పదబంధ పారిజాతము/అడి
అడ_____అడి 41 అడి_____అడి
- "అరహతముని వోయి యడవుల గలసె." బస. 6. ఆ. 165 పుట.
అడవులపా లగు
- చెల్లాచెద రయి పాఱిపోవు.
- "ఆ కలకలమున జిత్తం బాకులతం బొంద దొంగ లడవులపా లై."
- కా. మా. 4. 104.
అడవుల వెన్నెలలు
- పైపై తళుకులు.
- తాళ్ళ సం. 5. 24.
అడసాల
- వంటశాల.
- అడ, అడు, అడి - వంట అన్న అర్థంలో కన్నడమున ప్రచురంగా ఉన్న పదాలు. అడసాల, అడబాల ఇందులోనుండి వచ్చినవే.
అడవులుపట్టు
- దేశంమీద పోవు.
- "ఆ యజమాని కాస్తా గటుక్కు మనే సరికి ఆకుటుంబం అంతా అడవులుపట్టి పోయింది." వా.
అడావడి చేయు.
- హడావుడి చేయు.
- "తొడలయందం బడావడి నొనర్ప." శ్రవ. 3. 25.
అడిగంట్లు
- అడుగులూ బడుగులూ.
- "ర, త్నాకర రత్న రాసు లడిగంట్ల." కవిక. 1. 11.
అడిగండ్లు మడిగండ్లు
- అడుగు బడుగూ.
- మిగులూసగులూ అనుట. జం.
- "అడిగండ్లు మడిగండ్లు తిరిప మిడెడు కటికిదేబె లెల." వేమన.
- శ. ర. లో అడుగు కండ్లు అనుకొని అడుగున నిలిచిన రాళ్లు అని అర్థ మిచ్చుట సరి కాదు.
అడిగఱ్ఱ
- పాదదాసుడు.
- "హరగణంబుల కెల్ల నడిగఱ్ఱ ననిన." ప్రభు. 8. 188.
అడిగించుకొను
- ఒకరితో నీతి చెప్పించుకొను, ఒకరు అనుటకు వీలుగా తప్పు దారి నడుచు.
- "విన్నావొ వినవొ నీతి స, మున్నతు లడిగించుకొనగ నొప్పనివి ధరన్." నిరం. 3. 25.
అడిగి కొను
- బ్రతిమాలు.
- "అడిగికొన్నను మొగం బిడనీనిచెక్కిళ్లు ప్రేమ దీఱగ ముద్దుపెట్టి పెట్టి." కవిరా. 5. 188.
- "ఇట్లా చేయవద్దురా అని ఎన్నోవిధాల అడుక్కొన్నాను. వాడు వింటేనా?" వా.
అడిగినయంతలోన
- అడిగినదే తడవుగా, వెంటనే.
- "అడిగినయంతలోన సరసాన్నములన్ సమకూర్చు." పారి. 1. 61.
అడిగేవాడు లేడు.
- అడ్డుపెట్టువా రెవ్వరూ లేరు. అడి_______అడి 42 అడి_______అడి
- ప్రశ్నించేవా రుండరు. ఏమి? అని అనేవా రుండరు.
- "ని, న్నడిగెడువా డుండడు ప్రొ, ద్దుడిగిన బయనింపు మించు కోపిక గలుగున్." క్షేత్ర. పు. 37.
- చూ. అడిగేవాళ్లు పెట్టేవాళ్లు లేరు.
అడిగొట్టు
- కుచ్చితుడు.
అడిచిపడు
- మిడిసిపడు.
- చూ. అడిచిపాటు.
- "నీకు వృద్ధసేవ లేకున్కి యెఱుగంగనయ్యె రిత్త యిట్టు లడిచిపడుటం, బట్టి."
- భార. కర్ణ. 3. 71.
అడిచినుకు పొడిచినుకు
- కొద్దిగా పడువాన.
అడిచిపాటు
- మిడిసిపాటు.
- త్వర, తొందర అని నిఘంటువులలోని అర్థము సరి కాదు.
- "సమర ము పేక్షించి శాంతిమై నుండెద నడిచిపా టేటికి."
- భార. భీష్మ. 3. ఆ.
- "జడనిధిచందంబున ని,మ్మడు వొప్పంగ నిప్పు డేమి మాడెను నిమ్మై, నడచిపడ రిత్త నెవ్వగ, లుడుగుడు మఱి చూచు కొంద మొయ్యన తఱిలోన్."
- భార. శాంతి. 3. ఆ.
- "అడిచిపడు నాజ్యహోమ మంత్రాహుతులకు."
- శృం. నైష. 4. ఆ.
అడిత్రావు (గు) డనక
- తక్కువతిండి అని చూడక.
- "అడిత్రాగు డనక యిప్పటి, కడిదికి నేమాంస మైన గ్రక్కున గొనిరం డెడసేయక..."
- నారా/ పంచ. 1. ఆ.
అడితిదారు
- అడితి పుచ్చుకొని సరు కమ్ము వాడు.
- చూ. అడిసాటా.
అడిదపు మెకము
- ఖడ్గమృగము.
అడిబంటు
- సేవకుడు, కాపలావాడు.
- "ఆమని యింద్రియముల కడిబంటను."
- తాళ్ళ. సం. 7. 246.
అడిబండ
- అధముడు.
- ఒక తిట్టు.
అడిబీరపుతులువ
- డంబాచారపు మనిషి, వట్టి బీరములు పలుకువాడు.
- "అడిబీరపు తులువ గెలుచు నటె పాండవులన్."
- భార. ద్రో. 4. 184.
అడిబీరము
- శుష్కప్రతాపము.
- భార. ద్రో. 4. 184.
అడియండ
- నమస్కారము, దాసోహమనుట. అడి - కాలు (అడి+అండ) అడియేన్ వంటిది.
- "దండంబు దర్పితోద్దండరక్షోహర్త కడియండ జాతరూపాంబరునకు."
- రుక్మాం. 1. 123. అడి______అడి 43 అడి_______అడు
అడియడు
- పాద సేవకుడు.
అడియరి
- సేవకుడు, నీచుడు.
- "అడియరితనమున న ప్పాండవుల నాశ్రయింపజాల." భార. సౌ. 1. 7.
- "అడియరి యై తా భోగార్థముగా దాచిన." విజ్ఞా. అచా. 87.
- "అటమటీని తోడ నడియరితోడను వెలకు నెత్తమాడ వెరవు గాదు."
- ఉ. హరి. 3. 112.
అడియాలము
- సంకేతము, ఆనవాలు.
- దక్షిణాంధ్రంలో ఇది వాడుకలో నేటికీ ఉన్నది. *రూపాం) అడయాళము. ఇది కన్నడంమాట.
- "అందరకు సంజ్ఞలు నడియాలంబులుం గల్పించి."
- భార. భీష్మ. 1. 122.
- "వాడు దొంగిలించినా డనడానికి అడియాళం ఏమీ దొరకలే దట." వా.
అడియాస
- పేరాశ.
- "అక్కట! మోసపోయి యడియాసల జావక యున్న దాన."
- భార. విరా. 2. 226.
- "సామ్యముల గోరక పొ మ్మడియాస లేటికిన్." భార. అర. 4. అ.
- "వాడి వన్నీ ఒట్టి అడియాసలు." వా.
అడివి మేళం
- అమాయకురాలు. ఏమీ తెలియనిది అనుట.
- "ఆవిడ ఒట్టి అడివి మేళం. దాన్ని కట్టుకొని ఏం చేస్తావు?" వా.
అడిసాటా
- కమిషను వ్యాపారము. అడితిగొని చేయు వ్యాపారము. అరసట్టా, సట్టా వ్యాపారం అని నేటివాడుక.
అడిసిగ్గులు
- నునుసిగ్గులు. తలవంచుకొన జేయుసిగ్గులు. ఇందులోని అడికూడా కాలే, కాళ్లు చూచుకొనుట. తల వంచుకొనుట ఒకటే కదా.
- "అడిసిగ్గులు తమకంబులు నుడివోవగ." యయాతిచరిత్ర.
అడకులు దిన్న ట్లగునే కడుపున గుట్టెత్తినపుడు
- చేసినప్పటికంటె దానిఫలితం అనుభవానికి వచ్చినప్పుడు తెలుస్తుంది అనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
- "అడుకులు దిన్న ట్లగునే కడుపున గుట్టెత్తినపుడు గడు బఱచితి."
- భార. ద్రోణ. 4. 89.
అడుక్కు తిను
- ఒకతిట్టు, కోపంతో ఎక్కడో దేబిరించు అనుట.
- "చదువుకోక పోతే అడుక్కు తింటాడు."
- "ఇంతసే పెక్కడ అడుక్క తింటున్నావురా." వా.
అడుక్కొను
- ప్రాధేయపడు.
- "జనని యడుక్కొని చదువుకో అడు_______అడు 44 అడు_______అడు
బొమ్మన్న వినక వేమఱు వెక్కి వెక్కి యేడ్చు." హంస. 3. ఆ. 142.
- "నామాట వినరా అని యెంత అడుక్కున్నా వాడు విన లేదు." వా.
- "పెద్దవాణ్ణి అడుక్కుం టున్నాను. ఇక అక్కడికి వెళ్ళకు." వా.
అడుక్కొని తిను
- చూ. అడుక్కు తిను.
అడుగంటు
- 1. ఇంకిపోవు, తఱుగు, నశించు.
- 2. అన్నము మొదలగునవి మాడిపోవు.
- "లేకి నిధవ్రజంబు, లవలేశము కాంచన భూధరంబు ర,త్నాకరరత్న రాసు లడుగంట్లు......పురవైశ్యుల సంపద లెన్ని చూపుచోన్." కవికర్ణ. 1. 11.
- "అన్నం అడుగంటింది."
- "వాళ్ళింట్లో ఉన్న బంగారం, వెండి అంతా అడుగంటి పోయింది." వా.
అడుగకుండిన పోదు
- అడిగితీరవలసిందే అనుట.
- "అడుగకుండిన బోదింక ననుచు బలికె." కళా. 7. 6.
- "నిన్నీవిషయం అడగాలని చాలనాళ్ళ నుంచీ అనుకొంటున్నాను. ఇన్నాళ్లూ కుదర లేదు. ఇక అడగకుండా ఉండడానికి వీలు లేదు." వా.
అడు గటు పెట్టను
- కాలు కదల్చను.
- ఖండితముగా రా నని చెప్పుటలో ఉపయోగించుపలుకుబడి.
- "ధరణి విడిచి దివికి నడు గటు వెట్టన్." కళా. 3. 244.
అడు గటు పెట్టలేను
- ముందుకు నడవను.
- "తల నిండగ నర్థము వోసి తేని నే నడుగటు వెట్టగా వెఱతు నచ్యుత." ప్రభా. 1. 92.
- రూ. అడుగు తీసి అడుగు పెట్ట లేను."
అడుగడు గశ్వమేధము
- అడుగడుగూ ఒక గండం. అశ్వమేధం అతి కష్టసాధ్యమైనయాగం లక్షణయా అంత కష్ట మైనపని అనుట.
- "అడుగడు గశ్వమేధ మగు నాజి మొనన్." కుమా. 11. 44.
అడుగడుగునకు
- తేప తేపకు, అడుగు పెట్టినప్పు డెల్ల.
- "అర్ద్రవస్త్రంబు లంగంబు లంటవడకి, కొనుచు నమ్రత నడుగడుగునకు బెద్ద, మాట గోవింద యనుచును."
- హంస. 4. ఆ. 212.
- "వాడు అడుగడుక్కూ ఆక్షేపిస్తాడు." వా.
అడుగ బంపు
- విచారించు, కుశల మడుగు.
- "నాటనుండియుం బదిలము గాగ నన్నడుగ బంపనికారణ మేమి?" పారి. 2. 28.
అడుగబోవు
- యాచించు.
- "బలిదైత్యు నడుగ బోయిన నాటి హైన్య మొకటి." జైమి. 1. 44. అడు_____అడు 45 అడు_____అడు
అడుగవచ్చినవారు
- పిల్లకు పెత్తనము వచ్చిన వారు.
- "అడుగ వచ్చినవార లయ్యబలరూప, శిలకులగుణవిఖ్యాతి చాల మెచ్చి."
- శుక. 2. ఆ. 153 ప.
అడు గామడ యగు
- ఒక కొంత దూరమే ఆమడ దూరముగా తోచు - దౌర్బల్యాదులవలన.
- "పొడలు పెట్టుచు దన కడుగామ డై యుండ." కా. మా. 3. 193.
- "నల్ల రేగడభూమి, వర్షాకాలంలో నడిచే వారికి అడుగు ఆమడగా నుండును."
- కాశియా. పు. 51.
అడుగు ఆమడగా నడుచు
- మహాభారముతో, శ్రమతో నడుచు.
- "ఆ గర్భిణీస్త్రీ అడుగామడగా నడిచివస్తే నీవు ఏమాత్రం కనికరం లేకుండా పొమ్మంటే యెక్కడకు పోతుంది?" వా.
అడుగుకొని తిను
- యాచించు.
- "వాడు ఊళ్లో అడుగుకొని తింటున్నాడు. అస్తా? పాస్తా?" వా.
అడుగుగులాము
- పాదదాసుడు.
"రమ్మని పొమ్మని తెమ్మని
యిమ్మని కానిమ్మ టంచు నే గొమరుంబ్రా
యమ్మున నానల నిడుసమ
యమ్ముననీదృశులు నాదునడుగుగులాముల్"
- భద్రావత్య. 2. ఆ.
అడుగు తప్పని
- జవదాటని.
- నా. మా. 94.
అడుగు దప్పక
- జవదాటక.
"పతిభక్తితోడ జరిపెడు,
వ్రతములు వల దనెడునట్టి వనితలు గలరే?
పతిమాట కడుగు దప్పక,
సతులకు ననుకూలబుద్ధి జరియింప దగున్." రుక్మాం. 4. 79.
అడుగు దప్పినచో దప్పు పిడుగు
- కొంచెము పొరపాటు చేసినా ప్రమాద మగును; కొంచెం జాగర్తపడితే అది తప్పును అనుట. పిడుగు పడునప్పుడు ఒక అడుగు అటు వేసిన ప్రమాదము, ఇటు వేసిన ఆ ప్రమాదం తప్పును. తద్వారా యేర్పడినపలుకుబడి.
- "అడుగు దప్పినచో దప్పు బిడు గటంచు."
- శుక. 1. ఆ. 319 ప.
అడుగు దాటడు
- ఏమాత్రం మాట నతిక్రమించడు అనుట.
- "వాడు అన్నమాట అడుగు దాటితే ఒట్టు." వా.
అడుగు దీయక
- వెనుకంజ వేయక.
- "కడగి సింహముమీద గవిసిన నైన నడుగు దీయక గుండె లవియు మోదుదుము."
- గౌ. హరి. ప్రథ. పంక్తి 477-78.