వా.
  • "ఆమాటా యీమాటా మాట్లాడి వకిటిదాకా వెళ్లి ఆతరవాత అసలు విషయం బయట పెట్టాడు." వా.

ఆము కవియు

  • పొగ రెక్కు.
  • "ప్రామిన్కు నెత్తాము లాముకవియు." పాండు. 2. 152. ఆమూ_____ఆమూ 123 ఆయ______ఆయ
  • "కాఱుపుల్ దిని యాము కవిపి." సారం. 1. 68.
  • "నెఱసంజ యాము కవిసె - "
  • చూ. ఆముకొను.

ఆముకొను

  • బలిసిన.
  • లక్షణయా అతిశయించు.
  • "ఆముకొన్న ప్రేమచే." క్షేత్రయ్య.
  • చూ. ఆముకవియు.

ఆముటెద్దు

  • పొగరు పట్టినయెద్దు.

ఆముదంగాడు

  • పట్టుకొంటే వదలనివాడు.
  • "వాడు వట్టి ఆముదంగాడు. వా డెక్కడ తటస్థపడ్డాడు రా నీకు." వా.

ఆముదం త్రాగినమొగం పెట్టు.

  • నిస్పృహను, చేతకానితనమును స్ఫురింపజేయు.
  • "ఎందుకు రా? అలా ఆముదం తాగిన మొహంపెట్టుకొని కూర్చుని ఉన్నావు?" వా.

ఆముదము రాయు

  • నష్టపెట్టు.
  • "నే నేదో చుట్టపుచూపుగా పోతే నాకు ఆముదం రాశాడు." వా.

ఆముపట్టు

  • అహముపట్టు, పొగ రెక్కు.
  • "వాడికి మహా ఆముపట్టి ఉంది లే." వా.

ఆమూలచూడముగా

  • ఆమూలాగ్రముగా, పూర్తిగా.
  • "ఆమూల చూడముగ నెఱిగింతున్." విప్ర. 4. 40.

ఆయకట్టు

  • సాగుకు లాయి కయినభూమి.
  • "ఆ చెరువుకింద మున్నూరు ఎకరాల ఆయకట్టు ఉంది." వా.

ఆయగాళ్ళు

  • ఊరిలోని వివిధవృత్తులవారు.

ఆయన కాయ నై

  • తనంతకు తానే.
  • "ఆయన కాయనై రణమునందలి కోర్కె నినున్ వరించె." పాండవాశ్వ. 61.

ఆయములు ముట్టుకొను

  • కళ లంటు, మర్మము లంటు.
  • "అంగము లొరసుకొంటూ ఆయములు ముట్టుకొంటా." తాళ్ల. సం. 3. 539.

ఆయపాటున

  • మర్మస్థానంలో.
  • ఆయువుపట్టున అనడానికి వాడుకరూపం.
  • "వాడు ఆయపాటున కొట్టేసరికి వీడు ఠపీమని నేల పడ్డాడు." వా.

ఆయవారపు సంచి

  • బిచ్చపుసంచి.
  • "అంకభాగమునందు నాయవారపుసంచి." జైమి. 7. 197.

ఆయవారము

  • బిచ్చము.
  • "ఆయవారముకంటె నధికకల్యాణంబు పఱిగయెన్నుల ధాన్యభక్షణంబు." భాగ. 7. 410.

ఆయవార మెత్తు

  • బిచ్చ మెత్తు. ఆయ______ఆయె 124 ఆయె______ఆర
  • "ఆయవార మెత్తి అతను చదువుకున్నాడు." వా.

ఆయవ్యయాలు

  • జమాఖర్చులు.

ఆయాసపడు

  • శ్రమపడు.
  • "పనులయెడ నాయాసపడినవారి నెల్ల మిగుల మన్నింపుడు." భాస్క. బాల. 115.

ఆయువు దెగు

  • ఆతుర్దాయము తీరు.
  • "ఆయువు దెగినట్టి జంతువులు సచ్చు." భార. ఆను. 5. 58

ఆయువుపట్టు

  • ముఖ్య మైనది.
  • "కథ కంతా ఆయువుపట్టు ఇక్కడే ఉంది." వా.

ఆయువు మూడు

  • అవసానదశ వచ్చు.
  • "ఆయువుమూడినట్టి సన్యాసికి గట్టె నైదువతన మ్మొక డమ్మకు దక్కువయ్యె బో." నాయకు. 8 పు.

ఆయు వెక్కు

  • ఆయుర్వృద్ధి కలుగు.
  • "ఎల్లవారును గడు నాయు వెక్కి వగయు దెవులు .... లేకున్నారు." హరి. 5. 6.

ఆయె వోయె

  • అయిం దేదో అయింది, పోయిం దేదో పోయింది.
  • "పోనీ నేటికి నాయెబోయె గడు దుర్బుదిన్ విచారింప నేలా?" కా. మా. 2. 123.
  • "నీయంతవాని కిటు లౌ, నా? యాయెంబోయె నిప్పు డైనం దవసిన్, డాయక మీ నా యుసుఱుల, నే యనువున నేటు సేయ సెంచెదఒ యనుచున్." రామకథా. బాల. 4 ఆ.

ఆయె నౌ లే

  • అది సరేకానీ.
  • "ఆయె నౌలే యిది వట్టి శంక." సారం. 2. 22.

ఆరంభశూరత్వము

  • ప్రారంభంలో మాత్రమే పట్టుదల కనబఱచుట.
  • "వాడి దంతా ఆరంభ శూరత్వం. నాలుగు రోజులుపోతే ఏమీ చేయడు." వా.

ఆర గాగు

  • బాగా కాగు.
  • "ఆరం గాగిన పాలమీగడలు హస్తాబ్జంబులం దేవి." హరి. 5. 207.

ఆరగింపు

  • భోజనం; నైవేద్యం, కొంచెం నిరసనగానూ అంటారు.
  • "వాడికి పొద్దున్నే ఆరగింపు అయితే గానీ బయటికి బయలుదేరడు." వా.
  • "స్వామికి ఆరగింపు అవుతున్నది." వా.

ఆరగూరు

  • నిండారు.
  • "అట్లు జనమేజయుడు వగ నారం గూరి." భార. శాంతి. 3. 346.

ఆరటపడు

  • కష్టపడు. ఆర_______ఆరి 125 ఆరి_______ఆరి

ఆరట పెట్టు

  • కష్ట పెట్టు.
  • ఆరటం ఆరాటం అన్న రూపంలో నేటికీ వాడుకలో వినవస్తుంది.
  • పాండు. 4. 289.
  • "వాళ్లు తల్లులూ పిల్లలూ ఎంత ఆరాటపడి పోతున్నారో చెప్పలే మమ్మా!"
  • "ఏమిట్రా ఆ ఆరాటం! కాసేపు ఆగు." వా.

ఆరడిబోవు

  • వ్యర్థ మగు.
  • "రాముని కార్య మారడి బోయె." వర. రా. కిష్కి. పు. 501 పంక్తి 1.

ఆరడుగుల నేల

  • చూ. అయిదుమూళ్ల నేల.

ఆరబండు

  • కలమాగు.
  • "ఒకమాన నారబండిన పండ్లు." భార. శాంతి. 1. 160.

ఆరబట్టు

  • నిందించు, కడిగి ఆరవేయు.
  • "బ్రాహ్మణమత మారబట్టు ములుచ." నాయకు. 15 పు.
  • చూ. ఉతికి ఆరవేయు.

ఆరాటపడు

  • ఆవేదన చెందు.
  • "మన సారాటపడం జేసి కాని రా దుడి గింపన్." కేయూ. 2. 37.

ఆరింద

  • ఆరితేరిన ఆడది, నెఱజాణ.
  • జగ. 41.
  • "ఆపిల్ల్స్ ఏదో ఆరిందాలా మాట్లాడుతుంది." వా.
  • చూ. ఆరిందా.

ఆరిందా గోవిందా అయినట్లు

  • సమర్థునకే శాస్తి అయ్యె ననుట.

ఆరితేరిన ఘటం

  • గడుసరి.
  • "వాడు ఇందులో బాగా ఆరితేరిన ఘటం. వాడిదగ్గర నీ ఆట లేమీ సాగవు." వా.

ఆరితేరు

  • గడిదేరు. డక్కా మొక్కీలు తిను.
  • "హరుకంటి సెగ కోర్చి యారి తేరిన మారుడు." విజయ. 3. 25.

ఆరినపుండ్లు కోలలను గెలికిన క్రియ

  • మఱచినబాధను తిరిగీ జ్ఞప్తికి తెచ్చుపట్ల అనే సామ్యం. మానిపోయిన పుండును సూదితో కెలికినట్లు.
  • పండితా. ద్వితీ. మహి. పుట 169.

ఆరివేరము

  • కలహప్రియత్వము.
  • "గగనముననుండి వచ్చె నాకస్మికముగ నారివేరంపుదపసి దైత్యారికడకు." పారి. 1 ఆ.

ఆరివేరము చేయు

  • గందరగోళము చేయు.
  • "..... తల్లియస్థుల కొకమాట పాపకర్ముండు చెం చర్థభార మనుచు ఆరు______ఆరు 126 ఆరు______ఆరు

వంచనాపాటవంబున గొంచు బోయి యారివేరంబు చేసినకారణమున." కాశీ. 5. 68. ఆరుదూఱు

  • అల్లరి, నింద.
  • "వాడు ఆరుదూఱు చేసెనే." క్షేత్రయ్య.
  • "వారక యత్తగారికనుబ్రామి నిజేశ్వరు మోసపుచ్చి యే, యారును దూఱు నైన బడి యెందఱు... కోరిననాథునిం గలిసి కొల్లలుగా సుఖ మంద రన్న." అహల్యా. 3. 33.
  • "వారి కెవ్వారికి లేనియారుదూఱు నీ తలనె వ్రాసెనే ధాత." అహల్యా. 3. 46.

ఆరు నూరయినా నూరు ఆరయినా...

  • ఏది ఏమయినా అనుట.
  • "ఆరునూ రయిన వెనుకాడను." రుద్రమ. 42 పు.
  • "ఆరు నూరయినా నూరు ఆరయినా యీ పెళ్లి జరిగి తీరవలసిందే." వా.

ఆరునెలలు బేరము

  • త్వరగా తెమలనిది.
  • "వాణ్ణి పిలుచుకొనిపోతే యీ పని తెములుతుందా? వాడి దంతా ఆరు నెలల బేరం." వా.

ఆరున్నొకటి

  • ఏడు.
  • ఏడు అనుట అమంగళసూచక మని కొలచడం, తూచడం వగైరాలలో ఆరున్నొకటి అనడం వాడుక.

ఆరున్నొక్కరాగం తీయు

  • ఏడ్చు.
  • "మా అబ్బాయి అప్పుడు ఆరునొక్క క్క రాగం తీశాడు." వా.
  • చూ. ఆరునొక్క రాగం లంకించు కొను.

ఆరునొక్కరాగం లంకించుకొను

  • చూ. ఆరునొక్క రాగం తీయు.

ఆరుబత్తుల కంపెనీ

  • దివాలాకోరు ముఠా.
  • అర్బత్ నాట్ కంపెనీ దివాలా తీయడం ప్రసిద్ధం. అందుపై తరువాత యేర్పడిన పలుకుబడి.

ఆరుమూడు చేయు

  • పని చెడగొట్టు.
  • కలువాయి. 29.

ఆరు మూడైనా మూడు ఆరైనా

  • ఏమైనా సరే అనుట.
  • "ఆరు మూడైనా మూడు ఆరైనా ఆ ఊరికి నేను ఈ రాత్రి వెళ్ళడం తప్పదు." వా.
  • చూ. ఆరునూరయినా నూరుఆరయినా.

ఆరుస్తావా తీరుస్తావా ?

  • నీ కెందుకు ఈ సంగతి అనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • "నీ కెందుకులే అవన్నీ. నీ వేం ఆరుస్తావా? తీరుస్తావా?" వా.
  • చూ. ఆర్చెదొ తీర్చెదో. ఆరూ_____ఆర్చి 127 ఆర్చి_____ఆర్ప

ఆరూ పోరూ

  • పోరుట, గోకుట. జం.
  • ముఖ్యంగా అత్తింటివారిపోరు.
  • "ఆవిడది ఆరూ పోరూ లేనిసంసారం." వా.

ఆరూ మూడూ అట్లపిండి అగు

  • చెడిపోవు అనే అర్థంలో ఉపయోగించే పలుకుబడి.
  • "ఆపని అంతా ఆరూ మూడూ అట్లపిండి అయిపోయింది." వా.

ఆరోగణము

  • భోజనము (కన్నడం - ఆరోగణ) నై వేద్యము.
  • చూ. ఆరోగిణము.
  • "హరునకు నిత్యంబు గరికాలచోడ నరపతి యారోగణము నెమ్మి జలుప బలకల నేఱినప్రాసంగుంబ్రాలు..."
  • బస. 5. 143 పుట.

ఆరోగ్యం మహాభాగ్యం

  • ఆరోగ్యం మొదట చూచు కోవాలి అని చెప్పవలసి వచ్చినపుడు అనేమాట.
  • "మరీ అంత రాత్రింబవళ్లు పని చేస్తే ఎట్లా రా? ఒళ్లు చెడదూ? ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు." వా.

ఆరోగ్యస్నానం

  • జబ్బుపడి లేచిన తర్వాత చేసే మొదటి స్నానం.
  • "నిన్న నే ఆరోగ్యస్నాం చేశావు. అప్పుడే బయటికి ఎందుకు వెడతావు బాబూ!" వా.

ఆర్చి తేళ్ళ దలబెట్టు

  • అనవసరంగా బాధించు, గుట్టు బయట బెట్టు.
  • "ఏల చలంబు నీ వడిగెదేని వచించెద నాదు గోప్యమున్, బేలవె యార్చి తేళ్ల దలబెట్ట..." ప్రభా. 3. 147.

ఆర్చి పేర్చి

  • సింహనాదం చేసి, విజృంభించి.
  • "ఆర్చి పేర్చి మారు డారీతి సేయంగ." చంద్ర. విలా. 2. 42.

ఆర్చు తీర్చు

  • ఊరార్చు.
  • "ఆర్పగ దీర్పగ మిక్కిలి, నేర్పు గలవయస్యలట్లు నెలతయు మీ మీ, నేర్పున బలికెద రక్కఱ, యేర్పడ మీ కీ విచార మేటికి జెపుడా." ఆము. 5. 65.

ఆర్చెదో తీర్చెదో

  • ఆరుస్తావా తీరుస్తావా? నీకు చెప్పీ యేమి ప్రయోజనం అనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • "ఆర్చెదొ తీర్చెదో తెలుప నయ్యెడి దేమి?" సారం. 3. 184.
  • చూ. ఆరుస్తావా తీరుస్తావా?

ఆర్చేవారా తీర్చేవారా?

  • ది క్కెవరూ లే రనుట.
  • "ఏదో అవస్థ పడుతున్నాను. ఎవరితో చెప్పుకొని ఏం లాభం? ఆర్చేవారా? తీర్చేవారా?" వా.

ఆర్పగ దీర్పగ

  • ఆర్చుటకూ తీర్చుటకూ సమర్థమైన.
  • "ఆర్పగ దీర్పగ మిక్కిలి నేర్పుగలవయస్యు డట్లు." ఆము. 5. 65. ఆర్వే______ఆఱ 128 ఆఱ_____ఆల

ఆర్వేరము

  • చూ. ఆరివేరము.

ఆఱగలదీపము మండినట్లు

  • ఆరిపోయేముందు దీపం విపరీతంగా వెలుగుతుం దని అంటారు. దానిపై వచ్చిన పలుకుబడి.
  • చావు తెలివి వంటిది.
  • "ఆఱంగలదీపము ట్లతడు మండుం గాక." భార. కర్ణ. 3. 49.

ఆఱడిచావు

  • దుర్మరణం, చెడు పేరుతో చావు.
  • "కుసుమాయుధు నాఱడిచావు చూచి." కుమా. 5. 80

ఆఱడి తెచ్చు

  • నింద తెచ్చు.
  • "అనఘుని ధర్మపత్నికి నహల్యకు నాఱడి దే దలంచి." విప్ర. 3. 48.

ఆఱడిపడు

  • అల్లరిపడు.
  • చూ. ఆఱడిపుచ్చు.

ఆఱడిపుచ్చు

  • 1. వ్యర్థపఱుచు.
  • 2. బాధించు.
  • "ఆఱడి చేసి నా తగుల మాఱడిపుచ్చంగ నేల బేల!" విరా. 2. 253.
  • "న న్నిటు గానపాలు చేసి యాఱడి పుచ్చితి." నిర్వ. 9. 88.

ఆఱడి పెట్టు

  • అల్లరిపెట్టు, బాధ పెట్టు, వ్యర్థము చేయు.
  • "నామనసు మోహము కాఱడి వెట్టి నీవు న న్నొల్లక వీడ నాడెదవు." వి. పు. 2. 233.

ఆఱడిపోవు

  • వ్యర్థమగు.
  • లక్షణయా చచ్చు, పాడగు, భగ్న మగు అనే అర్థాలలో ఇది ప్రయుక్త మవుతూ వుంటుంది.
  • "అనవుడు గృష్ణు డిట్టులను నాఱడి వోయె బ్రయత్న మెల్ల." భార. అశ్వ. 3. 59.
  • "హా! పుత్రవర్గ మిటు లాఱడి వోవ." భార. స్త్రీ. 1. 10.

ఆఱు నూఱైనా నూఱు ఆఱైనా

  • ఏది యేమైనా అనుట.
  • రూ. ఆరుమూడైనా మూడు ఆరైనా.

ఆఱు మూ డగు

  • చెడిపోవు.
  • "ఆపని అంతా ఆరుమూడు అయి పోయింది." వా.

ఆలగోడు బాలగో డగు

  • కరుణాక్రందనపూరిత మగు. ఆవులగోదు, బాలలగోడు - ఆవులూ, పిల్లలూ అతికరుణంగా విలపిస్తారు కడా!
  • "అతగాడు పోయేసరికి వాళ్ల యిల్లంతా ఆలగోడూ బాలగోడూ అయిపోయింది." వా.

ఆలగోడు బాలగోడుగా ఉండు

  • అతిశోచనీయస్థితిలో ఉండు.
  • "పాపం! వాళ్లింట్లో నిన్న రాత్రే ఆల_____ఆల 129 ఆల_____ఆలి

హఠాత్తుగా ఆయనభార్య చనిపోయిందట. అంతా ఆలగోడూ బాలగోడుగా ఉంది." వా. ఆలనా పాలనా లేదు

  • చూచేవా రెవరూ లే రనుట.
  • "ఆతోట ఆలనా పాలనా లేక పాడయి పోయింది." వా.

ఆపపాడి

  • పాలిచ్చు ఆవులకలిమి.
  • మేకపాడి వంటిది. పాండు. 2. 111.

ఆల బేల

  • అమాయకురాలు. జం.
  • "ఆలపు బేలపు కడు గొమరాలవు..." కుమా.

ఆలము చేయు

  • ఉపేక్ష చేయు.
  • "అని పలుకు నమ్మరాళలోలనయన పలుకు లాలంబు సేసి చక్రవాకి యిట్లనియె." మను. 6. 68.

ఆలము సేయు

  • వ్యర్థపఱచు, గాయపఱచు.
  • "కూర్మి యెల్ల నే డాలము సేసి." కుమా. 11. 55.

ఆలవట్ట మిడు

  • గుడ్డతో గుండ్రముగా కూర్చిన విసనకఱ్ఱతో వీచు. ఇప్పటికీ దేవాలయాలలో దేవునిముందు ఊరేగింపులలో పట్టుకొని పోతారు. వీని పిడికఱ్ఱ చాలా పొడవుగా ఉంటుంది.
  • "మృగాక్షు లాలవట్టంబు లిడ." భార. స్త్రీ. 2. 38.

ఆలవట్టము

  • వస్త్రంతో గుండ్రంగా తయారుచేసిన విసనకఱ్ఱ; ఆలయోత్సవాలలో, రాజోపచారాలలో ఉపయోగించే గుడ్డ గొడుగు.
  • "ఆలవట్టములు జామరులు...."
  • పండితా. ప్రథ. వాద. పుట. 518.
  • "మృగాక్షు లాలవట్టంబు లిడ..." భార. స్త్రీ. 2. 38.
  • "కమలదళము మృణాళకాండమున జెర్చి, యాలవట్టంబు గావించి లీల మెఱయ, విసరు-" నిర్వ. 8. 62.
  • "అచ్చరవిరిజోడు లాలవట్టము లూన, విను టెంకిచెలులు వీవనలు వైవ." అచ్చ. సుంద. 35.

ఆలించి విను

  • శ్రద్ధగా విను, సావధానంగా విను.
  • "రతిరోదనధ్వని వసంతకు చెవులం జిలికిన నులికిపడి యద్దెస యాలించి విని." కుమా. 5. 87.

ఆలిగొను

  • పరిహసించు.
  • "అకట! సైరంధ్రి నన్ను నిట్లాలి గొనగ, నేల." భార. విరా. 4. 18.
  • చూ. ఆలిబుచ్చు.

ఆలిబుచ్చు

  • పరిహసించు.
  • చూ. ఆలిగొను. ఆలి______ఆలె 130 ఆలే______ఆళ

ఆలిసేయు

  • వ్యర్థము చేయు.
  • "శూలి చేసినతప మెల్ల నాలి సేసె." కుమా. 4. 409.

ఆలూ చూలూ లేదు

  • భార్యాపిల్లలు లేరు.
  • కాస్త నిరసనగా వానికి యేమీ లేదు అనుపట్ల ఉపయోగిస్తారు.
  • "ఆలూ చూలూ లేనివా ణ్ణెవడు నమ్ముతారు రా?" వా.

ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం

  • అస లింకా ఆరంభం కాక ముందే ఫలితాన్ని గూర్చి ఉవ్విళ్లూరేపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • "ఉద్యోగానికి దరఖాస్తు పెట్టావో లేదో అప్పుడే యింక్రిమెంటు లెక్క వేస్తున్నా వేమిట్రా? ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నాట్ట." వా.

ఆలెగాడు

  • నౌకరు. శ,ర.
  • ఆయగాడు అనే వాడుకలో వినబడుతుంది.

ఆలె(ల)పొయ్యి

  • స్నా నానికి నీళ్లు కాచు పొయ్యి. దీన్ని సామాన్యంగా ఒక బిందో కాగో పెట్టి చుట్టూ కట్ట కట్టివేసి ఉంటారు. ఆ బిందె తీయుటకు రాదు. దానిని ఆలపొయ్యి అని నేడు అంటారు.

ఆలేకార్లు

  • అధికారులు, ఆఫీసర్లు.
  • నిత్యబహువచనము.
  • "సర్కారు సిబ్బంది సరి చేయుటకు గొంత, సాలు జమాబందిపాలు గొంత, పొరుగూరి మన్నీల సరఫరా కింత యా, లేకార్ల లంచాలలోకి కొంత... కొంత కొంతయె ఖర్చు కొండంత యయ్యె." పెన్నే. 2.

ఆలోకనవిద్య

  • ఇంద్రజాలము.

ఆళ(ల)తి సేయు

  • ఝంకారము చేయు (తుమ్మెదల విషయంలోనే ఈ పదం కనబడుతుంది) అందుతో పాట పాడు, ఆలపించు అన్నట్లు మారింది.

          "ఆడెడు నమ్మి గనొనకు మమ్మ బయ
           ల్పడ నాడుచిల్కతో, నాడకు మమ్మ,
           తేటిగెడ నాళతి సేయకు మమ్మ."
                                    కుమా. 5. 131.

         "సోలుచు సమ్మదరసముం, గ్రోలుచు,
           వనపాల బాలికలు నవలతికాం, దోల
           ముల వేడ్క సలుపుచు, నాళతు లొగి
           జేసి పాడి రభినవలీలన్."
                                  కుమా. 4. 112.

         "కో, యిలల యెలుంగు లోలి గొని
          యింపుగ జిల్కలతోడ నెమ్మిమై, నల
          వడి మాటలాడి యళు లాలతి సేయగ
          బాడి డాగురిం, తలు హరితోడ నాడు
          దురు తద్వనవీధులయందు గోపికల్."
                                 హరి. పూ. 8.35.

ఆళు_____ఆవ 131 ఆవ______ఆవ

ఆళులపొల్లలు

  • ఆడు పోడుములు, స్త్రీ రీతులు.
  • "పొడువు నూడ మగల పొల్లలు నాళుల పొల్లలును నిజంబపోలె నుండు." కుమా. 11. 46.
  • చూ. మగలపొల్లలు.

ఆవంత

  • కాసంత, కొంచెం అనుట.
  • "ఆవంత శంక లేక." భార. కర్ణ. 3. 288.

ఆవగింజలో అరభాగ మైనా

  • ఏకొంచెం కూడా.
  • "ఆవగింజను నరభాగ మైన గాదు." పాణి. 2. 11.

ఆవగింజలో అరసగము కాలేదు

  • కొంచెముకూడా కాలేదు.
  • ఆవగింజ అతి చిన్నది.
  • "ఇంకా ఆవగింజలో అరసగం కూడా కాలేదు. అప్పుడే ఏదో కొంప మునిగి పోతుం దని గోల పెడతా వేమిటోయి!" వా.

ఆవటము చేయు

  • అమర్చు, పొందుపఱచు.
  • "వర దాభయంబు లావటము చేసి." పాండు. 2. 229.

ఆవడ

  • పెరుగువడ.

ఆవ తాగిన పసరమువలె

  • పిచ్చెత్తినట్లు అనుట.
  • చూ. ఆవ ద్రావినట్లు.

ఆవ దిన్నట్లు

  • కడుపులో ఆవాలు పోసు కొన్నట్లు.
  • ఎక్కువ దిగులునూ శోకాతి రేకాన్నీ తెలియజేసే పలుకుబడి.
  • "ఆవదిన్నట్లు ఖేదావహం బయ్యె."
  • వర. రా. అయో. పు. 380. పంక్తి 6.

ఆవ ద్రావినట్లు

  • కడుపులో చేయి వేసి కలచినట్లు.
  • ఆవాలు నూరి త్రాగితే కడుపులో విపరీత మైనఆరాటం కలుగుతుంది.
  • "ఆవ ద్రావిన జోక నటమటిల్లు." రాధి. 3. 120.
  • చూ. ఆవతాగినపసరమువలె.

ఆవల నీవలన్

  • అక్కడక్కడా, అక్కడా యిక్కడా.
  • వాడుకలో అక్కడా ఇక్కడా అనేరూపమే నిలిచి ఉంది.
  • "ఏనావల నీవలన్ విని." విక్ర. 5. 15.
  • "వా డేదో బాగా సంపాయించా డని అక్కడా యిక్కడా అంటూండగా విన్నాను." వా.

ఆవలింపులు వచ్చు

  • విసుగెత్తు.
  • "వాడి ఉపన్యాసం వింటూంటే నాకు ఆవలింపులు వస్తున్నాయి." వా.
  • చూ. ఆవులింతలు వచ్చు. ఆవ_____ఆవు 132 ఆవు_____ఆశ

ఆవలిమో మిడు

  • అయిష్టము సూచిస్తూ మాఱు మొగము పెట్టు.
  • "ఆవలిమో మిడి తా గ్రోలె." విప్ర. 2. 68.
  • చూ. మాఱుమో మిడు.

ఆవిడ

  • భార్య; ఆమె.
  • "మా ఆవిడ దీనికి సుతరామూ ఒప్పుకోవడం లేదు." వా.
  • " మీ ఆవిడతో చెప్తాను ఉండండి. మీ రేమో మహా ఖర్చు పెట్టేస్తున్నారు." వా.
  • "ఆవి డెవరు?" వా.

ఆవుగోవు

  • సాధువు.
  • "ఆయన దేముంది పాపం ! ఆవుగోవు."

ఆవును చంపి చెప్పులు దానం చేయు

  • అల్ప మైన మంచిపని కోసం మహాపాపానికి ఒడిగట్టు.
  • "వాడు ఆవును చంపు చెప్పులు దానం చేస్తాడు. ఏమి లాభం?" వా.

ఆవురు మను

  • వాపోవు.
  • కొత్త. 303.

ఆవుర్న నోరు దెఱచు

  • ఆవురు మని నోరు తెఱుచు. క్రీడా. పు. 73.

ఆవులాంటివాడు

  • సాధువు.
  • "ఆయన కే పాపం తెలియదు. ఆవులాంటివాడు." వా.

ఆవులింతలు వచ్చు

  • చూ. ఆవలింపులు వచ్చు.

ఆవులిస్తే ప్రేవులు లెక్క పెట్ట గల

  • అతినిశితబుద్ధి అయిన; ఎదుటి వానిసత్తాసారం గ్రహించగల.
  • "వాడు ఆవులిస్తే ప్రేవులు లెక్క పెట్ట గలవాడు. వాడిదగ్గర మన ఆట లేవీ సాగవు." వా.

ఆవులు తలచినచోట పూరి మొలిచినట్లు

  • చక్కని సౌకర్యం ఏర్పడిన దనుట. ఆవులు మఱొక చోటికి వెళ్ళకుండా అనుకున్న చోటనే పచ్చిక మొలిస్తే మఱిం కేమి?
  • పండితా. ప్రథ. పురా. పుట. 387.

ఆవులువారు

  • అలసిపోవు, ఆవులింతలు వచ్చు స్థితికి వచ్చు.
  • "ఆవులువారెడిమేని అలుపులతోడ." తాళ్ల. సం. 3. 403.

ఆవేశకావేషాలు

  • కోపోద్రేకాలు. జం.
  • "ఆవేశకావేషాలు పెచ్చు పెరిగి ఆఊళ్లో ఖూనీలు జరిగా యట." వా.

ఆశకు మట్టు లేదు.

  • ఇంత ఆశ అయితే ఎలా అనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • బాణాల. కాళ. 10. ఆశ______ఆస 133 ఆస______ఆసు

ఆశపాతకం మనిషి

  • దురాశాపరుడు.
  • "వాడు ఒట్టి ఆశపాతకం మనిషి. ఏ మిచ్చినా వానికి తృప్తి అ నేది ఉండదు." వా.

ఆశాశల ద్రిప్పు

  • అటు ఇటు, ఇటు అటు త్రిప్పు, ఆశ పెట్టి త్రిప్పు.
  • "ఏయ విచారించిన దూటి దాటుకొని త న్నాశాశలం ద్రిప్పి." కా. మా. 3. 60.

ఆషాఢభూతి

  • హితవంచకుడు.
  • అమాయకంగా కనబడుతూ ద్రోహం చేసేవాడు.
  • పంచతంత్రంలోని కథపై వచ్చినపలుకుబడి.

ఆషామాషీ

  • కులాసాకబుర్లు.
  • "ఏదో ఆషామాషీ గా మాట్లాడుకొంటూ ఉంటే నీ ప్రస్తావన వచ్చింది. నే నేదో ఒక మంచిమాటే వేశాను మరి!" వా.

ఆసపడు

  • ఆసించు.
  • "అతని నాసపడి పలుకుచుండిరి." భార. ద్రోణ. 1. 17.
  • "పరకాంతలకు నాసపడనివాడు." జైమి. 3. 40.

ఆసవిఱుపు

  • ఆశాభంగము కలుగజేయునది.
  • "యాచకకోటుల కాసవిఱుపు." శుక. 3. 20.

ఆస సేయు

  • ఆశించు.

                "వెండియుం గడుసరి దానవులు మిసిమి
                 గలపసిడి కాసచేసి పడద్రోసి గాసిం
                 బఱచినప్రాసాదంబులును."
                                       ఉ. హరి. 1. 53.

  • "అల్లన దెమలింప నాస సేయుటయు." గౌ. హరి. ప్రథ. పంక్తి. 978.

ఆసాన నఱ్ఱాడు

  • మిక్కిలి ఆశతో వేకారు.
  • "పరువంబు గాక చొప్పడని మామిడి తేనె, లాన నాసాస నఱ్ఱాడునవియు!" పారి. 3. 51.

ఆసాసల

  • ఎక్కువ ఆశతో.
  • ఈ ద్విరుక్తి ఆధిక్యమును తెలుపును.
  • "బ్రమసి యాసాసల రసవాదము లొనర్చి, ప్రకటించి రాజపట్టికలు దీర్చి." శుక. 3. 372.

ఆసాంతము

  • పూర్తిగా.
  • "ఆవల నెత్తివత్తు రాసాంత మూడ్తురు." నాయకు. పు. 108.

అసీమాంతం చేయు

  • సాగనంపు.
  • పొలిమేరదాకా సాగనంపే అలవాటుపై వచ్చినపలుకుబడి.

ఆసువోసిన కండెవలె

  • ఒకచోట నిలువక. ఆసు____ఆస్తీ 134 ఆస్థా____ఇంక

ఆసువోసిన కండె అటూ ఇటూ ఆగకుండా తిరుగుతూ ఉంటుంది. ఆసు వోసెడుదాని హస్తంబురీతి

  • ఒకచోట నిలువక.
  • నేతపనిలో ఆసు పోయునప్పుడు చేయి అటూ ఇటూ గబ గబా తిరుగుతుంది.
  • "ఆసు వోసెడుదాని హస్తంబురీతిని, గుంచె దీసెడుదాని కొమరు మిగుల." హంస. 1. 220.
  • చూ. ఆసు వోసినకండెవలె.

ఆసేతుశీతనగం

  • చూ. ఆసేతుహిమాచలం.

ఆసేతుహిమాచలం

  • సేతువు మొదలుకొని హిమవత్పర్వతంవరకూ, యావద్భారతదేశంలోను అనుట.
  • ఇదే పలుకుబడి ఆయా పదాల పర్యాయపదాలతో కూడా మన కావ్యాలలో ప్రయోగిస్తారు.
  • చూ. ఆసేతుశీతనగం. జం.

ఆస్తిపాస్తులు

  • "వానికి ఆస్తిపాస్తు లేమీ లేవు. ఆ ఉద్యోగం ఉంది. వాడున్నాడు." వా.
  • చూ. ఆస్తి పాస్తీ.

ఆస్తీ పాస్తీ

  • ఆస్తి. జం.
  • "వాడికి ఆస్తా పాస్తా? ఏమీ లేదు."
  • "వాడి కింత ఆస్తీపాస్తీ ఉంది. తాను తినగలడు. ఒకరి కింత పెట్టగలడు." వా.

ఆస్థాన మగు

  • ఉండు; కొలు వుండు
  • "సువర్ణ కుంభయుతసౌధంబందు నాస్థాన మై." పాండు. 1. 21.

ఆహా పుట్ట జేయు

  • ఆశ్చర్యము కలిగించు.
  • "ఆహా పుట్టెడు లాతి చూపఱకు హాహా పుట్టు మీవారికిన్." భార. శల్య. 2. 248.

ఆహావుట్టిపడు

  • ఆశ్చర్యపడు.
  • "పౌరకమలేక్షణ లాహా వుట్టి పడిన యట్లన్, దేవుని గన మఱచి యిట్లనిరి తమలోనన్." శుక. 2. 16.

ఆహివెట్టు

  • కుదువపెట్టు ; తాకట్టు పెట్టు. తాళ్ల. సం. 10. 142.

ఇంక ఎక్కడ?

  • ఇంక వాని ప్రస్తావనకే ఆస్కారం లేదు అనుపట్ల ఉపయోగిస్తారు.
  • "కటాకటా ఇంక నెక్కడ చోడనృపతి, కటకటా యింక నెక్కడి వెల నాడు."
  • పండితా. ద్వితీ. మహి. పుట. 51.
  • "వాన రాలేదు. ఇం కెక్కడిపంటలు." వా.
  • చూ. ఇంకేమి?